PC: BCCI/X
వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దేవ్‌దత్ పడిక్కల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్.. వన్డే మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేశాడు. దూకుడుగా ఆడిన గిల్ తృటిలో తన 12వ టెస్టు సెంచరీ మార్క్‌ను మిస్ చేసుకున్నాడు. 146 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 98 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు.
అయితే గిల్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై భారత కెప్టెన్‌గా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన జాబితాలో గిల్ రెండో స్దానంలో నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. కాగా 1976లో గవాస్కర్ కెప్టెన్‌గా మొదటి టెస్టు ఇన్నింగ్స్‌లో 116 పరుగులు చేశాడు. మళ్లీ ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత గిల్ ఈ ఫీట్ సాధించడం గమనార్హం.
న్యూజిలాండ్‌లో భారత కెప్టెన్‌గా తమ తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన స్కోర్లు ఇవే
మహ్మద్ అజారుద్దీన్ - 48 (1990)
సునీల్ గవాస్కర్ - 116 (1976)
ఎం.ఎస్. ధోనీ - 47 (2009)
మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - 24 (1968)
వీరేందర్ సెహ్వాగ్ - 34 (2009)
విరాట్ కోహ్లీ - 2 (2020)
బిషన్ సింగ్ బేడీ - 30 (1976)
సౌరవ్ గంగూలీ - 17 (2002)
శుభ్‌మన్ గిల్ - 98 (2026)


