NZ Vs IND: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా పేస‌ర్లు | India Pacers-Recreate-12 Years-Record-Same Wellington Vs NZ Test Match | Sakshi
Sakshi News home page

NZ Vs IND: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా పేస‌ర్లు

Nov 20 2026 3:12 PM | Updated on Nov 20 2026 3:16 PM

India Pacers-Recreate-12 Years-Record-Same Wellington Vs NZ Test Match

Photo Credit: Twitter

వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో మొద‌లైన తొలి టెస్టులో టీమిండియా బౌల‌ర్లు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆకట్టుకున్నారు. అయితే న్యూజిలాండ్ బ్యాట‌ర్లు హెన్రీ నికోల్స్ (175 నాటౌట్‌), గ్లెన్ ఫిలిప్స్ (118) సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్ట‌డంతో కివీస్ 368 పరుగుల గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు  చేసింది. 

భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీయ‌గా, ఆకాశ్ దీప్ మూడు, అన్షుల్ కాంబోజ్ 2, ప్ర‌సిధ్ క్రిష్ణ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే.. న్యూజిలాండ్ ప‌ది వికెట్ల‌ను పేస‌ర్లే ప‌డ‌గొట్ట‌డం విశేషం. బుమ్రా, ఆకాశ్ దీప్‌లు క‌లిపి ఏడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అన్షుల్, ప్ర‌సిధ్‌లు క‌లిపి మ‌రో మూడు వికెట్లు తీశారు. 

జ‌ట్టులో ఏకైక స్పిన్న‌ర్‌గా ఉన్న వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు ఒక్క వికెట్ కూడా ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో న్యూజిలాండ్‌తో టెస్టులో టీమిండియా పేస‌ర్లు అన్ని వికెట్లు తీయ‌డం చ‌రిత్ర‌లో ఇది రెండోసారి మాత్ర‌మే. 2014లో తొలిసారి ఇదే వెల్లింగ్ట‌న్ వేదిక‌గా భార‌త పేస‌ర్లు ఈ ఫీట్‌ను న‌మోదు చేశారు. 

నాటి మ్యాచ్‌లో ఇషాంత్ శ‌ర్మ (6/51), మొహ‌మ్మ‌ద్ ష‌మీ (4/70)లు క‌లిసి ప‌ది వికెట్లు తీయ‌డం విశేషం. ఆనాడు జ‌ట్టులో ఏకైక స్పిన్న‌ర్‌గా ఉన్న జ‌డేజా కేవ‌లం రెండు ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ వేశాడు. ఇక స‌రిగ్గా ఏడాది త‌ర్వాత టెస్టు క్రికెట్ ఆడుతున్న బుమ్రా సూప‌ర్ బౌలింగ్‌తో అద‌ర‌గొట్టాడు. 92 ప‌రుగులిచ్చి 4 వికెట్లు తీసిన బుమ్రా కివీస్‌పై బెస్ట్ ఫిగ‌ర్స్‌ను న‌మోదు చేశాడు. 

సిరాజ్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన ఆకాశ్ దీప్ కూడా 23 ఓవ‌ర్లు వేసి 53 ప‌రుగులిచ్చి మూడు వికెట్లు తీయ‌డంతో పాటు గ్లెన్ ఫిలిప్స్‌, హెన్రీ నికోల్స్ 216 ప‌రుగులు భాగ‌స్వామ్యాన్ని విడ‌దీయడంలో స‌క్సెస్ అయ్యాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే, రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా 39 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. జైస్వాల్ (85) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, కేఎల్ రాహుల్ (52) అజేయ అర్థ‌శ‌త‌కం, ప‌డిక్క‌ల్ (16) క్రీజులో ఉన్నారు. మాట్ హెన్రీ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో మ‌రో 209 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

ఇదీ చదవండి: NZ vs IND: అదరగొట్టిన రాహుల్‌-జైశ్వాల్‌ జోడీ.. 32 ఏళ్ల నిరీక్షణకు తెర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement