source: X
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 3000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు. 83 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలురాయిని (43వ మ్యాచ్, 77వ ఇన్నింగ్స్‌లో) అందుకున్నాడు. ప్రస్తుతం గిల్ 93 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.
డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు..
గిల్- 3009*
పంత్- 2978
రోహిత్ శర్మ- 2716
రవీంద్ర జడేజా- 2675
యశస్వి జైస్వాల్- 2673
విరాట్ కోహ్లి- 2617
ఓవరాల్‌గా డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో గిల్ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.
డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..
రూట్- 6815
స్టీవ్ స్మిత్- 4804
లబూషేన్- 4651
ట్రవిస్ హెడ్- 4200
బెన్ స్టోక్స్- 3857
మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ 110 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. గిల్‌తో పాటు పంత్ (48) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 479-3గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (136) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి జైస్వాల్ (85), దేవదత్ పడిక్కల్ (80) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు.
అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. హెన్రీ నికోల్స్ (175 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (118) సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో బుమ్రా 4, ఆకాశ్‌దీప్ 3, అన్షుల్ కంబోజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి: సూపర్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్


