సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ భారత పురుషుల, మహిళల జట్లు తొలి ‘డ్రా’ నమోదు చేసుకున్నాయి. ఎనిమిదో రౌండ్‌లో కజకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2–2తో సమంగా ముగించింది. బోర్డు–1పై కోనేరు హంపి–బీబీసారా అసబయేవా గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. బోర్డు–2పై వైశాలి 46 ఎత్తుల్లో అలువా నుర్మాన్ చేతిలో ఓడిపోయింది. బోర్డు–3పై దివ్య దేశ్‌ముఖ్–కమలిదెనోవా గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. బోర్డు–4పై సవితా శ్రీ 62 ఎత్తుల్లో ఎల్నాజ్ కలియక్‌మెత్‌పై గెలిచింది.
మరోవైపు అజర్‌బైజాన్‌తో జరిగిన ఎనిమిదో రౌండ్ మ్యాచ్‌ను భారత పురుషుల జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. బోర్డు–1పై ప్రజ్ఞానంద–షఖిర్యారఱ్ మమెదైరోవ్ గేమ్ 36 ఎత్తుల్లో... బోర్డు–2పై అర్జున్–సులెమాన్లీ గేమ్ 37 ఎత్తుల్లో... బోర్డు–3పై గుకేశ్–మెహమూద్ మురాద్లీ గేమ్ 56 ఎత్తుల్లో... బోర్డు–4పై విదిత్–రవూఫ్ మమెదోవ్ గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఎనిమిదో రౌండ్ తర్వాత భారత పురుషుల జట్టు ఏడో స్థానంలో... భారత మహిళల జట్టు ఐదో స్థానంలో ఉన్నాయి. నేడు జరిగే తొమ్మిదో రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో భారత మహిళల జట్టు; జర్మనీతో భారత పురుషుల జట్టు తలపడతాయి.


