ఐదో స్థానం కోసం...నేడు జర్మనీతో భారత మహిళల హాకీ జట్టు పోరు | Indian womens hockey team to battle Germany for fifth place | Sakshi
Sakshi News home page

ఐదో స్థానం కోసం...నేడు జర్మనీతో భారత మహిళల హాకీ జట్టు పోరు

Aug 27 2026 3:48 AM | Updated on Aug 27 2026 3:48 AM

Indian womens hockey team to battle Germany for fifth place

ఆమ్‌స్టెల్వీన్‌: మహిళల హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమైన భారత జట్టు ఇప్పుడు ఐదో స్థానం కోసం జర్మనీతో పోరుకు సిద్ధమైంది. సాయంత్రం గం. 6:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ మెగా టోర్నీలో పూల్‌ ‘డి’ నుంచి బరిలోకి దిగిన సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు... ఒక మ్యాచ్‌లో గెలిచి మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 

అనంతరం రెండో దశ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నెదర్లాండ్స్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది. ఆ్రస్టేలియాతో చివరి మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌కు అర్హత సాధించే దశలో టీమిండియా ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్‌కు దూరమైంది. గతంలో రెండుసార్లు వరల్డ్‌కప్‌ నెగ్గిన జర్మనీ ప్రస్తుతం ఐదో ర్యాంక్‌లో ఉండగా... భారత్‌ 9వ స్థానంలో ఉంది. 1974లో జరిగిన తొలి మహిళల హాకీ ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచిన భారత్‌...ఆ తర్వాత ఎప్పుడూ సెమీస్‌కు చేరలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement