Photo Credit: BCCI Twitter
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు శుభారంభం చేసింది. 333 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు భారత బౌలర్ల ధాటికి 11.3 ఓవర్లలో 26 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇండియా-ఏ జట్టు 306 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పేసర్లు ప్రిన్స్ యాదవ్ 5 వికెట్లు, హర్షిత్ రానా 4 వికెట్లతో నేపాల్ నడ్డివిరిచారు.

PC: BCCI Twitter
ఈ ఇద్దరి ధాటికి నేపాల్ బ్యాటింగ్ కకావికలమైంది. నేపాల్ బ్యాటర్లలో 11 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, ఐదుగురు బ్యారట్లు డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే ఇండియా-ఏ జట్టుకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. గతంలో 2018లో లీసెష్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు 281 పరుగుల తేడాతో విజయాన్ని అందుకోవడమే ఇప్పటివరకు అత్యుత్త మంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును తిలక్ వర్మ సేన సవరించింది.

PC: BCCI Twitter
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. కుమార్ కుషాగ్ర (117), తిలక్ వర్మ (107) సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో సూర్యాన్ష్ షెడ్గే (14 బంతుల్లో 36 నాటౌట్) దంచికొట్టడంతో ఇండియా-ఏ భారీ స్కోరు చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బన్షీ, సందీప్ లమిచానే చెరో 3 వికెట్లు తీయగా, నందన్ యాదవ్ రెండు, పవన్ సరాఫ్ ఒక వికెట్ పడగొట్టాడు.
𝗙𝗜𝗙𝗘𝗥 𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹 🔥 Prince Yadav breathing fire at the moment 👏👏 Nepal are 9 down for 22. Updates ▶️ https://t.co/r7KnQLPzIm #TeamIndia | #INDAvNEP | #RisingStarsAsiaCup https://t.co/rtFYJzmb4t
— BCCI (@BCCI) November 20, 2026
Terrific start with the ball 👌 Harshit Rana 🤝 Prince Yadav 4️⃣ wickets in no time for India A Updates ▶️ https://t.co/r7KnQLPzIm #TeamIndia | #INDAvNEP | #RisingStarsAsiaCup https://t.co/xElAbC0CPb
— BCCI (@BCCI) November 20, 2026
ఇదీ చదవండి: శతక్కొట్టిన తిలక్, కుమార్ కుషాగ్ర.. నేపాల్ ఎదుట భారీ లక్ష్యం


