నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ ఆశలు గల్లంతు! | FIH Hockey World Cup 2026: Netherlands Outclass India 3-1 as Semifinal Hopes Take a Hit | Sakshi
Sakshi News home page

నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ ఆశలు గల్లంతు!

Aug 22 2026 9:12 PM | Updated on Aug 22 2026 9:35 PM

FIH Hockey World Cup 2026: Netherlands Outclass India 3-1 as Semifinal Hopes Take a Hit

పురుషల హాకీ ప్రపంచకప్‌-2026లో అమ్‌స్టెల్వీన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన సెకెండ్‌ రౌండ్‌ మ్యాచ్‌లో 3-1 తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో భారత జట్టు సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ కీలక మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన తేలిపోయింది.

ఫస్ట్‌ హాఫ్‌ల ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. భారత డిఫెన్స్ డచ్‌ జట్టు ఎటాక్‌ను సమర్థవంతంగా అడ్డుకుంది. దీంతో మొదటి రౌండ్‌ ముగిసే సరికి ఇరు జట్లు కూడా తమ గోల్‌ ఖాతాను తెరవలేకపోయాయి. అయితే సెకెండ్‌ హాఫ్‌లో అయితే నెదర్లాండ్స్‌ చెలరేగిపోయింది. మ్యాచ్ మూడో క్వార్టర్‌లో డ్యూకో టెల్గెన్‌క్యాంప్ అద్భుతమైన గోల్‌తో డచ్‌ జట్టును 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

నాలుగో కార్వర్ట్‌లో థిజ్స్ వాన్ డామ్ మరో గోల్‌ సాధించి నెదర్లాండ్స్‌ ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను పవర్ ఫుల్ డ్రాగ్ ఫ్లిక్‌తో గోల్‌గా భారత ఖాతాను తెరిచాడు. కానీ ఆ తర్వాత మరో గోల్‌ను భారత్‌ సాధించలేకపోయింది. ఇక చివరగా జ్స్ వాన్ డామ్ మరో గోల్‌ కొట్టి 3-1 తేడాతో నెదర్లాండ్స్‌ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ విజయంతో డచ్‌ సెమీస్‌కు అర్హత సాధించింది.

ఇక భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించాలంటే అద్భుతాలు జరిగాలి. టీమిండియా తమ చివరి మ్యాచ్‌లో అర్జెంటీనాపై భారీ విజయం సాధించడమే కాకుండా, ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలుపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement