ఫండే
ట్రెండీమెన్
ఫ్యాషన్
బాడీ సైజ్ ప్లస్‌లో ఉందని వార్డ్‌రోబ్ మైనస్‌లో ఉండాలా? అస్సలు వద్దు! సైజు పెరిగిందని స్టయిల్‌లో తగ్గాల్సిన పనిలేదు. మీ సైజు ఏదైనా సరే, స్టయిలింగ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లుక్ అదిరిపోవాల్సిందే! అందుకే, ప్లస్ సైజ్ అబ్బాయిల వార్డ్‌రోబ్‌లో ఏం ఉండాలి? ఇక్కడ చూద్దాం!
లూస్‌గా కూల్‌గా!
ప్లస్ సైజ్ అని మీ బాడీని దాచడానికి మాత్రమే బట్టలు వేసుకోవడం మానేసి, మీ స్టయిల్‌ను చూపించడానికి వేసుకోండి. అలాగని, మరీ లూజుగా ఉండకూడదు. బటన్ లు సరిగ్గా క్లోజ్ అయ్యేంత ఫిట్ ఉండాలి. బటన్ ల మధ్య గ్యాప్ వచ్చి పొట్టొచ్చినట్లు కనిపిస్తే మాత్రం ఫ్యాషన్ మొత్తం గాల్లోకి పోయినట్టే!
డిజైన్లు మాట్లాడాలి!
ఎప్పుడూ సాదా సీదా డిజైన్స్‌కు పరిమితం కాకుండా, నిలువు గీతలు, చిన్న ఫ్లోరల్ ప్రింట్లు, ట్రాపికల్ డిజైన్లు లాంటి వాటిని ట్రై చేయొచ్చు. ఇవి మొదట బాడీ షేప్‌ను కాకుండా, డిజైన్స్‌ను చూసేలా చేస్తాయి.
సూట్ వేసుకుంటే... సీన్ మారాలి!
మూడు ముక్కల సూట్‌తో ప్లస్ సైజ్ ఫ్లస్ట్ క్లాస్ మార్కులు కొట్టేయొచ్చు. రెడీమేడ్ సూట్ మీ బాడీకి సరిపోకపోతే దాన్ని బలవంతంగా ఒప్పించాల్సిన పనిలేదు. టైలర్ దగ్గర కొలతలు ఇచ్చి కుట్టించుకోవడమే ఇక్కడ అసలైన ఆయుధం!
రంగులే మీ ఆయుధం!
ఎప్పుడూ నలుపు, నేవీ బ్లూ, డార్క్ గ్రేలకు జీవితకాల సభ్యత్వం తీసుకోవాల్సిన పని లేదు. రంగులు మీకూ సొంతమే! గ్రే, మెరూన్ , డీప్ ఆలివ్ లాంటి షేడ్స్‌ను కూడా ప్రయత్నించండి. దానికి చక్కని టై, వాచ్, షూస్ జోడిస్తే లుక్ మరింత ఎలివేట్ అవుతుంది.
డెనిమ్‌తో దుమ్మురేపొచ్చు!
డెనిమ్ జాకెట్ సన్నగా ఉన్నవాళ్లకే పేటెంట్ కాదు. ప్లస్ సైజ్ అబ్బాయిలు కూడా దాన్ని ఫుల్‌గా వాడుకోవచ్చు. సింపుల్ టీషర్ట్ మీద లైట్ డెనిమ్ జాకెట్, కింద డార్క్ డెనిమ్ ప్యాంట్... అంతే, స్ట్రీట్ స్టయిల్ రెడీ! జాకెట్ హిప్స్ వరకు వచ్చేలా చూసుకుంటే బాడీ ప్రపోర్షన్ కూడా చక్కగా కనిపిస్తుంది.
పోలో... ప్లస్ పాయింట్!
పోలో టీషర్ట్ ఫ్యాషన్ లో ఎప్పటికీ ఫెయిల్ కాని ఫ్రెండ్. అలాగే, ఓవర్‌సైజ్ పేరుతో భుజాల దగ్గర బట్టలు వేలాడేలా మాత్రం వద్దు. దానికి చినోస్ లేదా ఖాకీ ప్యాంట్ జోడిస్తే లుక్ సింపుల్‌గా, స్మార్ట్‌గా మారిపోతుంది. ముఖ్యంగా తేలికైన, కొంత స్ట్రెచ్ ఉన్న ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే రోజంతా కంఫర్ట్ కూడా మీతోనే ఉంటుంది.
ర్యాపర్ వైబ్!
గ్రాఫిక్ టీషర్ట్, రిప్డ్ డెనిమ్, బేస్‌బాల్ క్యాప్, స్టేట్‌మెంట్ సన్ గ్లాసెస్, హైటాప్ స్నీకర్స్... ఈ కాంబినేషన్ తో స్ట్రీట్ స్టయిల్‌కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. టీషర్ట్ చేతులు పైచేయి వెడల్పైన భాగం దగ్గర ఉండేలా చూసుకుంటే ప్రొపోర్షన్ బాగుంటుంది. జతగా బాగీ జీన్ ్స వేసుకుంటే బెల్ట్‌తో ఫిట్‌ను కంట్రోల్‌లో ఉంచండి.
ప్లస్ సైజ్ అంటే దుస్తుల ఎంపికలు తగ్గిపోవడం కాదు. సరైన ఫిట్, సరైన పొడవు, సరైన రంగు ఈ మూడు కుదిరితే సైజు ఏదైనా స్టయిల్ మాత్రం సూపర్‌గానే ఉంటుంది.
- కొండి దీపిక
ఇదీ చదవండి: మా అమ్మానాన్నల విడాకుల కేస్ కోర్ట్‌లో నడుస్తోంది...


