పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్, ఎమోషనల్ అండ్ ఫీమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీ 'మయూఖ' (Mayookha) అఫీషియల్ ట్రైలర్ సెప్టెంబర్ 28, 2026న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా విడుదలయింది.
ఈ సినిమాకు శ్రీ తేజ్ ఎస్కే దర్శకత్వం వహించగా, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు.
చిత్రంలో మురళీధర్ గౌడ్, బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ కీలక పాత్రలు పోషించారు.
దసరా సెలవుల కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 9, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


