ఎల్‌పీయూలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. రెండువేల మంది విద్యర్థుల ఆందోళన! | lpu Jalandhar student protest | Sakshi
Sakshi News home page

ఎల్‌పీయూలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. రెండువేల మంది విద్యర్థుల ఆందోళన!

Sep 27 2026 8:32 AM | Updated on Sep 27 2026 8:36 AM

lpu Jalandhar student protest

జలంధర్‌: పంజాబ్‌లోని జలంధర్‌లో గల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో శనివారం అర్ధరాత్రి సుమారు 2 వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని ఎస్‌ఎస్‌పీ గౌరవ్ తూరా తెలిపారు.

విద్యార్థులు గర్ల్స్ హాస్టల్ సమీపంలో ఆందోళన ప్రారంభించి అనంతరం క్యాంపస్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. కిటికీల అద్దాలు పగులగొట్టి, ఇటుకలు, కుండీలు విసిరారు. కొన్ని భవనాలకు నిప్పు పెట్టారు. జాతీయ రహదారిని కూడా కొంతసేపు దిగ్బంధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

వైరల్ సందేశం ఆధారంగానే విద్యార్థుల్లో ఆగ్రహం చెలరేగిందని పోలీసులు పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్య జరిగిందని, మరికొందరు అత్యాచారం జరిగిందని పేర్కొన్నారని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఘటనను నిర్ధారించే ఆధారాలు ఏవీ లభించలేదని స్పష్టం చేశారు. మరోవైపు యూనివర్సిటీ ఆస్తులకు భారీగా నష్టం కలిగించిన ఘటనపై పోలీసులు దృష్టి సారించారు.

ఇదీ చదవండి: బిగ్‌బాస్ నటి బరితెగింపు.. వైద్యునిపై దాడి, కారు అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement