118 కేజీల నుంచి 84 కేజీలకు! జస్ట్‌ ఆరు నెల్లలోనే.. | How A Lifestyle Coach Helped This Man Lose 34 Kg In 6 Months | Sakshi
Sakshi News home page

118 కేజీల నుంచి 84 కేజీలకు! జస్ట్‌ ఆరు నెల్లలోనే..

Sep 27 2026 3:07 PM | Updated on Sep 27 2026 3:46 PM

How A Lifestyle Coach Helped This Man Lose 34 Kg In 6 Months

ఎన్నో వెయిట్‌లాస్‌ జర్నీలు చూశాం. కొందరు బరువుతగ్గే సర్జరీలు చేయించుకుని మరి ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించారు. మరికొందరు కేవలం డైట్‌ , వర్కౌట్లతో స్లిమ్‌గా మారారు. కానీ ఇతడి కథే వేరు. భారీకాయంతో వివిధ అనారోగాల బారినపడి ఇబ్బందిపడుతున్నప్పటికీ సర్జరీల జోలికి పోలేదు. పైగా తను బరువు ఎలా తగ్గితే మంచిదో..  లైఫ్‌స్టైల్‌ ట్రైనర్లను సంప్రదించి మరి ఆరోగ్యదాయకమైన విధానంలోనే అంత బరువుని తగ్గించుకున్నాడు. అది కూడా ఆరు నెల్లలోనే స్లిమ్‌గా మారి చూపించడం విశేషం. మరి అతను అనుసరించి వెయిట్‌లాస్‌ టెక్నిక్‌ ఏంటంటే..

38 ఏళ్ల వయసులో రాజేష్‌ అనే వ్యక్తి 118 కేజీల బరువుతో మధుమేహం, ఫ్యాటీలివర్‌, అధిక కొలెస్ట్రాల్, నీరసం, తీవ్రమైన స్లీప్ అప్నియా వంటి సమస్యలతో బాధపడ్డాడు. అప్పటికే డైట్‌, వర్కౌట్లతో నిలకడగా చేయడానికి స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేశాడు. చివరికి క్రమం తప్పకుండా చేసే స్టేజ్‌కి చేరుకున్నాక..బరువు తగ్గడానికి కాస్తా విభిన్నమైన పద్ధతిని అనురించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం లైఫ్‌స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హోని సంప్రదించాడు. 

అయితే అతడి వైద్యులు మందుగా ఆప్నియా కోసం, బరువు కోసం సర్జరీ చేయడం గురించి మాట్లాడారు. అవి రెండు అతని  అంతగా సరిపడవని తేలింది. దాంతో రాజేష్‌ సరైన జీవనశైలి వ్యూహంతో బరువు తగ్గాలని డిసైడ్‌ అయ్యాడు. అలాగని కఠినమై ఆహార నియమం, తీవ్రమైన వర్కౌట్ల జోలికి పోలేదు. ఎలాంటి జీవనశైలిని అనుసరించాడంటే..

  • జీవక్రియ ఆరోగ్యం, ఇన్సులిన్ నియంత్రణకు సంబంధించినవి

  • పోషకాలతో కూడిన ఆహారం, అదికూడా పరిమిత మేర,సంతృప్తిని కలిగించేలా

  • తన సామర్థ్యానికి అనుగుణంగా సాగే కదలిక

  • కాలేయ ఆరోగ్యంకి అనుగుణమైన పోషకాహారాలు

  • చిన్నగా బరువు తగ్గిన సెలబ్రేట్‌ చేసుకోవడం..

  • నిలకడగా అనుసరించడం

ఇలా ఒక నెల పాటు పాటించిన తర్వాత నిద్ర మెరుగుపడింది. ఆ తర్వాత శక్తి, ఏకాగ్రత, మానసిక స్థితి, మంచి ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ అన్నీ మెరుగుపడ్డాయి. అలాగే ఏదో డైట్‌ పాటిస్తున్న భావన లేకుండా దాన్ని ఎంజాయ్‌ చేస్తూ తీసుకోవడం నేర్చుకున్నాడు. అలాగే వర్కౌట్లను కూడా పెంచుకుంటూ ఆరోగ్యంగానూ ఆత్మవిశ్వాసంగానూ ఉండటం ప్రారంభించాడు. 

అంతేగాదు చాలామంది బరువు తగ్గడం కోసం ఉపక్రమించి మళ్లీ బ్రేక్‌ చేస్తుంటారు. అందుకే తాను అలా చేయకుండా ఉండాలనే కీలకమైన వాటిపై దృష్టిసారించి భారంగా కాకుండా ఇష్టంగా చేసేలా అలవాటు చేసుకుని బరువు తగ్గినట్లు వివరించారు రాజేష్‌.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

ఇదీ చదవండి: 116 కేజీల నుంచి 60 కేజీలకు..! జస్ట్‌ రెండేళ్ల వ్యవధిలోనే..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement