నితేష్ తివారీ రామాయణ మూవీ తారాగణం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఇది నవంబర్08, 2026న థియేటర్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలోని DNEG/ప్రైమ్ ఫోకస్ కార్యాలయంలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌లో నితేష్ తివారీ, సాయిపల్లవి, రవిదూబే, రణబీర్ కపూర్‌ల తోపాటు ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ కూడా అభిమానులను పలకిరిస్తూ కనిపించారు. అయితే ఈ కార్యక్రమంలో సీత పాత్ర పోషిస్తున్న సాయిపల్లవి పీచ్ ఆరెంజ్ రంగు చీరలో అత్యంత నిరాడంబర్‌గా గంభీరమైన హుందాతనంతో ఆకట్టుకున్నారామె.
ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె ధరించి ధుస్తులు అందరి మనసులను ఆకట్టుకుంది. మెటాలిక దారాలతో నేసిన సిల్క్ టిష్యూ చీర. పల్లు అంతా మెటాలిక ధారాలతో మెరిసేలా డిజైన్ చేశారు. చీర అంచుకి తగిన విధంగా బ్లౌజ్‌ని క్లిషమైన జర్దోజీతో రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. మినిమల్ లుక్ మేకప్‌తో తన ఆహార్యాన్ని ప్తూఇ చేసింది. ఇందులో కళ్లు ప్రకాశవంతంగా కనిపించేలా పెట్టుకున్న కాజల్ ఆమెను మరింత అందంగా కనిపించేలా చేసింది.
హెయిర్‌స్టైల్ కూడా వదులుగా జడ వేసుకుని పూల స్టడెడ్ యాక్సెసరితో అలంకరించుకుంది. అలాగే ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం మూత్యాల, చెవిపోగులు, పురాతన బంగారు గాజులు, ఒచ చిన్న ఉంగరంతో నిరాడంబరంగా మెరిసింది సాయిపల్లవి. జూలై నెల ప్రారంభంలో, 'ప్రథమ్ సంకల్ప్' అనే మీడియా ఈవెంట్‌తో ప్రమోషన్లను ప్రారంభించడానికి రామాయణ చిత్ర బృందం ఢిల్లీని సందర్శించింది. కాగా సాయిపల్లవి ఇలాంటి పాత్రలు లభించడం అంత సులభం కాదని, ఒక దేవతా పాత్రను పోషించడం అనేది కూడా అంత తేలికైన విషయం కాదిన పేర్కొంది.
తనవంతుకు ఈ పాత్రకు న్యాయం చేసేలా సీతమ్మ తన చేత చేయించుకుంటుందంటూ తన భక్తి భావాన్ని చాటుకుందామె. ఇక నితేష్ తివారీ దర్శకత్వంలో రూ. 4 వేల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ రామాయణం చిత్రంలో రణబీర్‌కపూర్, సాయిపల్లవి, యశ్, కునాల కపూర్, రవి దూబే, కుమార్ విశ్వాస్, అరుణ్ గోవిల్ తదితరులు నటిస్తున్నారు.
Mr Beast with Sai Pallavi, Ranbir Kapoor, Ravi Dubey 🔥🔥🥶.#Ramayana pic.twitter.com/mLYIKuxauG
— PEACE 🏹 (@Peace__AB) September 26, 2026
ఇదీ చదవండి: కొబ్బరి.. కాయా? పండా..? కోర్టు మెట్లు ఎక్కించిన ప్రశ్న!


