సీత పాత్రలో మిస్‌ యూనివర్స్‌ ఇండియా కజియా లిజ్‌ మెజో..! | Kaziah Liz Mejo will appear as Mata Sita in the Ramleela. | Sakshi
Sakshi News home page

సీత పాత్రలో మిస్‌ యూనివర్స్‌ ఇండియా కజియా లిజ్‌ మెజో..!

Sep 27 2026 12:55 PM | Updated on Sep 27 2026 12:55 PM

Kaziah Liz Mejo will appear as Mata Sita in the Ramleela.

ప్రతి ఏడాది దేశ రాజధాని ఢ్లిలీ అయోధ్య కీ రామ్‌లీలాని ప్రదర్శిస్తారనే విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ కార్యక్రమం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌కు చెందిన మావలంకర్ హాల్‌లో వచ్చే నెల అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 20 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ ఈ రామ్‌లీలాలో భగవాన్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. 

అలాగే సీత పాత్రలో మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2026 కజియ్‌ లిజ్‌ మెజో కనిపించనుంది. ఆమె ఈ ఏడాది ఆగస్టులోనే మిస్‌ యూనివర్స్‌ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు. కేరళలోని మావేలిక్కరకు చెందిన కజియా, గతంలో మిస్ యూనివర్స్ కేరళ 2026, మిస్ టీన్ దివా 2024 టైటిళ్లను కూడా గెలుచుకున్నారు. 

ఆమె లా స్టూడెంట్‌, క్లాసికల్‌ డ్యాన్సర్‌  కూడా. కాగా ఈ రామ్‌లీలాలో భారతీయ చలన చిత్రపరిశ్రమకు చెందిన వివిధ నటులు కూడా నటించనున్నారు. అరుణ్‌ బక్షి రావణుడి పాత్రలో కనిపించగా, బిందు దారా సింగ్‌ కుంభకర్ణుడి పాత్రలో నటిస్తారు. అలాగే అవతార్ గిల్ మేఘనాథుడిగా, పునీత్ ఇస్సార్ పరశురాముడిగా కనిపించనున్నారు.

ఇదీ చదవండి: రాయల్‌ టిష్యూ చీరలో సాయిపల్లవి స్టన్నింగ్‌ లుక్‌..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement