పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచ‌రీ | Pakistan’s Muhammad Shahzad Creates History, Smashes Fastest First Class Century In 49 Balls, Check More Details Inside | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచ‌రీ

Sep 25 2026 10:40 AM | Updated on Sep 25 2026 12:37 PM

Muhammad Shahzad smashes fastest first-class hundred by a Pakistani batter

పాకిస్తాన్ అన్‌క్యాప్డ్ ఆటగాడు ముహమ్మద్ షాజాద్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా షాజాద్ రికార్డులకెక్కాడు. కేవలం 49 బంతుల్లోనే అతను ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్-1 టోర్నీలో భాగంగా హైదరాబాద్ కింగ్స్‌మెన్ అకాడమీతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ టీవీ జట్టు తరపున షాజాద్ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముం‍దు ఈ రికార్డు మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ పేరిట ఉండేది. 2014 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మిస్బా 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. 

ఇప్పుడు తాజా ఇన్నింగ్స్‌తో  12 ఏళ్ల నాటి మిస్బా రికార్డును షాజాద్ బద్దలు కొట్టాడు. కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ టీవీ జట్టు కేవలం 34 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ముహమ్మద్ షాజాద్  ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 

ఇస్లామాబాద్ క్రికెట్ స్టేడియం బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 62 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షాజాద్ .. 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా తొలి రోజు ఆటముగిసే సమయానికి పాక్ టీవీ జట్టు 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. షాజాద్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలోనే పాక్ రెడ్ బాల్ జట్టులోకి వచ్చే అవకాశముంది.
చదవండి: WI vs ZIM: వెస్టిండీస్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement