బాలీవుడ్ నటి అలియా భట్, నటుడు విక్కీ కౌశల్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన మిజ్వాన్ ఫ్యాషన్ షోలో వీరిద్దరూ షోస్టాపర్లుగా ర్యాంప్‌పై సందడి చేశారు. ముంబైలో సెప్టెంబర్ 26న జరిగిన ఈ కార్యక్రమంలో అలియా, విక్కీ తమ సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు.


