ఏఐపై మాట్లాడుకుందాం! | China and US agree to establish AI safety channel and continue trade and military | Sakshi
Sakshi News home page

ఏఐపై మాట్లాడుకుందాం!

Sep 27 2026 6:04 AM | Updated on Sep 27 2026 6:04 AM

China and US agree to establish AI safety channel and continue trade and military

నూతన ఏఐ భద్రతా విధానం ఏర్పాటుకు అంగీకారం  

వాణిజ్యం, సైనిక అంశాలపై చర్చలు కొనసాగింపు  

సైనిక సమాచార మార్పిడిపై కార్యాచరణ వేగవంతం  

వాణిజ్య అంశాలపై సహకారానికి వాణిజ్య, పెట్టుబడుల మండలి  

జిన్‌పింగ్‌ పర్యటన సందర్భంగా అమెరికా, చైనా నిర్ణయం  

బ్యాంకాక్‌:  కృత్రిమ మేధ(ఏఐ) సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరపడానికి, సైనిక సమాచార మార్పిడిపై కార్యాచరణను వేగవంతం చేయడానికి అమెరికా, చైనాలు అంగీకారానికి వచ్చాయి. నూతన ఏఐ భద్రతా విధానం ఏర్పాటుకు, అలాగే వాణిజ్యం, సైనిక అంశాలపై చర్చలు కొనసాగించడానికి ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఇరుదేశాలు శనివారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. 

ఎంపిక చేసిన ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై సహకారానికి వాణిజ్య, పెట్టుబడుల మండలిని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయానికి వ చ్చినట్లు తెలిపాయి. ఈ బోర్డు ఈ వారం నుంచే కార్యకలాపాలు ప్రారంభించినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ 3 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇరువురు నేతల మధ్య కొత్తగా ఒప్పందాలేవీ కుదరలేదు. 

పశ్చిమాసియా పరిణామాలపైనా ట్రంప్, జిన్‌పింగ్‌ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమంటూ ఇచ్చిన హామీని ఇరాన్‌ గౌరవించాలని వారు తే ల్చిచెప్పారు. హార్మూజ్‌ జలసంధిలో పరిస్థితులను ప్రస్తావించారు. అంతర్జాతీయ జల మార్గాలపై ఏ దేశం కూడా సుంకాలు విధించడానికి వీల్లేదని స్పష్టంచేశారు. రెండు దేశాల సైన్యాల మధ్య సంక్షోభ సమాచార మార్పిడిని బలోపేతం చేయడం, సంక్షోభ నివారణపై ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 

చైనాతో సంబంధాలకు ట్రంప్‌ అధిక ప్రాధాన్యం  
చైనా అధినేత జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశంలో అడుగుపెట్టారు. గత ఏడాది చైనాతో వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసినప్పటికీ.. ఈ పర్యటన సందర్భంగా జిన్‌పింగ్‌ పట్ల డొనాల్డ్‌ ట్రంప్‌ అసాధారణమైన ఆతీ్మయత ప్రదర్శించడం గమనార్హం. చైనాతో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్రంప్‌ తన చేతల ద్వారా సంకేతాలిచ్చారు. సంక్షోభ సమయాల్లో సమాచార మార్పిడిని బలోపేతం చేయడం, సంక్షోభాలను నివారించడమే లక్ష్యంగా ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. కానీ, దీనిపై పూర్తి వివరాలేవీ బహిర్గతం చేయలేదు. ఏఐ సంబంధిత అంశాల కోసం అమెరికా, చైనాలు ఒక కమ్యూనికేషన్‌ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.   

త్వరలో పరస్పర సుంకాల తగ్గింపు  
దాదాపు 30 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై పరస్పర సుంకాలను తగ్గించుకోవాలని అమెరికా, చైనాలు భావిస్తున్నాయి. దీన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చాయి. వాణిజ్యపరమైన ఒప్పందాలను మరో రెండు నెలలపాటు పొడిగించేందుకు ట్రంప్, జిన్‌పింగ్‌ అంగీకరించారు. 2027, 2028లో అమెరికా నుంచి కనీసం 10 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడానికి చైనా అంగీకరించినట్లు వైట్‌హౌస్‌ స్పష్టంచేసింది. పరస్పర సుంకాల తగ్గింపులో ఎక్కువ భాగం వ్యవసాయ ఉత్పత్తులు లేదా పండుగ అలంకరణ సామగ్రి వంటి వస్తువులకే పరిమితం కానున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement