Photo Credit: Twitter
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన దేశం తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎస్టాడియో మోనుమెంటల్ స్టేడియంలో వేలాది ప్రేక్షకుల మధ్య అర్జెంటీనా, బెనిన్ మధ్య మ్యాచ్ జరిగింది. తన వీడ్కోలు మ్యాచ్‌లో గోల్ సాధించడంతో పాటు రెండు కీలక అసిస్ట్‌లు చేయడం విశేషం.
ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో బెనిన్‌ను చిత్తు చేసింది. తొలి హాఫ్‌లో ఇరుజట్లు గోల్ నమోదు చేయకపోవడంతో 0-0తో నిలిచాయి. అయితే రెండో సగం ప్రారంభమైన తర్వాత 52వ నిమిషంలో మెస్సీ పాస్ అందించగా, ఒటమెండీ ఎలాంటి మిస్టేక్ చేయకుండా బంతిని గోల్‌పోస్ట్‌కు తరలించడంతో అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఆట 61వ నిమిషంలో మెస్సీ తన రెండో అసిస్ట్ చేయగా, బంతిని అందుకున్న నికో పాజ్ మెరుపువేగంతో గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. దీంతో అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ వచ్చి చేరింది. రెండు కీలక పాస్‌లతో అర్జెంటీనా గోల్స్ చేయడంలో కీలపాత్ర పోషించిన మెస్సీ, ఈసారి మాత్రం తానే స్వయంగా గోల్ కొట్టి అభిమానులను అలరించాడు. నిర్ణీత సమయం ముగిసేసరికి అర్జెంటీనా 3-0తో ఆధిక్యంలో నిలిచి విజయం సాధించింది.

మెస్సీ కన్నీటిపర్యంతం..
ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ వెక్కి వెక్కి ఏడ్చాడు. 21 ఏళ్లుగా అర్జెంటీనా జట్టును తన భుజాలపై మోసిన క్షణాలు గుర్తుకువచ్చి కన్నీటిపర్యంతమయ్యాడు. అతడిని చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అవ్వడం కనిపించింది. ఆ తర్వాత మెస్సీ గ్రౌండ్ మొత్తం కలియతిరుగుతుంటే.. స్టాండ్స్‌లో నుంచి అభిమానులు పెద్ద ఎత్తున మెస్సీ.. మెస్సీ అంటూ నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు.
2005లో ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కెరీర్ ఆరంభించిన లియోనల్ మెస్సీ అర్జెంటీనా తరఫున 208 మ్యాచ్‌లు ఆడి 126 గోల్స్ చేశాడు. అంతర్జతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో 146 గోల్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయంగా మెస్సీ సాధించిన రికార్డులు..
👉126- అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్. జాతీయ జట్టు తరఫున మెస్సీ 208 మ్యాచ్‌లు ఆడాడు.
👉21- తాను ఆడిన ఆరు ప్రపంచకప్‌లలో కలిపి మెస్సీ చేసిన గోల్స్.
👉2- మెస్సీ గెల్చుకున్న ‘గోల్డెన్ బాల్’ అవార్డులు. 2014 ప్రపంచకప్‌లో, 2022 ప్రపంచకప్‌లో మెస్సీ ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.
👉1- ఒకే ప్రపంచకప్‌లో (2022) గ్రూప్ దశ, ప్రిక్వార్టర్, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో గోల్ చేసిన ఏకైక ప్లేయర్ మెస్సీ. ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (34) ఆడిన ప్లేయర్ రికార్డు... అత్యధిక మ్యాచ్‌ల్లో (27) కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డు కూడా మెస్సీ పేరిటే ఉంది.
👉మెస్సీ అర్జెంటీనాకు 2022 ఫిఫా ప్రపంచ కప్‌తో పాటు 2021, 2024 రెండు కోపా అమెరికా టైటిళ్లను అందించాడు. 2014లో ఒకసారి, 2026లో మరోసారి అర్జెంటీనాను రన్నరప్‌గా నిలిపాడు.
La emoción de Lionel Scaloni apenas empezó a sonar el himno. Este tipo ama a Argentina. Ama a Messi. https://t.co/COLCdATGZK
— Siempre Con Argentina⭐⭐⭐ (@siempreconargok) October 6, 2026
Gol número 126 de Lionel Messi en la Selección Argentina https://t.co/2SqYfH9pld
— Siempre Con Argentina⭐⭐⭐ (@siempreconargok) October 7, 2026
Lionel Messi, el mas grande de todos. https://t.co/fiFmL2GbUG
— Sudanalytics (@sudanalytics_) October 7, 2026
ఇదీ చదవండి: శ్రేయస్ చరిత్ర.. కెప్టెన్‌గా ఎవరికీ సాధ్యం కాని ఫీట్!


