పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి | Bombing In Pakistan Khyber Pakhtunkhwa | Sakshi
Sakshi News home page

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 11 మంది మృతి

Sep 26 2026 7:43 PM | Updated on Sep 26 2026 7:50 PM

Bombing In Pakistan Khyber Pakhtunkhwa

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ నగరంలో రోడ్డులో పోలీస్‌ చెక్‌పోస్టు దగ్గర జరిగిన ఈ పేలుడులో 11 మంది మృతి చెందగా.. మరో 30 మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో వచ్చిన ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని పేల్చడంతో భారీ పేలుడు సంభవించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాతుకానికి తమదే బాధ్యతని పాకిస్థానీ తాలిబన్‌గా పిలిచే తెహ్రీక్-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్ (TTP) ప్రకటించింది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి.

ప్రధానంగా టీటీపీ, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి వేర్పాటువాద సంస్థలు వరుస దాడులతో పేట్రేగిపోతున్నాయి. తాజా ఘటనతో దేశంలోని భద్రతా లోపాలపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు తర్వాత ఘటనాస్థలం నుంచి భారీగా బూడిదరంగు పొగ పైకి ఎగసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇదీ చదవండి: ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమంలో కలకలం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement