సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ (కావా) వాలీబాల్ క్లబ్ చాంపియన్‌షిప్‌లో ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ తెలుగు బ్లాక్ హాక్స్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ 20–25, 25–19, 25–22, 25–18తో ముంబై మీటియర్స్‌పై గెలిచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తెలుగు బ్లాక్ హాక్స్ సెమీఫైనల్‌కు చేరడం జట్టుకు మాత్రమే కాకుండా భారత వాలీబాల్‌కు కూడా గర్వకారణమని ఆ జట్టు యజమాని కంకణాల అభిõషిక్ రెడ్డి అన్నారు. తెలుగు బ్లాక్ హాక్స్ జట్టుకు అర్జెంటీనాకు చెందిన ఏరియల్ గార్సియా ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా... అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఫెడెరికో పెరెయిరా (అర్జెంటీనా), హెక్టర్ అలెక్సిస్ క్రజ్ (డొమినికన్ రిపబ్లిక్) , హెన్రిక్ మీరెలెస్ (బ్రెజిల్) సభ్యులుగా ఉన్నారు.


