అగాధం అంచున ప్రపంచం: జైశంకర్ హెచ్చరిక! | World on edge of abyss today seeing weaponisation of everything Jaishankar at UN | Sakshi
Sakshi News home page

అగాధం అంచున ప్రపంచం: జైశంకర్ హెచ్చరిక!

Sep 27 2026 7:52 AM | Updated on Sep 27 2026 7:52 AM

World on edge of abyss today seeing weaponisation of everything Jaishankar at UN

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం ప్రస్తుతం అగాధం అంచున ఉందని, ఆర్థిక వ్యవస్థ, మార్కెట్‌ ప్రవేశం, సరఫరా గొలుసులు, సాంకేతికత సహా ప్రతిదీ ఆయుధంగా మారుతోందని హెచ్చరించారు. శాంతి, భద్రత, స్థిరత్వం కోసం దేశాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో జరిగిన సాధారణ చర్చలో జైశంకర్ ప్రసంగించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా ప్రపంచంలో స్థిరత్వం, భద్రత, విశ్వసనీయత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక వనరులు, అనుసంధాన వ్యవస్థలు కూడా దేశాల ప్రయోజనాల కోసం ఒత్తిడి సాధనాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. దీంతో దేశాలు ప్రమాదాలను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక వనరుల కొరతతో కూడిన నాలుగు రకాల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని జైశంకర్ తెలిపారు.

ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం కావడం, ఎరువుల కొరత, ధాన్యం రవాణాలో అవరోధాలు పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయని జైశంకర్ చెప్పారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై కూడా ఒత్తిడి పెరుగుతోందన్నారు. పాకిస్థాన్‌ను నేరుగా పేరుపెట్టకుండా జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహించే వారు వాస్తవాలను వక్రీకరించి, ఉగ్రవాదాన్ని సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తనను తాను రక్షించుకునే హక్కును వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. స్నేహం, సౌహార్దం, ఉగ్రవాదం ఒకేసారి కొనసాగలేవన్నారు. సరిహద్దులు దాటి జరిగే ప్రభుత్వ ప్రోత్సాహిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని పేర్కొంటూ, దానికి పాల్పడే ప్రభుత్వాలను బాధ్యులను చేయాలని కోరారు.

ఇదీ చదవండి: భారత్‌కు రష్యా మద్దతు.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement