breaking news
Mens clothing
-
మెన్స్ ఫ్యాషన్‌లో ‘పర్సనల్ టచ్’.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
ప్యాంట్‌కి షర్ట్. షర్ట్‌కి కోట్... అంతేనా పురుషుల ఫ్యాషన్? అస్సలు కాదు! ఈ రోజుల్లో దుస్తులు కేవలం వేసుకునేవి మాత్రమే కాదు, మన గురించి చెప్పే వార్డ్రోబ్ విజిటింగ్ కార్ట్‌గా మారాయి. అందుకే పురుషుల్లోనూ రెడీమేడ్ కంటే, సంప్రదాయ టైలరింగ్ అందానికి, ఆధునిక ఆలోచనలతో కొత్త కలెక్షన్స్‌ను తీసుకొస్తున్నారు. అవెంటో ఇక్కడ చూద్దాం...అభిరుచికి తగినట్లే ఎంపికఒకప్పుడు రెడీమేడ్ దుస్తుల్లో నచ్చిన సైజు దొరికితే చాలు అనుకునే పురుషులు ఇప్పుడు చాలా తక్కువ. చాలామంది తమకు ఏది నప్పుతుంది? ఏ కట్లో సౌకర్యంగా ఉంటుంది? ఏ రంగు తమ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది? అని ఆలోచిస్తున్నారు. తమ కొలతలకు, అభిరుచికి తగ్గట్టుగా డిజైనర్ వేర్‌ను ఎంచుకుంటున్నారు. అలా కచ్చితమైన కటింగ్, పదునైన భుజాల ఆకృతి, పొరలుగా కనిపించే కాలర్లు, ప్రత్యేకమైన పాకెట్లు– ఇలా ప్రతి అంశం దుస్తులకు ఒక నిర్మాణాత్మకమైన అందాన్ని తీసుకొస్తుంది.సౌకర్యమే కొత్త స్టయిల్!ఫ్యాషన్ లో లుక్ ఎంత ముఖ్యమో, కంఫర్ట్ కూడా అంతే ముఖ్యం. అందుకే శరీర నిష్పత్తులకు తగ్గట్టుగా దుస్తులను రూపొందించడం మరో ప్రత్యేకత. మరీ బిగుతుగా కాదు, మరీ వదులుగా కాదు. కదిలినప్పుడు ఇబ్బంది పెట్టకుండా, వేసుకున్నప్పుడు సహజంగా అనిపించేలా కటింగ్ ఉంటుంది. ఎందుకంటే, రోజంతా సర్దుకుంటూ కూర్చునే ఉద్యోగం చేస్తే, అసలైన ఉద్యోగం పోతుంది కదా!అకేషనల్ డిజైన్స్ ప్రశాంతంగా ఉండే ఒకే తెల్ల చొక్కానే ప్రతిసారి ఆఫీస్పార్టీ, ఫ్యామిలీ ఫంక్షన్‌కైనా సరిపోతుందనే రోజులు పోయాయి! ఇప్పుడు పురుషులు కూడా ఏ సందర్భానికి ఎలాంటి లుక్ కావాలో ముందే ఆలోచించుకొని, ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారు. అలా పార్టీకి వేసుకునే బ్లేజర్ అయినా, పెళ్లికి ఎంచుకునే జో«ద్పురి అయినా మన అభిరుచికి తగ్గ చిన్న చిన్న మార్పులతో దానికి వ్యక్తిగత ముద్రను జోడిస్తున్నారు.సంప్రదాయం... కొత్త గీతల్లో!భారతీయ హస్తకళలో భాగమైన జర్దోజీ, ఆరి వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ పద్ధతులను పూల డిజైన్లకే పరిమితం చేయకుండా సరళమైన రేఖలు, ఆధునిక ఆకృతులు, విరుద్ధమైన అల్లికలతో ఆసక్తికరమైన రూపాలను తీసుకొస్తున్నారు. కానీ, ఎక్కడా అవసరానికి మించిన అలంకరణ కనిపించదు. ఎందుకంటే ఇప్పటి పురుషుల ఫ్యాషన్ లో ఎక్కువగా అరవడం లేదు. సైలెంట్‌గా స్టేట్మెంట్ ఇస్తున్నారు.ఫ్యాబ్రిక్ పైనా దృష్టి!ఒకే వస్త్రానికి అన్ని పనులూ అప్పగిస్తే ఎలా! అందుకే, వేసుకునే ఫ్యాబ్రిక్‌పై కూడా దృష్టి పడుతోంది. పట్టు నచ్చుతుంది కాని, కాటన్ కంఫర్ట్ కావాలి. అలాగే, వెల్వెట్ టచ్‌తో రిచ్‌లుక్ ఉండాలి అని ఫీల్ అవుతున్నారు. అందుకే, ఒకేసారి రెండు, మూడు రకాల వస్త్రాలను కలిపి తమకు నచ్చిన టెక్స్చర్, ఫీల్, లుక్‌ను పురుషులే ఎంచుకుంటున్నారు. అందుకే, ఇక్కడ డిజైన్‌లో సంప్రదాయం ఉంటుంది. కానీ పాతకాలపు ఫీలింగ్ కనిపించదు.అలా మొత్తానికి ఫురుషుల్లోనూ ఫ్యాషన్ అంటే మార్కెట్ ట్రెండ్‌ను ఫాలో కావటం కాదు, తమకంటూ ఓ స్టయిల్‌ను డిజైన్ చేసుకోవటం ట్రెండ్‌గా మారింది.ఇదీ చదవండి: మంచి ఫిట్నెస్ అంటే..? -
ప్లస్ సైజ్ బాడీనా? ఈ స్టైల్ టిప్స్ పాటిస్తే లుక్ అదిరిపోవాల్సిందే!
బాడీ సైజ్ ప్లస్‌లో ఉందని వార్డ్రోబ్ మైనస్‌లో ఉండాలా? అస్సలు వద్దు! సైజు పెరిగిందని స్టయిల్లో తగ్గాల్సిన పనిలేదు. మీ సైజు ఏదైనా సరే, స్టయిలింగ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లుక్ అదిరిపోవాల్సిందే! అందుకే, ప్లస్ సైజ్ అబ్బాయిల వార్డ్‌రోబ్‌లో ఏం ఉండాలి? ఇక్కడ చూద్దాం!లూస్‌గా కూల్‌గా!ప్లస్ సైజ్ అని మీ బాడీని దాచడానికి మాత్రమే బట్టలు వేసుకోవడం మానేసి, మీ స్టయిల్‌ను చూపించడానికి వేసుకోండి. అలాగని, మరీ లూజుగా ఉండకూడదు. బటన్ లు సరిగ్గా క్లోజ్ అయ్యేంత ఫిట్ ఉండాలి. బటన్ ల మధ్య గ్యాప్ వచ్చి పొట్టొచ్చినట్లు కనిపిస్తే మాత్రం ఫ్యాషన్ మొత్తం గాల్లోకి పోయినట్టే!డిజైన్లు మాట్లాడాలి!ఎప్పుడూ సాదా సీదా డిజైన్స్‌కు పరిమితం కాకుండా, నిలువు గీతలు, చిన్న ఫ్లోరల్ ప్రింట్లు, ట్రాపికల్ డిజైన్లు లాంటి వాటిని ట్రై చేయొచ్చు. ఇవి మొదట బాడీ షేప్‌ను కాకుండా, డిజైన్స్‌ను చూసేలా చేస్తాయి.సూట్ వేసుకుంటే... సీన్ మారాలి!మూడు ముక్కల సూట్‌తో ప్లస్ సైజ్ ఫ్లస్ట్ క్లాస్ మార్కులు కొట్టేయొచ్చు. రెడీమేడ్ సూట్ మీ బాడీకి సరిపోకపోతే దాన్ని బలవంతంగా ఒప్పించాల్సిన పనిలేదు. టైలర్ దగ్గర కొలతలు ఇచ్చి కుట్టించుకోవడమే ఇక్కడ అసలైన ఆయుధం!రంగులే మీ ఆయుధం!ఎప్పుడూ నలుపు, నేవీ బ్లూ, డార్క్ గ్రేలకు జీవితకాల సభ్యత్వం తీసుకోవాల్సిన పని లేదు. రంగులు మీకూ సొంతమే! గ్రే, మెరూన్ , డీప్ ఆలివ్ లాంటి షేడ్స్‌ను కూడా ప్రయత్నించండి. దానికి చక్కని టై, వాచ్, షూస్ జోడిస్తే లుక్ మరింత ఎలివేట్ అవుతుంది.డెనిమ్‌తో దుమ్మురేపొచ్చు!డెనిమ్ జాకెట్ సన్నగా ఉన్నవాళ్లకే పేటెంట్ కాదు. ప్లస్ సైజ్ అబ్బాయిలు కూడా దాన్ని ఫుల్‌గా వాడుకోవచ్చు. సింపుల్ టీషర్ట్ మీద లైట్ డెనిమ్ జాకెట్, కింద డార్క్ డెనిమ్ ప్యాంట్... అంతే, స్ట్రీట్ స్టయిల్ రెడీ! జాకెట్ హిప్స్ వరకు వచ్చేలా చూసుకుంటే బాడీ ప్రపోర్షన్ కూడా చక్కగా కనిపిస్తుంది.పోలో... ప్లస్ పాయింట్!పోలో టీషర్ట్ ఫ్యాషన్ లో ఎప్పటికీ ఫెయిల్ కాని ఫ్రెండ్. అలాగే, ఓవర్‌సైజ్ పేరుతో భుజాల దగ్గర బట్టలు వేలాడేలా మాత్రం వద్దు. దానికి చినోస్ లేదా ఖాకీ ప్యాంట్ జోడిస్తే లుక్ సింపుల్‌గా, స్మార్ట్‌గా మారిపోతుంది. ముఖ్యంగా తేలికైన, కొంత స్ట్రెచ్ ఉన్న ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే రోజంతా కంఫర్ట్ కూడా మీతోనే ఉంటుంది.ర్యాపర్ వైబ్!గ్రాఫిక్ టీషర్ట్, రిప్డ్ డెనిమ్, బేస్‌బాల్ క్యాప్, స్టేట్మెంట్ సన్ గ్లాసెస్, హైటాప్ స్నీకర్స్... ఈ కాంబినేషన్ తో స్ట్రీట్ స్టయిల్‌కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. టీషర్ట్ చేతులు పైచేయి వెడల్పైన భాగం దగ్గర ఉండేలా చూసుకుంటే ప్రొపోర్షన్ బాగుంటుంది. జతగా బాగీ జీన్ ్స వేసుకుంటే బెల్ట్‌తో ఫిట్‌ను కంట్రోల్లో ఉంచండి.ప్లస్ సైజ్ అంటే దుస్తుల ఎంపికలు తగ్గిపోవడం కాదు. సరైన ఫిట్, సరైన పొడవు, సరైన రంగు ఈ మూడు కుదిరితే సైజు ఏదైనా స్టయిల్ మాత్రం సూపర్‌గానే ఉంటుంది.- కొండి దీపికఇదీ చదవండి: మా అమ్మానాన్నల విడాకుల కేస్ కోర్ట్‌లో నడుస్తోంది... -
చీరకు జెండర్ లేదు!
నారీ వార్డ్రోబ్ లిస్ట్‌లో ఉండే ఎవర్గ్రీన్ డ్రెస్.. శారీ. ఇప్పుడిక మగవారి అలంకరణలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది. సంప్రదాయ దుస్తులలో ఈ కళ కొత్తగా మెరిసిపోతోంది. ధోతీగా మారి దావత్‌లలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. జెండర్ పరిమితులు లేని ఈ స్టైల్‌కి జనాల నుంచి కితాబులూ అందుకోవచ్చు.ఆరు గజాల చీర ఆడవారి ఆహార్యానికే కాదు, మగవారి రాజసానికి కూడా అలంకరణగా మారింది. యూనీసెక్స్ డిజైన్స్‌లో మేటిగా నిలిచింది. సంప్రదాయ వేడుకలలో స్టైలిష్‌గా నిలుస్తోంది. పట్టు, కాటన్, ఆర్గంజా., శారీస్ లేదా దుపట్టాలతో షర్ట్, ఓవర్ కోట్లను డిజైన్ చేయవచ్చు.. బ్లేజర్ కోసం చీర పల్లూను వాడచ్చు. డిజైన్ బట్టి ఒకే చీరను కుర్తా, పైజామా సెట్‌గా మార్చుకోవచ్చు. ఇందుకు దళసరిగా ఉండే పట్టు, కాటన్ శారీస్లో అందమైన డిజైన్స్ ఉన్నవి ఎంచుకోవాలి. చీర కొంగును షర్ట్ కాలర్, కఫ్ట్, పాకెట్స్ డిజైన్ చేయడానికి ఉపయోగించవచ్చు. అంతగా ఉపయోగించని, మంచి డిజైన్ ఉన్న శారీస్‌తోనూ మెన్ అండ్ ఉమెన్ సంప్రదాయ దుస్తులను రూపొందించవచ్చు.కట్టులో ఎన్నో వైవిధ్యాలుఈ రోజులను గమనిస్తే 40 ఏళ్ల లోపు మెన్ అండ్ ఉమెన్ వేర్, యాక్ససరీస్ చాలా వరకు ఒకే మోడల్స్‌లో ఉంటున్నాయి. హారమ్ ప్యాంట్స్/ ధోతీ అమ్మాయిలు ఉపయోగిస్తున్నారు, అబ్బాయిలు కూడా వాడుతున్నారు. వీటిమీదకు ఇద్దరూ టీ షర్ట్స్, షార్ట్ కుర్తీలూ, షర్ట్స్ వేసుకుంటున్నారు.→ బ్లేజర్స్, టీ షర్ట్స్, ధోతీ, టులిప్ ప్యాంట్స్... ఇలా జెండర్ లేకుండా యూనీసెక్స్ డిజైన్ మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఇది డ్రెస్సులకే కాదు కళ్లద్దాలు, వాచీ, ఫుట్‌వేర్ విషయంలో కూడా ఇద్దరి డిజైన్స్ ఒకేలా ఉంటున్నాయి. → చీరలను కట్ చేసి, కుట్టడం అనే ఆలోచన కూడా దూరమై చీరలనే ధోతీలుగా, లుంగీలుగా కట్టుకుంటున్నారు. ఇందుకు కాటన్, ప్రింటెడ్, సిల్క్... ఇలా ఏ శారీ అయినా ధోతీలాగా మార్చుకుంటున్నారు. ఇలా సంప్రదాయ వేడుకలు, పండుగలలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. వీటి మీదకు షార్ట్, లాంగ్ కుర్తీలు, బ్లేజర్లు వేసుకోవచ్చు. → సాధారణంగా ఆడవాళ్లు నాలుగుసార్లు కట్టాక ఆ చీరను మళ్లీ కొన్నాళ్ల పాటు కట్టరు. అలాగని, ఆ చీరను కట్ చేసి, కుట్టడం అనే దానిని ఆడవాళ్లు ఇష్టపడరు. అందుకని, చీరను ధోతీ, ప్యాంట్లాగా విభిన్న పద్ధతులలో కట్టుకుంటున్నారు. చీరను ధోతీలాగా ఎలా కట్టుకోవచ్చో సోషల్‌మీడియాలో చూసి, తెలుసుకోవచ్చు. దీనికి నడుము భాగంలో బెల్ట్ సెట్ చేసుకుంటే సేఫ్టీ ఉంటుంది.బెనారస్ చీరతో ధోతీఇటీవలి నా వివాహానికి రెడీమేడ్‌గా ఉండే కుర్తా పైజామా, ధోతీ డ్రెస్సులను షాపుల్లోనూ, బొటిక్లలోనూ చూశాను. ఏదైనా స్పెషల్‌గా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించాను. పెళ్లికి మా అమ్మ కొన్న చీరలను చూసినప్పుడు బ్లూ బెనారస్ శారీ భలే ఆకర్షణీయంగా అనిపించింది. ఆ చీరతో ఏమైనా స్పెషల్ చేయవచ్చా... అని ఆలోచించాను. ఆన్లైన్లో కనిపించే సంప్రదాయ దుస్తుల డిజైన్స్ చూశాను. టైలర్ని కలిసి, నా ఆలోచనను చెప్పాను. ధోతీ, కండువా చేయడానికి టైలర్ ఒప్పుకున్నారు. అలా చీర మిడిల్ పార్ట్‌తో ధోతీ చేయించాను. పల్లూ, బార్డర్ వంటివి ఉపయోగించి దుపట్టా డిజైన్ చేయించాను. కుర్తా కోసం కాంబినేషన్ క్లాత్ కోసం వెతికితే ఆ కలర్ మార్కెట్లో దొరకలేదు. దీంతో వైట్ క్లాత్ తీసుకొని, లైట్ షేడ్ వచ్చేలా డై చేయించాను. ఆ క్లాత్‌తో కుర్తా పూర్తయ్యింది. ఈ సెట్‌కి లైనింగ్ వేయించడం వల్ల డ్రెస్‌కి మంచి ఫాలింగ్ వచ్చింది. సాధారణంగా పెళ్లికి మెన్ ట్రెడిషనల్ వేర్కి 50 వేల రూపాయల నుంచి బడ్జెట్ అవుతుందని చెప్పా,రు. నేను ఇలా డిజైన్ చేయించుకోవడం వల్ల పాతిక వేల రూపాయలలో డ్రెస్ పూర్తయ్యింది. పెళ్లిలో ఈ యునిక్ డిజైన్ గురించి చాలా మంది అడిగారు. – కృష్ణ సందీప్ -
సారూన్.. ఇదో లుంగీ కథ
- వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా.. అంతా ఎంతో హాయిగా.. - ఇదేదో ఏసీ యూనిట్ గురించి కబుర్లు కావు.. - ఇండోనేసియా లుంగీల కథా కమామీషు! చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్ దాటి కాస్త ముందుకెళ్లగానే పురుషుల వస్త్రధారణలో ప్రత్యేక తేడా కనిపిస్తుంది. ఇది మిగతా ప్రాంతాలకు చాలా భిన్నంగా ఉంటుంది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అందరూ లుంగీలు ధరించి కనిపిస్తారు. వస్త్రధారణలో లుంగీ మనకు కొత్తేమీ కాదు. కానీ అక్కడివారు ధరించే లుంగీ మాత్రం కచ్చితంగా భిన్నమైందే. ప్రత్యేకంగా ఇస్లామిక్ దేశం ఇండోనేసియాలో తయారైన ఉన్నతశ్రేణి లుంగీలు మాత్రమే ధరించటం వారి ప్రత్యేకత. యెమన్ నుంచి.. కుతుబ్‌షాహీలు తమ సంస్థానంలో పోలీసు వ్యవస్థ, జమా పద్దుల నిర్వహణకు అరబ్ దేశాల నుంచి నిపుణుల్ని రప్పించారు. అలా యెమన్ దేశీయులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఆ తర్వాత అసఫ్‌జాహీల హయాం వచ్చాక కూడా వీరికి ప్రాధాన్యం పెరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యెమన్ జాతీయులకు బార్కస్, సలాలా ప్రాంతాలను కేటాయించారు. నేటికి ఈ ప్రాంతాలు యెమన్ వంశస్తులతో నిండిపోయి కనిపిస్తాయి. వీరికి ప్రత్యేక వస్త్రంతో తయారు చేసిన లుంగీలు ధరించటం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్నే వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇండోనేసియా నుంచే దిగుమతి.. యెమన్లు ఇండోనేసియాలో తయారైన లుంగీలనే వినియోగిస్తారు. వాటిని వారు ‘సారూన్’ అని, ‘తైబన్’ అని పిలుచుకుంటారు. ఈ లుంగీ నాణ్యత ఉన్నత శ్రేణిలో ఉంటుంది. వస్త్రం చాలా మృదువుగా ఉండి వేసవి కాలంలో చల్లని, శీతాకాలంలో వెచ్చని అనుభూతి నిస్తుంది. ఇండోనేసియాలో ప్రత్యేక శ్రద్ధతో వీటిని తయారు చేస్తారు. యెమన్ ప్రాంతానికి ఈ లుంగీలే ఎగుమతి అవుతాయి. బార్కస్‌లో స్థిరపడ్డ వీరి పూర్వీకులు యెమన్ దేశీయులు అయినందున వీరు కూడా ఆ పద్ధతినే అనుసరిస్తున్నారు. పన్నెండేళ్ల పిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరూ ఈ లుంగీలను ధరించే తిరుగుతుంటారు. బార్కస్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ ఇండోనేసియా లుంగీలమ్మే దుకాణాలు వెలిశాయి. ఇక సిటీలో ఎక్కడా ఈ లుంగీలు దొరకవు. ఈ లుంగీల ధర కూడా ఎక్కువే. సాధారణ లుంగీ రూ.750 ధర పలుకుతోంది. మరింత మంచివైతే రూ.2,000-3,000 వరకు ఉంటోంది. ఒక్కో లుంగీ కనీసం నాలుగేళ్లవరకు పాడవకుండా ఉంటుందని స్థానికులంటున్నారు. ..::గౌరీభట్ల నరసింహమూర్తి


