ఫండే
ఘనాంకాలు
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
టూరుకెళ్లడం అంటేనే చాలామందికి ఎక్కడలేని హుషారు! కాస్త సమయం చిక్కితే, కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని, అక్కడి వింతలను ప్రత్యక్షంగా తిలకించాలని ఉబలాటపడేవాళ్లు ప్రపంచమంతటా ఉంటారు. చారిత్రక ప్రదేశాలను చూడటానికి చాలామంది పర్యటనలు చేస్తారు.
మన దేశంలో ఎక్కువమంది తీర్థ క్షేత్రాలను సందర్శించడానికి పర్యటనలు చేస్తారు. పర్యాటకం చాలా దేశాలకు ముఖ్యమైన ఆదాయ వనరు. కేవలం పర్యాటక ఆదాయమే ప్రధాన వనరుగా మనుగడ సాగిస్తున్న దేశాలు డజన్లలో ఉన్నాయి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యాటక విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...
ప్రపంచంలో కొన్ని దేశాలు పర్యాటకుల రద్దీతో కిటకిటలాడుతుంటే, ఇంకొన్ని దేశాలు పర్యాటకుల రద్దీతోనే కాకుండా, పర్యాటక ఆదాయంతోనూ కళకళలాడుతున్నాయి. పర్యాటక ఆదాయంలో అత్యధికంగా కాసులు రాబట్టుకుంటున్న టాప్–10 దేశాల గణాంకాలు...
ప్రపంచ జనాభాలో మన దేశం అగ్రస్థానంలో ఉన్నా, ప్రపంచ పర్యాటకంలో ఇంకా 39వ స్థానంలోనే ఉంది. మన పర్యాటక ఆదాయంలో అత్యధిక భాగం స్వదేశీ పర్యాటకుల ద్వారానే లభిస్తోంది. మన దేశానికి విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువమంది ప్రవాస భారతీయులే ఉంటున్నారు. ఇక్కడ ఉంటున్న బంధుమిత్రులను చూడటానికి వచ్చేవారే వీరిలో ఎక్కువమంది ఉంటున్నారు. మన దేశ పర్యాటక వివరాలను గణాంకాల్లో చూద్దాం...
ఇదీ చదవండి: ప్రేమా.. ధనమా.. ప్రతిష్ఠా? ముందుగా ఏది ఇంట్లోకి రావాలి?


