చివరి ట్రైమెస్టర్‌ వరకు వర్కౌట్లు చేయొచ్చా..?! నటి సమంత కూడా.. | Health Tips: Samantha Ruth Prabhu's third trimester pregnancy workout | Sakshi
Sakshi News home page

Pregnant Samantha: చివరి ట్రైమెస్టర్‌ వరకు వర్కౌట్లు చేయొచ్చా..?! నటి సమంత కూడా..

Sep 28 2026 5:36 PM | Updated on Sep 28 2026 5:57 PM

Health Tips: Samantha Ruth Prabhu's third trimester pregnancy workout

నటి సమంత తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని పంచుకుంటూ..అభిమానులతో చిల్‌ అవుతోందామె. ప్రస్తుతం తన గర్భధారణ చివరదశలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్నే వెల్లడిస్తూ..ఈ సరికొత్త అనుభవంలో ఇష్టమైన పనులన్నీ చేసేలా శరీరం సహకరించినందుకు ఎంతో కృతజ్ఞతలు అని పేర్కొంది. అంతేగాదు ఈ చివరి ట్రైమెస్టర్‌లో సైతం వర్కౌట్లు చేస్తున్న దృశ్యాలు పంచుకుంటూ..దీన్ని ఘనంగా ముగిద్దాం అని సమంత సోషల్‌మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా, సమంత రూత్‌ ప్రభు, ఆమె భర్త రాజ్‌ నిడిమోరు దంపతుల ఈ డిసెంబర్‌లో తమ తొలి సంతానానికి స్వాగతం పలకనున్నారు. మరి ఇలా గర్భధారణ చివరి స్టేజ్‌ వరకు వర్కౌట్లు చేయొచ్చా? నిపణులు ఏమంటున్నారు తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని గర్భిణి మహిళలు నిశ్చింతగా చేయొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈసమయంలో ఎలాంటి వ్యాయామాలు చేయడం మంచిదో గైనకాలజిస్ట్‌లను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. చివరి త్రైమాసికం అంటే.. శరీరం ప్రసవానికి సిద్ధం అవుతుంది కాబట్టి కష్టతరమైన వ్యాయామాలు చేయకుండా..తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవడం మంచిదని అంటున్నారు.

 

 

ఈ టైంలో చేయదగినవి..

వాకింగ్‌: ఇది సురక్షితమైన సులవైన వ్యాయామం. రోజుకు  20–30 నిమిషాల పాటు సాధారణ వేగంతో నడవడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది.
స్విమ్మింగ్ (ఈత): నీటిలో శరీరం తేలికగా ఉంటుంది కాబట్టి నడుముపై ఒత్తిడి తగ్గుతుందని, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని అంటున్నారు. 
పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు (కీగెల్స్): ప్రసవానికి అవసరమైన కండరాలను బలోపేతం చేయడానికి, ప్రసవానంతరం మూత్రవిసర్జన సమస్యలు రాకుండా ఉండటానికి కీగెల్ వ్యాయామాలు సహాయపడతాయి.
ప్రీనేటల్ యోగా అండ్‌ స్ట్రెచింగ్స్: నిపుణుల సమక్షంలో చేసే యోగాసనాలు శ్వాస నియంత్రణకు, నడుము నొప్పి తగ్గడానికి ఉపయోగపడతాయి. భంగిమల కోసం సీతాకోకచిలుక ఆసనం (బటర్‌ఫ్లై పోజ్) వంటివి చేయవచ్చు.

కలిగే ప్రయోజనాలు

నడుము నొప్పి, కాళ్ల వాపులు, మలబద్ధకం తగ్గుతాయి.

రక్తప్రసరణ మెరుగవుతుంది.

రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది.

ప్రసవ సమయంలో అవసరమయ్యే శారీరక దృఢత్వం (స్టామినా) లభిస్తుంది.

గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), బీపీ వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. 

ఎలాంటివి వద్దు..
వెల్లకిలా పడుకుని చేసేవి వద్దు: చివరి నెలల్లో వెల్లకిలా పడుకుని వ్యాయామాలు చేయడం వల్ల గర్భాశయ బరువు ముఖ్యమైన రక్తనాళాలపై పడి, శిశువుకు రక్తప్రసరణ తగ్గే ప్రమాదం ఉంది.

బ్యాలెన్స్ తప్పేవి వద్దు: ఈ సమయంలో పొట్ట బరువు పెరగడం వల్ల శరీరం బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పడిపోయే ప్రమాదం ఉన్నవర్కౌట్ల జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.

దీంతోపాటు ఊపిరి సలపనంత వేగవంతంగా వ్యాయామాలు చేయొద్దని చెబుతున్నారు. అలాగే తగినంత నీరు తాగుతూ ఉండాలని చెబుతున్నారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

ఇదీ చదవండి: అమ్మాయిలూ.. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం నేర్చుకోండి..!ఖుష్బూ పటానీ సందేశం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement