రాణించిన పృథ్వీ షా.. రుతురాజ్‌ మెరుపులు.. ఆఖరి బంతికి.. | SMAT 2026 Ruturaj Shines Maharashtra Beat Assam Last Over Thriller | Sakshi
Sakshi News home page

రాణించిన పృథ్వీ షా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ మెరుపులు.. ఆఖరి బంతికి..

Nov 20 2026 12:48 PM | Updated on Nov 20 2026 12:58 PM

SMAT 2026 Ruturaj Shines Maharashtra Beat Assam Last Over Thriller

PC: Maharashtracricket/BCCI X

దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2026 సీజన్‌లో మహారాష్ట్ర జట్టు రెండో విజయం సాధించింది. పృథ్వీ షా కెప్టెన్సీలో పుదుచ్చేరి, కేరళ చేతిలో ఓడిపోయిన మహారాష్ట్ర.. హిమాచల్‌ ప్రదేశ్‌పై గెలిచి ఎట్టకేలకు బోణీ కొట్టింది.

మెరుగైన స్కోరు సాధించిన అసోం
తాజాగా అసోం జట్టుతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలో మహారాష్ట్ర గెలుపు నమోదు చేసింది. మొహాలీ వేదికగా టాస్‌ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. అసోం బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది.

డెనిష్‌ దాస్‌ మెరుపు అర్ధ శతకం
శివశంకర్‌ రాయ్‌ (26 బంతుల్లో 31) ఓ మోస్తరుగా రాణించగా.. కెప్టెన్‌ డెనిష్‌ దాస్‌ మెరుపు అర్ధ శతకం (33 బంతుల్లో 61)తో ఆకట్టుకున్నాడు. మహారాష్ట్ర బౌలర్లలో రామకృష్ణ ఘోష్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వివేక్‌ షేలార్‌ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. ముకేశ్‌ చౌదరి, ప్రశాంత్‌ సోలంకి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

రుషికేశ్‌ హాఫ్‌ సెంచరీ
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ పృథ్వీ షా (24 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రుషికేశ్‌ సోనావనే హాఫ్‌ సెంచరీ (32 బంతుల్లో 54)తో మెరిశాడు.

ఆఖరి బంతికి సింగిల్‌ తీసి
కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 35 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచి.. సిద్ధేశ్‌ వీర్‌ (12 బంతుల్లో 18 నాటౌట్‌)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సింగిల్‌ తీసి జట్టును గెలిపించాడు. కాగా భారత వన్డే జట్టుతో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌ పర్యటనలో ఉన్న సమయంలో పృథ్వీ షా మహారాష్ట్ర జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఇదీ చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన గ్లెన్‌ ఫిలిప్స్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement