సనత్ జయసూర్య రికార్డ్‌ బ్రేక్‌.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన శ‍్రీలంక | Kusal Mendis Breaks Sanath Jayasuriyas Stellar Record | Sakshi
Sakshi News home page

సనత్ జయసూర్య రికార్డ్‌ బ్రేక్‌.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన శ‍్రీలంక

Sep 25 2026 11:33 AM | Updated on Sep 25 2026 11:38 AM

Kusal Mendis Breaks Sanath Jayasuriyas Stellar Record

PC: England cricket

లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో16 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో లంక సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌(100 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121) భారీ సెంచరీతో కదం తొక్కగా.. కమిందు మెండిస్‌(54), పవన్ రత్నాయకే(49), జనిత్‌ లియాంగే(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో గస్ అట్కిన్సన్, రెహాన్‌ అహ్మద్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా అర్చర్‌ ఓ వికెట్‌ సాధించాడు.

అనంతరం 322 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు టామ్‌ బాంటన్‌(73), బెన్‌ డకెట్‌(67) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. అయితే కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌(1), జో రూట్‌(15) తీవ్ర పరిచాడు. మిడిలార్డర్‌లో జోస్‌ బట్లర్‌(69), విల్‌ జాక్స్‌(52) హాఫ్‌ సెంచరీలతో రాణించినస్పటికి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 305 పరుగులకే పరిమితమైంది. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే మూడు, మలింగ, ‍మధుశంక తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. ఇరు జట్ల మధ్య సిరీస్‌ డిసైడర్‌ సెప్టెంబర్‌ 27న జరగనుంది.

 జయసూర్య రికార్డ్ బ్రేక్‌
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కుశాల్ మెండిస్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లీడ్స్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన శ్రీలంక కెప్టెన్‌గా సనత్ జయసూర్య(112) రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు.
చదవండి: పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచ‌రీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement