సొంతగడ్డపై విజృంభించిన దక్షిణాఫ్రికా.. తొలి వన్డేలో ఆసీస్ చిత్తు | Breetzke Century Powers South Africa to 67-Run Victory Over Australia | Sakshi
Sakshi News home page

AUS vs SA: సొంతగడ్డపై విజృంభించిన దక్షిణాఫ్రికా.. తొలి వన్డేలో ఆసీస్ చిత్తు

Sep 25 2026 8:05 AM | Updated on Sep 25 2026 8:05 AM

Breetzke Century Powers South Africa to 67-Run Victory Over Australia

PC: SA Twitter

డర్బన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ప్రోటీస్‌ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే (106 బంతుల్లో 112 పరుగులు, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్  మార్కో జాన్సెన్ (59 బంతుల్లో 75 పరుగులు, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా సఫారీలు కంగారుల ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగారు.

మహారాజ్ మ్యాజిక్‌
అనంతరం 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు  మిచెల్ మార్ష్ (60), ట్రావిస్ హెడ్ (36) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ ఆ తర్వాత దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ విజృంభించడంతో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. 

మ‌హారాజ్‌ 9.2 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అత‌డితో పాటు కార్బిన్ బాష్, జోర్న్ ఫోర్టుయిన్లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. ఫ‌లితంగా ఆస్ట్రేలియా 41.2 ఓవ‌ర్ల‌లో 230 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే ఆదివారం జోహ‌న్స్‌బ‌ర్గ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.
చదవండి: WI vs ZIM: వెస్టిండీస్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement