Photo Credit: BCCI Twitter
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్స్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ కెప్టెన్ తిలక్ వర్మతో పాటు కుమార్ కుషాగ్ర అర్థసెంచరీలతో మెరిశారు. ముందుగా కెప్టెన్ తిలక్ వర్మ 77 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో కేవలం రెండు బౌండరీలు, ఒక సిక్సర్ మాత్రమే ఉన్నాయి.
ఆ వెంటనే కుమార్ కుషాగ్ర 62 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే ఓపెనర్లు అభిషేక్ శర్మ (9), వైభవ్ సూర్యవంశీ (26), ఆయుశ్ బదోని (2) స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు. దీంతో కెప్టెన్ తిలక్ వర్మ, కుమార్ కుషాగ్ర కలిసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
ఈ ఇద్దరు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచుతూ వచ్చారు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. ఫలితంగా 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టు కోలుకుంది. 33 ఓవర్లు ముగిసేసరికి ఇండియా-ఏ జట్టు 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో పవన్ సరాఫ్, నందన్ యాదవ్, లలిత్ రాజ్‌బన్సీలు తలా ఒక వికెట్ తీశారు.
Captain's knock under pressure 🫡 A well compiled and responsible FIFTY from India A skipper Tilak Varma 👏👏 Updates ▶️ https://t.co/r7KnQLPzIm #TeamIndia | #INDAvNEP | #RisingStarsAsiaCup https://t.co/0QGHlOl5OG
— BCCI (@BCCI) November 20, 2026
ఇదీ చదవండి: అభిషేక్ శర్మ ఫెయిల్.. నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ


