Ruturaj Gaikwad
-
తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?
అఫ్గనిస్తాన్‌తో శనివారం నాటి తొలి వన్డే కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇందుకోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకుంది. కాగా అఫ్గన్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రధాన మార్పు జరిగిన సంగతి తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల టీమిండియాకు దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా ఈ ఆర్సీబీ ఆటగాడు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అఫ్గన్‌తో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.ఈ నేపథ్యంలో వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి స్థానంలో.. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. అయితే, రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని జైసూను ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.రుతుకు బదులు జైసూను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి పనే చేశారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి రుతు శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.అక్కడ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ చేశాడు. మరో మ్యాచ్‌లోనూ రాణించాడు. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు రుతును ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్- ‘ఎ’ జట్టులో అతడు కీలక సభ్యుడు.ఒకవేళ టీమిండియాకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. అలాంటపుడు కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?.. యశస్వి జైస్వాల్‌కు కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వరు. కాబట్టి రుతురాజ్ శ్రీలంకలో ఉండటమే కరెక్ట్.నిజానికి జైసూ అఫ్గనిస్తాన్‌తో చండీగఢ్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి వన్డే కోసం అక్కడి నుంచి ధర్మశాలకు సులువుగానే చేరుకుంటాడు. తుదిజట్టులో యశస్వి జైస్వాల్‌కు బదులు ఇషాన్ కిషన్‌నే ఆడిస్తారు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున ఆడిన తమ చివరి వన్డేల్లో రుతు, జైసూ శతకాలు బాదడం విశేషం.ఇదిలా ఉంటే.. శనివారం ధర్మశాల వేదికగా టీమిండియా అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డే ఆడనుంది. ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జైసూ బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి. -
IND vs AFG: భారత్‌కు భారీ షాక్.. అఫ్గన్ అనూహ్య విజయం
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టుతో గురువారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ సేన ఓటమి పాలైంది.తొలుత ఆతిథ్య శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్ జరుగగా.. భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో గురువారం అఫ్గన్‌తో తలపడ్డ భారత జట్టు.. దంబుల్లాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అదరగొట్టిన భారత బ్యాటర్లుగత మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈసారి అదరగొట్టారు. ప్రభ్‌సిమ్రన్ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా.. వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు.మూడో స్థానంలో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66, కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించారు. మిగతా వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.349 పరుగుల భారీ స్కోరుఇక వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గనిస్తాన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ పడగొట్టారు.పదే పదే ఆటంకంఅనంతరం అఫ్గన్ లక్ష్య ఛేదనకు దిగగా వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. అఫ్గన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇమ్రాన్ మిర్, హసన్ ఐసాఖిల్ అఫ్గన్‌కు శుభారంభం అందించారు.ఇమ్రాన్ 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 75 పరుగులతో అజేయంగా నిలవగా.. హసన్ 29 బంతుల్లో 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఖలీద్ తనీవాల్ (2) మాత్రం విఫలమయ్యాడు. అయితే, ఓపెనర్ ఇమ్రాన్‌కు తోడుగా బహీరీ షా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు.సారథితో పాటు పట్టుదలగా నిలబడ్డ బహీర్బహీర్ 52 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఇమ్రాన్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. అయితే, అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 25.5 ఓవర్లు పూర్తైన తర్వాత మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి అఫ్గన్ రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.భారత్ ఓటమిఅయితే, ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం నిర్ణీత ఓవర్లలో భారత్ కంటే అఫ్గన్ జట్టు ఆధిక్యంలో నిలిచినట్లయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. భారత్‌పై అనూహ్య రీతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది.ఇక ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ట్రై సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ ఒక గెలుపు, ఒక ఓటమి నమోదు చేసింది. మరోవైపు.. అఫ్గన్ ఆడిన ఒక్కటీ గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో ప్రథమ స్థానంలో నిలవగా.. భారత్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది. ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడిన లంక చివరి స్థానంలో నిలిచింది.చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు -
IND vs AFG ODI: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్-‘ఎ’ జట్టు సత్తా చాటింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఈసారి సత్తా చాటగా.. రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ మరోసారి రాణించారు. ఫలితంగా నిర్ణీత 49 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు సాధించింది.తొలి మ్యాచ్ శ్రీలంకతోశ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ మంగళవారం మొదలైంది. తొలి మ్యాచ్‌లో భారత్- శ్రీలంక తలపడగా.. తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.లంకతో మ్యాచ్‌లో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (101) శతకంతో రాణించాడు. తిలక్ వర్మ 60 పరుగులతో రాణించాడు. ఇక తొలి మ్యాచ్‌లో గట్టెక్కిన భారత్.. రెండో మ్యాచ్‌లో భాగంగా గురువారం అఫ్గన్‌పై భారీ స్కోరు సాధించింది.అఫ్గన్‌పై చెలరేగిన ఓపెనర్లు దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69 బంతుల్లో 84), వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లోనే 44) శుభారంభం అందించారు. ప్రభ్‌సిమ్రన్ ఆచితూచి ఆడగా.. వైభవ్ ధనాధన్ దంచికొట్టాడు.రుతు, తిలక్ మరోసారి..వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 రన్స్ రాబట్టాడు. మిగిలిన వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) రాణించాడు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. 49 ఓవర్లు ఎందుకంటే?వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. అఫ్గన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అఫ్గన్ లక్ష్యం 294వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం అఫ్గనిస్తాన్ టార్గెట్‌ను 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు.చదవండి: ఆసీస్ జట్టులో నిఖిల్ చౌదరి -
అఫ్గనిస్తాన్‌తో వన్డే.. వైభవ్ సూర్యవంశీ ఉంటాడు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ఎ’ జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మంగళవారం నాటి వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు ఈ లెప్టాండర్ బ్యాటర్.వైభవ్ విఫలంఆరంభంలో బౌండరీలతో అలరించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. కాసేపటికే అవుటై ఉసూరుమనిపించాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో కేవలం 14 పరుగులు చేసి మహ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఇక మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2) విఫలమయ్యాడు.Bossing From Ball 1 😎Vaibhav Sooryavanshi - making a 𝙍𝙐𝙏𝙃𝙇𝙀𝙎𝙎 entry on the world stage. 💥 #SonySportsNetwork #SonyLIV #TalentTVCup #TeamIndia #SLvIND pic.twitter.com/tLBkRO2ySF— Sony Sports Network (@SonySportsNetwk) June 9, 2026రుతురాజ్ గైక్వాడ్ సెంచరీసాధారణంగా ఓపెనర్‌గా బరిలోకి దిగే ప్రియాన్ష్ ఆర్య లంకతో మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చి (32 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు. టాపార్డర్ విఫలమైనా నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ(101)తో రాణించడంతో భారత్ గట్టెక్కింది. నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులు చేయగలిగింది.అయితే, విజయం కోసం మాత్రం చివరి వరకు తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ విధించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 ఓవర్లు ముగిసే సరికి లంక 261/6తో పటిష్టంగా ఉంది. ఆఖరి మూడు ఓవర్లలో 17 పరుగులే రావాల్సి ఉండగా.. విజయం లాంఛనమే అనుకున్నారు.బౌలర్ల విజృంభణతో..కానీ భారత బౌలర్లు ఆఖర్లో పది బంతుల్లోనే నాలుగు వికెట్లు కూల్చి ఆతిథ్య లంక జట్టు ఓటమిని శాసించారు. అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆయుశ్ బదోని, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీయగా... అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి.. సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.ఇక తమ రెండో మ్యాచ్‌లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు గురువారం అఫ్గనిస్తాన్-‘ఎ’ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై చర్చ మొదలైంది. ఓపెనర్లుగా వైభవ్, ప్రభ్‌సిమ్రన్ విఫలమైనా వారిద్దరిని కొనసాగించాలని నాయకత్వ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా లంకపై గెలిచిన తుది జట్టుతోనే భారత్ అఫ్గన్‌తో వన్డే బరిలోనూ దిగనున్నట్లు తేలిపోయింది.అఫ్గనిస్తాన్-‘ఎ’తో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ (కెప్టెన్), ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, సూయాన్ష్ షెడ్గే, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, విప్రాజ్ నిగమ్.చదవండి: వాళ్లకే దిక్కు లేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
ఓటమి అంచుల నుంచి...
దంబుల్లా: 278 పరుగుల లక్ష్యఛేదనలో 47 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ‘ఎ’ జట్టు 261/6తో నిలిచింది. ఆ జట్టు విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా... చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ సహాన్ (72 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో జోరు మీదున్నాడు. ఇంకేముంది ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంక ‘ఎ’ జట్టు విజయం సాధించడం తథ్యమే అనుకుంటే... అక్కడే భారత ‘ఎ’ బౌలర్లు అద్భుతం చేశారు. 48వ ఓవర్లో 7 పరుగులు ఇ చ్చిన అన్షుల్ కంబోజ్... ప్రత్యర్థి కెప్టెన్‌ను అవుట్ చేయగా... అర్షద్ ఖాన్ వేసిన 49వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ‘ఎ’ జట్టు 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (114 బంతుల్లో 101; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ ( 97 బంతుల్లో 60; 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14; 3 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) విఫలమయ్యారు. భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో వైభవ్... ఐపీఎల్ జోరు కనబర్చలేకపోయాడు. ప్రియాన్ష్ ఆర్య (32; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆయుశ్ బదోనీ (24; 2 ఫోర్లు), సూర్యాన్ష్ షెడ్గె (26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్లలో షిరాజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో లంక 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. సహాన్‌తో పాటు డికెవెల్లా (47), అవిష్క(45), సదీరా సమరవిక్రమ (46) రాణించారు. అయితే చివర్లో ఒత్తిడిని అధిగమించడంలో సఫలమైన భారత జట్టును విజయం వరించింది. భారత ‘ఎ’ బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోనీ, విప్రాజ్ నిగమ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. గురువారం జరగనున్న రెండో లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
గైక్వాడ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపు
శ్రీలంకలో జరుగుతున్న ఏ-జట్ల ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఇవాళ (జూన్ 9) జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (101) సూపర్ సెంచరీతో, కెప్టెన్ తిలక్ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో ఆయుశ్ బదోని (24), సూర్యాంశ్ షేడ్గే (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్మ 32, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 1 (నాటౌట్) పరుగు చేయగా.. ఐపీఎల్ 2026 తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్, వనుజ సహాన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో) కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్ రాయ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టింది. జూన్ 11న జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ తలపడనున్నాయి. -
టీమిండియాలో చోటివ్వరా? శతకంతో కదం తొక్కాడు!
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్‌తో భారత్ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వైభవ్ విఫలం..అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్‌కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2), వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్‌కు పంపి దెబ్బకొట్టింది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.శతకంతో కదంతొక్కాడుఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.మిగిలిన వారిలో ఆయుశ్ బదోని 24, సూర్యాంశ్ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్, వనుజా సాహన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లుచివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జూన్ సిరీస్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయలేదు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్ భారత్-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్! -
కొంపముంచిన రుతురాజ్.. క్రికెట్ చరిత్రలో వింత రనౌట్!
ఇండియా-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే వింత రనౌట్‌కు మ్యాచ్ సాక్ష్యంగా నిలిచింది. విషయంలోకి వెళితే.. ఓపెనర్దిద్దరు తొందరగానే పెవిలియన్ చేరడంతో రుతురాజ్, ప్రియాన్ష్ ఆర్యలు ఆచితూచి ఆడారు. ఇద్దరు కలిసి చాలా బంతులెదుర్కొని 53 పరుగులు జోడించారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో రుతురాజ్ చేసిన తప్పిదం కొంపముంచింది. రవిందు ఫెర్నాండో వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతినే గైక్వాడ్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతికే హైడ్రామా చోటుచేసుకుంది. పాయింట్ దిశగా ఆడిన రుతురాజ్ రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే స్ట్రైక్ ఎండ్‌వైపు ఉన్న ప్రియాన్ష్ ఆర్య రుతురాజ్ రెండో పరుగు కోసం వచ్చిన విషయం గమనించలేదు. అప్పటికే క్రీజులో బ్యాట్ పెట్టాడు. కానీ అప్పటికే రుతురాజ్ స్ట్రైక్ ఎండ్‌వైపు వచ్చేశాడు. ఈలోగా బంతిని కీపర్ బౌలర్ వైపు విసిరే క్రమంలో ప్రియాన్ష్ బ్యాట్‌ను తొక్కడం కనిపించింది. ఇంతలో కీపర్ నుంచి బంతిని అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్‌లో ఉండడంతో నిబంధనల ప్రకారం ఎవరు బ్యాట్‌ను మొదటగా క్రీజులో పెట్టారనేది అంపైర్లు పరిశీలించారు. రిప్లేలో ప్రియాన్ష్ ఆర్య బ్యాట్ క్రీజుపై ఉంచినప్పటికీ, ప్రియాన్ష్ కంటే ముందే రుతురాజ్ బ్యాట్‌ను క్రీజులో ఉంచడం కనిపించింది. దీంతో అంపైర్లు ప్రియాన్ష్ ఆర్యను రనౌట్ అయినట్లు ప్రకటించారు. ఇద్దరి మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ వింత రనౌట్ జరిగింది. ఇలాంటి వింత రనౌట్లకు పాకిస్తాన్ పెట్టింది పేరు. ఇప్పుడు రుతురాజ్, ప్రియాన్ష్‌లు వింత రనౌట్‌తో వార్తల్లోకెక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే 69 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రుతురాజ్ గైక్వాడ్ (101), కెప్టెన్ తిలక్ వర్మ (60 బ్యాటింగ్) ఆదుకున్నారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 150 పరుగులు జోడించారు. లిస్ట్-ఏ క్రికెట్లో మంచి రికార్డు కలిగిన రుతురాజ్ మరోసారి ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ సెంచరీతో మెరిశాడు. అయితే సెంచరీ చేసిన మరుక్షణమే రుతురాజ్ వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇండియా-ఏ 45 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అంతకముందు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (14) ఫామ్‌ను కొనసాగించడంలో విఫలమయ్యాడు.pic.twitter.com/Ga3qBawcIN— crictalk (@crictalk7) June 9, 2026చదవండి: మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్ అరుదైన ఫీట్! -
గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో టీమిండియా ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టెస్టుతో పాటు వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. రేపటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ నేతృత్వంలోని టీమిండియా స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే పిక్క కండరాల గాయంతో కోహ్లీ ఈ సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు రుతురాజ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసినట్లు నివేదికలు వచ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ భారత-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ వార్తలన్నింటికీ ఫుల్స్టాప్ పడినట్లయింది.లంక పర్యటనలో భారత్.. శ్రీలంక-ఏ, అప్గానిస్తాన్-ఏ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడనుంది. తాజాగా రుతురాజ్ కొలంబోలో దర్శనమివ్వడంతో మరి కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఎటూ తేల్చని బీసీసీఐ?ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు 15 మందితో జట్టును ప్రకటించడంతో కోహ్లీ దూరమైన అతడి స్థానాన్ని ఆ సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకరితోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఆఫ్గన్‌తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. అతడు కూడా పిక్క కండరాల గాయంతో బాధపడుతుండడం టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జట్టులోని సీనియర్లంతా గాయాల బారిన పడడంతో వన్డే సిరీస్‌లో అప్గానిస్తాన్ మనకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనసరం లేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ, రోహిత్, పాండ్యాలు దూరమైతే మాత్రం బీసీసీఐ వీరి స్థానంలో కనీసం ఇద్దరినైనా జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. అయితే వన్డే సిరీస్‌కు ఇంకా సమయం ఉండడంతో బీసీసీఐ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా? -
ఆఫ్ఘన్ సిరీస్‌కు విరాట్ ప్రత్యామ్నాయం ఇతడే..!
త్వరలో (జూన్ 13) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. విరాట్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఈ గాయం విషయమై వైద్యులను సంప్రదించగా.. రెండు వారాల విశ్రాంతిని సూచించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ సిరీస్‌కు విరాట్ ప్రత్యామ్నాం ఎవరనే చర్చ పొద్దున్నుంచి నడుస్తుంది. ఈ విషయమై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా.. బీసీసీఐ ఓ వ్యక్తిని ఫైనల్ చేసిందని సమాచారం. విరాట్ రీప్లేస్మెంట్ కోసం తిలక్ వర్మ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడినప్పటికీ.. సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది.ఇప్పటికే ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న గైక్వాడ్.. త్వరలో మరోసారి భారత వన్డే జట్టు తరఫున బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగిన తన చివరి వన్డే సిరీస్‌లో గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో శతకం (105) నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే సెలెక్టర్లు తిలక్, పడిక్కల్, పాటిదార్‌ను కాదని రుతురాజ్వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. -
రుతురాజ్ గైక్వాడ్‌కు బంపర్ ఆఫర్
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, అస్సాం స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ గాయం కారణంగా లంక టూర్‌కు దూరమయ్యాడు. అతడి స్దానాన్ని మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. తిలక్ వర్మకు డిప్యూటీగా గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. గైక్వాడ్ దాదాపు ఏడాది తర్వాత ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ సీఎస్కే కెప్టెన్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతవుతున్నాడు. ఐపీఎల్-2026లో రుతురాజ్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 337 పరుగులు చేశాడు. అయితే రుతు తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి ఈ టూర్ మంచి అవకాశం.ఇక పరాగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే హ్యామ్‌స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే గాయం కారణంగా మైదానాన్ని వీడాడు.ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ, జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉండటంతో నొప్పితోనే తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ రాజస్తాన్ ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు అతడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో లంక పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రుతురాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడు చివరగా 2025లో ఇండియా-ఎ తరపున సౌతాఫ్రికా-ఎపై ఆడాడు. ఆ సిరీస్‌లో గైక్వాడ్ 210 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. కాగా లంక టూర్లో భాగంగా భారత్-ఎ జట్టు.. శ్రీలంక-ఎ, అఫ్గానిస్తాన్-ఎ టీమ్స్‌తో ముక్కోణపు వన్డే సిరీస్‌లో తలపడనుంది.శ్రీలంక సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ శెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్. -
ధోని గురించి ప్రశ్న.. రుతురాజ్ వ్యాఖ్యలు వైరల్
ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 2026లో చెత్త ప్రదర్శన కనబరిచింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొన్న చెన్నై.. ఘోర ఓటమిపాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.89 పరుగుల తేడాతో చిత్తుగుజరాత్తో మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యంతో 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాటపట్టడం వరుసగా ఇది మూడోసారి. ఇదిలా ఉంటే.. చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.రిటైర్మెంట్ సంకేతాలుమోకాలి నొప్పి కారణంగా ధోని (MS Dhoni) ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతాడని చెన్నై యాజమాన్యం తొలుత ప్రకటించింది. అయితే, ఆ తర్వాత కూడా అతడు అందుబాటులోకి రాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో చెన్నై సొంతమైదానం చెపాక్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా సోమవారం ధోని దర్శనమిచ్చాడు.సహచర ఆటగాళ్లతో కలిసి గ్రూప్ ఫొటో దిగిన ధోని.. అభిమానులకు అభివాదం చేస్తూ మైదానం మొత్తం కలియదిరిగాడు. దీంతో ‘తలా’ రిటైర్మెంట్ ఇచ్చాడనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ధోని నోటి నుంచి అధికారికంగా ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా రాలేదు.ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ధోని వచ్చే సీజన్లో ఆడతాడా? లేదంటే ఇక అతడి ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లేనా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ధోని గురించి ప్రశ్న.. నాకేం తెలుసు?గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రుతురాజ్‌కు ధోని భవిష్యత్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘వచ్చే ఏడాదే ఈ విషయం గురించి స్పష్టత వస్తుంది. నాకు కూడా దీని గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియదు. మీతో పాటే వచ్చే ఏడాదే నేనూ ధోని ఆడతాడా? లేదా? అనేది తెలుసుకుంటాను’’ అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు.ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించే ధోనిని ఈ సీజన్లో తాము బాగా మిస్సయ్యామన్న రుతురాజ్.. ఆయన ఉంటే పరిస్థితి ఉంటే కాస్త భిన్నంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ధోని లేని లోటు ఎవరూ తీర్చలేరని.. అయితే, ప్రస్తుతం ఉన్న జట్టుతో తాము సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు.చదవండి: సీఎస్కేకు మరో దెబ్బ.. ఈసారి తుదిజట్టు మొత్తానికీ శిక్ష! -
సీఎస్కేకు మరో భారీ ఎదురుదెబ్బ.. ఈసారి!
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2026లో ‘ప్లే ఆఫ్స్’కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై ఘోర పరాజయం ఎదుర్కొంది. మొదట టాపార్డర్ రాణించడంతో భారీ స్కోరు చేసిన టైటాన్స్... బౌలింగ్‌లోనూ సమష్టిగా సత్తాచాటి పట్టికలో రెండో స్థానానికి చేరింది.వరుసగా ఇది మూడోసారిమరోవైపు.. వరుసగా మూడో ఓటమితో చెన్నై సీజన్‌ను ముగించింది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత చెన్నై జట్టు ‘ప్లే ఆఫ్స్’నకు చేరకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇలా ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న చెన్నై జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు జట్టుకు భారీ జరిమానా పడింది. ఐపీఎల్ పాలక మండలి తాజాగా ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.‘‘అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేటు మెయింటెన్ చేసినందుకు గానూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జరిమానా విధిస్తున్నాం.రూ. 24 లక్షల ఫైన్ఈ సీజన్లో చెన్నై ఈ తప్పిదానికి పాల్పడటం ఇది రెండోసారి. కాబట్టి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. గైక్వాడ్‌కు రూ. 24 లక్షల ఫైన్ వేశాము. అదే విధంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పాల్గొన్న చెన్నై తుదిజట్టు మొత్తానికి.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా అందరికీ రూ. 6 లక్షల జరిమానా లేదంటే.. వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం (ఇందులో ఏది తక్కువగా ఉంటే అదే వర్తిస్తుంది)’’ అని ఐపీఎల్ పాలక మండలి పేర్కొంది. చెన్నై వర్సెస్ గుజరాత్ సంక్షిప్త స్కోర్లుగుజరాత్: 229/4(20)చెన్నై: 140(13.4)ఫలితం: చెన్నైపై 89 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపుచెన్నై తుదిజట్టుసంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడుThe beautiful uncertainties of a simple game called CRICKET ✨Except there was nothing uncertain about how comprehensively #GT closed out their league stage 💙#TATAIPL | #KhelBindaas | #GTvCSK | @gujarat_titans | @ChennaiIPL pic.twitter.com/W5syAIGhJF— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
సీఎస్కేపై గుజరాత్ ఘన విజయం
అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే బ్యాటర్లలో శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు.Updates:సీఎస్కే ఏడో వికెట్ డౌన్రషీద్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి కాంబోజ్(19) అవుట్ కాగా.. నాలుగో బంతికి బ్రెవిస్(8) పెవిలియన్‌కు చేరాడు.శివమ్ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) రూపంలో సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 123/6దూకుడుగా ఆడుతున్న దూబే10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. శివమ్ దూబే దూకుడుగా ఆడుతున్నాడు. 15 బంతుల్లో 41 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్2.3: సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఉర్విల్ పటేల్ (0). స్కోరు: 36-3(3.2)కార్తిక్ శర్మ 6, మాథ్యూ షార్ట్ 13 పరుగులతో ఉన్నారు. విజయానికి 194 పరుగులు కావాలి.2.2: సిరాజ్ బౌలింగ్‌లో రుతురాజ్ బౌల్డ్ (7 బంతుల్లో 16)సంజూ శాంసన్ డకౌట్ఇన్నింగ్స్ తొలి బంతికే చెన్నై తమ ఓపెనర్ సంజూ శాంసన్ (0) వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు. మాథ్యూ షార్ట్‌కు తోడుగా రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి వచ్చాడు.గుజరాత్ భారీ స్కోరు!ఓపెనర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించి బలమైన పునాది వేశారు. వీరికి తోడు వన్‌డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్)తో దుమ్ములేపాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ గిల్‌ను అవుట్ చేయగా.. అన్షుల్ కాంబోజ్ సాయి వికెట్ దక్కిచుకున్నాడు. ముకేశ్ చౌదరి వాషింగ్టన్ సుందర్ (7)ను పెవిలియన్‌కు పంపగా.. రాహుల్ తెవాటియా (0) రనౌట్ అయ్యాడు.వాషీ అవుట్19.6: ముకేశ్ చౌదరి బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన వాషీ (7).మూడో వికెట్ డౌన్18.3: రాహుల్ తెవాటియా (0) రనౌట్. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్. స్కోరు: 207-3(18.3). వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు.సాయి సుదర్శన్ అవుట్18.2: అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్. 53 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన సాయి. రాహుల్ తెవాటియా క్రీజులోకి రాగా.. బట్లర్ 43 పరుగులతో ఉన్నాడు. గుజరాత్ డబుల్ సెంచరీ17.6: గుర్జప్నీత్ బౌలింగ్‌లో బట్లర్ ఫోర్ తీయగా.. గుజరాత్ డబుల్ సెంచరీ మార్కు అందుకుంది. స్కోరు: 201-1(18). బట్లర్ 43, సుదర్శన్ 78 పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో గుజరాత్ స్కోరు: 159-1జోస్ బట్లర్ 26, సాయి సుదర్శన్ 57 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్12.2: గిల్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి.. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ పెవిలియన్ చేరాడు.మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న గిల్ ఖాతాలో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. స్కోరు: 129-1. జోస్ బట్లర్ క్రీజులోకి రాగా.. సుదర్శన్ 51 పరుగులతో ఉన్నాడు.సాయి సుదర్శన్ ఫిఫ్టీ11.1: నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్. ఈ సీజన్లో అతడికి ఇది వరుసగా ఐదో అర్ధ శతకం.పది ఓవర్లలో గుజరాత్ స్కోరు: 111-0ఓపెనర్లు గిల్ 30 బంతుల్లో 62, సుదర్శన్ 30 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.గిల్ అర్ధ శతకం6.6: నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్. 23 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్. స్కోరు: 78-0.పవర్ ప్లేలో గుజరాత్ స్కోరు: 62-0 (6)గిల్ 18 బంతుల్లో 35, సుదర్శన్ 18 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు.హాఫ్ సెంచరీ5.1: అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ ఫోర్ బాదగా.. గుజరాత్ యాభై పరుగుల మార్కు అందుకుంది.తొలి ఓవర్లో గుజరాత్ స్కోరు: 8-0ముకేశ్ చౌదరి చెన్నై బౌలింగ్ ఎటాక్ మొదలుపెట్టగా.. గిల్ ఏడు, సాయి సుదర్శన్ ఒక పరుగుతో ఉన్నారు.టాస్ గెలిచిన చెన్నై ఐపీఎల్-2026లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందుగా టాప్-4లో అడుగుపెట్టగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి అర్హత సాధించింది. తమతో పాటు గుజరాత్ టైటాన్స్‌ను కూడా ప్లే ఆఫ్స్‌నకు తీసుకువెళ్లింది.మిగిలిన ఒక్క స్థానం కోసంఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ఐదు జట్లు (రాజస్తాన్, పంజాబ్, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ) అధికారికంగా రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై తమ లీగ్ దశలో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో అద్భుతం జరగాలని కోరుకుంటోంది. ఇందుకు పటిష్ట గుజరాత్ టైటాన్స్‌తో గురువారం తలపడేందుకు సిద్ధమైంది.తుదిజట్లలో మార్పులు ఇవీఅహ్మదాబాద్ వేదికగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. అకీల్ హొసేన్ స్థానంలో గుర్జప్నీత్ సింగ్, ప్రశాంత్ వీర్ స్థానంలో మాథ్యూ షార్ట్ వచ్చినట్లు తెలిపాడు.ఇక గుజరాత్ టైటాన్స్ సైతం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. సాయి కిషోర్ స్థానంలో ప్రసిద్ కృష్ణను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.గుజరాత్ వర్సెస్ చెన్నై తుదిజట్లుగుజరాత్సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.చెన్నైసంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్. -
ధోనీ రిటైర్మెంట్పై రుతురాజ్ క్లారిటీ!
సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పష్టతనిచ్చాడు. ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ సోమవారం చెన్నైలోని సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో ధోనీ ఆడుతాడని అభిమానులు ఆశించారు. టాస్ సమయంలో ధోనీ ఆడుతున్నాడా లేదా అని రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు రుతురాజ్ సమాధానమిచ్చాడు. ఎంఎస్ ధోనీ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని, ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడడం లేదని తెలిపాడు. దీంతో అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. అయితే ధోనీ మ్యాచ్ ఆడకపోయినప్పటికీ జట్టుతో పాటు చెపాక్ స్టేడియానికి రావడం అభిమానులకు ఊరట కలిగించే అంశం. ఎటూ ధోనీ మ్యాచ్ ఆడడం లేదు కాబట్టి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం సైలెంట్‌గా స్టేడియంలోకి వచ్చి అభివాదం చేస్తూ సీఎస్కేకు గుడ్‌బై చెబుతాడేమోనని అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఇలా సైలెంట్‌గా రిటైర్ అవ్వడాన్ని తాము భరించలేమని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ధోనీ ఇవాళ తన రిటైర్మెంట్పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం మే 21 వరకు ఆగాల్సిందే. ఇక సొంత గ్రౌండ్లో చివరి మ్యాచ్ ఆడుతున్న సీఎస్కే మే 21న గుజరాత్ టైటాన్స్‌తో ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.దీంతో అహ్మదాబాద్‌లోనే ధోనీకి సీఎస్కే ఘనంగా సెండాఫ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఎస్కే ప్లేఆఫ్స్ చేరితే అప్పటికప్పుడు ప్రణాళికలను మార్చేందుకు సీఎస్కే యాజమాన్యం సిద్ధమవుతోంది.Ravi Shastri asked: "MS Dhoni, where is he? Is he playing?"Ruturaj Gaikwad replied and send the Chepauk Crowd into frenzy#CSKvsSRHpic.twitter.com/rM2zXo0koz— Farrago Abdullah Parody (@abdullah_0mar) May 18, 2026🚨 Toss update from Chennai 🚨@ChennaiIPL won the toss and elected to bat first against @SunrisersUpdates ▶️ https://t.co/4SxAzYKEvY#TATAIPL | #KhelBindaas | #CSKvSRH pic.twitter.com/u4gjxRo6HK— IndianPremierLeague (@IPL) May 18, 2026 -
IPL 2026: సీఎస్కేపై సన్‌రైజర్స్ ఘన విజయం
ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. సీఎస్కే విధించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్ క్లాసెన్(26 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు నితీశ్ కుమార్ రెడ్డి.. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. సన్‌రైజర్స్ విజయానికి 17 బంతుల్లో 27 పరుగులు కావాలి.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్క్లాసెన్ రూపంలో సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన క్లాసెన్.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న కిషన్, క్లాసెన్హెన్రిచ్ క్లాసెన్(43), ఇషాన్ కిషన్(48) దూకుడుగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్: 126/2అభిషేక్ శర్మ (26) ఔట్.. రెండో వికెట్ డౌన్సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అకిల్ హొసెన్ బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.7 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 53/1ఏడు ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. అబిషేక్ శర్మ (25), ఇషాన్ కిషన్ (22) పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ (6) రూపంలో 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో హెడ్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.ఎస్ఆర్హెచ్ టార్గెట్ 181 పరుగులుసొంతగడ్డపై జరుగుతున్న ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (44), కార్తిక్ శర్మ (32), శివమ్ దూబే (26) తలా కొన్ని పరుగులు చేయడంతో సీఎస్కే గౌరవప్రదమైన స్కోరును అందుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీయగా, సాకిబ్ హుసేన్ 2, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ చెరొక వికెట్ తీశారు. టాపార్డర్ విఫలం కావడం సీఎస్కే కొంపముంచింది.16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (35), శివమ్ దూబే (16) పరుగులతో ఆడుతున్నారు.4 వికెట్లు డౌన్చెన్నై సూపర్ కింగ్స్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. కార్తీక్ శర్మ 32, రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులు తీసి ఔటయ్యారు. క్రీజులో బ్రెవిస్ 11, శివం దూబె 7 పరుగులతో ఉన్నారు. స్కోరు 13 ఓవర్లకు 105-4గా ఉంది. 9 ఓవర్లలో సీఎస్కే 89/29 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. కార్తిక్ శర్మ (32), రుతురాజ్ గైక్వాడ్ (14) క్రీజులో ఉన్నారు.ఉర్విల్ క్లీన్‌బౌల్డ్.. రెండో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే 48 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన ఉర్విల్ పటేల్‌ను సాకిబ్ హుస్సేన్ క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు.తొలి వికెట్ కోల్పోయిన చెన్నైసంజూ శాంసన్ (27) రూపంలో చెన్నై సూపర్‌కింగ్స్ 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టాస్ గెలిచిన సీఎస్కే బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో సీఎస్కే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గుర్జన్‌పీత్ సింగ్ స్థానంలో అకిల్ హొసేన్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ధోనీ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ తెలిపాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగుతోంది.తుది జట్లు:సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేచెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్ -
మా ఓటమికి కారణం వాళ్లే: రుతురాజ్
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ఫాస్ట్ బౌలర్ల నుంచి తాను మెరుగైన ప్రదర్శన ఆశించానని.. కానీ వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ పరాజయానికి బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు.బౌలర్ల వైఫల్యంగత మూడు మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన చెన్నై.. శుక్రవారం ఏకనా స్టేడియంలో లక్నోతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన లక్నో కేవలం 16.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో చెన్నైపై జయభేరి మోగించి.. రుతురాజ్ సేన ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసింది. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ మరీ దారుణంగా కేవలం 2.4 ఓవర్లు వేసి ఏకంగా 63 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతడి బౌలింగ్‌లో లక్నో బ్యాటర్లు చితక్కొట్టారు.వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందేఈ నేపథ్యంలో ఓటమి అనంతరం చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘మేము బ్యాటింగ్ చేసినపుడు వికెట్ కఠినంగా ఉంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఈ పరిస్థితులను చక్కగా వినియోగించుకున్నారు. మేము 160- 170 పరుగులే చేస్తామనుకున్నా.అయితే, 180 స్కోరు దాటగలిగాము. బ్యాటింగ్ పరంగా మా తప్పేమీ లేదు. క్రెడిట్ ప్రత్యర్థి బౌలర్లకు ఇవ్వాల్సిందే. ఇక లక్నో బ్యాటర్లు కూడా గొప్పగా ఆడారు. ఈ వికెట్ మీద ఫాస్ట్ బౌలర్ల నుంచి మేమెంతో ఆశించాము. కానీ వారు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. బౌలింగ్‌లో మా ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయాము.వాళ్లు కూడా గొప్పగా షాట్లు ఆడారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ అద్భుతం చేశాడు. ఏదేమైనా ప్రత్యర్థి జట్టు మనకన్నా గొప్పగా ఆడినపుడు ఆ నిజాన్ని అంగీకరించాలి. మేము కూడా ఇంకాస్త పట్టుదలగా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేది’’ అని పేర్కొన్నాడు.చదవండి: నీకసలు సెన్స్ ఉందా రుతురాజ్?.. అతడిని ఆడించవా? -
నీకసలు సెన్స్ ఉందా రుతురాజ్?.. అతడిని ఆడించవా?
ఐపీఎల్-2026లో ఐదు రోజుల క్రితం ఆదివారం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఐపీఎల్లో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయాయి. ఆ తర్వాత తాము ఆడిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ముంబై చిత్తు చేయగా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌కు లక్నో ఝలక్ ఇచ్చింది. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలోనే ఓడి చాన్స్ కోల్పోయిన లక్నో... ఇప్పుడు తమ సొంతగడ్డపై ప్రత్యర్థిని చిత్తు చేసి లెక్క సరిచేసింది. బౌలింగ్‌లో ఆకాశ్, బ్యాటింగ్‌లో మిచెల్ మార్ష్ మెరుపులు లక్నోను గెలిపించగా... మూడు వరుస విజయాల తర్వాత మరింత పైకి చేరే స్థితిలో నిలిచిన చెన్నై ఈ ఓటమితో తమ పరిస్థితిని సంక్లిష్టంగా మార్చుకుంది.కార్తిక్ శర్మ ఒక్కడేఏకనా స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులే చేయగలిగింది. కార్తిక్ శర్మ 71 పరుగులతో రాణించగా.. మిగతా వారి నుంచి అతడికి పెద్దగా సహకారం లభించలేదు.మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ఇక నామమాత్రపు లక్ష్యాన్ని లక్నో 16.4 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్ (38 బంతుల్లో 90)తో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడు వేసిన పునాదిపై నికోలస్ పూరన్ (17 బంతుల్లో 32 నాటౌట్) బలంగా నిలబడి.. లక్నోను విజయతీరాలకు చేర్చాడు.The Bison goes berserk 6️⃣6️⃣6️⃣6️⃣⚪4️⃣❗#MitchellMarsh brings up his fifty in just 21 balls as he comes out all guns blazing for #LSG! 💥🏏#TATAIPL Race To Playoffs 2026 ➡️ #LSGvCSK | LIVE NOW 👉 https://t.co/5Mr0NV7vdi pic.twitter.com/v3sC0DqiHp— Star Sports (@StarSportsIndia) May 15, 2026అన్షుల్ కాంబోజ్ చెత్త ప్రదర్శనచెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ కేవలం 2.4 ఓవర్లలోనే ఏకంగా 63 పరుగులు ఇచ్చుకుని.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతడి ఓవర్లు చెన్నై కొంపముంచాయి. మిగతా వారిలో ముకేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ ఒక్కో వికెట్ తీయగా.. నూర్ అహ్మద్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగా.. గుర్జప్నీత్ సింగ్ ఫర్వాలేదనిపించాడు.లక్నో చేతిలో ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం కావడంతో జట్టు ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా లక్నోతో మ్యాచ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అనుసరించిన వ్యూహాలను మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.నీకసలు సెన్స్ ఉందా రుతురాజ్?ఈ క్రమంలో చెన్నై మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ రుతురాజ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘తుదిజట్టు ఎంపికలో తప్పుల కారణంగా ఈ సీజన్లో ఓడిపోవడం చెన్నైకి అలవాటుగా మారింది. ఇలాంటి వికెట్‌పై అకీల్ హొసేన్‌ను ఆడించకపోవడం అతిపెద్ద తప్పు.అస్సలు వీళ్లకు సెన్స్ ఉందా అనే సందేహం వస్తోంది. మరో మ్యాచ్.. చేజారిన మరో అవకాశం’’ అని బద్రీనాథ్ ఎక్స్ వేదికగా రుతురాజ్‌ను విమర్శించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గానూ రుతు విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.చదవండి: IPL 2026: సీఎస్కేకు చుక్కలు చూపించాడు.. ఎవరీ ఆకాశ్ సింగ్? -
'అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. అది మా అదృష్టం'
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొంది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత హోం టీమ్ ఢిల్లీని 155 పరుగులకే కట్టడి చేసిన సీఎస్కే.. అనంతరం లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలో చేధించింది. సీఎస్కే విజయంలో సంజూ శాంసన్(87 నాటౌట్), కార్తీక్ శర్మ(41) మరోసారి కీలక పాత్ర పోషించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు."గత ఏడాది కంటే ఈసారి మా జట్టు బలంగా ఉందని మేము ఆదిలోనే భావించాం. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి కీలక ఆటగాడు రావడంతో మా అన్ని విభాగాలు పటిష్టమయ్యాయి. మా మిడిలార్డర్ బ్యాటింగ్ కూడా బలంగా ఉంది. కార్తీక్ శర్మ యువ ఆటగాళ్లు రాణిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు మా బౌలింగ్ విభాగం నిలకడగా రాణిస్తోంది. అన్షుల్ కాంబోజ్, అకిల్, నూర్, ఓవర్టన్ వంటి బౌలర్లు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే అన్షుల్ విఫలమయ్యాడు. అందుకు అతడు బాధపడ్డాడు. అతడు బలంగా తిరిగి వస్తాడన్న నమ్మకం మాకు ఉంది. ఇక టోర్నీ ఆరంభంలో కాస్త తడబడ్డాం. మా ఊపును అందుకోవడానికి ఒక్క విజయం అవసరమైంది. మూడు మ్యాచ్‌ల తర్వాత మాకు మూమెంటమ్ లభించింది. ఆ తర్వాత నుంచి జట్టు మొత్తం సమిష్టిగా రాణించడం మొదలుపెట్టాము. సంజూ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌ను కనబరిచిన సంజూ, ఇప్పుడు మా జట్టుకు వెన్నెముకలా మారాడు. అతను జట్టులో ఉండటం మా అదృష్టం. యంగ్ ప్లేయర్ కార్తీక్ శర్మలో కూడా అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిందంటూ ఏమి లేదు. అతడికి భారీ షాట్లతో పాటు స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ ఆడే సత్తా కూడా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గైక్వాడ్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్ (87 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విజయం దిశగా సీఎస్కేఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే విజయం దిశగా కొనసాగుతోంది. 16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. శాంసన్ (84), కార్తిక్ శర్మ (23) పరుగులతో క్రీజులో ఉన్నారు. శాంసన్ హాఫ్ సెంచరీ.. సీఎస్కే 96/2ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 32 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న శాంసన్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్కే 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే8 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. శాంసన్ (22), కార్తిక్ శర్మ (5) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 17 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది.రుతురాజ్ ఔట్..ఆరు పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎన్గిడి బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సీఎస్కే 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. శాంసన్ (10), గైక్వాడ్ (6) పరుగులతో ఆడుతున్నారు.సీఎస్కే టార్గెట్ 156 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (40 నాటౌట్), స్టబ్స్ (38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అకిల్ హొసేన్, ముకేశ్ చౌదరీ, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్‌లు తలా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డర్ వైఫల్యం ఢిల్లీ కొంపముంచింది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టబ్స్, సమీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (30), సమీర్ రిజ్వీ (16) పరుగులతో ఆడుతున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీసీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ల పరంపర కొనసాగుతోంది. 2 పరుగులు చేసిన కెప్టెన్ అక్షర్ పటేల్ గుర్జ్ప్నీత్ సింగ్ బౌలింగ్‌లో అకిల్ హొసేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (4), ట్రిస్టన్ స్టబ్స్ (12) పరుగులతో ఆడుతున్నారు.4 వికెట్లు డౌన్‌నితీశ్ రాణా, కరుణ్ నాయర్ ఔటయ్యారు. నితీశ్ రాణా 15 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో కార్తీక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కరుణ్ నాయర్ 13 పరుగులు చేసి.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో గుర్జప్నీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కేఎల్ రాహుల్ ఔట్..12 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ అకిల్ హొసేన్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది.తొలి వికెట్ డౌన్సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రాహుల్ (10) క్రీజులో ఉన్నాడు.టాస్ నెగ్గిన ఢిల్లీ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కైల్ జేమీసన్ స్థానంలో లుంగి ఎన్గిడి జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్కే రెండు మార్పులు చేసింది. అకిల్ హొసేన్, గుర్జప్నీత్ సింగ్ జట్టులోకి వచ్చారు. సీజన్ తొలి అంచె పోటీలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయాన్ని అందుకుంది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ తమ సొంతగడ్డపై చెన్నైని ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో మాత్రం చెన్నై సూపర్‌కింగ్స్‌దే పైచేయి. 32 మ్యాచ్‌ల్లో 20 సార్లు సీఎస్కే, 12 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. 2022 నుంచి చూసుకుంటే సీఎస్కే నాలుగుసార్లు నెగ్గితే, ఢిల్లీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, లుంగీ ఎంగిడి, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్. -
‘నేను క్రెడిట్ తీసుకోలేను.. అతడే మ్యాచ్ విన్నర్’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ అజేయ అర్థసెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కార్తిక్ శర్మ కూడా అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సీజన్లో నాలుగో విజయం అందుకున్న సీఎస్కే 8 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. నిజానికి ఈ మ్యాచ్ విన్నర్ తాను కాదని, ఇంపాక్ట్‌గా వచ్చి అజేయ అర్థసెంచరీతో అదరగొట్టిన కార్తిక్ శర్మకు క్రెడిట్ ఇవ్వాలని రుతురాజ్ తెలిపాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని చెప్పాడు. రుతురాజ్ మాట్లాడుతూ..'చాలా సంతోషంగా ఉంది. మేం మొదట బాగానే ప్రారంభించాం. కానీ మధ్యలో ముంబై ఇండియన్స్ పుంజు కుంది. అయితే మేం మళ్లీ మ్యాచ్‌ను మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం. మొదటి కొన్ని ఓవర్లను తట్టుకుని నిలబడటం.. ఆపై టాప్ త్రీ బ్యాటర్లలో ఒకరు చివరి వరకు ఉండటం కీలకమని మేం భావించాం. ఇక అన్షుల్ కంబోజ్ చాలా నిలకడగా రాణిస్తున్నాడు. తన ప్రక్రియను అనుసరిస్తున్నాడు. అతని ఆలోచనా తీరు ఒక బ్యాటర్ లాగా ఉంటుంది. నూర్ కూడా కొన్ని మార్పులు చేసుకుని బాగా రాణిస్తున్నాడు. టీమ్ కాంబినేషన్లో భాగంగానే అఖీల్ హుస్సేన్‌ను ఆడించలేదు. 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని, అదనపు బౌలర్ ఉండాలని ఆలోచించాం. ప్రశాంత్ వీర్, ఘోష్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలరు. మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ చెబుతున్నట్లుగా.. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. అయితే ఇది టీ20 క్రికెట్. సరైన సమయం కోసం వేచి చూశాను. కార్తీక్ శర్మకు ఈ ఇన్నింగ్స్ మంచి బూస్ట్‌లాంటిది. అతను సిక్సర్లు కొట్టగలడు. కానీ అతను బంతులను ఎంచుకొని ఆడిన తీరు బాగుంది. అతను ఫామ్ కొనసాగిస్తే జట్టుకు ప్రయోజనం. మేం ఆటను చాలా సింపుల్‌గా ఉంచుతున్నాం. తప్పులు జరుగుతుంటాయి కానీ బలంగా తిరిగి రావాలి. ఈ జెర్సీ, అభిమానుల కోసం మా సర్వస్వం ఇస్తాం.’ అని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.Trusting the process and letting the bat do the talking 💛🎥 Skipper Ruturaj Gaikwad talks about finding his rhythm and the match-winning knock 🗣️#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL | @Ruutu1331 pic.twitter.com/VZ2T0hqcYZ— IndianPremierLeague (@IPL) May 2, 2026చదవండి: ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు! -
సీఎస్కేను గెలిపించిన కార్తిక్ శర్మ.. ముంబై ఓటమి
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అంచె పోటీల్లో ముంబైని చిత్తుగా ఓడించిన సీఎస్కే శనివారం రెండో అంచె పోటీలోనూ మరోసారి ముంబైని ఓడించింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.160 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే మరో 11 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కార్తిక్ శర్మ (54 నాటౌట్) అజేయంగా నిలిచి సీఎస్కేను గెలిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, గజన్ఫర్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.అజేయ అర్థసెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. ముంబైకి ఇది ఆరో ఓటమి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.An unorthodox finishing touch to a classic rivalry! 🎬🎥 @ChennaiIPL complete the double over their arch-rivals #MI in style 💛Scorecard ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/yeBWsXZ6Lu— IndianPremierLeague (@IPL) May 2, 2026 -
IPL 2026: ముంబైపై సీఎస్కే ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగో విజయాన్ని సాధించింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ కార్తిక్ శర్మ (54 నాటౌట్) అజేయంగా నిలిచి సీఎస్కేను గెలిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, గజన్ఫర్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.గైక్వాడ్ హాఫ్ సెంచరీముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర్థసెంచరీ సాధించాడు. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్కే 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే160 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సీఎస్కే 63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన ఉర్విల్ పటేల్ గజన్ఫర్ బౌలింగ్‌లో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (11) ఔట్.. తొలి వికెట్ డౌన్160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన శాంసన్ బుమ్రా బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 160 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.ఆరో వికెట్ డౌన్..5 పరుగులు చేసిన రాబిన్ మింజ్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ముంబై ఇండియన్స్ 139 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నమన్ ధిర్ (48), పాండ్యా (9) పరుగులతో ఆడుతున్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ముంబైసీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నమన్ ధిర్ 44, పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నమన్ ధిర్ 42, తిలక్ వర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నమన్ ధిర్ 25, సూర్యకుమార్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రికిల్టన్ 15, నమన్ ధిర్ 13 పరుగులతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబైసీఎస్కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన ఓపెనర్ విల్‌జాక్స్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో రామక్రిష్ణ ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై ఒక పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది.టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. రఘుశర్మ సీజన్లో తొలి మ్యాచ్ ఆడనుండగా, అశ్వనీ స్థానంలో క్రిష్ భగత్ జట్టులోకి వచ్చాడు. ఇక చెన్నై సూపర్‌కింగ్స్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. అకిల్ హొసేన్ స్థానంలో ప్రశాంత్ వీర్, గుర్జప్నీత్ సింగ్ స్థానంలో రామక్రిష్ణ ఘోష్ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోరులో సీఎస్కే 103 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరిముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్ -
రుతురాజ్ ఖాతాలో భారీ రికార్డు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 26) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో తన జట్టు ఓడినా, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన రుతురాజ్ ఐపీఎల్లో సీఎస్కే తరఫున 100 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రుతురాజ్‌కు ముందు ధోని (234), సురేశ్ రైనా (180), శివమ్ దూబే (106) మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం రుతురాజ్ ఖాతాలో 101 సిక్సర్లు ఉన్నాయి.కాగా, నిన్నటి మ్యాచ్‌లో రుతురాజ్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో గౌరవప్రదమైన స్కోర్ అందించినప్పటికీ.. సీఎస్కే పరాజయంపాలైంది. రుతురాజ్ 60 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో రుతురాజ్ మినహా ఎవరూ రాణించలేదు. సంజూ శాంసన్ 11, ఉర్విల్ పటేల్ 4, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్, బ్రెవిస్ 2, శివమ్ దూబే 22, కార్తీక్ శర్మ 15, ఓవర్టన్ 18 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3, అర్షద్ ఖాన్ 2, సిరాజ్, సుతార్ తలో వికెట్ తీశారు.అనంతరం 159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఆడుతుపాడుతూ ఛేదించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (87) భారీ అర్ద సెంచరీతో తన జట్టును గెలిపించాడు. అతనికి కెప్టెన్ గిల్ (33), బట్లర్ (39) సహకరించారు. సీఎస్కే బౌలర్లలో అకీల్ హొసేన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్ ఐదో స్థానానికి ఎగబాకగా.. సీఎస్కే ఆరో స్థానానికి పడిపోయింది. -
సిక్సర్ల వీరుడని బిల్డప్.. టీమిండియాకు ఆడుతున్నాడు కానీ!
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఈ సీజన్లో ఎనిమిదింట ఐదో పరాజయం నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 74 నాటౌట్) ఒక్కడే మెరుగైన స్కోరు సాధించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివం దూబేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.సిక్సర్ల వీరుడని బిల్డప్‘‘శివం దూబే పరుగులు రాబట్టలేక సతమతమవుతున్నాడు. సిక్సర్ల దూబేగా అతడికి బాగా ప్రచారం కల్పించారు. కానీ అతడు ఐపీఎల్లో ప్రభావంతమైన ఇన్నింగ్స్ ఆడి దాదాపుగా రెండేళ్లు గడిచిపోయింది. కేవలం స్పిన్ బౌలింగ్‌లో మాత్రమే హిట్టింగ్ ఆడేవాడిగా ఉండిపోవద్దు దూబే.టీమిండియాకు ఆడుతున్నాడు కానీ..నిజానికి అంతర్జాతీయ క్రికెట్లో దూబే అద్బుతంగా ఆడుతున్నాడు. కానీ ఐపీఎల్లో తేలిపోతున్నాడు. ఈసారి ఐపీఎల్లో అతడు విఫలం కావడం చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద సమస్యగా పరిణమించింది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో 17 బంతుల్లో 22 పరుగులు చేశాడు దూబే. ఈ సీజన్లో ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా కేవలం 150 పరుగులు సాధించాడు.రుతు ఒక్కడేఇక మ్యాచ్ విషయానికొస్తే.. బౌలర్ల క్రమశిక్షణకు టాపార్డర్ మెరుపులు తోడవడంతోగుజరాత్ టైటాన్స్ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతమైదానం చెపాక్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 74 నాటౌట్) ఎట్టకేలకు అర్ధశతకం సాధించగా... మిగతావాళ్లు విఫలమయ్యారు.సాయి అదరగొట్టేశాడుగుజరాత్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కగిసో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... అర్షద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. సాయి సుదర్శన్ (46 బంతులలో 87; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) దుమ్మురేపగా... కెప్టెన్శుబ్మన్ గిల్ (23 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు), బట్లర్ (30 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అతడికి అండగా నిలిచారు. చెన్నై బౌలర్లలో అకీల్, నూర్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: Virender Sehwag: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు -
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కే స్కోరెంతంటే?
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నప్పటికి రుతురాజ్ మాత్రం ఆచితూచి తమ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు.60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు జేమీ ఓవర్టన్(6 బంతుల్లో 18) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో రబాడ మూడు, అర్షద్ ఖాన్, సుత్తార్, సిరాజ్ తలా వికెట్ సాధించారు. గత మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన సంజూ సంశాన్.. గుజరాత్‌పై మాత్రం 11 పరుగులు చేసి ఔటయ్యాడు. -
సీఎస్కేకు భారీ షాక్.. జట్టును వదిలి వెళ్లిపోయిన కెప్టెన్!
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 26) చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సీఎస్కే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కుటుంబ అత్యవసర పరిస్థితి (Family Emergency) కారణంగా సీఎస్కే జట్టును వీడి పుణేకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అతడు జట్టుతో పాటు చెన్నైకి ప్రయాణించలేదు. అయితే అతడు తిరిగి ఎప్పుడు జట్టుతో చేరుతాడన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ సీఎస్కే అభిమానులు మాత్రం వీలైనంత త్వరగా రుతురాజ్ జట్టుతో కలవాలని కోరుకుంటున్నారు.మరోవైపు సీఎస్కే లెజండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆడనున్నట్లు సమాచారం. సీఎస్కే హెడ్ కోచ్ మైఖల్ హస్సీ సైతం ధోని రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ఒకవేళ రుతురాజ్ గుజరాత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే ఎంఎస్ ధోని మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన సూపర్ కింగ్స్.. మూడింట విజయం సాధించి పాయింట్ట పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి! -
అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథే: సెహ్వాగ్
ఐపీఎల్-2026లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మూడింట గెలిచింది. ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించి పాయింట్ల సంఖ్యను ఆరుకు పెంచుకుంది. సొంతమైదానం వాంఖడేలో ముంబైని చెన్నై చిత్తు చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.మూడు మ్యాచ్‌లలో రెండు శతకాలుఅయితే, టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) మాత్రం చెన్నై విషయంలో భిన్నంగా స్పందించాడు. ఒక్కరిపై ఆధారపడితే చెన్నై ఈసారి కూడా గట్టెక్కలేదని అభిప్రాయపడ్డాడు. కాగా చెన్నై ఇప్పటికి మూడు విజయాలు సాధించగా.. ఈ మూడింటిలో సంజూ శాంసన్ రెండు అజేయ సెంచరీలతో జట్టును గెలిపించాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 115 పరుగులు చేసిన సంజూ.. తాజాగా ముంబైపై 101 పరుగులు సాధించాడు. ఈ రెండు మ్యాచ్‌లలో మిగతా బ్యాటర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ సంజూ 48 పరుగులతో టాప్‌రన్‌స్కోరర్‌గా నిలిచి జట్టుకు విజయం అందించాడు.అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథేఈ నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం చెన్నై జట్టును అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ ఆ జట్టు గెలిచిన ప్రతి సందర్భంలోనే ఒకే ఒక్క బ్యాటర్ పరుగులు రాబట్టాడు. అతడు పరుగులు చేయడంలో విఫలమైన రోజు కథ వేరుగా ఉంటోంది.ఒకవేళ అతడు మళ్లీ గనుక ఫెయిలైతే పాత కథే పునరావృతం అవుతుంది. కాబట్టి ఒకే ఒక్క బ్యాటర్‌పై ఆధారపడటం సరికాదు. సంజూతో పాటు పరుగులు రాబట్టే ఆయుశ్ మాత్రే దురదృష్టవశాత్తూ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్ మీద చెన్నై ఆశలు పెట్టుకుంది. సంజూతో కలిసి వాళ్లు కూడా రాణిస్తేనే సీఎస్కే ప్రయాణం ముందుకు సాగుతుంది’’ అని క్రిక్‌బజ్ షోలో పేర్కొన్నాడు. ఏదేమైనా సంజూ శాంసన్ సంచలన ఇన్నింగ్స్‌తో ముంబైపై చెన్నైకి విజయం అందించాడని సెహ్వాగ్ ప్రశంసించాడు.కాగా రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై.. కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.చదవండి: ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?What composure. What striking 💛𝐒𝐚𝐧𝐣𝐮 𝐒𝐦𝐚𝐬𝐡𝐢𝐧𝐠 𝐒𝐚𝐦𝐬𝐨𝐧 🔥Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL | @IamSanjuSamson pic.twitter.com/2Hr9Ui0UEn— IndianPremierLeague (@IPL) April 23, 2026 -
‘ధోని కావాలనే CSKకు దూరంగా ఉంటున్నాడు’
చెన్నై సూపర్ కింగ్స్.. మహేంద్ర సింగ్ ధోని.. ఈ రెండూ పర్యాయ పదాల లాంటివి అనడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి అంతా తానై చెన్నైని ముందుకు నడిపించాడు ధోని. తన సారథ్యంలో రికార్డు స్థాయిలో జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.సరైన వారసుడు ఎవరు?అయితే, ధోని (MS Dhoni) కెప్టెన్‌గా తప్పుకొన్న తర్వాత ఇప్పటి వరకు అతడి వారసుడిగా ఎవరూ నిలదొక్కుకోవడం లేదు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు 2022లో పగ్గాలు ఇవ్వగా అతడు ఒత్తిడి భరించలేక మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్‌ను ధోని స్థానంలో కెప్టెన్‌ను చేశారు.అయితే, గతేడాది ఐదు మ్యాచ్‌ల తర్వాత గాయం కారణంగా అతడు మధ్యలోనే టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ధోని మరోసారి సారథిగా పగ్గాలు చేపట్టగా.. అప్పటికే నష్టం జరిగిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్-2025లో సీఎస్కే పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.44 ఏళ్ల వయసులోనూఇక 44 ఏళ్ల వయసులోనూ ధోని చెన్నై తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఐపీఎల్-2026లో సీఎస్కే ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. అయినా ఇంత వరకు ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పిక్కల్లో గాయం కారణంగా అతడు జట్టుకు దూరంగా ఉంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.ధోని కావాలనే దూరంగా ఉంటున్నాడా?అయితే, ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌కు ముందు ధోని బాగానే ప్రాక్టీస్ చేసినట్లు కనిపించింది. అయినప్పటికీ అతడు బరిలోకి దిగలేదు. కనీసం స్టేడియానికి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ధోని కావాలనే జట్టుకు దూరంగా ఉంటున్నాడా? అనే సందేహాలు తలెత్తగా.. న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.అందుకే ఇలా చేస్తున్నాడు!క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని ఫిట్‌గానే కనిపిస్తున్నాడు. అయినా సరే జట్టుకు దూరంగా ఉంటున్నాడు. కనీసం జట్టుతో కలిసి మైదానానికి రావడం లేదు. డగౌట్‌లోనూ కనిపించడం లేదు.వీలైనంతగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. అతడొక దిగ్గజ ఆటగాడు, కెప్టెన్. అయినా సరే ఇలా ఎందుకు చేస్తున్నాడు? కావాలనే అతడు జట్టుకు దూరంగా ఉంటున్నట్లు అనిపిస్తోంది. తాను లేకున్నా జట్టు ముందుకు సాగేలా ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నట్లున్నాడు’’ అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు.Respect ++ 💛💙#MIvCSK #WhistlePodupic.twitter.com/xphQe6IpPj— Chennai Super Kings (@ChennaiIPL) April 24, 2026రుతు, సంజూ మీదే ఫోకస్ ఉండేలా..‘తలా’ తనకు తానే తన క్రేజ్ తగ్గించుకుని.. కొత్త నాయకత్వ బృందంపై దృష్టి పడేలా చేస్తున్నాడని.. జట్టును వారు తమ చేతుల్లోకి తీసుకునేలా చేస్తున్నాడని డౌల్ అభిప్రాయపడ్డాడు. కాగా గతంలోనూ రుతు కెప్టెన్‌గా ఉన్నా.. మైదానంలో అతడికి సలహాలు, సూచనలు ఇస్తూ ధోని అంతా తానై వ్యవహరించేవాడు.అయితే, ఈసారి సంజూ శాంసన్ రాకతో ధోని తనపై భారం తగ్గించుకుని.. నాయకత్వ బృందంలో రుతుతో పాటు సంజూ భాగమయ్యేలా చేయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. కాగా ధోని స్థానంలో సంజూ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముంబైతో మ్యాచ్‌లో సంజూ అజేయ సెంచరీ (54 బంతుల్లో 101)తో చెలరేగి.. సీఎస్కేకు సీజన్లో మూడో విజయం అందించాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు -
ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి: రుతురాజ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కట్టడి చేసినప్పటికీ.. ఆతర్వాత బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. ఒక్క బ్యాటర్ కుదురుగా క్రీజ్‌లో నిలబడినా, ఈ మ్యాచ్‌లో సీఎస్కే గెలిచేదే.ఛేదనలో సగం మ్యాచ్ వరకు పట్టు నిలుపుకున్న సీఎస్కే, ఆతర్వాత అనూహ్యంగా ఒత్తిడికి చిత్తై లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 195 పరుగుల ఛేదనలో సీఎస్కే స్కోర్ 10 ఓవర్ల తర్వాత 111-3గా ఉండింది. ఈ దశలో ఆ జట్టు గెలుపు నల్లేరుపైనడకే అనుకున్నారు. అయితే ఆతర్వాత మూడు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. 11, 12, 13 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆ ఓవర్లలో సీఎస్కే కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది.ఆతర్వాత ఓవర్లలోనూ సీఎస్కే బ్యాటర్లు అడపాదడపా పరుగులు చేసి గెలుపుపై ఆశలు సజీవంగానే ఉంచారు. అయితే చివరి ఓవర్లలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేశారు. ఛేదించదగ్గ లక్ష్యమే (6 బంతుల్లో 18 పరుగులు) కళ్ల ముందు ఉన్నా, సీఎస్కే బ్యాటర్లు దాన్ని అందుకోలేకపోయారు. ఫలితంగా సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో సీఎస్కే ఓడింది.ఈ ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇలా అన్నాడు. ఇలాంటి పిచ్‌పై 195 పరుగుల లక్ష్యం ఏ రోజైనా సాధ్యమే. తొలుత 220–230 స్కోరు వచ్చేలా అనిపించింది. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి 30-40 పరుగులు నిరోధించగలగారు. 10 ఓవర్ల తర్వాత 80 పరుగులు మాత్రమే అవసరం. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక్క భాగస్వామ్యం నెలకొల్పగలిగినా మ్యాచ్ మాదే. కానీ ఆతర్వాత 3 ఓవర్లలో కేవలం 9 పరుగులే రావడం మ్యాచ్ స్వరూపాన్ని మర్చేసింది. డెత్ ఓవర్లలో 12–13 రన్స్ ఛేజ్ చేయడం కష్టంగా మారింది.మా బౌలింగ్ యూనిట్‌ను ప్రశంసించాలి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్‌ప్లేలో అభిషేక్ శర్మ బాగా ఆడినా, ఆతర్వాత మొమెంటమ్ తిరిగి పొందాం. జేమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్.. అందరూ బాగా బౌలింగ్ చేశారు.ముఖ్యంగా అన్షుల్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇందు కోసం అతను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. చాలా స్పష్టంగా తన ప్లాన్స్ చెప్పి, కెప్టెన్ నేను ఇలా చేస్తానని నమ్మకంగా చెప్పే బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. మొత్తంగా అన్షుల్ ప్రతిరోజూ మెరుగుపడుతున్నాడు. రుతురాజ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఈ మ్యాచ్‌లో ఓడినా, అతని బౌలర్లపై సంతృప్తిగానే ఉన్నాడు. ఛేదించదగ్గ లక్ష్యమే అయినా, కొద్ది ఓవర్లు కొంపముంచాయని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా సీఎస్కే హ్యాట్రిక్ ఓటములు, రెండు వరుస విజయాల తర్వాత మరో ఓటమిని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో ఏదో స్థానంలో కొనసాగుతుంది. -
ఎస్ఆర్హెచ్ను గెలిపించిన బౌలర్లు
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీ త 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతావారు పరుగులు చేయడంలో విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరు మార్కును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జేమి ఓవర్టన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, ముకేశ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఛేదనను సీఎస్కే ధాటిగానే ఆరంభించింది. ఆరంభంలోనే ఓపెనర్ సంజూ శాంసన్ ఔటైనప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఆయుశ్ మాత్రే 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 30 పరుగులు సాధించాడు. మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్ (25), మాథ్యూ షార్ట్ (34) పరుగులతో పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఓవర్టన్ (16) కాస్త ప్రతిఘటించినప్పటికీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు కఠినంగా బంతులేయడంతో సీఎస్కే ఓటమి దిశగా పయనించింది. -
సీఎస్కే కొత్త కెప్టెన్ సంజూ శాంసన్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆరంభంలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడినప్పటికీ వరుసగా రెండు విజయాలు సాధించి సీఎస్కే గాడిన పడింది. కానీ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సీఎస్కే కెప్టెన్సీ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్ సీఎస్కేకు కొత్త కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. అది ఈ సీజన్ మధ్యలోనే జరిగే అవకాశముందని కూడా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఈ సీజన్లో కాకపోయినా భవిష్యత్తులో మాత్రం శాంసన్ సీఎస్కేను శాసిస్తాడని జోస్యం చెప్పాడు. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్న సీఎస్కేకు కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాడు అవసరమని, ఈ విషయంలో సీఎస్కేకు మొదటి చాయిస్ సంజూనే అని తెలిపాడు. ఇప్పటికే సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు ఫైనల్ చేర్చినట్లు గుర్తుచేశాడు. దీంతో సీఎస్కే యాజమాన్యం ఈ సీజన్ మధ్యలోనే రుతురాజ్‌ను తప్పించి శాంసన్‌కు బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్చపోనవసరం లేదని తెలిపాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న రుతురాజ్ ఈ సీజన్లోనే కెప్టెన్సీ వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయని జోస్యం చెప్పడం గమనార్హం.ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఎంఎస్ ధోని సారధ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక సీఎస్కే ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ధోని తర్వాత కెప్టెన్లు ఎందరు మారినా సీఎస్కే మరో టైటిల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యింది. 2022 సీజన్లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించింది. కానీ కెప్టెన్‌గా ఒత్తిడిని తట్టుకోలేక జడేజా దానిని మధ్యలోనే వదిలేశాడు. దీంతో గత్యంతరం లేక మళ్లీ ధోనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అలా 2023 సీజన్లోనూ సీఎస్కేను నడిపించిన ధోని ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత 2024 సీజన్లో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించింది. కానీ ఆ సీజన్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఇక 2025 సీజన్లో రుతురాజ్ సారథ్యంలోని సీఎస్కే దారుణ ఆటతీరుతో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్ క్రికెటర్! -
సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.150 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగుల చేసిన మాథ్యూ షార్ట్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లలో సీఎస్కే 135/514 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 32, శివమ్ దూబే 10 పరుగులతో ఆడు తున్నారు.బ్రెవిస్ డకౌట్113 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను శివాంగ్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 66 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ (19) వెనుదిరిగాడు. అంతకముందు ధాటిగా ఆడుతున్న ఆయుశ్ మాత్రే నితీశ్‌రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.దంచికొడుతున్న సీఎస్కేఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే దంచికొడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (30), రుతురాజ్ (14) క్రీజులో ఉన్నారు.195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన శాంసన్ నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 195 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్థసెంచరీలతో రాణించారు. వీరిద్దరు రాణించినప్పటికీ మిగతావారు విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో జేమి ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సాహిల్ అరోరా గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఎస్ఆర్హెచ్ 177 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్లో క్లాసెన్ (59) కంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ 150 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లో నితీష్‌కుమార్ (12) ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.12 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్లాసెన్ 30, నితీశ్‌రెడ్డి 4 పరుగులతో ఆడు తున్నారు.సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ఇషాన్ రుతురాజ్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.అభిషేక్ హాఫ్ సెంచరీ..సీఎస్కేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 75 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన హెడ్ ముకేశ్‌చౌదరీ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 26, హెడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడు తున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ముఖాముఖి పోరులో ఇరుజట్లు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 15 విజయాలలు, ఎస్ఆర్హెచ్ 7 విజయాలు సాధించాయి. చివరి ఐదు మ్యాచ్‌ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్ 3, సీఎస్కే రెండింట నెగ్గాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగచెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (వికెట కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్ -
భారీ ఇన్నింగ్స్ దగ్గర్లోనే ఉంది: రుతురాజ్
ఐపీఎల్ 2026లో సీఎస్కే జట్టు హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండో విజయం సాధించింది. నిన్న (ఏప్రిల్ 14) కేకేఆర్‌పై 32 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ గెలుపు తర్వాత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా ఆనందంగా కనిపించాడు. ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ గెలుపుపై విశ్లేషణ ఇచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్‌పై సంతృప్తి వ్యక్తపరుస్తూ, ఫీల్డింగ్‌లో లోపాలను ఒప్పుకున్నాడు. రుతురాజ్ మాటల్లో..పిచ్ మారిపోయిందిమేము 220–210 పరుగులు చేయాలని అనుకున్నాం. కానీ పిచ్ 7–8 ఓవర్ల తర్వాత మారిపోయింది. బంతి స్లో అయ్యి, స్పిన్‌కు అనుకూలించింది. అందుకే 190–180 పరుగులు సరిపోతాయని భావించాం. ఆ తర్వాత పవర్‌ప్లేలో బౌలింగ్ బాగుంటే, రన్‌రేట్ కంట్రోల్ చేయవచ్చని అనుకున్నాం. మ్యాచ్‌మ్యాచ్‌కు మెరుగవుతున్నారుమా బౌలర్లు తమ పాత్రలను అర్థం చేసుకుంటున్నారు. ఏ ఓవర్లలో ఏ లెంగ్త్ వేయాలో తెలుసుకుంటున్నారు. మ్యాచ్‌మ్యాచ్‌కు మెరుగవుతున్నారు. ఇది మంచి సంకేతం. నూర్ అహ్మద్, అకీల్ హొసేన్ బౌలింగ్ వ్యూహం చాలా బాగుంది. వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఫీల్డింగ్‌లో లోపాలు మేము చాలా క్యాచ్‌లు డ్రాప్ చేశాం. వాతవరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగింది. అలాగని ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంలో చాలా మెరుగుపరచుకోవాలి. శక్తి, సంకల్పం, గెలవాలన్న పట్టుదల ఉంటే, కొన్ని డ్రాప్‌లు జరిగినా పర్వాలేదు. భారీ ఇన్నింగ్స్ దగ్గరలో ఉంది చాలా రోజుల తర్వాత గెలిచిన జట్టులో ఉండటం ఆనందంగా ఉంది. గత మ్యాచ్ తర్వాత రిలాక్స్‌గా అనిపించింది. ఇప్పుడు పాజిటివ్‌గా ఉన్నాను. భారీ ఇన్నింగ్స్ దగ్గరలోనే ఉంది.రుతురాజ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రెండు వరుస విజయాల తర్వాత రిలాక్డ్స్‌గా కనిపించాడు. ప్లస్‌లు, మైనస్‌ల గురించి బహిరంగంగా మాట్లాడాడు. త్వరలో అతని నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని విశ్వాసంగా ఉన్నాడు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ సొంత ఇలాకా హైదరాబాద్‌లో జరుగునుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని సీఎస్కే పట్టుదలగా ఉంది.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. సంజూ శాంసన్ (48), డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ నూర్ అహ్మద్ (4-0-21-3), అన్షుల్ కంబోజ్ (4-0-32-2), అకీల్ హొసేన్ (4-0-26-1) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసిన రమన్‌దీప్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
‘రుతురాజ్ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్‌కు చాన్స్ ఇవ్వు’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ రుతురాజ్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ ఏడు పరుగులు చేసి అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో 12.6 సగటుతో 63 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్‌గానే గాక కెప్టెన్‌గానూ రుతురాజ్ ఫెయిలవుతున్నాడు. సీఎస్కే ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించి మూడింట ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో రుతురాజ్ కెప్టెన్సీ సహా వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు పెరిగిపోతున్నాయి. దీంతో రుతురాజ్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంటే బాగుంటుందని క్రీడా పండితులు సూచిస్తున్నారు. వన్‌డౌన్‌లో వస్తున్న ఆయుశ్ మాత్రేకు ప్రమోషన్ ఇచ్చి ఓపెనర్‌గా పంపితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా రుతురాజ్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంటాడేమో చూడాలి. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48) టాప్ స్కోరర్‌గా నిలవగా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్‌లు తలా ఒక వికెట్ తీశారు. View this post on Instagram A post shared by THE ADULT SOCIETY (@adultsociety) చదవండి: IPL 2026: నల్ల రిబ్బన్లతో బరిలోకి.. కారణమదే! -
IPL 2026: కేకేఆర్‌పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 32 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రమన్‌దీప్ సింగ్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. సీఎస్కేతో మ్యాచ్‌లో కేకేఆర్ కష్టాల్లో పడింది. నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో కేకేఆర్ 85 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. తొలుత రహానే (28)ను బుట్టలో వేసుకున్న నూర్ మరుసటి బంతికి కామెరున్ గ్రీన్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రింకూ సింగ్ (5), పావెల్ (2) క్రీజులో ఉన్నారు.అంతకముందు కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ అకిల్ హొసేన్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సునీల్ నరైన్ (24) రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన నరైన్ స్లిప్‌లో గుర్జన్‌పీత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.ఫిన్ అలెన్ ఔట్..193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ (1) శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కేకేఆర్ టార్గెట్ 193 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్ కేకేఆర్ ముంగిట 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48) టాప్ స్కోరర్‌గా నిలవగా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్‌లు తలా ఒక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (37), సర్ఫరాజ్ (23) క్రీజులో ఉన్నారు. అంతకముందు శాంసన్ కార్తిక్ త్యాగీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.సంజు క్లీన్ బౌల్డ్111 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 11.2 ఓవర్లో కార్తిక్ త్యాగీ బౌలింగ్‌లో సంజు శాంసన్ క్లీన్ బ్లౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే స్కోరు 13 ఓవర్లకు 128 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. రెండో వికెట్ డౌన్కేకేఆర్తో మ్యాచ్‌లో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన ఆయుశ్ మాత్రే వైభవ్ అరోరా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. శాంసన్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.రుతురాజ్ (7) ఔట్..కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రుతురాజ్ (7) మరోసారి నిరాశపరుస్తూ అనుకుల్‌రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్‌ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. నవదీప్ సైనీ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. సీఎస్కే మాత్రం ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది.ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడగా సీఎస్కే 20 సార్లు, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించాయి. 2022 నుంచి చూసుకుంటే ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు నెగ్గాయి.చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్‌కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి. -
IPL 2026: నితీశ్ రాణా, రుతురాజ్‌పై చర్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. సంజూ శాంసన్ (115 నాటౌట్) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (59 రిటైర్డ్ ఔట్) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో శివమ్ దూబే (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ.. జేమీ ఓవర్టన్ (4-0-18-4), అన్షుల్ కంబోజ్ (4-0-35-3) ధాటికి 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. ట్రిస్టన్ స్టబ్స్ (60) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు సీఎస్కేకు ఈ సీజన్లో మొదటిది కాగా.. ఢిల్లీ నాలుగు మ్యాచ్‌ల్లో రెండో పరాజయాన్ని ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఢిల్లీ ఆటగాడు నితీశ్ రాణాకు జరిమానా విధించింది.సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్ స్లో ఓవర్‌రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ మ్యాచ్ ఫీజ్‌లో రూ. 12 లక్షలు కోల్పోగా.. నితీశ్‌కు మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం కోత, అదనంగా ఓ డీమెరిట్ పాయింట్ శిక్షగా విధించబడింది. సీఎస్కేకు ఈ సీజన్లో ఇది మొదటి తప్పిదం కావడంతో జరిమానాతో సరిపెట్టారు.నితీశ్ విషయానికొస్తే.. అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గానూ ఈ శిక్షను ఎదుర్కొన్నాడు. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో (19వ ఓవర్లో) ట్రిస్టన్ స్టబ్స్ గ్లవ్స్ మార్చుకోవాలని అంపైర్లను కోరగా, వారు నిరాకరించారు. దీంతో నితీశ్ మధ్యలో కల్పించుకొని స్టబ్స్‌కు వత్తాసుగా ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అసభ్య పదజాలం కూడా వాడాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.3 నిబంధన ప్రకారం ఇది లెవెల్ 1 నేరం కిందికి వస్తుంది. ఇందుకు మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించారు. -
‘విజయానికి వాళ్లే కారణం.. సంజూ కాదు’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ విజయంలో సంజూ శాంసన్, ఆయుశ్ మాత్రేలు కీలకపాత్ర పోషించారు. అయితే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం బౌలర్ల వల్లే తమ జట్టు విజయం సాధించిదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు సీజన్లో తొలి విజయం సాధించడం, సంతోషంతో మాట్లాడేందుకు మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ మేము ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది. చెపాక్ స్టేడియంలో మేము ఎప్పుడు మొదట బ్యాటింగ్ చేసినా 200 నుంచి 210 స్కోరు చేయాలని అనుకునేవాళ్లం. కానీ స్లో పిచ్ కారణంగా ఆ స్కోరు చేయడం కాస్త కష్టంగా అనిపించేంది. గత మ్యాచ్‌లతో పోలిస్తే అన్ని విషయాల్లో మెరుగయ్యాం. ఈరోజు సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ఆయుష్ కూడా అద్భుతంగా రాణించాడు. కానీ ఇవాళ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలుపులో బౌలింగ్ పాత్రే కీలకం. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం మా విజయానికి కలిసొచ్చింది. మా బౌలర్ల కృషిని చూసి గర్వపడుతున్నా. నిజానికి మా బౌలింగ్ లైనప్‌లో 'ఎక్స్-ఫ్యాక్టర్' బౌలర్ లేకపోయి ఉండవచ్చు. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ ఎంత ప్రభావవంతంగా ఉండాలి, ముందస్తుగా ఎలా ఆలోచించాలి, అదనపు బౌండరీలను ఎలా ఆపాలి అనే విషయాలపై మేం చర్చించుకుంటూనే ఉన్నాం. తొలి మూడు మ్యాచ్‌ల్లో మేము విజయానికి చేరువగా వచ్చినప్పటికీ ఒకటి రెండు ఓవర్లలో 20-25 పరుగులు సమర్పించుకోవడం గెలుపును దూరం చేశాయి. పవర్‌ప్లేలో మేం కొంచెం వెనకంజలో నిలిచినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాం. చెన్నై ఫ్యాన్స్ ఎప్పుడూ మాకు అండగా ఉంటారు. మేం ఎక్కడికి వెళ్లినా వారి మద్దతు, సందేశాలు మమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దేశంలో ఈ ప్రాంతం ప్రత్యేకం. ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే ఫ్రాంచైజీని అమితంగా ప్రేమిస్తుంటారు.’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.చదవండి: ‘నా సెంచరీ వెనుక ఆ 50 సెకన్లు.. అతడికే అంకితం’ -
అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు (సీఎస్కే) అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంతో పాటు 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన జట్టుగా చెన్నై రికార్డు సొంతం. ధోని నేతృత్వంలో అద్భుత ఆటను ప్రదర్శించిన సీఎస్కే 2023లో చివరిసారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. ఆ తర్వాతి సీజన్ నుంచి సీఎస్కే ఆటతీరు దారుణంగా పడిపోతు వస్తోంది. గత నాలుగేళ్లుగా ధోనీ జట్టులో ఉన్నా అతడి పాత్ర అంతంతమాత్రమే. ఇక ఈ సీజన్లో సీఎస్కే ఆటతీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త ఆటతీరుతో హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది.దారుణమైన నెట్ రన్‌రేట్‌తో పట్టికలో సీఎస్కే ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. అయితే గతంలో ఇలా వరుస ఓటములు చవిచూసినప్పటికీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన సీఎస్కేకు ఈసారి మాత్రం ఆ చాన్స్ లేదనిపిస్తోంది.గతంలో సీఎస్కే అంటే వయసు మీరిన ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తుండేవారు. దీంతో ఆ జట్టుకు వృద్ధాప్య జట్టుగా పేరుండేది. కానీ అదే వెటరన్ టీంతోనే ధోని ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టాడు. కానీ ఈసారి సీఎస్కే కూడా గేర్ మార్చింది. జట్టును మొత్తం యువ ఆటగాళ్లతో నింపే ప్రయత్నం చేసింది. అందుకు జడేజా, సామ్ కరన్ వంటి సీనియర్లను విడుదల చేసిన సీఎస్కే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ లాంటి కుర్రాళ్ల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేసి జట్టులోకి తీసుకొచ్చింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. యువ రక్తంతో నిండిన జట్టు ఈసారి అద్భుతాలు చేస్తుందని ఆశించారు చెన్నై అభిమానులు. కానీ ఆ జట్టు తొలి మూడు మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో చతికిలపడింది. రాజస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో 127 పరుగులకే కుప్పకూలిన సీఎస్కే.. రెండో మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ లాంటి కుర్రాళ్ల ప్రదర్శనతో 209 పరుగులు చేసి కూడా పంజాబ్ బ్యాటర్లను నిలువరించలేక ఓటమి చవిచూసింది. ఇక మూడో మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లను ఆర్సీబీ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. 251 పరుగుల కొండంత లక్ష్యం ఛేదించే క్రమంలో చతికిలపడి హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది.కెప్టెన్‌గా రుతురాజ్ విఫలం..2024 సీజన్లో సీఎస్కే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం కూడా సీఎస్కేను ఇబ్బందుల్లో పడేసింది. 2024 సీజన్లో 583 పరుగులు సాధించి రెండో టాప్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్ 2026 సీజన్లో మాత్రం అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిలువున్న రుతురాజ్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పడం ఆసక్తి కలిగించింది. గత సీజన్లలో కెప్టెన్సీ ఎలా ఉన్నా బ్యాటర్ రాణించేవాడు రుతురాజ్. కానీ ఈసారి అదీ లేదు. 6, 28, 7.. ఇవీ మూడు ఇన్నింగ్స్ ల్లో అతడి స్కోర్లు. వేగంగా ఆడలేని బలహీనతను అతను అధిగమించలేకపోతున్నాడు. కెప్టెన్‌గా జట్టును సమష్టిగా నడిపించడంలోనూ రుతురాజ్ విఫలమవుతున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ పకడ్బందీగా సాగలేదు. ధోనిలా అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను రుతురాజ్ సమర్థంగా ఉపయోగించుకోలేకపోతున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది.సంజూకు ఏమైంది?రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయిన సంజూ శాంసన్ ఈసారి సీఎస్కే తలరాతను మారుస్తాడని అంతా ఊహించారు. కానీ టీ20 ప్రపంచకప్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో హీరో మారిన శాంసన్ ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం జీరో అయిపోయాడు. శాంసన్ బ్యాటింగ్‌లో నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఓపెనింగ్ భాగస్వామ్యం ఏ జట్టుకైనా అత్యంత కీలకం. కానీ శాంసన్, రుతురాజ్‌లు ఏకకాలంలో విఫలం కావడం కూడా సీఎస్కేను దెబ్బతీస్తోంది. సంజూ శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 6,7,9.. సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఓపెనర్లిద్దరూ ఆరంభంలోనే ఔటవ్వడంతో తర్వాత వచ్చేవారిపై ఒత్తిడి పెరిగి సరిగ్గా ఆడలేకపోతున్నారు. మిడిలార్డర్లో ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. కోట్లు ఖర్చు చేసిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు దారుణంగా విఫలమవుతున్నారు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఎప్పుడు ఎలా ఆడతాడో అర్థం కాని స్థితి నెలకొంది.పసలేని బౌలింగ్..బ్యాటింగ్‌లో సమస్యలు ఇలా ఉంటే బౌలింగ్‌లో పరిస్థితి మరోలా ఉంది. అన్షుల్ కాంబోజ్ మినహా చెన్నైకి చెప్పుకోదగ్గ బౌలర్లు పెద్దగా కనిపించడం లేదు. జేమీ ఓవర్టర్, నూర్ అహ్మద్‌లు ఉన్నా వారు పెద్దగా ప్రభావం చూపడం లేదు. శివమ్ దూబే బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు సీఎస్కే బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమానత్వం కనిపించేది. కానీ ఇప్పటి జట్టులో అది కరువైంది.అదంతా గతం..ఇక కెప్టెన్‌గా సీఎస్కేకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోని జట్టుకు దూరమవ్వడం కూడా సీఎస్కేను డీలా పడేలా చేసింది. ధోని ఆడకున్నా సరే అతడు జట్టుతో పాటు ఉంటే అదే కొండంత బలం. బ్యాటింగ్‌లో ఊపు తగ్గినప్పటకీ వికెట్ల వెనుక ఉండి అతడిచ్చే సలహాలు జట్టుకు ఎన్నోసార్లు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు అదంతా గతం. ధోని ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చినా సీఎస్కేకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే గత రెండు సీజన్లలో ధోని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ సీఎస్కే లీగ్ దశకే పరిమితమైంది. మరి ఇప్పుడు ధోని వచ్చినా జట్టును ఏం మార్చగలడు అనే అభిప్రాయయాలు బలంగా వినిపిస్తున్నాయి.చదవండి: ‘తప్పు చేశావ్.. కెప్టెన్‌గా అదొక చెత్త నిర్ణయం’ -
ఆర్సీబీతో మ్యాచ్.. ఓటమికి పూర్తి బాధ్యత నాదే!
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే వస్తోంది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైన సీఎస్కే హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. అంతేకాదు పరమ చెత్త ఆటతీరుతో (-2.157) దారుణమైన నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్ ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. మ్యాచ్ ఓటమికి తానే మొత్తం బాధ్యత తీసుకుంటానని రుతురాజ్ పేర్కొన్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమయ్యానని, అందుకే ఓటమికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. రుతురాజ్ మాట్లాడుతూ.. ‘బిగ్ టార్గెట్ మన కళ్లముందు ఉన్నప్పుడు బాధ్యతగా ఆడాల్సిన అవసరముంది. టాపార్డర్‌లో నేను ఎక్కువ పరుగులు చేయాల్సింది. మా బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్తో పాటు శివమ్ దూబే తమ పోరాటం చేశారు. కానీ నేను బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే ఓటమిని నన్ను నేను బాధ్యుడిగా చేసుకుంటున్నా. అన్షుల్ కాంబోజ్ దాదాపుగా అతడి వికెట్ తీశాడు. మేం ఆనందంలో ఉన్నాం. అయితే.. ఆ బాల్ నోబాల్ కావడం మా దురదృష్టకరం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మైదానం నలువైపులా బంతిని బాదాడు. అతడు బ్యాటింగ్ చేసిన విధానానికి ఖచ్చితంగా హ్యాట్సాఫ్. గతంలో భారీ స్కోర్లను ఛేదించిన సందర్భాలున్నాయి. హ్యాట్రిక్ ఓటములు బాధ కలిగిస్తున్నప్పటికీ తర్వాతి మ్యాచ్‌ల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటాం’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 3 బంతుల్లో ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గత సీజన్లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రుతురాజ్ అప్పటి నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవుతూనే వస్తున్నాడు. కెప్టెన్సీ అనే బాధ్యత రుతురాజ్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.చదవండి: భువనేశ్వర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి -
‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓడిపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగానే పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. మ్యాచ్ ఓటమి అనంతరం రుతురాజ్ మాట్లాడాడు.‘ఇది చాలా కఠినమైన మ్యాచ్. అయినప్పటికి కూడా ఈ మ్యాచ్ నుంచి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. మా బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ముఖ్యంగా ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే శివమ్ దూబే కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా బ్యాటింగ్ విభాగం బాగా ఆడింది. మా బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉంది. జట్టుకు ఏది అవసరమో, ఆ పాత్రకు అనుగుణంగా మారడమే ముఖ్యం. ఈరోజు వికెట్ కొంచెం గ్రిప్ అవుతున్నందున, బహుశా మరికొంత సేపు క్రీజులో నిలదొక్కుకోవాలని నాకు అనిపించింది. ఆ తరువాత వేగంగా ఆడాలని అనుకున్నాను. అయితే.. దురదృష్టవశాత్తు తప్పుడు సమయంలో ఔట్ అయ్యాను. నిజానికి 209 అనేది చాలా మంచి స్కోరు. పిచ్ నుంచి పేసర్లకు మంచి సహకారం అందింది. రాహుల్ చాహర్‌ను ఇంపాక్ట్‌గా తీసుకోవడంపై నేను ఒక్కటే ఆలోచించాను. ముగ్గురు సీమర్లు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లతో ఆడాలని అనుకున్నాము. ఈ కాంబినేషన్ జట్టుకు ఉపయోగపడుతుందనుకున్నా. కానీ మా స్పిన్నర్లకు ఈ రోజు అసలు కలిసిరాలేదు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయాము. అయితే మాది యువ జట్టు. అనవసరమైన అంచనాలతో ఒత్తిడి పెంచుకోకూడదని భావిస్తున్నాం’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్! -
చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఐపీఎల్లో ఐదు టైటిల్స్ కొట్టిన సీఎస్కే ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ ఆటతీరుతో చెన్నై సూపర్‌కింగ్స్ దారుణ ఓటమిని ఎదుర్కొంది. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ లేకపోవడం, అన్నింటికీ మించి ఎంఎస్ ధోని గాయంతో జట్టుకు దూరమవ్వడం సీఎస్కేను ఒత్తిడిలోకి నెట్టేసినట్లయింది. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. అయితే ఒక్క మ్యాచ్‌లో ఓటమితోనే సీఎస్కేను తప్పు బట్టాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కూర్పు గందరగోళం..కానీ మ్యాచ్ ఫలితం క్షణాల్లో మారిపోయే ఐపీఎల్లో ఫస్ట్ హాఫ్ సీజన్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవడమే అన్ని జట్లు టార్గెట్‌గా పెట్టుకుంటాయి. దీంతో సీజన్ తొలి మ్యాచ్ నుంచే అన్ని జట్లు గెలవాలనే సంకల్పంతోనే ఆడుతుంటాయి. వాస్తవానికి సీఎస్కే జట్టు కూర్పు కొంత గందరగోళంగానే కనిపిస్తుంది. డెవాల్డ్ బ్రెవిస్ గాయంతో మ్యాచ్‌కు దూరమవ్వడంతో సర్ఫరాజ్‌ఖాన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా ఓపెనర్‌గా బరిలోకి దింపితే వేరుగా ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో సర్ఫరాజ్ ముంబై తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఒకవేళ సీఎస్కే సర్ఫరాజ్ సేవల్ని ఉపయోగించుకోవాలనుకుంటే బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ఓపెనింగ్ లేదా మూడో స్థానంలో ఆడిస్తే బాగుండేది.మిడిలార్డర్ ఫెయిల్సాధారణంగా మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.కానీ కెప్టెన్ రుతురాజ్ 11 బంతుల్లో ఆరు పరుగులకే పరిమితం కావడం, అండర్-19 టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌట్ కావడం, మాథ్య షార్ట్ కూడా 2 పరుగులకే పెవిలియన్ చేరడం సీఎస్కేను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. జట్టులో రుతురాజ్, సంజూ శాంసన్, దూబే మినహా మిగతావారంతా జూనియర్లే. దూబే విఫలం..ఈ నేపథ్యంలో బాధ్యతగా ఆడాల్సిన సీనియర్లు నిర్లక్ష్య ఆటతీరుతో వికెట్లు పారేసుకోవడం కూడా సీఎస్కే కొంపముంచింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో శివమ్ దూబే ఫినిషర్‌గా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సీన్‌ను ఇప్పుడు ఐపీఎల్లో సీఎస్కే తరఫున పునరావృతం చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వచ్చీ రాగానే సిక్స్ కొట్టి దూకుడు ప్రదర్శించినప్పటికీ.. అప్పుడున్న పరిస్థితుల్లో సిక్సర్లు బాదడం కంటే ఇన్నింగ్స్ నిర్మించడంపై దూబే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే దూబే తర్వాత బ్యాటర్లు పెద్దగా లేరు. అయితే సీఎస్కే తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన జేమీ ఓవర్టన్కు దూబే నుంచి సహకారం అంది ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. దూబే బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉంటే కనీసం 170 పరుగులైనా చేసి ఉండేది. ధోని గైర్హాజరీలో దూబే నిలబడి సాధికారికంగా బ్యాటింగ్ చేసి ఉంటే అతడి విలువ అమాంతం పెరిగిపోయేది. ఇక సీఎస్కే లో స్కోరింగ్ మ్యాచ్‌లను కూడా కాపాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కనిపించిన ధోని లోటు!అయితే అప్పుడు ధోని మాస్టర్ మైండ్‌లా వ్యవహరించి వ్యూహాలు పన్ని ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడంలో సలహాలు, సూచనలు చేసేవాడు.కానీ ఇప్పుడు ధోని దూరం కావడంతో ఆ ప్రభావం కనిపించింది. ధోని ఉన్నప్పుడు కూడా సీఎస్కే మ్యాచ్‌లు ఓడిపోలేదా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమే కావొచ్చు.కానీ ధోని కేవల సీఎస్కే ఆటగాడు మాత్రమే కాదు. రెండు మూడు సీజన్లుగా చివర్లోనే బ్యాటింగ్ వస్తున్నాడు. కాని అతడిచ్చి సలహాలు సీఎస్కే కెప్టెన్లు తప్పకుండా పాటించి ఫలితాలు సాధించేది. కానీ ఈసారి ధోని లేకపోవడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. చెన్నై సూపర్‌కింగ్స్ ఫీల్డింగ్ విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. కానీ నిన్నటి రాజస్తాన్ మ్యాచ్‌లో ఆటగాళ్లలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రమాదకర సూర్యవంశీ క్యాచ్‌ను కార్తిక్ శర్మ విడిచి పెట్టడం, ఆ తర్వాత బౌండరీ వెళ్లకుండా బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్లు రాజస్తాన్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఓటమికి కూడా కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ఇది సీజన్లో తొలి మ్యాచ్ మాత్రమే కావడంతో రాబోయే మ్యాచ్‌ల్లో తప్పులను సరిదిద్దుకొని ఆడాల్సిన అవసరం సీఎస్కేకు ఉంది. ఇక డెవాల్డ్ బ్రెవిస్, ధోని ఎప్పుడు ఆడతారన్న దానిపై స్పష్టత లేదు. కాబట్టి వీరిద్దరు జట్టులోకి వచ్చేలోపూ తొలి హాఫ్‌లో కనీసం నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే టాప్-4లో నిలిచేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు.చదవండి: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! -
‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’
ఐపీఎల్ 19వ సీజన్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఓటమితో ప్రారంభించింది. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో రాజస్తాన్ రాయల్స్ చేతిలో సీఎస్కే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే రాజస్తాన్‌తో మ్యాచ్ ఓటమి మాకు గుణపాఠం లాంటిదని, తప్పులతో సీజన్‌ను ప్రారంభించినప్పుడే రాబోయే మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలన్న దానిపై స్పష్టత వస్తుందని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మీడియాతో మాట్లాడాడు. ‘మ్యాచ్ ఓటమి పెద్దగా నిరాశ కలిగించలేదు. అయితే మా ఇన్నింగ్స్ ఆరంభంలో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నండ్రీ బర్గర్లను ఎదుర్కొన్నప్పుడు పరిస్థితులు కఠినంగా ఉన్నాయనిపించింది. నిజానికి రాజస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశారు. ఆరంభంలో పేసర్లు, మధ్యలో స్పిన్నర్లకు పిచ్ సహకరించినట్లు అనిపించింది. కానీ మేము బ్యాటింగ్ మరింత మెరుగ్గా చేసినట్లయితే 150 నుంచి 160 స్కోరు చేసేవాళ్లం. వికెట్ కఠినంగా ఉన్నప్పుడు పరుగులు రావడం కష్టమైపోతుంది. అందుకే ఫలితంపై పెద్దగా నిరాశ చెందడం లేదు. ఈ మ్యాచ్ గురించి ఇక్కడే మరిచిపోయి ముందుకు సాగుతాము. మరో మూడు రోజుల్లో ఇంకో మ్యాచ్ ఉందని, దీంతో జట్టులో అందరూ సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మా జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. మ్యాచ్‌లో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. మాది బలమైన బ్యాటింగ్ లైనప్. భారీ స్కోర్లు చేయగల సత్తా మాకు ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. అయితే సీఎస్కే భారీ అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్, శివమ్ దూబే పూర్తిగా విఫలం కావడం, గాయాలతో ధోని, డెవాల్డ్ బ్రెవిస్ దూరం కావడం కూడా సీఎస్కేను ఒత్తిడిలోకి నెట్టేసింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.చదవండి: ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురికి చెక్! -
IPL 2026: సీఎస్కేలో కీలక మార్పు
గతేడాది చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్లో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐదు మ్యాచ్‌ల తర్వాత జట్టుకు దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని జట్టును ముందుకు నడిపాడు.ఊహించని నిర్ణయంఅయితే, పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది సీఎస్కే. దీంతో జట్టు ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు సీఎస్కే ఊహించని నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్, సీఎస్కే మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను ట్రేడ్ చేసింది.సంజూ శాంసన్ చేరికజడ్డూను రాజస్తాన్ రాయల్స్‌కు ఇచ్చేసి.. అతడికి బదులుగా ఆ జట్టు కెప్టెన్, టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson)ను జట్టులో చేర్చుకుంది. దీంతో వికెట్ కీపింగ్‌లో ధోని వారసుడిగా సంజూ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అంతేకాదు రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని సంజూను కెప్టెన్ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, సీఎస్కే మాత్రం రుతుకే మరోసారి పగ్గాలు అప్పగించింది.నాతో పాటు ఓపెనర్గాఈ నేపథ్యంలో సంజూ శాంసన్ పాత్ర ఏమిటన్న అంశంపై రుతురాజ్ గైక్వాడ్ తాజాగా స్పందించాడు. ముంబైలో బుధవారం జరిగిన కెప్టెన్ల సమావేశానికి రుతు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను, సంజూ ఈసారి ఓపెనర్లుగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు. తద్వారా ఈసారి సీఎస్కే ఓపెనింగ్ జోడీ ఎవరన్న ప్రశ్నకు తెరదించాడు.కాగా ఓపెనర్‌గా రుతుకు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి 60 ఇన్నింగ్స్‌లో అతడు 2289 పరుగులు చేశాడు. అయితే, గతేడాది రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి సీఎస్కే ఓపెనర్లుగా బరిలోకి దిగగా.. మూడో స్థానంలో రుతురాజ్ వచ్చాడు.ఓపెనర్‌గానే బెస్ట్ఇక ఇప్పటికి ఓవరాల్‌గా వన్‌డౌన్‌లో ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన రుతు కేవలం 208 పరుగులే చేశాడు. దీంతో మరోసారి తానే ఓపెనింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు.. టీమిండియా, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా సంజూకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో అతడిదే కీలక పాత్ర. నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. ప్రపంచ రికార్డు -
చెన్నై చెలరేగేనా!
ఏ సీజన్లోనైనా ఐపీఎల్ టైటిల్ ఫేవరెట్స్ ప్రస్తావన వస్తే కచ్చితంగా అందులో ఉండే జట్టు చెన్నై సూపర్‌కింగ్స్. నిషేధం కారణంగా మధ్యలో రెండేళ్లు మినహాయిస్తే 16 సీజన్లలో 12 సార్లు టాప్–4లో నిలిచిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. 12 పర్యాయాల్లో ఐదుసార్లు విజేతగా... ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచి చెన్నై తమ సత్తా చాటుకుంది. అయితే గత రెండేళ్లలో చెన్నై జట్టు పరిస్థితి మారింది. ‘కెప్టెన్ కూల్’ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం... రుతురాజ్ గైక్వాడ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగింది. 2023లో ధోని సారథ్యంలోనే ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన చెన్నై ఆ తర్వాత తడబడింది. రుతురాజ్ సారథ్యంలో 2024లో ఐదో స్థానంలో నిలిచిన ఆ జట్టు 2025లో అనూహ్యంగా చివరిదైన పదో స్థానంతో సరిపెట్టుకొని తమ లీగ్ చరిత్రలోనే పేలవమైన ప్రదర్శన నమోదు చేసింది.సూపర్ కింగ్స్‌లో నాణ్యమైన ఆటగాళ్లే కాదు... పొట్టి ఫార్మాట్‌కు అవసరమైన స్పెషలిస్ట్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఒకప్పటిలానే ఇప్పుడు కూడా ఈ జట్టు విదేశీ మెరుపుల కంటే భారత ఆటగాళ్లు, వారి బలాబలాలనే నమ్ముకుంది. అయితే దీనికి విదేశీ ఆటగాళ్లు మెరుపులు జోడిస్తే అది అదనపు బలమే అవుతుంది. ఫ్రాంచైజీల మధ్య జరిగిన అంతర్గత ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజాను వదిలేసి అతని స్థానంలో సంజూ సామ్సన్ను కొనుగోలు చేసింది. పలువురు దేశవాళీ కుర్రాళ్లను తీసుకోవడం ద్వారా జట్టులోకి యువ రక్తాన్ని ఎక్కించినట్లయ్యింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే చెన్నై కీలక ఆటగాళ్లు కాగా... క్రికెట్ దిగ్గజం ధోని తుది జట్టుకు ఆడుతున్నప్పటికీ అతని పాత్ర మాత్రం ఆటకంటే కూడా మార్గదర్శనంతోనే పరిమితమనే మాట జగమెరిగిన సత్యం. వయసు పైబడిన అతను ఇప్పటికీ ఫ్రాంచైజీ ఆశాకిరణంగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఫినిషర్‌గా బ్యాటింగ్‌కు దిగే అవకాశమైతే ఉంది! కానీ అన్ని మ్యాచ్‌ల్లో మాత్రం కాదు. మరోసారి ధోనికిది ఫేర్వెల్ ఐపీఎల్ కాగలదని క్రికెట్ విశ్లేషకులంతా భావిస్తున్నారు. దీంతో చెన్నై సహచరులంతా తమ అభిమాన భారత దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. బ్రెవిస్, హెన్రీలు సత్తా చాటితే చెన్నైకి భారత ఆటగాళ్లే కొండంత బలమైనప్పటికీ విదేశీ ఆటగాళ్లలో బ్రెవిస్, నూర్ అహ్మద్, హెన్రీలను కూడా నమ్ముకుంది. గత సీజన్లో సత్తా చాటుకున్న బ్రెవిస్, నూర్ అహ్మద్ రాణిస్తే చెన్నై మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. అలాగే పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్ను విరిచే సత్తా ఉన్న మ్యాట్ హెన్రీ కూడా చెలరేగితే చెన్నై జోరుకు ఎదురుండదు. వేలంలో ఎవరి ఊహకి అందని విధంగా భారీ మొత్తం వెచ్చించి మరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను చెన్నై తీసుకుంది. ఈ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లపై ఎవరికి ఎలాంటి అంచనాలున్నా... లేకున్నా... ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం పెద్ద నమ్మకాన్నే పెట్టుకుంది. లేకుంటే కేవలం ఇద్దరిపైనే రూ. 28.40 కోట్లనయితే ఖర్చు చేయదుగా! సర్ఫరాజ్ ఖాన్ కూడా సూపర్‌కింగ్స్ జట్టు ద్వారా అందరికంటా పడాలని తెగ ఆరాటపడుతున్నాడు. అందివచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. సామ్సన్ ‘కింగ్స్’ రాత మార్చేనా... సంజూ సామ్సన్ అంటే ఒకప్పుడు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టే గుర్తొస్తుంది. ఇప్పుడు అలా కాదు. 2026 టి20 ప్రపంచకప్ కూడా గుర్తుంటుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ మొత్తం మ్యాచ్‌లు కూడా ఆడని ప్లేయర్... మొత్తం ప్రపంచకప్ కథనే మార్చిన ఆటగాడయ్యాడు. వెస్టిండీస్‌తో క్వార్టర్ ఫైనల్స్‌ను తలపించిన సూపర్–8 చివరి మ్యాచ్‌లో సామ్సన్ (97 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత సెమీఫైనల్లో 89, ఫైనల్లో 89 స్కోర్లు భారత్‌ను ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేలా చేశాయి. అలా ఇప్పుడు ఐపీఎల్ ప్లేయర్ కాస్తా టీమిండియా స్టార్ అయ్యాడు. గెలిచిన కప్, ఆడబోయే లీగ్ రెండూ టి20 ఫార్మాటే కావడంతో ఈ ఫార్మాట్లో సూపర్ ఫామ్‌లో ఉన్న సామ్సన్ ఇప్పుడు ధోని జట్టుకు బంగారు కొండలా కనిపిస్తున్నాడు. రుతురాజ్, శివమ్ దూబేలాంటి హిట్టర్లున్న కింగ్స్‌కు పూర్వవైభవం తేవాలన్నా... జట్టు రాత మారాలన్నా అది సామ్సన్ ఒక్కడి మెరుపులపైనే ఆధారపడి ఉంది. ధోని తుది జట్టుకు ఆడుతున్నాడనే ధైర్యం కూడా చెన్నైకి అదనపు బలం కాగాలదు. ఈ నేపథ్యంలో అన్ని అనుకున్నట్లు జరిగితే చెన్నై ఖాతాలో ఆరో టైటిల్ చేరడం సాధ్యమే. ఇదే జరిగితే ఫ్యాన్స్ ‘విజిల్ పొడు’తో సందడి చేసుకుంటారు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెపె్టన్), ధోని, సంజూ సామ్సన్, ఆయుశ్ మాత్రే, బ్రెవిస్, రామకృష్ణ ఘోష్, శివమ్ దూబే, ఉరి్వల్ పటేల్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ చౌధరీ, నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, ఓవర్టన్, అకీల్ హోసీన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్, హెన్రీ, రాహుల్ చహర్, జాక్ ఫౌక్స్. -
మరోసారి శతక్కొట్టిన రుతురాజ్.. సెలక్టర్లు పట్టించుకోరుగా!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి శతక్కొట్టాడు. గోవాతో మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన వేళ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రుతు.. మొత్తంగా 131 బంతులు ఎదుర్కొని 134 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.రుతురాజ్ (Ruturaj Gaikwad) శతక ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కాగా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 279 పరుగులు సాధించాడు. తాజాగా గోవాతో గురువారం నాటి మ్యాచ్‌లో ఈ మహారాష్ట్ర కెప్టెన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.గోవా బౌలర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలుజైపూర్ వేదికగా గోవాతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసింది. గోవా పేసర్ వాసుకి కౌశిక్ అర్షిన్ కులకర్ణిని డకౌట్ చేయగా.. మరో ఓపెనర్ పృథ్వీ షా (1)ను అర్జున్ టెండుల్కర్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన కౌశిక్.. వన్‌డౌన్ బ్యాటర్ అంకిత్ బావ్నే(0), సిద్ధార్థ్ మాత్రే (27 బంతుల్లో 3)లను కూడా వెనక్కి పంపాడు.🚨 Ruturaj Gaikwad Show in Vijay Hazare TrophyRuns - 134Balls - 1314/6 - 8/6Maharastra was 5 down on Just 25 runs and then he scored valuable century.He deserved the part of Indian ODI squad but he got dropped due to politics of Gautam Gambhir 💔pic.twitter.com/Ts0ubxdo1b— Tejash (@Tejashyyyyy) January 8, 2026ఆదుకున్న రుతురాజ్ఈ క్రమంలో సింగిల్ డిజిట్ స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన మహారాష్ట్రను రుతురాజ్ అజేయ శతకం (134)తో ఆదుకున్నాడు. అతడికి తోడుగా లోయర్ ఆర్డర్లో విక్కీ ఓస్త్వాల్ హాఫ్ సెంచరీ (53)తో మెరవగా.. రాజ్వర్ధన్ హంగర్గేకర్ (19 బంతుల్లో 32 నాటౌట్) ధనాధన్ దంచికొట్టాడు. ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగలిగింది.శతకాలు బాదుతున్నా.. సెలక్టర్లు పట్టించుకోరుగా!ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రుతురాజ్ శతకం సాధించాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్‌పై, తాజాగా గోవాపై శతక్కొట్టాడు. అయితే, సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డేలు ఆడే భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు.గత సిరీస్‌లో సెంచరీతో అలరించినా సెలక్టర్లు రుతురాజ్‌కు మొండిచేయి చూపారు. గాయం నుంచి కోలుకుని మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో అతడిపై వేటు పడింది. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు వన్డేల్లో మెరుగైన రికార్డు లేకపోయినా మరోసారి అతడికి జట్టులో చోటు దక్కింది.వికెట్ కీపర్‌గానూ సత్తా చాటితేనేఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. వికెట్ కీపర్‌గానూ రుతురాజ్ సత్తా చాటితేనే తిరిగి అతడు టీమిండియాలో అడుగుపెట్టగలడని అభిప్రాయపడ్డాడు. మరోవైపు.. రుతుకు టీమిండియా తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్లే కనిపిస్తోందని మరో మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ అన్నాడు. కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 వన్డేలు ఆడిన రుతు.. 28.5 సగటుతో 228 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే, రుతు బ్యాటింగ్ సగటు తక్కువగా ఉండటం వల్ల బ్యాకప్ ఓపెనర్‌గా అయినా అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోయిందని చెప్పవచ్చు.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త -
అతడు సెలక్ట్ అవ్వాలంటే అదొక్కటే మార్గం: మాజీ చీఫ్ సెలక్టర్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. గత వన్డే సిరీస్ (సౌతాఫ్రికా)తో పోలిస్తే.. ఈసారి ముగ్గురు క్రికెటర్లు తమ స్థానాలు కోల్పోయారు. రిషభ్ పంత్ ఆట, వన్డేల్లో అతడి సగటు, వైఫల్యాలపై చర్చ జరుగుతున్నా... రెండో వికెట్ కీపర్‌గా అతడికే పట్టం కట్టారు సెలక్టర్లు.అయితే.. మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (Dhruv Jurel)పై మాత్రం వేటు పడింది. ఇక హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) కూడా జట్టులో స్థానం కోల్పోయాడు. తిలక్‌ను విశాఖపట్నంలో మూడో వన్డేకు తుది జట్టులోకి తీసుకున్నా...బ్యాటింగ్ రాకపోగా, జురేల్‌కు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశమే రాలేదు.శ్రేయస్ అయ్యర్ పునరాగమనంతోమరోవైపు.. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీ సాధించినా రుతురాజ్ గైక్వాడ్‌పై కూడా వేటు పడింది. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లోనూ దుమ్ములేపుతున్నా అతడికి నిరాశే మిగిలింది. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ పునరాగమనంతో రుతురాజ్ స్థానం కోల్పోక తప్పలేదు.అయితే, రుతు విషయంలో సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. ‘‘జట్టులో స్థానం కోసం రుతురాజ్ తనలోని మరో నైపుణ్యం గురించి సెలక్టర్లకు చెప్పాలేమో!.. ‘నేను ధోనితో కలిసి ఆడాను.. వికెట్ కీపింగ్ కూడా చేయగలను’ అని చెప్పాలి.అదొక్కటే మార్గంజట్టులోకి తిరిగి వచ్చేందుకు అతడికి అదొక్కటే మార్గం. శ్రేయస్ అయ్యర్ కచ్చితంగా జట్టులో ఉండాలి. అదే సమయంలో పదిహేను మంది సభ్యులలో రుతురాజ్ కూడా ఉండాలి. నితీశ్ కుమార్ రెడ్డికి బదులు అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది.నువ్వు సెంచరీ చేశావని తెలిసినా రుతు వంటి ఆటగాళ్లకు చోటు ఇవ్వమని చెప్పడం సరికాదు. దేశీ క్రికెట్లో మళ్లీ సత్తా చాటి అతడు తనను తాను నిరూపించుకోవాల్సిందే’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఈ నెల 11, 14, 18 తేదీల్లో వరుసగా వడోదర, రాజ్‌కోట్, ఇండోర్లలో వన్డేలు జరుగుతాయి. న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: BCCI: శుబ్‌మన్ గిల్ డిమాండ్ ఇదే! -
చరిత్ర సృష్టించిన రుతురాజ్
టీమిండియా అప్ కమింగ్ స్టార్, మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓ అద్భుతమైన రికార్డు సాధించాడు. దేశవాలీ వన్టే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. రుతు కేవలం 55 ఇన్నింగ్స్‌ల్లోనే సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు కర్ణాటక ఆటగాడు మనీశ్ పాండే పేరిట ఉండేది. మనీశ్‌కు ఈ మైలురాయిని తాకేందుకు 99 ఇన్నింగ్స్‌లు పట్టింది.వీహెచ్‌టీ చరిత్రలో మనీశ్ తర్వాత 100 సిక్సర్ల మార్కును తాకిన రెండో ఆటగాడు కూడా రుతురాజే. రుతురాజ్ సాధించిన ఈ సిక్సర్ల రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత వీహెచ్‌టీ ఎడిషన్‌లో రుతు 100 సిక్సర్ల రికార్డును సాధించాడు. ఈ ఎడిషన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రుతు.. ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు.ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న రుతు.. తాజాగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున అద్భుత శతకం బాదాడు. అయినా అతనికి త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌లో అవకాశం రాలేదు. చాలాకాలం క్రితమే రుతు భారత టీ20 ఫార్మాట్ నుంచి ఔటయ్యాడు.ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలో విపరీతమైన పోటీ ఉన్న కారణంగా రుతు అద్భుతంగా రాణిస్తున్నా అవకాశాలు రావడం లేదు. త్వరలో రుతు ఐపీఎల్-2026లో సీఎస్కేకు నాయకత్వం వహించనున్నాడు. కొద్ది రోజుల క్రితం వరకు రుతు సీఎస్కే కెప్టెన్సీ కూడా ఊడుతుందని ప్రచారం జరిగింది. అయితే మేనేజ్మెంట్ ఇతనిపై భరోసా ఉంచింది. -
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులోకి తిరిగొచ్చారు. అయితే అయ్యర్ ఇంకా బీసీసీఐ వైద్యబృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సింది. జనవరి 6 న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున శ్రేయస్ ఆడనున్నాడు. దీంతో అతడు ఫిట్నెస్ లెవల్స్ వైద్యులు అంచనా వేయనున్నారు. అతడు ఎటువంటి సమస్య లేకుండా ఆడితే కివీస్‌తో వన్డే సిరీస్‌లో కూడా భాగం కానున్నాడు. ఒకవేళ ఈ ముంబై బ్యాటర్‌కు ఏదైనా సమస్య తలెత్తితే తిరిగి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లనున్నాడు.రుతురాజ్‌పై వేటు..ఇక అయ్యర్ రీ ఎంట్రీతో మహారాష్ట్ర కెప్టెన్, స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌పై వేటు పడింది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో సత్తాచాటినప్పటికి.. జట్టు కూర్పు దృష్ట్యా అతడిని సెలక్టర్లు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక టీ20 ప్రపంచకప్-2026ను దృష్టిలో ఉంచుకుని జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు. దీంతో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణాలతో కూడిన పేస్ దళాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు.షమీకి నో ఛాన్స్..ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. అతడిని కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయనున్నారని వార్తలు వచ్చినప్పటికి.. సెలక్టర్లు మాత్రం మొగ్గు చూపలేదు. షమీ గతేడాది మార్చి నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు.పంత్‌కే ఓటు..అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నారని వార్తలకు సెలక్టర్లు చెక్ పెట్టారు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు పంత్‌ను ఎంపిక చేశారు. అతడిని తప్పించి ఇషాన్ కిషన్‌కు చోటు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం పంత్‌కే ఓటేశారు. కేఎల్ రాహుల్ బ్యాకప్‌గా పంత్ ఉండనున్నాడు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ఇక కివీస్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.కివీస్‌తో వన్డేలకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్‌నెస్‌కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్, అర్ష్‌దీప్ -
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. అతడికి నో ఛాన్స్!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టనుంది టీమిండియా. ఇరుజట్ల మధ్య జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం భారత్- కివీస్ (IND vs NZ) జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి.ఇందుకు సంబంధించి న్యూజిలాండ్ ఇప్పటికే తమ వన్డే, టీ20 జట్లు ప్రకటించగా.. భారత్ కేవలం టీ20 జట్టు వివరాలను మాత్రమే వెల్లడించింది. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ప్రదర్శన ఆధారంగా.. శనివారం వన్డే జట్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది.జైస్వాల్‌కు చోటు దక్కినా..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా న్యూజిలాండ్‌తో వన్డేలకు తన జట్టును ఎంచుకున్నాడు. టాపార్డర్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లిలను కొనసాగించాడు ఈ మాజీ ఓపెనర్.ముంబై తరఫున ఇటీవల సెంచరీతో రాణించిన టెస్టు జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)కు.. తుదిజట్టులో ఇప్పుడే చోటు దక్కదని.. ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా.. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్నే సెలక్టర్లు కొనసాగిస్తారని పేర్కొన్నాడు.పంత్‌కు చోటెలా?అదే విధంగా వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు చోటిచ్చిన ఆకాశ్ చోప్రా.. వైస్ కెప్టెన్‌గా అతడే ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను కాదని.. వన్డేల్లో మెరుగైన రికార్డు లేని, విజయ్ హజారే మ్యాచ్‌లలో విఫలమవుతున్న రిషభ్ పంత్‌ను ఎంపిక చేసుకున్నాడు.ఇక స్పిన్ ఆల్‌రౌండర్ల విభాగంలో వాషింగ్టన్ సుందర్‌కు ఓటు వేసిన ఆకాశ్ చోప్రా.. లెఫ్టార్మ్ బౌలర్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలలో ఒకరినే సెలక్టర్లు ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డాడు. అక్షర్ ఐదు టీ20లతో పాటు వరల్డ్‌కప్ ఆడాల్సి ఉన్నందున వన్డేల నుంచి అతడికి విశ్రాంతినివ్వవచ్చని పేర్కొన్నాడు. అందుకే కివీస్‌తో వన్డేల్లో జడ్డూనే ఆడతాడని అంచనా వేశాడు.సంజూతో పాటు షమీకీ మొండిచేయితన జట్టులో తిలక్ వర్మకు కూడా చోటుందన్న ఆకాశ్ చోప్రా.. పేసర్ల విభాగంలో మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తుదిజట్టుకు కూడా ఎంపిక అవుతారని పేర్కొన్నాడు. వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీని మాత్రం అతడు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక స్పెషలిస్టు స్పిన్నర్‌గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు ఆకాశ్ చోప్రా ఓటువేశాడు. కాగా కివీస్‌తో టీ20 మ్యాచ్‌లు, ప్రపంచకప్-2026 దృష్ట్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు వన్డేల నుంచి మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టుశుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్/రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్.చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా -
టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’గా మారిన ప్లేయర్లు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్ దేవ్‌దత్ పడిక్కల్, ముంబై సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. పడిక్కల్ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లలో మూడుసార్లు శతక్కొట్టాడు. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో 147 పరుగులతో దుమ్ములేపిన పడిక్కల్.. కేరళపై 124 పరుగులు సాధించాడు.టీమిండియా సెలక్టర్లకు తలనొప్పిఅనంతరం పుదుచ్చేరిపై 113 పరుగులతో పడిక్కల్ ఆకట్టుకున్నాడు. మరోవైపు.. సర్ఫరాజ్ బుధవారం విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. గోవాతో మ్యాచ్‌లో 75 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు బాది 157 పరుగులు సాధించాడు. నిలకడైన ప్రదర్శనతో రాణిస్తూ వన్డేలకూ తాను సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నాడు.వీరిద్దరితో పాటు మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సైతం దేశీ వన్డే టోర్నీలో అదరగొడుతున్నాడు. ఉత్తరాఖండ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ రుతు అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 113 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 124 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 331 పరుగులు చేయడంలో రుతుది కీలక పాత్ర.మరోవైపు.. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ సైతం మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బెంగాల్ తరపున బుధవారం నాటి మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసిన షమీ.. జమ్మూ కశ్మీర్‌పై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా వీరంతా అదరగొడుతుంటే.. టీమిండియా రెగ్యులర్ జట్టులో భాగమైన ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్, ఆంధ్ర సారథి నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం నిరాశపరుస్తున్నారు.ఆంధ్ర జట్టుకు మూడో పరాజయంనితీశ్ కెప్టెన్సీలోని ఆంధ్ర జట్టు (Andhra Cricket Team).. బ్యాటర్ల వైఫల్యం కారణంగా విజయ్ హజారే ట్రోఫీలో మూడో పరాజయం మూటగట్టుకుంది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో సౌరాష్ట్ర చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్ హార్విక్ దేశాయ్ (81 బంతుల్లో 61; 7 ఫోర్లు), చిరాగ్ జానీ (96 బంతుల్లో 69; 4 ఫోర్లు, 1 సిక్స్), రుచిత్ అహిర్ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు.ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 3 వికెట్లు పడగొట్టగా... కలిదిండి రాజు 2 వికెట్లు తీశాడు. నితీశ్ కుమార్ రెడ్డి, జాగర్లపుడి రామ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు తడబడింది. బ్యాటర్లంతా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవడంతో... ఆంధ్ర జట్టు 47.2 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది.జ్ఞానేశ్వర్ (33; 6 ఫోర్లు), హేమంత్ రెడ్డి (29; 4 ఫోర్లు), కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (30; 4 ఫోర్లు), రాజు (30; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయగా... శ్రీకర్ భరత్ (4), రికీ భుయ్ (4), యారా సందీప్ (0) విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అంకుర్ పన్వర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక విజయం, మూడు పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆంధ్ర జట్టు పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శనివారం గుజరాత్‌తో ఆంధ్ర జట్టు తలపడనుంది.మరి పంత్, నితీశ్ రెడ్డి సంగతి?అంతకు ముందు.. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లోనూ నితీశ్ రెడ్డి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి.. ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. అయితే, రైల్వేస్‌తో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి బ్యాట్‌తో రాణించారు. ఐదో స్థానంలో వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఓ వికెట్ కూడా పడగొట్టాడు.అనంతరం ఒడిషాతో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి మరోసారి నిరాశపరిచాడు. ఆరు పరుగులు చేసి.. ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. తాజాగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు.. రిషభ్ పంత్ నాలుగు మ్యాచ్‌లలో కలిపి 121 (ఆంధ్రపై 5, గుజరాత్‌పై 70, సౌరాష్ట్రపై 22, ఒడిశాపై 24)పరుగులు చేయగలిగాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు పంత్ ఇలా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది.చదవండి: 2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్ -
వరుస శతకాలతో దూసుకుపోతున్న పడిక్కల్, రుతురాజ్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా యువ బ్యాటర్, కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 4 మ్యాచ్‌ల్లో 3 శతకాలతో శతక మోత మోగించాడు. తాజాగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 116 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసిన అతను.. జార్ఖండ్ (118 బంతుల్లో 147; 10 ఫోర్లు, 7 సిక్సర్లు), కేరళపై (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా శతకాలు బాదాడుతాజా శతకంతో లిస్ట్-ఏ క్రికెట్లో పడిక్కల్ శతకాల సంఖ్య 12కి చేరింది. పడిక్కల్ కేవలం 36 ఇన్నింగ్స్‌ల్లోనే 12 శతకాలు, 12 అర్ద శతకాలతో 80కిపైగా సగటుతో 2300 పైచిలుకు పరుగులు చేశాడు.పుదుచ్చేరితో మ్యాచ్‌లో పడిక్కల్‌తో పాటు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (124 బంతుల్లో 132; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సెంచరీలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో పడిక్కల్, మయాంక్ సెంచరీలకు కరుణ్ నాయర్ (34 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ కూడా తోడైంది.సూపర్ సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్ఇవాళే (డిసెంబర్ 31) జరిగిన మరో మ్యాచ్‌లో మరో టీమిండియా యువ బ్యాటర్, మహారాష్ట్ర స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (113 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అద్భుత శతకంతో కదంతొక్కాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ ఈ శతకం బాదాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (50-3) రుతురాజ్ బ్యాట్ నుంచి ఈ క్లాసిక్ సెంచరీ వచ్చింది. రుతురాజ్ శతకం కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర భారీ స్కోర్ (331-7) చేసింది.ఈ సెంచరీతో రుతురాజ్ తన లిస్ట్-ఏ శతకాల సంఖ్యను 19కి పెంచుకున్నాడు. రుతురాజ్ ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ సెంచరీ చేశాడు. ఈ ఏడాది రుతురాజ్ ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. బుచ్చిబాబు ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇండియా-ఏ, ఇండియా, తాజాగా విజయ్ హజారే ట్రోఫీ.. ఇలా ఆడిన ప్రతి ఫార్మాట్లోనూ సెంచరీలు చేసి, విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా ఆశాకిరణంగా మారాడు. -
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2024లో కరేబియన్ దీవుల్లో ట్రోఫీని ముద్దాడిన భారత జట్టు.. ఈసారి సొంతగడ్డపై అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. గతేడాది కాలంగా నిలకడైన ప్రదర్శనతో.. వరుస విజయాలతో సూర్య సేన మరోసారి హాట్ ఫేవరెట్‌గా మారింది.ఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఈ ఐసీసీ టోర్నీకి ఎంపిక చేసింది. వైస్ కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్‌పై వేటు వేయడంతో పాటు.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma)ను కూడా జట్టు నుంచి తప్పించింది. వీరి స్థానాల్లో రింకూ సింగ్ (Rinku Singh), ఇషాన్ కిషన్‌లకు చోటిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు ప్రత్యామ్నాయ జట్టుతో ముందుకు వచ్చాడు. మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నా.. చాన్నాళ్లుగా భారత టీ20 జట్టుకు దూరమైన ఆటగాళ్లతో ఆకాశ్ చోప్రా తన టీమ్‌ను ప్రకటించాడు. జైస్వాల్, రుతురాజ్‌కు చోటుఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌లను ఎంచుకున్న ఈ మాజీ ఓపెనింగ్ బ్యాటర్... శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జితేశ్ శర్మలకు కూడా స్థానం ఇచ్చాడు.భువీ, షమీలకూ ఛాన్స్‌అదే విధంగా.. పేసర్ల విభాగంలో స్వింగ్ సుల్తాన్, జట్టుకు ఏనాడో దూరమైన భువనేశ్వర్ కుమార్‌కు చోటిచ్చిన ఆకాశ్ చోప్రా.. ఇటీవలి కాలంలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నా సెలక్టర్లు పక్కనపెడుతున్న మొహమ్మద్ షమీని కూడా తన జట్టుకు ఎంపిక చేశాడు. వీరికి తోడుగా మొహమ్మద్ సిరాజ్, దీపక్ చహర్‌లకు కూడా స్థానం కల్పించాడు.ఇక ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌లను కూడా ఆకాశ్ చోప్రా తన జట్టులో చేర్చుకున్నాడు. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 ఫిబ్రవరి 7న మొదలై.. మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.టీ20 ప్రపంచకప్-2026 ఎడిషన్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న జట్టురుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, యజువేంద్ర చహల్, మొహమ్మద్ సిరాజ్.చదవండి: టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం -
‘తిలక్, పంత్ ఉన్నా.. అతడిని నమ్మారు.. క్రెడిట్ ఇవ్వాల్సిందే’
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఆడిన జట్టునే.. రెండో వన్డేలోనూ కొసాగించింది టీమిండియా యాజమాన్యం. ఫలితంగా మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు తనను తాను నిరూపించుకునేందుకు మరో అవకాశం లభించింది.సెంచరీతో అదరగొట్టాడుఈసారి రుతురాజ్ ఎలాంటి తప్పిదమూ చేయలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయ్‌పూర్ మైదానంలో శతక్కొట్టిన తొలి అంతర్జాతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ (Ruturaj Gaikwad)... మొత్తంగా 83 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 105 పరుగులు రాబట్టాడు.సాధారణంగా రుతురాజ్ ఓపెనింగ్ బ్యాటర్‌గా వస్తాడు. కానీ జట్టు కూర్పు దృష్ట్యా ఈసారి అతడు మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గైర్హాజరీ కారణంగా రుతుకు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రిషభ్ పంత్ (Rishabh Pant) నుంచి గట్టి పోటీ ఉన్నా.. యాజమాన్యం అనూహ్య రీతిలో తుదిజట్టులోనూ అతడిని ఆడించింది.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ విషయంలో మేనేజ్మెంట్కు తప్పక క్రెడిట్ ఇవ్వాలన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..తిలక్, పంత్ ఉన్నా.. ‘‘ఒక్క మ్యాచ్‌తో ఏ ఆటగాడు తనను తాను నిరూపించుకోలేడు. కాబట్టే రుతురాజ్‌కు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. ఇందుకు యాజమాన్యానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. తిలక్ వర్మ , రిషభ్ పంత్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్నా రుతుకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అతడిని నాలుగో స్థానంలో పంపినా సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక ముందు కూడా అతడిని జట్టులో కొనసాగిస్తే టాపార్డర్‌లో ఉంటాడా? లేదంటే నాలుగో స్థానంలో ఆడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.తనను ఏ స్థానంలో ఆడించినా పర్లేదనే సంకేతాన్ని రుతురాజ్ సెలక్టర్లకు ఇచ్చేశాడు. కాబట్టి మూడో వన్డేలోనూ అతడిని తప్పక కొనసాగిస్తారనే భావిస్తున్నా’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.దురదృష్టవశాత్తూకాగా రాంచి వేదికగా తొలి వన్డేలో రుతు 14 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో రుతు ఇచ్చిన క్యాచ్‌ను డెవాల్డ్ బ్రెవిస్ సంచలన రీతిలో ఒంటిచేత్తో అందుకుని.. అతడికి రీఎంట్రీలో చేదు అనుభవం మిగిల్చాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓడింది. ఫలితంగా ప్రస్తుతం 1-1తో ఇరుజట్లు సమానంగా ఉండగా.. విశాఖపట్నంలో శనివారం జరిగే మూడో వన్డేతో సిరీస్ విజేత ఎవరో తేలుతుంది. చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు! -
'అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఇకనైనా మారండి'
రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర స్టార్.. ప్రత్యర్ధి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో గైక్వాడ్ 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ తన సత్తా నిరూపించుకున్నాడని, అతడికి వన్డేల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ మెనెజ్‌మెంట్‌ను సూచించాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరం కావడంతో రుతురాజ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. తొలి వన్డేలో విఫలమైనప్పటికి.. రెండో వన్డేలో మాత్రం కమ్ బ్యాక్ ఇచ్చాడు. సెంచరీతో పాటు విరాట్ కోహ్లీతో కలిసి 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు."జట్టు సెలక్షన్ విషయంలో ఇకపై పెద్దగా ప్రయోగాలు చేయరని ఆశిస్తున్నాను . రతురాజ్ అద్భుతమైన ఆటగాడు. అతడికి మూడు ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. కచ్చితంగా రుతురాజ్ ఆల్ ఫార్మాట్ జట్టులో ఉండటానికి అర్హుడు. అతడికి అవకాశాలు ఇవ్వండి. టెస్టుల్లో కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటికే రంజీ ట్రోఫీలో తనను నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అయితే రుతురాజ్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులోకి వచ్చి రాగానే సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది.అతడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సౌతాఫ్రికా వంటి బౌలింగ్ అటాక్‌పై సెంచరీ కొట్టడం గొప్ప విషయం "అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా? -
358 సరిపోలేదు
విరాట్ కోహ్లి తన అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డేల్లో 53వ సెంచరీతో చెలరేగాడు. అండగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. జట్టు గత మ్యాచ్లోకంటే మరో 9 పరుగులు ఎక్కువే చేసింది. అయినా సరే, రెండో వన్డేలో భారత్‌కు ఓటమి తప్పలేదు. రాంచీలో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయిన సఫారీలు ఈసారి రాయ్‌పూర్‌లో పట్టు వదల్లేదు. ఏకంగా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సమం చేశారు. మార్క్రమ్, బ్రెవిస్, బ్రెట్కీ బ్యాటింగ్ జోరుతో పాటు బౌలర్ల వైఫల్యం, అతి పేలవ ఫీల్డింగ్‌తో భారత్ నుంచి మ్యాచ్ చేజారింది. రాయ్‌పూర్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ 1–1తో సమమైంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (93 బంతుల్లో 102; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా రెండో శతకంతో చెలరేగగా... రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 105; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. కోహ్లి, రుతురాజ్ మూడో వికెట్‌కు 26 ఓవర్లలో 156 పరుగులు జోడించగా, చివర్లో కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు సాధించింది. మార్క్రమ్ (98 బంతుల్లో 110; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ నమోదు చేయగా... మాథ్యూ బ్రీట్కే (64 బంతుల్లో 68; 5 ఫోర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (34 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే శనివారం విశాఖపట్నంలో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) జాగ్రత్తగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా... బర్గర్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (14) అదే ఓవర్లో వెనుదిరిగాడు. కొద్ది సేపటికే జైస్వాల్ కూడా అవుటయ్యాడు. అయితే కోహ్లి, రుతురాజ్ భారీ భాగస్వామ్యంతో జట్టును నడిపించారు. సిక్స్‌తో ఖాతా తెరిచిన కోహ్లి ఆ తర్వాత తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 66 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో అవకాశం వృథా చేసుకున్న రుతురాజ్ ఈసారి పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు. ఇద్దరిలో ముందుగా రుతురాజ్ 52 బంతుల్లో, ఆ తర్వాత కోహ్లి 47 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అనంతరం మరింత జోరు పెంచిన రుతురాజ్... మహరాజ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. యాన్సెన్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్స్ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. మరోవైపు బాష్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన రుతురాజ్ 77 బంతుల్లోనే తన తొలి శతకాన్ని అందుకొని సంబరాలు చేసుకున్నాడు. 50 నుంచి 100కు చేరేందుకు అతను 25 బంతులే తీసుకున్నాడు. సెంచరీ తర్వాత రుతురాజ్ అవుట్ కాగా... యాన్సెన్ ఓవర్లో సింగిల్‌తో కోహ్లి సెంచరీ (90 బంతుల్లో) పూర్తయింది. ఆవెంటనే కోహ్లి వెనుదిరిగాడు. సుందర్ (1) విఫలం కాగా, రాహుల్, రవీంద్ర జడేజా (24 నాటౌట్) కలిసి స్కోరును 350 పరుగులు దాటించారు. ఈ క్రమంలో రాహుల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకోగా, ఆఖరి 10 ఓవర్లలో భారత్ 76 పరుగులు రాబట్టగలిగింది. బ్రెవిస్ దూకుడు... దక్షిణాఫ్రికా టాప్–5లో డికాక్ (8) మినహా మిగతా వారంతా లక్ష్య ఛేదనలో తమవంతు పాత్ర పోషించారు. జట్టు ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన తర్వాత మార్క్రమ్, బవుమా కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ముఖ్యంగా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన మార్క్రమ్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 88 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. అతను అవుటయ్యే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 30 ఓవర్లలో 197/3. మిగిలిన 20 ఓవర్లలో 8.10 రన్‌రేట్‌తో 162 పరుగులు అసాధ్యంగా కనిపించింది! అయితే ఇక్కడే బ్రెవిస్ ఆట స్వరూపాన్ని మార్చాడు. కుల్దీప్, హర్షిత్ బౌలింగ్‌లో చెరో రెండు చొప్పున మొత్తం ఐదు సిక్సర్లు బాదడంతో చేయాల్సిన రన్‌రేట్ ఒక్కసారిగా తగ్గిపోయింది. బ్రెవిస్, బ్రీట్కే నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త కట్టడి చేయగలిగినా... కార్బిన్ బాష్ (15 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) నిలిచి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బాష్ (బి) యాన్సెన్ 22; రోహిత్ (సి) డికాక్ (బి) బర్గర్ 14; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 102; రుతురాజ్ (సి) జోర్జి (బి) యాన్సెన్ 105; రాహుల్ (నాటౌట్) 66; సుందర్ (రనౌట్) 1; జడేజా (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 358. వికెట్ల పతనం: 1–40, 2–62, 3–257, 4–284, 5–289. బౌలింగ్: బర్గర్ 6.1–0–43–1, ఎన్గిడి 10–1–51–1, యాన్సెన్ 10–0–63–2, మహరాజ్ 10–0–70–0, బాష్ 8–0–79–0, మార్క్రమ్ 5.5–0–48–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రుతురాజ్ (బి) హర్షిత్ 110; డికాక్ (సి) సుందర్ (బి) అర్‡్షదీప్ 8; బవుమా (సి) హర్షిత్ (బి) ప్రసిధ్ 46; బ్రీట్కే (ఎల్బీ) (బి) ప్రసిధ్ 68; బ్రెవిస్ (సి) జైస్వాల్ (బి) కుల్దీప్ 54; జోర్జి (రిటైర్డ్‌హర్ట్) 17; యాన్సెన్ (సి) రుతురాజ్ (బి) అర్‡్షదీప్ 2; బాష్ (నాటౌట్) 29; మహరాజ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (49.2 ఓవర్లలో 6 వికెట్లకు) 362. వికెట్ల పతనం: 1–26, 2–127, 3–197, 4–289, 5–317, 6–322. బౌలింగ్: అర్ష్ దీప్ 10–0–54–2, హర్షిత్ 10–0–70–1, ప్రసిధ్ 8.2–0–85–2, సుందర్ 4–0–28–0, జడేజా 7–0–41–, కుల్దీప్ 10–0–78–1. 11 కోహ్లి వరుసగా రెండు వన్డేల్లో సెంచరీలు సాధించడం ఇది 11వ సారి.34 కోహ్లి తన వన్డే కెరీర్లో 34 వేర్వేరు వేదికల్లో సెంచరీ సాధించాడు. సచిన్ కూడా 34 వేదికల్లో శతకాలు బాదాడు.44 ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది 44వ సారి.3 దక్షిణాఫ్రికాపై మూడుసార్లు వన్డేల్లో ఇద్దరు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయగా.. మూడుసార్లూ భారత్ ఓడిపోవడం గమనార్హం. 1991 నవంబర్ 14న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్... 2001 అక్టోబర్ 5న జొహనెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సెంచరీలు చేశారు. ఈ రెండింటిలోనూ భారత్ ఓటమి పాలైంది.2 రుతురాజ్ గైక్వాడ్ టి20 (2023 నవంబర్ 28న ఆ్రస్టేలియాపై గువాహటిలో 123 నాటౌట్), వన్డే (2025 డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాపై 105) ఫార్మాట్లలో తన తొలి సెంచరీ చేసిన రెండు సందర్భాల్లోనూ భారత్ ఓడిపోయింది.2 వన్డేల్లో భారత్‌పై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. 2019లో మొహాలీలో జరిగిన వన్డేలోనూ ఆ్రస్టేలియా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. -
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన రుతురాజ్ గైక్వాడ్‌కు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసి నిష్క్రమించాడు.సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్..సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో రుతురాజ్ (Ruturaj Gaikwad) గాల్లోకి లేపిన బంతిని.. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) అద్భుతంగా ఒడిసిపట్టాడు. సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని.. రుతురాజ్‌కు నిద్రలేని రాత్రిని మిగిల్చాడు. అసలే రాక రాక వచ్చిన అవకాశం.. కానీ ఇలా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రుతుతో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రెండో వన్డేలో యాజమాన్యం రుతురాజ్‌పై వేటు వేసి.. రిషభ్ పంత్ (Rishabh Pant)ను తుదిజట్టులోకి తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, మేనేజ్మెంట్ రుతుకు మరో అవకాశం ఇచ్చింది. రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డేలో అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌కు ఎంపిక చేసింది.77 బంతుల్లోనే సెంచరీఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. శతక్కొట్టిన తర్వాత కూడా జోరు కొనసాగించిన రుతురాజ్... మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు.మరికొన్నాళ్లపాటు..సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో టోనీ డి జోర్జికి క్యాచ్ ఇవ్వడంతో రుతురాజ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. నిజానికి ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే రుతురాజ్‌ను మేనేజ్మెంట్.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దింపింది. తొలి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన రుతు.. తాజా వన్డేలో శతకం సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగే అర్హత సంపాదించాడు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డుఇక వన్డేల్లో తన తొలి సెంచరీతోనే రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయ్‌పూర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ శతకం నమోదు చేసిన క్రికెటర్‌గా తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇప్పటి వరకు రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.ఆస్ట్రేలియాతో టీ20, న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌లు జరుగగా.. కివీస్‌తో వన్డేలో నాటి కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులు సాధించాడు. ఈ వేదికపై ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్ శతకం సాధించి.. రోహిత్ పేరును చెరిపేశాడు.మరో రెండు రికార్డులుఇక ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా శతకం (93 బంతుల్లో 102) సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. 77 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతకు ముందు యూసఫ్ పఠాన్ 2011లో ప్రొటిస్ జట్టుతో 68 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.చదవండి: BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన -
శతక్కొట్టిన రుతురాజ్, కోహ్లి.. రాహుల్ మెరుపు ఇన్నింగ్స్
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రాయ్‌పూర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) విఫలం కాగా.. విరాట్ కోహ్లి (102), రుతురాజ్ (105) సెంచరీలతో చెలరేగారు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025 రాహుల్ మెరుపు అర్ధ శతకంతాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అజేయ అర్ధ శతకం (43 బంతుల్లోనే 66)తో అదరగొట్టగా.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) రనౌట్ అయ్యాడు. మిగిలిన వారిలో మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ రెండు, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి తలా ఒక వికెట్ పడగొట్టారు.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ (IND vs SA ODIs)లో భాగంగా టీమిండియా రాంచిలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 349 పరుగులు చేసిన భారత్.. ప్రొటిస్‌పై 17 పరుగుల తేడాతో నెగ్గింది. తాజాగా మరోసారి 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన టీమిండియా.. సఫారీలకు 359 పరుగుల టార్గెట్ విధించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాపై వన్డేల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు.వన్డేల్లో సౌతాఫ్రికాపై టీమిండియా అత్యధిక స్కోర్లు టాప్-5 జాబితా🏏గ్వాలియర్ వేదికగా 2010లో 401/3🏏రాయ్‌పూర్ వేదికగా 2025లో 358/5🏏రాంచి వేదికగా 2025లో 349/8🏏కార్డిఫ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ 2013లో 331/7🏏కోల్‌కతా వేదికగా వన్డే వరల్డ్‌కప్ 2023లో 326/5.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి -
గంభీర్ నమ్మకమే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి పుంజుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సఫారీలతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను ఈ మహారాష్ట్ర బ్యాటర్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 12 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రుతురాజ్.. తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లితో కలిపి 150కి పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గౌతీ నమ్మాడు.. రుతు అదరగొట్టాడురుతురాజ్ గైక్వాడ్ దాదాపు రెండేళ్ల తర్వాత భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. లిస్ట్-ఎ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండడంతో సెలక్టర్లు పిలుపునిచ్చారు. అయితే ప్రోటీస్‌తో తొలి వన్డేలో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.దీంతో అతడిని రెండో వన్డేకు పక్కన పెట్టాలని చాలా మంది మాజీలు సూచించారు. కానీ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం రుతుపై నమ్మకం ఉంచాడు. రెండో వన్డేలో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ఈసారి మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని గైక్వాడ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కోహ్లి(102) కూడా శతక్కొట్టాడు.భారీ స్కోర్ దిశగా భారత్..రాయ్‌పూర్ వన్డేలో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 45 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(43), జడేజా(9) ఉన్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వన్డే పునరాగమనంలో వరుస మ్యాచ్‌లలో దుమ్ములేపుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ అర్ధ శతకం (74 నాటౌట్) బాది ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. సొంతగడ్డపై అదే జోరును కొనసాగిస్తున్నాడు.సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేలో కోహ్లి (Virat Kohli) శతక్కొట్టిన విషయం తెలిసిందే. కేవలం 120 బంతుల్లోనే 135 పరుగులతో సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్‌గా 83వ శతకం నమోదు చేసి.. శతక శతకాలకు మరింత చేరువయ్యాడు.రెండో వన్డేలోనూ దూకుడుఇక తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలోనూ కోహ్లి దంచికొట్టాడు. రాయ్‌పూర్ వేదికగా 47 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో వరుసగా మూడోసారి యాభై పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలోనే కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు.చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లియాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా13 వేర్వేరు సందర్భాల్లో (13 Streaks) వరుసగా మూడు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి నిలకడైన ఆటకు ఇదే నిదర్శనం. గతంలో భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ 11 సందర్భాల్లో ఈ ఫీట్ నమోదు చేయగా.. సచిన్ టెండుల్కర్ పది సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు.కోహ్లి- రుతు ధనాధన్మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాయ్‌పూర్ వేదికగా బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు ఎంచుకున్న టీమిండియా 31వ ఓవర్లు ముగిసేసరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, నాలుగో నంబర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని నూటా యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. UPDATE: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్ సెంచరీచదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్‌పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్ -
ఒక్క మ్యాచ్‌కే అతడిపై వేటు.. డేంజరస్ బ్యాటర్‌కు ఛాన్స్?
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక ప్రోటీస్ జట్టును 17 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికి సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో రాహుల్ సేన ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సింది.జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఓ దశలో జాన్సెన్, బాష్ జోరు చూస్తే సఫారీలదే మ్యాచ్ అన్నట్లు అన్పించింది. కానీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మయాజాలంతో ఓటమి నుంచి మెన్ బ్లూ గట్టెక్కింది.అదేవిధంగా రాంచీ వన్డేలో భారత మిడిలార్డర్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(8) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(13) కూడా నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు.వారిద్దరిపై వేటు.. ఈ నేపథ్యంలో బుధవారం రాయ్‌పూర్ వేదికగా సఫారీలతో జరిగే రెండో వన్డేలో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.తొలి వన్డేలో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్, సుందర్‌లపై వేటు వేసేందుకు మెనెజ్‌మెంట్ సిద్దమైనట్లు సమాచారం.రుతు స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, సుందర్ స్ధానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ జట్టులోకి రానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. పంత్ గతేడాది చివరగా భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు ఏడాది తర్వాత ఈ డేంజరస్ బ్యాటర్ బ్లూ జెర్సీలో కన్పించనున్నాడు. గత మ్యాచ్‌లో సుందర్ కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. జట్టులో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌తో పాటు రవీంద్ర జడేజా ఉండడంతో సుందర్‌ను బెంచ్‌కు పరిమితం చేయాలని గంభీర్ యోచిస్తున్నట్లు సమాచారం. నితీష్ బ్యాట్‌తో పాటు మీడియం పేస్ బౌలర్‌గా కూడా తన సేవలను అందించనున్నాడు. అయితే సఫారీలతో జరిగిన రెండో టెస్టులో మాత్రం నితీష్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్చదవండి: రోహిత్‌తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్! -
పొడిచేశావ్ కట్టప్పా!.. ఎందుకిలా చేశావు!.. పాపం మన కెప్టెన్!
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. సౌతాఫ్రికాతో వన్డేలకు ఈ మహారాష్ట్ర ఆటగాడిని ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం.. రాంచిలో తుదిజట్టులోనూ ఆడే అవకాశం ఇచ్చింది.ఎట్టకేలకు ఓ అవకాశంఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్‌లో రుతు (Ruturaj Gaikwad) సత్తా చాటిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో 129 బంతుల్లో 117 పరుగులు సాధించిన రుతురాజ్.. రెండో మ్యాచ్‌లో అజేయ అర్ధ శతకం (68)తో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) గాయం వల్ల దూరం కావడం వల్ల రుతుకు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.అయితే, ప్రస్తుత భారత వన్డే జట్టు కూర్పు దృష్ట్యా తుదిజట్టులో రుతురాజ్‌కు చోటు దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా రిషభ్ పంత్‌కు మొండిచేయి చూపిన నాయకత్వ బృందం రుతుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించింది. ఈ క్రమంలో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఈ కుడిచేతి వాటం ఆటగాడు బ్యాటింగ్‌కు వచ్చాడు.ఊహించని రీతిలో షాక్నెమ్మదిగానే తన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రుతురాజ్‌కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. భారత ఇన్నింగ్స్‌లో 27వ ఓవర్‌ను సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ వేశాడు. అతడి బౌలింగ్‌లో మూడో బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రుతు గాల్లోకి లేపాడు. అంతే.. ఇన్సైడ్ సర్కిల్ లోపల ఇంతలో బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పాదరసంలా దూసుకవచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ నమ్మశక్యం కాని రీతిలో... ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు.కోహ్లి సైతం.. నోరెళ్లబెట్టాడుబ్రెవిస్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో రుతు కథ ముగిసిపోయింది. మొత్తంగా 14 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి అతడు నిష్క్రమించాడు. నిజానికి బ్రెవిస్ ఆ క్యాచ్ అలా పడతాడని ఎవరూ ఊహించలేదు. అంతెందుకు రుతుకు తోడుగా మరో ఎండ్‌లో ఉన్న దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం.. ఆ క్యాచ్ చూసి నోరెళ్లబెట్టాడు.అలా బ్రెవిస్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా రుతు రీఎంట్రీలో దురదృష్టవశాత్తూ పెద్దగా స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో బ్రెవిస్ సింగిల్ హ్యాండ్ క్యాచ్ హైలైట్ కాగా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేసిన పోస్టు వైరల్‌గా మారింది. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేసిన సీఎస్కే.. ‘‘ఎందుకిలా చేశావు డీబీ? ఎందుకు?’’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.Why, Brevis… why?Ruturaj was settling in so beautifully, playing with such calm and class —and then you flew in the air and snatched that catch out of nowhere.Brevis, you just broke the hearts of countless Rutu fans today. 💔pic.twitter.com/qEfyTuhfHC— Mahi Patel (@Mahi_Patel_07) November 30, 2025 పొడిచేశావు కదా కట్టప్పాతమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో తమకూ బాధ మిగిల్చాడనే ఉద్దేశంతో సీఎస్కే ఈ మేరకు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇందుకు బదులుగా.. ‘‘పాపం.. రుతును పొడిచేశావు కదా కట్టప్పా’’ అంటూ నెటిజన్లు బాహుబలి స్టైల్ మీమ్స్‌తో ఇద్దరినీ ట్రోల్ చేస్తున్నారు. కాగా బేబీ ఏబీడీగా పేరొందిన బ్రెవిస్.. ఐపీఎల్లో రుతు కెప్టెన్సీలో సీఎస్కేకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈసారి 2026 వేలానికి ముందు బ్రెవిస్‌ను సీఎస్కే అట్టిపెట్టుకుంది కూడా!భారత్ భారీ స్కోరుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ (57), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60), రవీంద్ర జడేజా (32) రాణించగా.. కోహ్లి (120 బంతుల్లో 135) శతక్కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.కష్టాల్లో సౌతాఫ్రికాలక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 134 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (7), ర్యాన్ రికెల్టన్ (0), క్వింటన్ డికాక్ (0) దారుణంగా విఫలమయ్యారు. టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) ఓ మోస్తరుగా రాణించారు. ఇలాంటి దశలో నాలుగో నంబర్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే అర్ద శతకం పూర్తి చేసుకుని సఫారీల ఆశాకిరణంగా నిలిచాడు.అన్నట్లు హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్రెవిస్ ఇచ్చిన క్యాచ్‌ను రుతురాజ్ పట్టడం విశేషం. కాగా భారత పేసర్లు హర్షిత్ రాణా మూడు, అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 25 ఓవర్ల ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. విజయానికి 188 పరుగుల దూరంలో నిలిచింది. మరోవైపు.. భారత్ గెలుపునకు ఐదు వికెట్లు కావాలి!!చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్‌ను దాటేసి తొలి ప్లేయర్‌గా.. 7000వ సెంచరీఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!Need a breakthrough? Call Harshit Rana! 📞A fine catch by Ruturaj as the dangerman Dewald Brevis departs 👏#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/w4PAuCIgUR— Star Sports (@StarSportsIndia) November 30, 2025 -
‘రుతురాజ్ అద్భుతమైన ఆటగాడు.. ఛాన్సులు ఇస్తాం’
ప్రతిభ ఉన్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు పొందలేకపోతున్న టీమిండియా ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. ఈ మహారాష్ట్ర ఆటగాడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటడంతో పాటు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. టీమిండియా ఓపెనర్‌గానూ తనను తాను నిరూపించుకున్న రుతు.. ఆసియా క్రీడలు-2023లో భారత జట్టు కెప్టెన్‌గా పసిడి పతకం గెలిచాడు.రెండేళ్ల తర్వాత..అయితే, అనుకున్న స్థాయిలో రుతుకు టీమిండియాలో ఛాన్సులు మాత్రం రావడం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ల నుంచి ఎదురైన పోటీలో రుతు వెనుకబడిపోయాడు. ఈ క్రమంలో మరోసారి దేశీ క్రికెట్, భారత్-‘ఎ’ తరఫున అదరగొట్టి.. టీమిండియా పునరాగమనానికి రుతురాజ్ సిద్ధమయ్యాడు.దాదాపు రెండేళ్ల విరామం తర్వాత.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్‌ను సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఈసారి, కెప్టెన్ హోదాలో ఉన్న శుబ్‌మన్ గిల్ గాయం వల్ల దూరం అయినా.. అతడికి బ్యాకప్‌గా టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్ వన్డే జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మకు.. ఓపెనింగ్ జోడీగా జైసూ, రుతులలో ఎవరు ఉంటారనేది ఆసక్తిగా మారింది.రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడుఈ విషయంపై టీమిండియా వన్డే తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. ప్రస్తుతం మా వన్డే జట్టులో 5-6 స్థానాల్లో ఆటగాళ్లు ఫిక్సయిపోయారు.అయితే, తనకు వచ్చిన అవకాశాలన్నిటిని రుతురాజ్ సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ఈ సిరీస్‌లో అతడికి ఛాన్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని కేఎల్ రాహుల్ తెలిపాడు. అయితే, ఏ స్థానంలో రుతురాజ్‌ను ఆడించే అవకాశం ఉందన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా ఆదివారం భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇందుకు రాంచీ వేదిక.చదవండి: అభిషేక్ శర్మ అట్టర్‌ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్ -
ధోనీ కేరళ వస్తే? ఇది ఏఐ అని చెబితే తప్ప తెలియదు (ఫొటోలు)
-
కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 ఆరంభానికి ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టోర్నీ కోసం తమ జట్టు కెప్టెన్‌గా ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షాను ఎంసీఎ నియమించింది. కాగా ఎంసీఎ రెండు రోజుల క్రితం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది.వాస్తవానికి రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర జట్టుకు సారథ్యం వహించాల్సి ఉండేది. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు రుతురాజ్‌ను భారత సెలక్టర్లు పిలుపునివ్వడంతో అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర కెప్టెన్ మార్పు అనివార్యమైంది. ఎంసీఎ సెలక్టర్లు ఇప్పటికే తమ నిర్ణయాన్ని షాకు తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం(నవంబర్ 24) అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పృథ్వీ షాకు కెప్టెన్‌గా అనుభవం ఉంది. గతంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో ముంబై జట్టుకు పలు మ్యాచ్‌లలో సారథ్యం వహించాడు. కాగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందు పృథ్వీ తన మకాంను ముంబై నుంచి మహారాష్ట్రకు మార్చిన సంగతి తెలిసిందే. ముంబై క్రికెట్ అసోయేషిన్‌తో విబేధాలు కారణంగా షా మహారాష్ట్రకు వచ్చాడు. ముంబై నుండి మహారాష్ట్రకు మారినప్పటి నుంచి పృథ్వీ షా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుత రంజీ సీజన్లో షా 7 ఇన్నింగ్స్‌లు ఆడి 67.14 సగటుతో 470 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర అదే రోజున తమ తొలి మ్యాచ్‌లో జమ్మూ అం్డ్ కాశ్మీర్‌తో తలపడనుంది.మహారాష్ట్ర జట్టురుతురాజ్ గైక్వాడ్, నిఖిల్ నాయక్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, రామకృష్ణ ఘోష్, రాజవర్ధన్ హంగర్గేకర్, జలజ్ సక్సేనా, అజీమ్ కాజీ, అర్షిన్ కులకర్ణి, ముఖేష్ చౌదరి, విక్కీ ఓస్త్వాల్, ప్రశాంత్ సోలంకి, మందార్ భండారి, యోగేష్ డోంగరే, యోగేష్ డోంగరే -
కెప్టెన్‌గా రుతురాజ్
త్వరలో ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ (SMAT 2025-26) కోసం 16 మంది సభ్యుల మహారాష్ట్ర జట్టును (Maharashtra) ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఎంపికయ్యాడు. ఇటీవలే ముంబై నుంచి వలస వచ్చిన పృథ్వీ షాకు (Prithvi Shaw) ఈ జట్టులో చోటు దక్కింది. రుతురాజ్, షా ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.ఈ టోర్నీ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో జమ్మూ అండ్ కశ్మీర్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో హైదరాబాద్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఛండీఘడ్, బిహార్, గోవా జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో మహారాష్ట్ర మొత్తం 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ కోల్‌కతా వేదికగా జరుగనున్నాయి.SMAT 2025-26 కోసం మహారాష్ట్ర జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), పృథ్వీ షా, అర్శిన్ కులకర్ణి, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ (వికెట్‌కీపర్), రామకృష్ణ ఘోష్, విక్కీ ఓస్త్వాల్, తనయ్ సంఘ్వీ, ముకేశ్ చౌదరీ, ప్రశాంత్ సోలంకి, మందర్ బండారీ (వికెట్‌కీపర్), జలజ్ సక్సేనా, రాజవర్దన్ హంగార్గేకర్, యోగేశ్ డోంగరే, రంజిత్ నికమ్చదవండి: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు -
IPL 2026: ‘పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పన్నెండు మంది ఆటగాళ్లను వదిలేసింది. క్యాష్ రిచ్ లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జట్టును వీడగా.. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర వంటి ప్లేయర్లను వదిలించుకుంది.అయితే, సీఎస్కే ‘బేబి మలింగ’, శ్రీలంక పేసర్ మతీశ పతిరణను కూడా వేలంలోకి వదలడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) ప్రియ శిష్యుడిగా పేరొందాడు పతిరణ. ధోని నాయకత్వం, మార్గదర్శనంలో అంచెలంచెలుగా ఎదిగి సీఎస్కే ప్రధాన పేసర్లలో ఒకడిగా మారాడు.రూ. 20 లక్షలతో చేరి.. 13 కోట్లకు..ఐపీఎల్-2022 సీజన్ సందర్భంగా రీప్లేస్మెంట్ ప్లేయర్‌గా రూ. 20 లక్షలతో సీఎస్కేలో చేరాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే.. 2023లో రూ. 20 లక్షలకు జట్టుతో ఉన్న ఈ యువ పేసర్.. చెన్నై ఐదోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 12 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 19 వికెట్లు కూల్చి సత్తా చాటాడు.ఇక గతేడాది రూ. 20 లక్షలకు పతిరణను రిటైన్ చేసుకోగా.. గాయం వల్ల ఆడలేకపోయాడు. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించి చెన్నై అతడిని అట్టిపెట్టుకుంది. అయితే, ఈసారి పతిరణ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 12 మ్యాచ్‌లు ఆడి కేవలం 13 వికెట్లు తీశాడు. ఎకానమీ 10.13.పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?ఈ నేపథ్యంలోనే చెన్నై పతిరణను విడిచిపెట్టడం గమనార్హం. ఈ విషయంపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘పతిరణ కోసం సీఎస్కే చాలా ఖర్చు చేసింది. అతడిని పెంచి, పోషించి.. తీర్చిదిద్దింది.అతడు కూడా జట్టు కోసం శ్రమించాడు. విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నిజానికి పతిరణ ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌లలో ఆడుతున్నాడు. వేర్వేరు వికెట్లపై ఎలా బౌలింగ్ చేయాలో అతడికి అవగాహన ఉంది. నైపుణ్యం గల బ్యాటర్లను కూడా పతిరణ బోల్తా కొట్టించగలడు.అలాంటి బౌలర్‌ను.. ముఖ్యంగా తాము పెద్ద చేసిన బౌలర్‌ను సీఎస్కే ఎలా వదిలేసిందో నాకైతే అర్థం కావడం లేదు. గతేడాది కాస్త వెనుకబడినా అతడు తిరిగి పుంజుకోగలడు. అతడిపై మరోసారి నమ్మకం ఉంచాల్సింది’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.సీఎస్కేలోకి సంజూ శాంసన్ఇదిలా ఉంటే.. సుదీర్ఘకాలంగా తమతో ఉన్న రవీంద్ర జడేజాతో పాటు.. సామ్ కర్రాన్‌ను వేలానికి ముందే రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసింది సీఎస్కే. ఇందుకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ జట్టులోకి చేర్చుకుంది. ఇక ఐపీఎల్-2026 సీజన్లోనూ రుతురాజ్ గైక్వాడ్నే తమ కెప్టెన్‌గా కొనసాగిస్తామని ఇప్పటికే సీఎస్కే స్పష్టం చేసింది.చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ లిస్టుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).చదవండి: IPL 2026: ‘కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతా’ -
టీమిండియాకు భంగపాటు
రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఏతో ఇవాళ (నవంబర్ 19) జరిగిన మూడో వన్డేలో భారత-ఏ జట్టుకు భంగపాటు ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత యువ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఫలితంగా పర్యాటకుల చేతిలో 73 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇది వరకే సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికాకు ఇది కంటితుడుపు విజయం. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఓపెనర్ల శతకాలుటాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ (325/6) చేసింది. ఓపెనర్లు లూహాన్ డ్రి ప్రిటోరియస్ (123), రివాల్లో మూన్సామి (107) అద్బుత శతకాలు సాధించారు. వీరిద్దరు ఔటయ్యాక సౌతాఫ్రికా స్కోర్ నెమ్మదించింది. ఆతర్వాత వచ్చిన రుబిన్ హెర్మన్ (11), క్వెషైల్ (1), కెప్టెన్ ఆకెర్మన్ (16), డియాన్ ఫార్రెస్టర్ (20) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వీరంతా కూడా రాణించి ఉంటే సౌతాఫ్రికా ఇంకాస్త భారీ స్కోర్ చేసేది. ఆఖర్లో డెలానో పాట్గెటర్ (30 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికా స్కోర్‌ను 300 మార్కు దాటించాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ 10 ఓవర్లలో 82 పరుగులిచ్చాడు (2 వికెట్లు). హర్షిత్ రాణా (10-1-47-2), ప్రసిద్ద్ కృష్ణ (10-0-52-2) సౌతాఫ్రికా బ్యాటర్లను కాస్త నిలువరించగలిగారు.టాపార్డర్ వైఫల్యం326 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (25) సహా టాపార్డర్ అంతా దారుణంగా విఫలమైంది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ తిలక్ వర్మ తలో 11, రియాన్ పరాగ్ 17 పరుగులు చేసి ఔటయ్యారు. ఆతర్వాత ఇషాన్ కిషన్ (53), ఆయుశ్ బదోని (66) కాసేపు పోరాడారు. అయితే అప్పటికే భారత ఓటమి ఖరారైపోయింది. నకాబా పీటర్ (10-0-48-4), మొరేకి (9.1-0-58-3), ఫోర్టుయిన్ (10-0-48-2) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌ను 252 పరుగులకే కట్టడి చేశారు. చదవండి: 'మరో' చరిత్రకు అడుగు దూరంలో బంగ్లాదేశ్ దిగ్గజం -
IPL 2026: ‘అతడొక డమ్మీ కెప్టెన్.. చేసేదంతా వేరొకరు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్ సందడి మొదలైపోయింది. ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు రిటెన్షన్, రిలీజ్ జాబితాలు విడుదల చేసి వేలానికి సిద్ధమైపోయాయి. అబుదాబి వేదికగా డిసెంబరు 16న జరుగనున్న వేలం పాటలో పాల్గొనేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎనిమిది జట్లు తమ కెప్టెన్లను ఖరారు చేశాయి. ఇందులో ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)నే తమ సారథిగా కొనసాగిస్తానని చెప్పడం విశేషం. రవీంద్ర జడేజాను ఇచ్చేసి.. రాజస్తాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్ (Sanju Samson)కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే, యాజమాన్యం మాత్రం రుతు వైపే మొగ్గుచూపింది.ఇప్పుడే జట్టులో చేరిన సంజూ శాంసన్‌ను ప్రస్తుతానికి వైస్ కెప్టెన్‌గా నియమించాలని సీఎస్కే మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడొక డమ్మీ కెప్టెన్.. రుతురాజ్ గైక్వాడ్ కేవలం పేపర్ మీద మాత్రమే సారథిగా కనిపిస్తాడని.. అతడొక డమ్మీ కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనినే మైదానం లోపల, వెలుపల నిజమైన సారథిగా వ్యవహరిస్తాడని కైఫ్ పేర్కొన్నాడు.‘‘ధోని బ్యాటింగ్ చేయడానికి తుదిజట్టులోకి రాడు. 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడానికి.. 20 ఓవర్ల పాటు కెప్టెన్సీ చేయడానికి మాత్రమే జట్టులో ఉంటాడు. మిగతా ఆటగాళ్లు ఎలా ఆడాలో మైదానంలోనే మార్గదర్శనం చేస్తాడు.అంతా ధోని కనుసన్నల్లోనేగైక్వాడ్ను గైడ్ చేయడానికే ధోని మైదానంలో ఉంటాడు. మెంటార్‌గా, కెప్టెన్‌గా మాత్రమే ధోని మైదానంలో దిగుతాడు. పేపర్ మీద మాత్రం గైక్వాడ్ పేరు కెప్టెన్‌గా ఉంటుంది. అయితే, మైదానంలో, మైదానం వెలుపల అంతా ధోని కనుసన్నల్లోనే నడుస్తుంది.కాబట్టి ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడని అనుకోవడం పొరపాటే. తనకు తానుగా ధోని ఈ నిర్ణయం తీసుకుంటే తప్ప.. అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశమే లేదు’’ అని కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ధోని వారసుడిగాకాగా చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ ధోని. అయితే, 2022లో తన వారసుడిగా రవీంద్ర జడేజాను ధోని ప్రకటించగా.. వరుస మ్యాచ్‌లలో ఓటమి నేపథ్యంలో జడ్డూ మధ్యలోనే వైదొలిగాడు. దీంతో మళ్లీ ధోనినే పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత 2024లో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. కానీ 2025లో గాయం వల్ల రుతు కూడా మధ్యలోనే దూరం కాగా.. మళ్లీ ధోనినే సారథిగా వ్యవహరించాడు. చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు! -
శుబ్‌మన్ గిల్ స్థానంలో ఊహించని ఆటగాడు!
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) దూరం కానున్నట్లు తెలుస్తోంది. మెడ నొప్పి తీవ్రంగా ఉండటంతో అతడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా ఇంకా కనీసం మూడు, నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతడికి సూచించినట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.ఊహించని ఆటగాడుగిల్ ప్రస్తుతం విమానంలో ప్రయాణించే పరిస్థితి లేదు కాబట్టి.. గువాహటి వేదికగా రెండో టెస్టు (IND vs SA 2nd Test)కు అతడు దూరమయ్యే పరిస్థితి ఉందని బీసీసీఐ అధికారి ఒకరు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తుదిజట్టులో గిల్ స్థానాన్ని మేనేజ్మెంట్ ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ జరుగుతుండగా.. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఊహించని ఆటగాడి పేరు తెరపైకి తెచ్చాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)ను టెస్టు జట్టులోకి తీసుకోవాలా? ఈ మాట వింటే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు. ఇప్పటికే సౌతాఫ్రికాతో టెస్టులకు జట్టును ఎంపిక చేసిన తర్వాత రుతు పేరెందుకు? అని మీరు అడుగవచ్చు.సాయి, పడిక్కల్ కాదు!రెండో టెస్టులో గిల్ ఆడతాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా మెడ నొప్పి ఇంకా తగ్గలేదనే సమాచారం ఉంది. ఒకవేళ అతడు మ్యాచ్‌కు పూర్తిగా దూరమైతే.. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్‌లో ఒకరిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారా?ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్టాండర్లు ఉన్నారు. మరి అలాంటపుడు మరో ఇద్దరు లెఫ్టాండర్ల (సాయి, పడిక్కల్)లలో ఒకరివైపు మొగ్గుచూపుతారా? అలాంటపుడు మొత్తంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లను ఆడించాల్సి వస్తుంది.రుతు బెస్ట్.. ఎందుకంటే?అలాంటపుడే బెటర్ ఆప్షన్ కోసం చూడాలి. రుతురాజ్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారత్-‘ఎ’ తరఫున వైట్‌బాల్ క్రికెట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లలో అదరగొడుతున్నాడు. రంజీ, దులిప్ ట్రోఫీ వంటి రెడ్‌బాల్ టోర్నీల్లోనూ పరుగులు రాబడుతున్నాడు.మిడిలార్డర్లోనూ రుతు బ్యాటింగ్ చేయగలడు. అతడి టెక్నిక్ కూడా బాగుంటుంది. నిజానికి టెస్టులకు అతడు సరైన ఆప్షన్. ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌లో ఇదే వేదిక (గువాహటి)పై రుతు సెంచరీ చేశాడు. కాబట్టి శుబ్‌మన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో లేకుంటే.. రుతురాజ్‌ను తీసుకువస్తే బాగుంటుంది’’ అంటూ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చదవండి: వైభవ్ తుపాన్ ఎలా ఆపేది? -
IPL 2026: ఎనిమిది మంది కెప్టెన్లు ఫిక్స్!.. మరి ఆ రెండు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్‌కు ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అట్టిపెట్టుకునే, విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన పది జట్లు.. వేలానికి సన్నద్ధమయ్యాయి. ఖరీదు అనుకున్న ఆటగాళ్లను ఆక్షన్‌లోకి వదిలి.. తిరిగి తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని కొన్ని ఫ్రాంఛైజీలు భావిస్తుండగా.. భారం అనుకున్న ఆటగాళ్లను మరికొన్ని ఫ్రాంఛైజీలు ట్రేడ్ చేసుకున్నాయి.జడ్డూకు బదులుగా సంజూఇక ట్రేడింగ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన ఒప్పందం హైలైట్‌గా నిలిచింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్‌కు ఇచ్చేసిన సీఎస్కే.. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ ఫ్రాంఛైజీలోకి ఆహ్వానించింది. సంజూ రిటైన్ ధర రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ నుంచి అతడిని చెన్నై ట్రేడ్ చేసుకుంది.రుతురాజ్ గైక్వాడ్‌కే ఓటుఈ నేపథ్యంలో సంజూకు సీఎస్కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగగా.. చెన్నై మాత్రం రుతురాజ్ గైక్వాడ్‌కే ఓటు వేసింది. రిటెన్షన్, రిలీజ్ జాబితా విడుదల చేసిన వెంటనే రుతును తమ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా అదే బాటలో నడువగా.. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలు కూడా తమ పాత కెప్టెన్లనే 2026లోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.ఇంకా సారథిని ప్రకటించని ఆ రెండు జట్లుఅయితే, కెప్టెన్ సంజూను సీఎస్కేకు ట్రేడ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ మాత్రం కొత్త సారథి పేరును ఇంకా ప్రకటించలేదు. మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా తమ కెప్టెన్‌గా అజింక్య రహానేను కొనసాగిస్తారా? లేదా? అన్న విషయం గురించి స్పష్టతనివ్వలేదు. కాగా డిసెంబరు 16న అబుదాబి వేదికగా ఐపీఎల్-2026 మినీ వేలం జరుగనుంది.ఐపీఎల్-2026లో జట్ల కెప్టెన్లు వీరే👑చెన్నై సూపర్ కింగ్స్- రుతురాజ్ గైక్వాడ్👑సన్‌రైజర్స్ హైదరాబాద్- ప్యాట్ కమిన్స్👑గుజరాత్ టైటాన్స్- శుబ్‌మన్ గిల్👑లక్నో సూపర్ జెయింట్స్- రిషభ్ పంత్👑రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రజత్ పాటిదార్👑ఢిల్లీ క్యాపిటల్స్- అక్షర్ పటేల్👑పంజాబ్ కింగ్స్- శ్రేయస్ అయ్యర్👑ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా.చదవండి: వెంకటేశ్ అయ్యర్‌కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్, అంతర్జాతీయ వన్డేలు సహా) అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా-ఏ నిన్న (నవంబర్ 16) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అజేయ అర్ద సెంచరీ (83 బంతుల్లో 68 నాటౌట్) సాధించిన తర్వాత రుతురాజ్ లిస్ట్-ఏ సగటు 57.80కి చేరింది. తద్వారా చతేశ్వర్ పుజారాను (57.01) అధిగమించి లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్‌గా.. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ కంటే ముందు కేవలం ఒకే ఒక ఆటగాడు ఉన్నాడు. ఆస్ట్రేలియా వైట్ బాల్ దిగ్గజం మైఖేల్ బెవాన్ (57.86) మాత్రమే రుతురాజ్ కంటే ముందున్నాడు.లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన టాప్-5 బ్యాటర్లు..మైఖేల్ బెవాన్-57.86 (427 ఇన్నింగ్స్‌లు)రుతురాజ్ గైక్వాడ్-57.80 (85 ఇన్నింగ్స్‌లు)సామ్ హెయిన్-57.76 (64 ఇన్నింగ్స్‌లు)చతేశ్వర్ పుజారా-57.01 (130 ఇన్నింగ్స్‌లు)విరాట్ కోహ్లి-56.66 (339 ఇన్నింగ్స్‌లు)ఇప్పటివరకు కెరీర్లో 85 లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌లు ఆడిన రుతురాజ్ 17 శతకాలు, 18 అర్ద శతకాల సాయంతో 4509 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యధిక స్కోర్ 220 నాటౌట్‌గా ఉంది.భీకర ఫామ్ప్రస్తుతం సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న మూడు అనధికారిక వన్డే సిరీస్‌లో రుతురాజ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. రెండో వన్డేలో అజేయ అర్ద శతకంతో భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అతను.. అంతకుముందు తొలి వన్డేలో అద్భుత శతకం (129 బంతుల్లో 117) బాదాడు. రెండో వన్డేలో గెలుపుతో భారత్, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే నవంబర్ 19న రాజ్‌కోట్‌లో జరుగనుంది. చదవండి: పాక్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికా 'ఎ' తో జరిగిన రెండో అనధికారిక వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ 'ఎ' ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు విలవిల్లాడారు. స్పిన్నర్ నిశాంత్ సింధు 4 వికెట్లు పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా 3, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్‌స్వామి(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) రాణించారు.రుతురాజ్ మెరుపులు.. అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండియా జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 27.5 ఓవర్లలో చేధించింది. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 9 ఫోర్లతో 68) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుథో సిపామ్లా ఒక్కడే వికెట్ సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో అనధికారిక వన్డే రాజ్‌కోట్ వేదికగానే నవంబర్ 19న జరగనుంది.చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్ -
IPL 2026: కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కే
ఐపీఎల్-2026 మినీ వేలానికి (IPL 2026 Auction) ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడేళ్లుగా తమతో ఉన్న రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసింది. జడ్డూకు బదులుగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)ను జట్టులోకి చేర్చుకుంది.ఏకంగా రూ. 18 కోట్లుసంజూ కోసం సీఎస్కే ఏకంగా రూ. 18 కోట్లు చెల్లించగా.. రాయల్స్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడేజాతో పాటు సామ్ కర్రాన్‌ను సీఎస్కే నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇక కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు సీఎస్కే ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.కెప్టెన్ పేరును ప్రకటించిన సీఎస్కేఈ నేపథ్యంలోనే సంజూకు సీఎస్కే కెప్టెన్సీ అప్పగిస్తారనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలకు సీఎస్కే ఫ్రాంఛైజీ స్వయంగా తెరదించింది. రుతురాజ్ గైక్వాడ్నే తమ కెప్టెన్‌గా కొనసాగిస్తామని శనివారం స్పష్టం చేసింది. ‘‘ముందుకు నడిపించే సారథి.. మా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధ్రువీకరించింది.వైస్ కెప్టెన్‌గా?అంతేకాదు.. సంజూను వికెట్ కీపర్‌గానూ ఉపయోగించుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేనట్లే. దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఉండగా.. కీపింగ్ సేవలు వేరే ఎవరి చేతికి ఇచ్చేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి సంజూ సీఎస్కేలో ఓ సాధారణ క్రికెటర్‌గా మాత్రమే ఉంటాడు. అయితే, టాపార్డర్‌లో అతడు కీలక ఆటగాడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రుతుకు డిప్యూటీగా వైస్ కెప్టెన్‌గా నియమితుడైనా ఆశ్చర్యం లేదు.కేవలం నాలుగే గెలిచికాగా గత నాలుగు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ సారథిగా ఉన్న సంజూ.. 2022లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇదిలా ఉంటే.. 2024 సీజన్లో ధోని నుంచి పగ్గాలు అందుకున్న రుతురాజ్ కెప్టెన్‌గా ఇంత వరకు తనదైన ముద్ర వేయలేదు. తాజా ఎడిషన్‌లో గాయం కారణంగా అతడు మధ్యలోనే నిష్క్రమించగా.. మళ్లీ ధోనినే జట్టును ముందుకు నడిపించాడు.అయితే, ఈసారి సీఎస్కే ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివరన పదోస్థానంలో నిలిచింది. అందుకే ఐపీఎల్-2026కు ముందే చాలా మంది ఆటగాళ్లను వదిలించుకున్న సీఎస్కే.. వేలంలో మెరికల్లాంటి ప్లేయర్లను కొనుగోలు చేయాలనే వ్యూహంతో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు (CSK Retention List)రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లుమతీశ పతిరణ, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్దార్థ్, షేక్ రషీద్, కమ్లేశ్ నాగర్కోటి, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్‌కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
రుతురాజ్ సూపర్ సెంచరీ.. భారత్ ఘన విజయం
రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరిగిన తొలి అనధికారిక వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 286 పరుగుల లక్ష్య చేధనలో రుతురాజ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించిన గైక్వాడ్ వికెట్‌కు 64 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.వరుస క్రమంలో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ పెవిలియన్‌కు చేరినప్పటికి.. రుతురాజ్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఈ మహారాష్ట్ర బ్యాటర్ ఆచితూచి ఆడుతూ 110 బంతుల్లో తన 16వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్ 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌతాఫ్రికా చిత్తు..రుతురాజ్‌తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ(39), నితీశ్ కుమార్ రెడ్డి(37), నిషాంత్ సింధు(29) రాణించారు. ఫలితంగా భారత-ఎ జట్టు ప్రోటీస్‌పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 286 పరుగుల లక్ష్యాన్ని ఇండియా-ఎ జట్టు 6 వికెట్లు కోల్పోయి 49.3 ఓవర్లలో చేధించింది.అంతకముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రోటిస్ పోట్గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో), బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.అభిషేక్ ఫెయిల్..కాగా 50 ఓవర్ల ఫార్మాట్లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే 31 పరుగులు చేసి ఔటయ్యాడు. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలచడంలో అతడు విఫలమయ్యాడు. ఈ పంజాబ్ క్రికెటర్ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
భారత జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్‌గా అతడే
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశారు. కంగారూ జట్టుతో మూడు వన్డేల్లో రో‘హిట్’ కాగా.. కోహ్లి మాత్రం తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు.ఆసీస్ టూర్‌కు ముందుఅయితే, మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుత సెంచరీ (121)తో చెలరేగగా.. కోహ్లి భారీ అర్ధ శతకం (73)తో మెరిశాడు. ఇలా హిట్‌మ్యాన్ శతక్కొట్టడం.. కోహ్లి ఫామ్‌లోకి రావడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2027 నాటికి రో- కో జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడాల్సి రావొచ్చని ఆసీస్ టూర్‌కు ముందు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే.ఇక ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్ జట్టుతో వన్డే సిరీస్ సందర్భంగా రో- కో త్వరలోనే మరోసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు.నవంబరు 13, 16 19 తేదీల్లోఇక అంతకంటే ముందు భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్లు అనధికారిక టెస్టు సిరీస్‌తో పాటు.. అనధికారిక వన్డే సిరీస్‌లోనూ పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొలి అనధికారిక టెస్టు ముగియగా.. రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు మ్యాచ్ గెలిచింది.ఈ క్రమంలోనే టెస్టుల తర్వాత నవంబరు 13, 16 19 తేదీల్లో భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్లు అనధికారిక వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ మూడూ డే- నైట్ మ్యాచ్‌లే. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి కూడా భారత్- ‘ఎ’ తరఫున బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా జట్టును ప్రకటించింది.భారత జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరుఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపిక కాగా... రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల పేర్లు లేవు. దీంతో రో-కో ఆటను మరోసారి చూడాలన్న అభిమానుల ఆశలకు గండిపడినట్లయింది. ఇదిలా ఉంటే.. వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన నేపథ్యంలో.. తిలక్ వర్మ ‘ఎ’ జట్టుకు సారథి కాగా.. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు.అదే విధంగా.. ఇషాన్ కిషన్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. టీమిండియా స్టార్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఇందులో భాగం కానున్నారు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డేలకు భారత్- ‘ఎ’ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).చదవండి: నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. అయినా పృథ్వీ షాకు తప్పని భంగపాటు!
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో మహారాష్ట్రతో తన ప్రయాణం మొదలుపెట్టాడు టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw). తొలుత కేరళతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (75)తో సత్తా చాటాడు. తాజాగా చండీగఢ్‌తో మ్యాచ్‌లో మాత్రం పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించాడు. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీచండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పృథ్వీ పరిమితమయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి మహారాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రంజీ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (Fastest Double Century) నమోదు చేశాడు.222 Runs of pure statement. 💥Prithvi Shaw lights up the Ranji stage with a jaw-dropping 222 — his maiden double ton for Maharashtra, laced with 28 fours and 5 sixes against Chandigarh. A knock that screams class, confidence, and comeback. #mca #mcacricket #teammaharashtra… pic.twitter.com/g3vcoropH8— Maharashtra Cricket Association (@MahaCricket) October 28, 2025పృథ్వీ షాకు భంగపాటు!మొత్తంగా 156 బంతుల్లో 222 పరుగులు సాధించిన పృథ్వీ షా.. ఇన్నింగ్స్‌లో 29 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే, అర్జున్ ఆజాద్ బౌలింగ్‌లో నిషాంక్ బిర్లాకు క్యాచ్ ఇవ్వడంతో పృథ్వీ షా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఏదేమైనా డబుల్ సెంచరీతో సత్తా చాటిన పృథ్వీ షాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరిస్తుందని అంతా భావించారు.పృథ్వీ షాకు రుతురాజ్ సర్ప్రైజ్అయితే, పృథ్వీని కాదని.. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (163 బంతుల్లో 116) సాధించిన రుతురాజ్ గైక్వాడ్‌కు ఈ బహుమానం దక్కింది. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రుతు.. పృథ్వీకి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. పృథ్వీని దగ్గరికి పిలిచి అతడితో కలిసి అవార్డును పంచుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియోను మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమిష్టి కృషి, పరస్పర గౌరవం, క్రీడాస్ఫూర్తికి ఇది నిదర్శనం అంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా చండీగఢ్‌పై మహారాష్ట్ర 144 పరుగుల తేడాతో విజయం సాధించింది.Shared Glory, True Spirit 🫡Ruturaj Gaikwad shared his Player of the Match award with Prithvi Shaw, recognising Shaw’s sensational 222-run knock that set up Maharashtra’s victory. A gesture that speaks volumes — teamwork, respect, and mutual excellence at its best.#mca… pic.twitter.com/yMWHsW7Miq— Maharashtra Cricket Association (@MahaCricket) October 28, 2025చండీగఢ్ వర్సెస్ మహారాష్ట్ర సంక్షిప్త స్కోర్లు👉మహారాష్ట్ర: 313 & 359/3 డిక్లేర్డ్👉చండీగఢ్ : 209 &319👉ఫలితం: చండీగఢ్‌పై 144 పరుగుల తేడాతో మహారాష్ట్ర గెలుపు.. మహారాష్ట్రకు ఆరు పాయింట్లు.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్? -
శతక్కొట్టిన ఇషాన్ కిషన్
రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) భాగంగా తమిళనాడుతో ఇవాళ (అక్టోబర్ 15) మొదలైన మ్యాచ్‌లో జార్ఖండ్ ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ కూడా అయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ 137 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.75 ఓవర్ల తర్వాత జార్ఖండ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 251 పరుగులుగా ఉంది. ఇషాన్‌కు జతగా సాహిల్ రాజ్ (33) క్రీజ్‌లో ఉన్నాడు. జార్ఖండ్ ఇన్నింగ్స్‌లో శిఖర్ మోహన్ 10, శరన్‌దీప్ సింగ్ 48, కుమార్ సూరజ్ 3, విరాట్ సింగ్ 28, కుమార్ కుషాగ్రా 11, అనుకూల్ రాయ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 3, డీటీ చంద్రశేఖర్ 2, సందీప్ వారియర్ ఓ వికెట్ పడగొట్టాడు.కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 16 మ్యాచ్‌లు జరుగతున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇషాన్ కిషన్‌దే మొదటి శతకం. వేర్వేరు మ్యాచ్‌ల్లో టీమిండియా ఆటగాళ్లు దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal), రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సెంచరీలకు చేరువై ఔటాయ్యరు. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్ (కర్ణాటక) 96 పరుగుల వద్ద ఔటాయ్యడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ (మహారాష్ట్ర) 9 పరుగుల తేడాతో అత్యంత అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ తన జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు (18/5) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సెంచరీతో కదంతొక్కిన టీమిండియా మాజీ వికెట్కీపర్ఉత్తర్ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మాజీ వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్ (Srikar bharat) (ఆంధ్రప్రదేశ్) సెంచరీతో కదంతొక్కాడు. 213 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షేక్ రషీద్ (69) క్రీజ్‌లో ఉన్నాడు. 73 ఓవర్ల తర్వాత ఆంధ్ర స్కోర్ 235/1గా ఉంది.చదవండి: దుమ్మురేపిన రషీద్ ఖాన్ -
పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్‌దీ అదే దారి
రంజీ ట్రోఫీ తాజా సీజన్ తొలి మ్యాచ్‌లోనే మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw)కు చేదు అనుభవం ఎదురైంది. కేరళతో బుధవారం మొదలైన మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న పృథ్వీ.. పరుగుల ఖాతా తెరవకుండానే నిధీశ్ (Nidheesh) బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.మహారాష్ట్ర Vs కేరళ ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji Trophy) 91వ ఎడిషన్‌కు బుధవారం తెరలేచింది. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-బిలోని మహారాష్ట్ర- కేరళ మధ్య తిరువనంతపురం వేదికగా మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్‌దీ అదే దారిఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఊహించని రీతిలో వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యాడు. అర్షిన్ బాసిల్ బౌలింగ్‌లో కణ్ణుమ్మల్కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ గోల్డెన్ డకౌట్ కాగా.. సిద్ధేశ్.. నిధీశ్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే అజారుద్దీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఖాతా తెరిచిన రుతువీరితో పాటు కెప్టెన్ అంకిత్ బావ్నే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అయితే, ఏడు బంతుల పాటు క్రీజులో నిలిచిన అతడు బాసిల్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 25 బంతులు ఎదుర్కొన్న తర్వాత కానీ పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. పది ఓవర్ల ఆట ముగిసే సరికి రుతు 28 బంతుల్లో ఒక పరుగు చేయగా.. సౌరభ్ నవాలే 20 బంతుల్లో 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మొత్తానికి తొలిరోజు పది ఓవర్ల ఆటలో కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 16 పరుగులే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వరుస సెంచరీల తర్వాతకాగా కెరీర్ ఆరంభం నుంచి ముంబైకి ఆడిన పృథ్వీ షా.. ఈ ఏడాది మహారాష్ట్రకు మారాడు. ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ రెడ్‌బాల్ టోర్నీలో, ముంబైతో వార్మప్ మ్యాచ్‌లో సెంచరీలతో అలరించిన పృథ్వీ.. అసలైన పోరులో మాత్రం ఆదిలోనే తుస్సుమనిపించాడు.రంజీ ట్రోఫీ-2025: మహారాష్ట్ర వర్సెస్ కేరళ తుదిజట్లుమహారాష్ట్రఅంకిత్ బావ్నే (కెప్టెన్), పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, రజనీశ్ గుర్బానీ, విక్కీ ఓస్త్వాల్, సిద్ధేష్ వీర్, ముఖేష్ చౌదరి, అర్షిన్ కులకర్ణి, రామకృష్ణ ఘోష్.కేరళమహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్, వికెట్ కీపర్), బాబా అపరాజిత్, సంజూ శాంసన్, సచిన్ బేబీ, ఎండీ నిధీశ్, అక్షయ్ చంద్రన్, రోహన్ కుణ్ణుమ్మల్, అంకిత్ శర్మ, ఈడెన్ యాపిల్ టామ్, నెడుమాన్కులి బాసిల్, సల్మాన్ నిజార్.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ -
224 పరుగుల ఆధిక్యంలో...
నాగ్‌పూర్ వేదికగా ఇరానీ కప్ (Irani Cup 2025) మ్యాచ్‌పై విదర్భ జట్టు పట్టు బిగించింది. రెస్టాఫ్ ఇండియా (Vidarbha vs Rest of India)తో జరుగుతున్న ఈ పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ ఓవరాల్‌గా 224 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం విదర్భ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. సెంచరీ హీరో ఈసారి ఫెయిల్దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో చాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టు... ఇరానీ కప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అథర్వ తైడె (15), అమన్ (37) అవుట్ కాగా... ధ్రువ్ షోరె (Dhruv Shorey- 60 బంతుల్లో 24 బ్యాటింగ్; 1 ఫోర్), దానిశ్ మాలేవర్ (37 బంతుల్లో 16 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. లక్ష్యం ఎంతో?రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ చెరో వికెట్ పడగొట్టారు. వర్షం కారణంగా మూడో రోజు కూడా ఆటకు ఆటంకం వాటిల్లింది. మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా... 8 వికెట్లు చేతిలో ఉన్న విదర్భ జట్టు... ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి. అంతకుముందు విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 69.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రజత్ పాటీదార్ (125 బంతుల్లో 66; 10 ఫోర్లు), అభిమన్యు ఈశ్వరన్ (112 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1), మానవ్ సుతార్ (1) విఫలమవడంతో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు చేయలేకపోయింది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా... హర్ష్ దూబే, పార్థ్ చెరో 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 342; రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: అభిమన్యు (ఎల్బీ) (బి) పార్థ్ 52; ఆర్యాన్ జుయెల్ (ఎల్బీ) (బి) దర్శన్ 23; యశ్ ధుల్ (స్టంప్డ్) వాడ్కర్ (బి) హర్శ్ దూబే 11; రజత్ పాటీదార్ (సి) రాథోడ్ (బి) హర్శ్ దూబే 66; రుతురాజ్ గైక్వాడ్ (సి) రాథోడ్ (బి) యశ్ ఠాకూర్ 9; ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) పార్థ్ 1; మానవ్ సుతార్ (ఎల్బీ) (బి) యశ్ ఠాకూక్ 10; ఆకాశ్‌దీప్ (సి) అథర్వ (బి) యశ్ ఠాకూర్ 14; అన్షుల్ కంబోజ్ (నాటౌట్) 10; గుర్నూర్ బ్రార్ (సి) దూబే (బి) యశ్ ఠాకూర్ 13; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (69.5 ఓవర్లలో ఆలౌట్) 214.వికెట్ల పతనం: 1–52, 2–73, 3–105, 4–119, 5–124, 6–142, 7–175, 8–191, 9–191, 10–214. బౌలింగ్: హర్శ్ దూబే 22–5–58–2; ఆదిత్య ఠాకరే 11–1–40–1; దర్శన్ నల్కండే 8–1–26–1; యశ్ ఠాకూర్ 16.5–3–66–4; పార్థ్ రెఖడే 12–3–24–2. విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ తైడె (సి) ఆకాశ్‌దీప్ (బి) మానవ్ సుతార్ 15; అమన్ (సి) ఇషాన్ కిషన్ (బి) గుర్నూర్ బ్రార్ 37; ధ్రువ్ షోరె (బ్యాటింగ్) 24; దానిశ్ మాలేవార్ (బ్యాటింగ్) 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (36 ఓవర్లలో 2 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–42, 2–64. బౌలింగ్: సారాంశ్ జైన్ 9–0–28–0; ఆకాశ్‌దీప్ 3–1–4–0; మానవ్ సుతార్ 14–1–35–1; అన్షుల్ కంబోజ్ 4–0–14–0; గుర్నూర్ బ్రార్ 6–2–11–1. చదవండి: IND vs WI 1st Test: ముగ్గురు సెంచరీలు.. భారీ ఆధిక్యంలో భారత్.. -
ఆసియా కప్ జట్టులో నో ప్లేస్.. సత్తా చాటిన యశస్వి జైస్వాల్
ఆసియా కప్ 2025 ప్రధాన జట్టులో (స్టాండ్‌బైగా ఎంపిక) చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దులీప్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఈ టోర్నీలో వెస్ట్ జోన్‌కు ఆడుతున్న జైస్వాల్.. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో రాణించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా (4).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మెరుపు అర్ద సెంచరీతో (70 బంతుల్లో 64; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు.రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ రాణించినా అతని జట్టు చేతుల్లో నుంచి మ్యాచ్ జారిపోయేలా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించారు. ఒక వేళ మ్యాచ్ డ్రా అయిన పక్షంలో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. అదే జరిగితే సెంట్రల్ జోన్ ఫైనల్స్‌కు చేరుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన సెంట్రల్ జోన్ 162 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్.. రుతురాజ్ గైక్వాడ్ (184) భారీ సెంచరీతో కదంతొక్కడంతో 438 పరుగులు చేసింది. తనుశ్ కోటియన్ (76), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయకపోయినా 600 పరుగుల భారీ స్కోర్ చేసింది. దనిశ్ మాలేవార్ (76), షుభమ్ శర్మ (96), కెప్టెన్ రజత్ పాటిదార్ (77), ఉపేంద్ర యాదవ్ (87), హర్ష్ దూబే (75), సరాన్ష్ జైన్ (63 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.162 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రుతురాజ్ (16) విఫలం కాగా.. తనుశ్ కోటియన్ (1), షమ్స్ ములానీ (1) క్రీజ్‌లో ఉన్నారు. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు వెస్ట్ జోన్ ఇంకా 30 పరుగులు వెనుకపడి ఉంది. -
భారీ శతకాలతో చెలరేగిన రుతురాజ్, జగదీశన్.. పడిక్కల్ ఫిఫ్టీ
బెంగళూరు: రుతురాజ్ గైక్వాడ్ (206 బంతుల్లో 184; 25 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత శతకం సాధించడంతో వెస్ట్‌జోన్ భారీస్కోరు సాధించింది. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్‌తో గురువారం మొదలైన సెమీఫైనల్లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 6 వికెట్లకు 363 పరుగులు చేసింది. తనుశ్ కొటియాన్ (121 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు) రాణించాడు. సెంట్రల్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, సారాంశ్ జైన్ చెరో 2 వికెట్లు తీశారు. గత నెలలో జరిగిన బుచి్చబాబు టోర్నీలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన పోరులో మహారాష్ట్ర తరఫున చెలరేగి సెంచరీ బాదిన రుతురాజ్ ఇక్కడి బీసీసీఐ ఎక్సలెన్సీ గ్రౌండ్లోనూ అదే జోరు కొనసాగించాడు. 4/1... 10/2! బ్యాటింగ్‌కు దిగగానే వెస్ట్‌జోన్ కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మొదలైన ఓవర్లోనే 4 పరుగుల స్కోరు వద్దే కీలకమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) వికెట్‌ను కోల్పోయింది. దీన్నుంచి తేరుకోకముందే మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (1) కూడా వికెట్‌ను అప్పగించడంతో 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వెస్ట్ కష్టాల్లో కూరుకుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రుతురాజ్ ఆడిన ఆట, చేసిన పరుగులు, పాతుకుపోయిన భాగస్వామ్యాలతో వెస్ట్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. ముందుగా వన్‌డౌన్ బ్యాటర్ ఆర్య దేశాయ్ (39; 6 ఫోర్లు)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. చూడచక్కని బౌండరీలతో గైక్వాడ్ పరుగులు రాబట్టాడు. జట్టు స్కోరు 100కు ముందు 92 పరుగుల వద్ద ఆర్య అవుటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 25; 4 ఫోర్లు) బాధ్యత కనబరచలేకపోయాడు. క్రీజులోకి రాగానే అవుటయ్యే ప్రమాదం నుంచి బయట పడినప్పటికీ మరెంతో సేపు క్రీజులో నిలువలేదు. కుదురుగా ఆడుతున్న రుతురాజ్‌కు సహకారం అందించాల్సిన చోట నిర్లక్ష్యంగా 137 స్కోరు వద్ద అతనూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. తనుశ్ అండతో... రెండో సెషన్లో షమ్స్ ములానీ (18; 3 ఫోర్లు) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఈ దశలో క్రీజులోకి వచి్చన తనుశ్ కొటియాన్ అండతో గైక్వాడ్ బ్యాటింగ్ జోరుగా సాగింది. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడమే కాదు... పరుగుల్ని కూడా చకచకా రాబట్టారు. ఈ క్రమంలోనే రుతురాజ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం తర్వాత అతను వన్డేను తలపించే ఆటతీరుతో అలరించడంతో పరుగుల వేగం అనూహ్యంగా పుంజుకుంది. జట్టు స్కోరు 300 పైచిలుకు దాటింది. ఇక డబుల్ సెంచరీ ఖాయమనుకున్న దశలో రుతురాజ్‌ను సారాంశ్ అవుట్ చేశాడు. దీంతో ఆరో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ (50 బంతుల్లో 24 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులోకి రాగా నింపాదిగా ఆడుతున్న తనుశ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇద్దరు నాటౌట్‌గా నిలిచారు. రాణించిన పడిక్కల్, తన్మయ్టాపార్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడటంతో సౌత్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీ సెమీస్ పోరును సాధికారికంగా ప్రారంభించింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (260 బంతుల్లో 148 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దులీప్ ట్రోఫీలో నార్త్‌జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ తొలిరోజు ఆట నిలిచే సమయానికి తొలిఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 57; 7 ఫోర్లు), తన్మయ్ అగర్వాల్ (99 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు 2, అన్షుశ్ కంబోజ్ ఒక వికెట్ తీశారు. ఓపెనర్ల శుభారంభం టాస్ నెగ్గిన నార్త్‌జోన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సౌత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, జగదీశన్ చక్కని ఆరంభమిచ్చారు. ఇద్దరు చక్కని సమన్వయంతో పరుగులు సాధించారు. టీమిండియాతో కలిసి ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన నారాయణ్ జగదీశన్‌కు తుదిజట్టుకు ఆడే అవకాశం లభించలేదు. అయితే దేశవాళీ క్రికెట్లో తన బ్యాటింగ్ జోరును కనబరచడం ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్శించే ప్రయత్నం చేశాడు. తన్మయ్‌తో కలిసి నార్త్‌జోన్ బౌలర్లను అవలీలగా ఎదుర్కోన్నాడు.ఓపెనర్లిద్దరూ పాతుకుపోవడంతో నార్త్‌జోన్‌కు తొలిసెషన్లో కష్టాలు తప్పలేదు. చూస్తుండగానే జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. ఎట్టకేలకు జట్టు స్కోరు 103 పరుగుల వద్ద తన్మయ్ నిష్క్రమించడంతో తొలివికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. పడిక్కల్ ఫిఫ్టీ తొలి వికెట్ తీసిన ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్, జగదీశన్ పరుగులు చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అనవసర షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్‌తో జట్టు స్కోరును నడిపించారు. క్రీజులో కుదురుకున్నాక పడిక్కల్ అడపాదడపా బౌండరీలతో అలరించాడు. దీంతో నార్త్ కష్టాలు కాస్త మళ్లీ మొదటికొచ్చాయి. ఇటు పరుగుల్ని ఆపలేక... అటు వికెట్లను పడగొట్టలేక నార్త్‌జోన్ బౌలర్లు రోజంతా ఆపసోపాలు పడ్డారు.ఇక దేవదత్ అర్ధసెంచరీ సాధించగా, నారాయణ్ జగదీశన్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 200 పైచిలుకు దాటాకా పడిక్కల్‌ను అన్షుల్ కాంబోజ్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన మోహిత్ (15) తక్కువ స్కోరుకే పరిమితం కాగా... కెప్టెన్ అజారుద్దీన్ (11 బ్యాటింగ్), ఓపెనర్ జగదీశన్లు మళ్లీ మరో వికెట్ అవకాశాన్ని ఇవ్వకుండా రోజును ముగించారు. చేతిలో ఇంకా ఏడు వికెట్లున్న సౌత్‌జోన్ భారీస్కోరు దిశగా పయనిస్తోంది.చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్ -
సెంచరీతో కదం తొక్కిన రుతురాజ్ గైక్వాడ్..
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జాతీయ సెలక్టర్లకు సవాలు విసిరాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్ 2లో వెస్ట్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్.. అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట రుతురాజ్ సత్తాచాటాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన తమ జట్టును రుతురాజ్ తన ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ 131 బంతుల్లో 13 ఫోర్లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మహారాష్ట్ర ఆటగాడు 157 బంతుల్లో 120 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 58 ఓవర్లు ముగిసే సరికి వెస్ట్ జోన్ 5 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. క్రీజులో రుతుతో పాటు తనీష్ కొటియన్(26) ఉన్నాడు.గైక్వాడ్ టెస్టుల్లో ఎంట్రీ ఇస్తాడా?టీమిండియా తరపున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన రుతురాజ్ గైక్వాడ్ .. టెస్టు డెబ్యూ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికి గైక్వాడ్‌కు ఒక్కసారి కూడా భారత టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటిలో గైక్వాడ్ టెస్టుల్లో ఆడే సూచనలు కన్పించడం లేదు. ఎందుకంటే ఓపెనర్లగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ తమ స్ధానాలను సుస్థిరం చేసుకోగా.. మూడు, నాలుగు స్ధానాలు ప్రస్తుతానికి ఖాళీ లేవు. మూడో స్ధానంలో సాయిసుదర్శన్ వస్తుండగా.. నాలుగో ప్లేస్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సాయిసుదర్శన్, కరుణ్ నాయర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఒకవేళ ఆ స్ధానాన్ని మరో ఆటగాడికి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తే రుతురాజ్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి సెలక్టర్లు ఎటువంటి అనుహ్య నిర్ణయాలు తీసుకోపోవచ్చు. కాగా వెస్టిండీస్-భారత్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. -
విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. వీడియో
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో మెరిశాడు. హిమాచల్ ప్రదేశ్‌తో ఇవాళ (ఆగస్ట్ 26) ప్రారంభమైన మ్యాచ్‌లో 144 బంతుల్లో 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రుతురాజ్ బాదిన నాలుగు సిక్సర్లు వరుస బంతుల్లో బాదినవి కావడం విశేషం. అమన్ జైన్వాల్ అనే బౌలర్ వేసిన ఓ ఓవర్లో రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. రుతురాజ్ వరుస సిక్సర్లు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.6,6,6,6 BY RUTURAJ GAIKWAD IN A SINGLE OVER IN BUCHI BABU...!!!! 😍🔥 pic.twitter.com/LhoA6JKKiQ— Johns. (@CricCrazyJohns) August 26, 2025ఈ వీడియో చూసి సీఎస్కే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రుతురాజ్ గత ఐపీఎల్ సీజన్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సీఎస్కే ఫ్యాన్స్‌కు ఆ సీజన్లో రుతురాజ్ మెరుపులు మిస్ అయ్యారు. తమ కెప్టెన్ టచ్‌లోకి రావడంతో వారి ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.హిమాచల్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ క్లాసికల్ సెంచరీ బాది తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. మరో సెంచరీ వీరుడు అర్షిన్ కులకర్ణితో (146) కలిసి 220 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్.. ఆతర్వాత ఎదుర్కొన్న 22 బంతుల్లో 33 పరుగులు చేశాడు.రుతురాజ్ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భారత-ఏ జట్టుకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశాలు రాలేదు. అనంతరం రుతు ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ ఆడేందుకు యార్క్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నా, వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. బుచ్చిబాబు టోర్నీలో రుతురాజ్ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఛత్తీస్ఘడ్పై 1, 11 పరుగులు మాత్రమే చేశాడు.రుతురాజ్ త్వరలో దులీప్ ట్రోఫీలో కనిపించనున్నాడు. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి చాలా మంది టీమిండియా స్టార్లతో కలిసి వెస్ట్ జోన్‌కు ఆడనున్నాడు. -
సెంచరీతో కదంతొక్కిన రుతురాజ్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దేశవాలీ సీజన్‌ను ఘనంగా ప్రారంభించాడు. బుచ్చిబాబు టోర్నీలో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఇవాళ (ఆగస్ట్ 26) హిమాచల్ ప్రదేశ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రుతురాజ్ ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేశాడు. తనలోని క్లాస్‌ను మరోసారి అభిమానులకు రుచి చూపించాడు. మహారాష్ట్ర ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌తో పాటు అర్షిన్ కులకర్ణి కూడా సెంచరీతో మెరిశాడు. ఇటీవలే ముంబై నుంచి మహారాష్ట్రకు వలస పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి స్కోర్ వివరాలు తెలియరాలేదు.కాగా, బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నైలోని వివిధ వేదికల్లో జరుగుతుంది. ఈ టోర్నీ మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడి పోటీపడుతున్నాయి. ప్రతి గ్రూపులో టాప్‌లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.ఈ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ముంబై తరఫున సర్ఫరాజ్ ఖాన్, పంజాబ్ తరఫున రమన్‌దీప్ సింగ్, మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా సెంచరీలతో మెరిశారు.ఇదిలా ఉంటే, ఈ సీజన్ బుచ్చిబాబు టోర్నీ దులీప్ ట్రోఫీ షెడ్యూల్‌తో క్లాష్ అవుతుంది. ఈ టోర్నీ ఆఖరి రోజు దులీప్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. దులీప్ ట్రోఫీ ఆడుతున్న ఆటగాళ్లు బుచ్చిబాబు టోర్నీ చివరి రౌండ్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నారు. దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 28 నుంచి మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ తలపడనున్నాయి. అదే రోజు సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ కూడా పోటీపడనున్నాయి. సౌత్ జోన్, వెస్ట్ జోన్ నేరుగా సెమీస్‌కు అర్హత సాధించాయి.నార్త్ జోన్‌కు అంకిత్ కుమార్ సారథ్యం వహించనుండగా.. సౌత్ జోన్‌కు తిలక్ వర్మ, సెంట్రల్ జోన్‌కు ధృవ్ జురెల్, వెస్ట్ జోన్‌కు శార్దూల్ ఠాకూర్, ఈస్ట్ జోన్‌కు అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నీలో రియాన్ పరాగ్, మొహమ్మద్ షమీ, ఆకాశ్‌దీప్, ముకేశ్ కుమార్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, దేవదత్ పడిక్కల్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ లాంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రెడ్డికి చోటు
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం (ఆగష్టు 19)న తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే, ఇందులో మిడిల్ ఆర్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మాత్రం చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే.అదే విధంగా.. ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను సెలక్టర్లు ప్రధాన జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శల వర్షం కురుస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసియా కప్-2025 టోర్నీకి తన ప్రత్యామ్నాయ జట్టును ప్రకటించాడు.ప్రత్యామ్నాయ జట్టు ఇదే.. సారథిగా శ్రేయస్ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్న ఆకాశ్ చోప్రా.. వైస్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఈ సందర్భంగా.. ‘‘యశస్వి జైస్వాల్‌తో మనం మొదలుపెడదాం. ఆసియా కప్‌నకు బీసీసీఐ ప్రకటించిన ప్రధాన జట్టులో ఈ పేరు ఉండాల్సింది.టీ20 ప్రపంచకప్-2026 నాటికి అతడు జట్టులో భాగమైతే బాగుంటుంది. ఇక రుతురాజ్ గైక్వాడ్. ఆస్ట్రేలియాతో గువాహటి మ్యాచ్‌లో అతడు సెంచరీ చేశాడు. జట్టుకు అతడే వైస్ కెప్టెన్. ఐపీఎల్-2025 సందర్భంగా అతడు గాయపడ్డాడు.మూడో స్థానంలో కేఎల్ రాహుల్ఏదేమైనా నిలకడగా రాణించే కొద్ది మంది ఆటగాళ్లలో రుతు ఒకడు. కానీ అతడి పేరే బీసీసీఐ పరిశీలనలో లేకుండా పోయింది. ఓపెనర్లుగా జైసూ, రుతు ఉంటారు. ఇక మూడో స్థానంలో కేఎల్ రాహుల్ ఉంటే బాగుంటుంది.అతడు ఇన్నింగ్స్ ఆరంభించగలడు.. మూడో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు. వేగంగా ఆడమన్నా.. వికెట్లు పడకుండా జాగ్రత్త పడమని చెప్పినా.. రెండూ చేస్తాడు. అంతేకాదు.. వికెట్ కీపర్‌గానూ సేవలు అందించగలడు. కానీ ఎందుకో అతడూ పక్కకు వెళ్లిపోయాడు.వికెట్ కీపర్‌గా పంత్నా జట్టులో నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తాడు. అంతేకాదు.. కెప్టెన్ కూడా అతడే!.. ఇక ఐదో స్థానంలో రిషభ్ పంత్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉంటాడు. నంబర్ 6 ప్లేయర్‌గా హార్దిక్ పాండ్యా బదులు నితీశ్ కుమార్ రెడ్డి వస్తాడు.ఏడు, ఎనిమిది స్థానాల్లో కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌లను నేను ఆడిస్తాను. వాషీ బౌలింగ్ చేస్తాడు.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు కూడా పనికివస్తాడు. ఐపీఎల్లో ఈ ఏడాది సత్తా చాటిన కృనాల్ పాండ్యాను కూడా నా జట్టులో తప్పక చేర్చాలి కదా!ఇక రవి బిష్ణోయి.. అతడు తొమ్మిదో నంబర్ ప్లేయర్. ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తర్వాతి స్థానాల్లో వస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన తుది జట్టులోని ఆటగాళ్ల పేర్లు వెల్లడించాడు. వీరితో పాటు సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ఖలీల్ అహ్మద్‌లకు తన ప్రధాన జట్టులో ఆకాశ్ చోప్రా చోటిచ్చాడు.ఆసియా కప్-2025 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.ఆసియా కప్-2025 టోర్నీకి ఆకాశ్ చోప్రా ఆల్టర్నేటివ్ తుదిజట్టుయశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.చదవండి: ఆసియా కప్-2025: వాళిద్దరిని ఎందుకు ఎంపిక చేయలేదు? -
Prithvi Shaw: తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలం
బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ 2025లో సంచలనం నమోదైంది. పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్ లాంటి స్టార్లు ఉన్న మహారాష్ట్రను చిన్న జట్టు ఛత్తీస్‌ఘడ్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌ఘడ్ సంజీత్ దేశాయ్ (93) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. శుభమ్ అగర్వాల్, అవ్నీశ్ సింగ్ ధలీవాల్ ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో విక్కీ ఓస్త్వాల్, హితేశ్ వలుంజ్ తలో 3 వికెట్లు తీశారు.అరంగేట్రంలోనే మెరుపు సెంచరీ చేసిన పృథ్వీ షాఅనంతరం బరిలోకి దిగిన మహారాష్ట్ర.. అరంగేట్రం ఆటగాడు పృథ్వీ షా మెరుపు సెంచరీతో (111) ఆదుకోవడంతో 217 పరుగులు చేయగలిగింది. షా రాణించినా మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ఛత్తీస్‌ఘడ్‌కు 35 పరుగులు కీలక ఆధిక్యం లభించింది. దేశవాలీ క్రికెట్లో ముంబై తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో షా మహారాష్ట్రకు మారిన విషయం తెలిసిందే.చెలరేగిన మహా బౌలర్లు35 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్‌ఘడ్.. మహారాష్ట్ర బౌలర్లు విక్కీ ఓస్త్వాల్, హితేశ్ వలుంజ్ (థలో 5 వికెట్లు తీశారు) ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది.ఘోరంగా విఫలమైన షా, రుతురాజ్అనంతరం 185 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన మహారాష్ట్ర అనూహ్యంగా 149 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పృథ్వీ షా రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. బావ్నే ఒంటరిపోరాటం వృధాకెప్టెన్ అంకిత్ బావ్నే ఒంటరిపోరాటం (66) చేసినా మహారాష్ట్రను గెలిపించలేకపోయాడు. 36 పరుగుల తేడాతో ఛత్తీస్‌ఘడ్ మహారాష్ట్రను ఓడించింది. శుభమ్ అగ్రవాల్ మహారాష్ట్రను దెబ్బేశాడు. -
శతక్కొట్టిన పృథ్వీ షా.. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదంటూ..
టీమిండియా ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) కాంపిటేటివ్ క్రికెట్ పునరాగమనంలో అదరగొట్టాడు. చెన్నై వేదికగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ అరంగేట్ర పోరులో సెంచరీ (141 బంతుల్లో 111; 15 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించాడు. ఈ సందర్భంగా పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా 2021లో టీమిండియా తరఫున చివరిగా ఆడిన ఈ ముంబై బ్యాటర్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.వేటు వేసిన ముంబై సెలక్టర్లుక్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి, అధిక బరువు తదితర కారణాల వల్ల దేశవాళీ క్రికెట్‌కూ పృథ్వీ దూరమయ్యాడు. ముంబై సెలక్టర్లు కీలక మ్యాచ్‌ల నుంచి అతడిని తప్పించడంతో పృథ్వీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో కూడా అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్‌కు సరైన వారసుడిగా కీర్తించబడిన పృథ్వీ కెరీర్.. అంతే వేగంగా పతనమైంది.ఆదరించిన మహారాష్ట్ర ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్లో ముంబై నుంచి మహారాష్ట్ర (Maharashtra) జట్టుకు మారిన పృథ్వీ షా.. కొత్త ప్రయాణంలో శుభారంభం అందుకున్నాడు. బుచ్చిబాబు రెడ్ బాల్ ఈ టోర్నీలో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా... ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో ‘శత’క్కొట్టాడు. ఛత్తీస్‌గఢ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ కాగా... అనంతరం మహారాష్ట్ర జట్టు 73 ఓవర్లలో 217 పరుగులు చేసింది.ఇన్నింగ్స్ ప్రారంభించిన పృథ్వీ షా సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. రుతురాజ్ గైక్వాడ్ (1) విఫలమయ్యాడు. వికెట్ కీపర్ సౌరభ్ (50 నాటౌట్; 5 ఫోర్లు) అండతో పృథ్వీ షా జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చత్తీస్‌గఢ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదుఇక సెంచరీ చేసిన అనంతరం పృథ్వీ షా తన మనసులోని ఆవేదనను పంచుకున్నాడు. ‘‘నేను బాగున్నాను. నిజంగానే బాగున్నా. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. మరేం పర్లేదు. ఇంతకు ముందు కూడా నాకు ఇలాగే జరిగింది.ఎవరూ లేకపోయినా.. నా కుటుంబం నాకు మద్దతుగా ఉంది. మానసికంగా నేను కుంగిపోయినపుడు నా స్నేహితులు నాతోనే ఉన్నారు. అయితే, మరికొందరు మాత్రం తమ తమ పనులతో బిజీ అయిపోయారు. వాళ్లకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా!.. ఎవరి పని వాళ్లది.నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువనాకు సాయంగా రాలేదని వారిని నేను తప్పుబట్టను. ఏం చేసినా ఒంటరిగానే చేయాలి.. నన్ను నేను నిరూపించుకోవాలి అని గట్టిగా అనుకున్నాను. నిజానికి నాకు అదే మంచిది కూడా!జీవితంలో ఇప్పటికే ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ఒకసారి ఉన్నత శిఖరాలు.. మరోసారి అధఃపాతాళం. అయినా నేను తిరిగి పుంజుకున్నాను. కాబట్టి అసాధ్యమనేది ఏదీ ఉండదని నమ్ముతాను.నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. పనిపట్ల అంకిత భావం ఉంది. ఈ సీజన్లో నేను, నా జట్టు గొప్పగా రాణిస్తుందనే నమ్మకంతో ఉన్నా’’ అంటూ పృథ్వీ షా తన విమర్శకులకు కౌంటర్ ఇస్తూనే.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతానని పేర్కొన్నాడు.చదవండి: అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్.. కానీ ఇప్పుడు: అగార్కర్ -
కెప్టెన్‌గా రుతురాజ్‌పై వేటు.. జట్టులో పృథ్వీషాకు చోటు
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మహారాష్ట్ర తరపున అరంగేట్రం చేసేందుకు టీమిండియా ఆటగాడు, ముంబై మాజీ ఓపెనర్ పృథ్వీ షా సిద్దమవుతున్నాడు. బుచ్చి బాబు మల్టీ-డే టోర్నమెంట్ 2025 కోసం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.ఈ జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కింది. 25 ఏళ్ల పృథ్వీ షా ఇటీవలే ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో తెగదింపులు చేసుకుని మహారాష్ట్రకు తన మకాంను మార్చాడు. ఇక బుచ్చి బాబు టోర్నీ కోసం మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా అంకిత్ బావ్నేను సెలక్టర్లు నియమించారు. మహారాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని బావ్నేకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. గత రంజీ సీజన్లో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గైర్హజరీలో బావ్నేనే జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహారాష్ట్ర తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్లలో రెండో ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అయితే సెలక్టర్లు గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడం వెనక ఓ కారణముంది. ఈ భారత ఓపెనర్ 2025-26 దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టుకు సెలక్ట్ చేశారు. ఆగస్టు 28న దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుందున, బుచ్చిబాబు టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు రుతు అందుబాటులో ఉండడు. అందుకే బావ్నే కెప్టెన్‌గా నియమించారు.ఈ ఏడాది బుచ్చిబాబు టోర్నీ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 18 నుండి 20 వరకు గురునానక్ కళాశాల మైదానంలో ఛత్తీస్‌గఢ్‌తో తలపడనుంది.మహారాష్ట్ర జట్టుఅంకిత్ బావ్నే (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సిద్ధేష్ వీర్, సచిన్ దాస్, అర్షిన్ కులకర్ణి, హర్షల్ కేట్, సిద్ధార్థ్ మ్హత్రే, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), మందార్ భండారి, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ దాధే, ప్రదీప్ దద్దే, ప్రదీప్ దద్దే సోలంకి, రాజవర్ధన్ హంగర్గేకర్ -
సంజూకు బదులు జడ్డూ, రుతురాజ్.. సీఎస్కే నిర్ణయం ఇదే..!
ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో సంజూ శాంసన్ ట్రేడ్ డీల్‌కు సంబంధించిన అంశం హాట్‌హాట్‌గా నడుస్తుంది. సంజూ రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో సీఎస్కే అతన్ని ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ట్రేడ్ డీల్‌లో భాగంగా రాయల్స్ సంజూకు బదులు సీఎస్కేకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లను అడిగినట్లు సమాచారం. కొంత నగదుతో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లేదా శివమ్ దూబేలలో ఎవరో ఒకరిని డిమాండ్ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ డీల్‌కు సీఎస్కే యాజమాన్యం ససేమిరా అనిందని క్రిక్‌బజ్ పేర్కొంది.సంజూకు బదులు నగదు డీల్ జరుగుతుందే కానీ, తమ ఆటగాళ్లలో ఏ ఒక్కరిని వదులుకునేది లేదని సీఎస్కే రాయల్స్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ రాయల్స్, సీఎస్కే మధ్య డీల్ కుదరకపోతే సంజూను ట్రేడ్ డీల్ ద్వారా దక్కించుకునేందుకు వేరే ఫ్రాంచైజీలు కూడా పోటీపడవచ్చు. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోతే సంజూ ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం 2027 సీజన్ వరకు రాయల్స్‌తోనే కొనసాగాల్సి వస్తుంది.సీఎస్కేకు వెళ్లాలన్నది సంజూ వ్యక్తిగత ఆప్షన్‌గా తెలుస్తుంది. రాయల్స్‌లో ఇమడలేకపోవడంతో అతను సీఎస్కే వైపు చూస్తున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీ మారాలనుకున్న విషయాన్ని సంజూ చాలా గోప్యంగా ఉంచుతూనే లోలోపల పావులు కదుపుతున్నట్లు వినికిడి. మొత్తానికి సంజూ తమతో అసౌకర్యంగా ఉన్నాడన్న విషయాన్ని రాయల్స్ యాజమాన్యం గ్రహించింది. సంజూ నిర్ణయాన్ని ఫ్రాంచైజీ గౌరవించే అవకాశం ఉంది. ఏ ఫ్రాంచైజీతో ట్రేడ్ డీల్ కుదరకపోతే సంజూను వేలానికి వదిలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే సంజూకు రికార్డు ధర లభించే అవకాశం ఉంటుంది. సీఎస్కేతో పాటు కేకేఆర్, గుజరాత్ ఫ్రాంచైజీలు సంజూ కోసం ఎగబడవచ్చు. -
రుతురాజ్‌కు రీప్లేస్‌మెంట్‌గా వచ్చి సత్తా చాటిన పాక్ ప్లేయర్
ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్-2025లో పాకిస్తాన్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్ సత్తా చాటాడు. వార్విక్షైర్తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ (83 బంతుల్లో 55; 9 ఫోర్లు) చేశాడు (యార్క్‌షైర్). తద్వారా యార్క్‌షైర్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. బెంజమిన్ క్లిఫ్ (8.3-0-46-5), మాథ్యూ రెవిస్ (8-3-26-2), జార్జ్ హిల్ (8-2-26-2), జాక్ వైట్ (10-1-21-1) ధాటికి 36.3 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో వన్ష్ జానీ (82) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించారు. మిగతా వారిలో అలెక్స్ డేవిస్ (15), కై స్మిత్ (11), మైఖేల్ బూత్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన యార్క్‌షైర్ ఆదిలో తడబడింది. అయితే ఇమామ్ ఉల్ హాక్ (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టు గెలుపును ఖరారు చేశాడు. ఇమామ్‌కు విలియమ్ లక్స్ట్న్ (25), జేమ్స్ వార్టన్ (17), జార్జ్ హిల్ (20 నాటౌట్), హ్యారీ డ్యూక్ (10 నాటౌట్) సహకరించారు. వార్విక్షైర్ బౌలర్లలో భూత్కు 3, ఒలివర్ డాల్బీ, ఈథన్ బాంబర్‌కు తలో వికెట్ దక్కాయి.రుతురాజ్‌కు ప్రత్నామ్నాయంగా వచ్చి..!వాస్తవానికి ఈ టోర్నీకి ఇమామ్ ఉల్ హక్ ముందుగా ఎంపిక కాలేదు. వ్యక్తిగత కారణాల చేత టీమిండియా యువ ఆటగాడు వైదొలగడంతో అతని ప్రత్యామ్నాయంగా యార్క్షైర్లోకి వచ్చాడు. ఇమామ్ చివరిగా 2022లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడాడు. అప్పుడతను సోమర్సెట్కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం ఇమామ్ పాక్ జట్టులోనూ రెగ్యులర్ సభ్యుడిగా లేడు. ఫామ్ లేమి కారణంగా పాక్ సెలెక్టర్లు అతన్ని పక్కకు పెట్టారు. -
ఖలీల్ అహ్మద్ కీలక నిర్ణయం
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో ఎస్సెక్స్ జట్టుతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఖలీల్.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్టుకు గుడ్‌బై చెప్పాడు.నిరాశకు లోనయ్యాంఈ విషయాన్ని ఎస్సెక్స్ (Essex Cricket) యాజమాన్యం సోమవారం ధ్రువీకరించింది. ‘‘వ్యక్తిగత కారణాల వల్ల ఖలీల్ అహ్మద్ తిరిగి స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. క్లబ్‌తో అతడి ఒప్పందం ఇంతటితో ముగిసిపోయినట్లు ప్రకటిస్తున్నాం. అతడు అర్ధంతరంగా జట్టును వీడటం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.అయితే, ఖలీల్ నిర్ణయాన్ని మేము తప్పక గౌరవిస్తాం. స్వల్పకాలమే జట్టుతో ఉన్నా.. అతడు అందించిన సేవలు మరువలేము. అతడి భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా వెలుగొందాలని ఎస్సెక్స్ క్రికెట్లో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు’’ అని క్లబ్ ప్రకటన విడుదల చేసింది.కాగా మే నెల నుంచి ఖలీల్ అహ్మద్ ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. భారత్-ఎ తరఫున ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడిన జట్టులో అతడు సభ్యుడు. రెండో టెస్టులో ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.రెండు నెలల ఒప్పందంఅనంతరం గత నెలలో ఎస్సెక్స్ క్రికెట్‌తో ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్, వన్డే కప్ ఆడేందుకు రెండు నెలల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ఇప్పటికి కౌంటీ చాంపియన్‌షిప్‌లో రెండు మ్యాచ్‌లే ఆడిన ఖలీల్ అహ్మద్.. మరో నాలుగు మ్యాచ్‌లతో పాటు వన్డే కప్ఆడాల్సి ఉంది. కానీ.. అంతలోనే అతడు స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.కాగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు యజువేంద్ర చహల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ఖలీల్ అహ్మద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. చహల్ నార్తాంప్టన్‌షైర్‌కు ఆడగా.. రుతురాజ్ యార్క్‌షైర్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఒప్పందం నుంచి తప్పుకొన్నాడు.మరోవైపు.. ఇషాన్ కిషన్ ఒప్పందం ప్రకారం నాటింగ్హామ్షైర్కు రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇక తిలక్ వర్మ డివిజన్ 2లో భాగంగా హాంప్‌షైర్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడి.. రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చదవండి: IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’ -
రుతురాజ్ గైక్వాడ్ కీలక నిర్ణయం
టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కీలక నిర్ణయం తీసుకున్నాడు. యార్క్‌షైర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అతడు వైదొలిగాడు. ఈ విషయాన్ని యార్క్‌షైర్ (Yorkshire) కౌంటీ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.నిరాశకు గురిచేసిందిఈ సందర్భంగా యార్క్‌షైర్ జట్టు హెడ్‌కోచ్ ఆంటోని మెగ్రాత్ మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగత కారణాల దృష్ట్యా గైక్వాడ్ ఇంగ్లండ్‌కు రాలేకపోతున్నాడు. అతడు ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడు. ఈ విషయం మమ్మల్ని నిరాశకు గురిచేసింది.అయితే, గైక్వాడ్ నిర్ణయానికి గల కచ్చితమైన కారణాన్ని నేను చెప్పలేను. అతడి స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేసుకుంటాం. కానీ అందుకు సమయం తక్కువగా ఉంది. ఏదేమైనా ఈ విషయం గురించి నేను ఇంతకంటే ఎక్కువగా ఏమీ మాట్లాడలేను’’ అని పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్న రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 ఏళ్ల ఈ ఓపెనింగ్ బ్యాటర్ తాజా కౌంటీ సీజన్లో సర్రేతో జరిగే మ్యాచ్‌తో అరంగేట్రం చేయాల్సి ఉంది. అదే విధంగా వన్డే కప్‌లోనూ పాల్గొనాల్సి ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఇంగ్లండ్‌కు వెళ్లే పరిస్థితి లేదని.. అందుకే తప్పుకొన్నాడని సమాచారం.సీఎస్కే సారథిగా..ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా.. ఈ సీజన్ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. మోచేతి గాయం వల్ల ఐదు మ్యాచ్‌ల తర్వాత జట్టుకు దూరమయ్యాడు.అయితే, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత- ‘ఎ’ జట్టుకు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్.. అనధికారిక టెస్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, ఇంట్రా- స్క్వాడ్ మ్యాచ్‌లో మాత్రం పాల్గొన్నాడు.చివరగా జింబాబ్వేతో సిరీస్లోకాగా ఫస్ట్‌క్లాస్ కెరీర్లో రుతురాజ్ గైక్వాడ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటికి 38 మ్యాచ్‌లు ఆడిన ఈ మహారాష్ట్ర కెప్టెన్ 41.77 సగటుతో 2632 పరుగులు సాధించాడు. ఇక 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రుతురాజ్.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటికి భారత్ తరఫున 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 441 పరుగులు చేశాడు. ఆరు వన్డేల్లో 157 రన్స్ రాబట్టాడు. చివరగా 2024లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా రుతు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: WCL 2025: హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన పాకిస్తాన్ -
IPL 2026: సీఎస్కేలోకి సంజూ.. బదులుగా రాజస్తాన్‌కు రుతురాజ్?!
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) వచ్చే ఏడాది ఐపీఎల్ జట్టు మారనున్నాడా? రాజస్తాన్ రాయల్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరనున్నాడా? అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌పై సీఎస్కే ఒక్కటే కాదు.. ఇంకో రెండు-మూడు ఫ్రాంఛైజీలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.కేరళ స్టార్ సంజూ శాంసన్ 2013లో ఐపీఎల్ (IPL)లో అరంగేట్రం చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన అతడు.. ఆ తర్వాత జట్టుపై నిషేధం పడటంతో 2016-17 సీజన్లలో ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారాడు. అయితే, 2018లో తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు.ఫైనల్ చేర్చిన సారథిఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగిన సంజూ.. 2021లో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. సారథిగా అత్యుత్తమంగా 2022లో రాజస్తాన్‌ను అతడు ఫైనల్‌కు చేర్చాడు. 2008లో షేన్ వార్న్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన రాజస్తాన్.. మళ్లీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఇక 2023లో ఐదోస్థానంతో ముగించిన సంజూ సేన.. 2024లో ప్లే ఆఫ్స్ చేరినా ఫైనల్‌కు వెళ్లలేకపోయింది.ఇక ఈ ఏడాది సంజూ ఫిట్నెస్ సమస్యల కారణంగా ఎక్కువసార్లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగగా.. రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి రాజస్తాన్ మరీ దారుణంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే... కొత్త హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సంజూకు మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో వార్తలు రాగా.. ద్రవిడ్ వాటిని ఖండించాడు. మరోవైపు.. రియాన్ పరాగ్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌ను చేయాలనే యోచనలో రాజస్తాన్ మేనేజ్మెంట్ ఉందనే రూమర్లు వస్తున్నాయి.సంజూపై సీఎస్కే ఆసక్తి నిజమేఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ రాజస్తాన్‌ను వీడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. సీఎస్కే ఈ రేసులో ముందున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎస్కే వర్గాలు మాట్లాడుతూ.. ‘‘సంజూ భారత బ్యాటర్. వికెట్ కీపర్. ఓపెనింగ్ కూడా చేయగలడు.కాబట్టి కచ్చితంగా అతడిని జట్టులో చేర్చుకోవాలని మాకూ ఆసక్తి ఉంది. ఒకవేళ అతడు అందుబాటులో ఉంటే కచ్చితంగా తీసుకుంటాం. ట్రేడ్ చేసుకునైనా అతడిని దక్కించుకుంటాం. అయితే, విషయం అంతవరకు రాలేదు కానీ మాకు మాత్రం అతడిని తీసుకోవడం పట్ల కచ్చితంగా ఆసక్తి ఉంది’’ అని పేర్కొన్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.రుతును ఇచ్చేస్తారా?ఒకవేళ చెన్నై జట్టు గనుక సంజూను దక్కించుకోవాలంటే రాజస్తాన్ ప్లేయర్-టు- ప్లేయర్ ట్రేడ్ వైపే మొగ్గు చూపవచ్చు. అలా అయితే, 2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్ సంజూను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. జట్టుకు అతడే కెప్టెన్.మరోవైపు.. సీఎస్కే తమ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను అట్టిపెట్టుకునేందుకు రూ. 18 కోట్లు కేటాయించింది. కాబట్టి ఒకేస్థాయి ఆటగాళ్ల మార్పిడి జరగాలంటే సంజూ- రుతులను ఎక్స్చేంచ్ చేసుకోవాల్సి ఉంటుంది.అయితే, సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇప్పటికే చాలాసార్లు రుతు గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అతడిని సారథిగా నియమించినట్లు తెలిపాడు. మరి అలాంటపుడు సంజూను ఎవరితో మార్చుకుంటారు?.. అసలు అతడిని వదులుకునేందుకు రాజస్తాన్ సిద్ధంగా ఉందా??.. అంటే మినీ వేలం సమయంలోనే తేలుతుంది. -
పృథ్వీ షా ఆడబోయేది ఈ జట్టుకే!.. సీఎస్కే స్టార్ సారథ్యంలో..
భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తన సొంత జట్టు మంబైని వీడాడు. దేశవాళీ క్రికెట్లో జట్టు మారాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అందుకు అంగీకరించింది. అతడు కోరినట్లుగానే నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేసింది.పరస్పరం హుందా ప్రకటనలు‘‘ముంబై క్రికెట్ అసోసియేషన్ నాకు విలువైన అవకాశాలెన్నో ఇచ్చింది. ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచింది. అందుకు అసోసియేషన్‌కు ధన్యవాదాలు. ఎంసీఏకు చెందిన జట్టులో భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం.ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నాను. అయితే, జట్టు మారాలని నిర్ణయించుకున్నాను’’ అని పృథ్వీ షా ఎంసీఏకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన ఎంసీఏ.. ‘‘క్రికెటర్ పృథ్వీ షా.. ముంబైకి చెందిన ఈ ప్రొఫెషనల్ ఆటగాడు వచ్చే దేశవాళీ సీజన్లో ఇతర జట్టుకు ఆడేందుకు అనుమతించాలని నిరభ్యంతర పత్రం కోరాడు.అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఎంసీఏ ఎన్ఓసీ జారీ చేసింది’’ అని తమ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పృథ్వీ జట్టు ఆడబోయే కొత్త జట్టు ఇదేనంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా పృథ్వీ ఇకపై మహారాష్ట్ర జట్టుకు ఆడబోతున్నట్లు తెలిపింది.మహారాష్ట్రకు ఆడేందుకే నిర్ణయం!కాగా 25 ఏళ్ల పృథ్వీ షాకు రెండు- మూడు అసోసియేషన్ల నుంచి పిలుపు వచ్చినప్పటికీ.. మహారాష్ట్రకు ఆడేందుకే అతడు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. టీమిండియా ఓపెనర్లలో ఒకడైన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో పృథ్వీ షా ఆడతాడు. కాగా మహారాష్ట్ర దేశీ జట్టును ముందుండి నడిపిస్తున్న రుతు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఉన్న విషయం తెలిసిందే.కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన పృథ్వీ షా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020లో వన్డే, 2021లో టీ20లలోనూ అరంగేట్రం చేశాడు.ఓపెనర్‌గా ఆరంభంలో ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత పృథ్వీ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇవే కారణాలతో ఎంసీఏ కూడా అతడిని కొన్నాళ్లు పక్కనపెట్టింది.ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు మొత్తంగా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన పృథ్వీ షా.. ఆయా ఫార్మాట్లలో 339, 189, ఒక పరుగు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 79 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు సాధించాడు. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. -
రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఆడనున్న పాక్ ఓపెనర్..
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2025-26లో యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడేందుకు షఫీక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేవిధంగా వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో కూడా యార్క్‌షైర్ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నాడు.ఈ విషయాన్ని షఫీక్ ధ్రువీకరించాడు. "యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకువడం చాలా సంతోషంగా ఉంది. నాటింగ్‌హామ్‌షైర్‌తో జరిగే బిగ్ మ్యాచ్‌కు ముందు యార్క్‌షైర్ జట్టులో చేరేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను. హెడింగ్లీ వంటి అద్బతమైన వాతవారణం ఉన్న మైదానంలో ఆడేందుకు ఎల్లప్పుడూ నేను ఇష్టపడతాను. నాకు ఈ అవకాశం కల్పించిన యార్క్‌షైర్‌కు ధన్యవాదాలు" అని షఫీక్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.కాగా ఇదే యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌కు టీమిండియా ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ప్రాతినిథ్యం వహించనున్నాడు. రాబోయే కౌంటీ సీజన్లో గైక్వాడ్, షఫీక్ కలిసి ఒకే జట్టుకు ఆడనున్నారు. కాగా షఫీక్ 2021లో బంగ్లాదేశ్‌పై తన టెస్టు కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. తన డెబ్యూ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, శ్రీలంకలపై కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ 2024లో మాత్రం ఈ పాక్ ఓపెనర్ పేలవ ఫామ్‌తో సతమతమయ్యాడు. గతేడాది 6 టెస్టులు ఆడి కేవలం 178 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన ఫామ్‌ను తిరిగి అందుకునేందుకు యార్క్‌షైర్‌తో జతకట్టాడు. ఓవరాల్‌గా తన టెస్టు కెరీర్లో షఫీక్.. 1504 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్ -
కౌంటీలకు రుతురాజ్ గైక్వాడ్
లీడ్స్: భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. యార్క్‌షైర్ తరఫున అతను డివిజన్–1 కౌంటీ చాంపియన్‌షిప్‌తో పాటు వన్డే కప్‌లో ఆడతాడని తెలిసింది. వచ్చేనెల సర్రే జట్టుతో జరిగే మ్యాచ్ నుంచి సీజన్ ముగిసేదాకా జట్టుకు అందుబాటులో ఉంటాడని యార్క్‌షైర్ కౌంటీ జట్టు తెలిపింది. ఈ 28 ఏళ్ల టాపార్డర్ బ్యాటర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన భారత్ ‘ఎ’ జట్టులో సభ్యుడైన గైక్వాడ్‌కు రెండు అనధికారిక టెస్టుల్లోనూ ఆడే అవకాశమైతే రాలేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన ఆ రెండు టెస్టులు ‘డ్రా’గానే ముగిశాయి. ఇక 13 నుంచి 16 వరకు బెకెన్‌హామ్‌లో భారత సీనియర్ జట్టుతో జరిగే నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఆడనుంది. ఇందులోనైనా రుతురాజ్‌కు అవకాశం లభిస్తుందేమో చూడాలి. ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ కెపె్టన్, రంజీల్లో మహారాష్ట్ర జట్టు కెపె్టన్ కూడా అయిన రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు వన్డేలు, 23 టి20లు ఆడాడు. కౌంటీల్లో కీలకమైన మ్యాచ్‌లు ఉన్న తరుణంలో రుతురాజ్లాంటి టాపార్డర్ బ్యాటర్ ఆడనుండటం తమకు లాభిస్తుందని యార్క్‌షైర్ హెడ్ కోచ్ ఆంథోని మెక్‌గ్రాత్ అన్నారు. అతని చేరిక తమ జట్టుకు అదనపు బలాన్ని చేకూరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యార్క్షైర్లాంటి ప్రముఖ ఇంగ్లండ్ కౌంటీ జట్టుకు ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని గైక్వాడ్ చెప్పాడు. దిగ్గజ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా టీనేజ్‌లో యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1992లో 19ఏళ్ల ప్రాయంలో సచిన్ యార్క్‌షైర్ తరఫున బరిలోకి దిగాడు. -
సచిన్ టెండూల్కర్ ఆడిన జట్టుతో ఒప్పందం చేసుకున్న రుతురాజ్
సీఎస్కే కెప్టెన్, టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంగ్లండ్ కౌంటీల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహించిన యార్క్‌షైర్ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. జులై నెలాఖరులో యార్క్‌షైర్‌తో జతకట్టనున్న రుతురాజ్.. కౌంటీ ఛాంపియన్షిప్, మెట్రో బ్యాంక్ వన్డే కప్ పూర్తయ్యే వరకు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. 28 ఏళ్ల రుతురాజ్ కౌంటీల్లో ఆడటం ఇదే మొదటిసారి. కౌంటీల్లో ఆడబోయే తొలి మహారాష్ట్ర క్రికెటర్‌గా రుతురాజ్ రికార్డుల్లోకెక్కనున్నాడు.రుతురాజ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో ఆడుతున్న భారత-ఏ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ సిరీస్‌లో అతని ఆడే అవకాశం రాలేదు. రుతురాజ్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సందర్భంగా మోచేతి గాయానికి గురై సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్లో రుతురాజ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. రుతురాజ్ గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ బాధ్యతలు చేపట్టాడు.2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రుతురాజ్ టీమిండియా తరఫున 6 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. ఇందులో సెంచరీ, ఐదు అర్ద సెంచరీల సాయంతో 748 పరుగులు చేశాడు. 2022 ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.2020లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రుతురాజ్.. అప్పటి నుంచి సీఎస్కేకే ఆడుతూ 71 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీల సాయంతో 2502 పరుగులు చేశాడు.దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే రుతురాజ్.. ఆ జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రుతురాజ్‌కు ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. రుతురాజ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 7, లిస్ట్-ఏ క్రికెట్లో 16 సెంచరీలు చేశాడు.రుతురాజ్ యార్క్‌షైర్‌తో ఒప్పందం చేసుకోవడం పట్ల ఆ జట్టు హెడ్ కోచ్ ఆంధోని మెక్‌గ్రాత్ హర్షం వ్యక్తం చేశాడు. రుతురాజ్ కూడా యార్క్‌షైర్‌లో చేరడం పట్ల ఆసక్తిని వ్యక్త పరిచాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1992లో యార్క్‌షైర్ తరఫున ఆడాడు. ఆ జట్టు తరఫున సచిన్ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 46.52 సగటున 1070 పరుగులు చేశాడు. -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటుతో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి క్రికెటర్‌గా నిలిచాడు. వర్షం వల్ల 14 ఓవర్ల ఆటఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాటిదార్ ఈ ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో పద్నాలుగు ఓవర్లకు మ్యాచ్‌ను కుదించగా.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (1) పూర్తిగా విఫలం కాగా.. రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించాడు.95 పరుగులుఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 50 నాటౌట్) ఆడటంతో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్‌బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.పంజాబ్ ఫటాఫట్‌ఇక పంజాబ్ 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. నేహాల్ వధేరా (19 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 30 ఇన్నింగ్స్‌లోనే పాటిదార్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.సచిన్ రికార్డు బ్రేక్ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న రికార్డును పాటిదార్ బద్దలు కొట్టాడు. వీరిద్దరు 31 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నారు. ఇక.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకుని.. ఐపీఎల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా రికార్డుఅయితే, రజత్ ఇన్నింగ్స్ పరంగా సుదర్శన్ కంటే వెనుకబడి ఉన్నా... సగటు, స్ట్రైక్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్నాడు. తద్వారా ఐపీఎల్లో 35కు పైగా సగటుతో 150కి పైగా స్ట్రైక్‌రేటుతో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా పాటిదార్ చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్లో అతడి నిలకడైన ఆటకు ఇది నిదర్శనం.ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ పంజాబ్👉వర్షం వల్ల మ్యాచ్ 14 ఓవర్లకు కుదింపు👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉బెంగళూరు స్కోరు: 95/9 (14)👉పంజాబ్ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో బెంగళూరుపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్ -
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గత మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోచేతి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గైక్వాడ్ గైర్హాజరీలో ఎంఎస్ ధోని కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్ మొత్తంలో ధోనినే సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.సీఎస్కే యాజమాన్యం తాజాగా రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసుకుంది. ముంబై చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేను జట్టులోకి తీసుకుంది. రుతురాజ్ ప్రత్యామ్నాం కోసం సీఎస్కే మేనేజ్మెంట్ మాత్రేతో పాటు పృథ్వీ షా (ముంబై), ఉర్విల్ పటేల్ (గుజరాత్), సల్మాన్ నిజర్ (కేరళ) పేర్లను పరిశీలించినప్పటికీ, చివరికి మాత్రేకే ఓటు వేసింది. మాత్రేను సీఎస్కే 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. మాత్రే ఈ సీజన్ మెగా వేలంలో పోటీపడినప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు. మాత్రేపై సీఎస్కే మొదటి నుంచి సానుకూలంగా ఉన్నా ఎందుకో మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. గతేడాది సీఎస్కే మాత్రేను ట్రయల్స్‌కు కూడా పిలిపించుకుంది.మాత్రేను వీలైనంత త్వరగా జట్టులో చేరాలని సీఎస్కే మేనేజ్మెంట్ కబురు పెట్టినట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీతో మ్యాచ్ కోసం సీఎస్కే ప్రస్తుతం లక్నోలో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ 20న సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి రావచ్చు.కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన మాత్రేకు ముంబై క్రికెటింగ్ సర్కిల్స్‌లో మంచి గుర్తింపు ఉంది. మాత్రే ముంబై తరఫున అతి తక్కువ మ్యాచ్‌లు ఆడినా టాలెంటెడ్ ఆటగాడిగా పేరు గడించాడు. మాత్రే 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 504 పరుగులు చేశాడు. 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 458 పరుగులు చేశాడు. గతేడాది అక్టోబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మాత్రే అతి తక్కువ కాలంలోనే టీమిండియా మెటీరియల్‌గా ముద్ర వేసుకున్నాడు. -
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
మహేంద్ర సింగ్ ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గ్వైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావడంతో ఈ మార్పు అనివార్యమైంది. గువాహాటిలో గత నెల 30న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రుతురాజ్ మోచేతికి గాయమైంది. అయితే దానికి చికిత్స కొనసాగిస్తూ అతడు మరో రెండు మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. నొప్పి తీవ్రం కావడంతో పరీక్షలు చేయగా మోచేతికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది.కేకేఆర్‌తో మ్యాచ్లోఫలితంగా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ ధోని (MS Dhoni) కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడు. సొంత మైదానం చెపాక్‌లో జరిగే శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని విధుల్లో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఒకప్పటి సీఎస్కే స్టార్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై జట్టు రాత మారదని అభిప్రాయపడ్డాడు.మీరెలా ముందుకు వెళ్లగలరు?‘‘జట్టులో ఎన్నో లోపాలు ఉన్నాయి. ముందుగా వాటిని సరిచేయాలి. అంతేగానీ ధోనిని తిరిగి కెప్టెన్‌గా చేసినందు వల్ల పరిస్థితులు వాటికవే చక్కబడిపోవు. రుతు లాంటి కీలక బ్యాటర్ స్థానాన్ని ఎవరితో మీరు భర్తీ చేస్తారు? ఈ లోటును ఎలా పూడ్చుకుంటారు?.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఎక్కడి నుంచి తెస్తారు?డెవాన్ కాన్వే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రిటైర్డ్ అవుట్ కావడానికి ముందు 69 పరుగులు చేశాడు. ఇక రచిన్ ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయంలో రుతు లాంటి సాలిడ్ బ్యాటర్ లేకుండా మీరెలా ముందుకు వెళ్లగలరు?’’ అని రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో సీఎస్కే యాజమాన్యాన్ని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా గతేడాది సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న ధోని.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించాడు. అయితే, అతడి సారథ్యంలో చెన్నై గొప్పగా రాణించలేకపోతోంది. ఐపీఎల్-2024లో రుతు సేన పద్నాలుగు మ్యాచ్‌లకు ఏడు గెలిచింది. అయితే, ఆర్సీబీతో కీలక మ్యాచ్‌లో ఓడి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి బాటపట్టింది.తొమ్మిదో స్థానంలోఇక ఐపీఎల్-2025లోనూ ఆరంభ మ్యాచ్‌లో ముంబై గెలిచిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.ఇదిలా ఉంటే.. సీఎస్కే టీమ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ధోని 2008–2023 మధ్య 235 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ‘తలా’ నాయకత్వంలో 5 సార్లు జట్టు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. 2022లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే టోర్నీ మధ్యలో అతడు 8 మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ధోనియే బాధ్యతలు తీసుకున్నాడు. 2024 సీజన్ నుంచి జట్టు సారథ్య బాధ్యతలు రుతురాజ్‌కు అప్పగించారు. అతడి కెప్టెన్సీలో టీమ్ 19 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 8 గెలిచి, 11 ఓడింది. చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!? -
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్-2025 సీజన్ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ స్ధానంలో సీఎస్కే కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నైకి ఇప్పుడు గైక్వాడ్ దూరం కావడం నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి.ఈ క్రమంలో గైక్వాడ్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్కే మెనెజ్‌మెంట్ పడింది. టీమిండియా ఓపెనర్, ముంబై స్టార్ ప్లేయర్ పృథ్వీ షాని తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో కొన్ని సీజన్ల పాటు ఓ వెలుగు వెలిగిన పృథ్వీ షా.. తొలిసారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు దూరంగా ఉన్నాడు.ఐపీఎల్-2025 మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో సతమతవుతున్నందున షాను ఏ ఫ్రాంచైజీ కూడా సొంతం చేసునేందుకు ముందుకు రాలేదు. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అతడిని తిరిగి సొంతం చేసుకునేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. అయితే మరోసారి పృథ్వీ షాకు రుతురాజ్ గాయం రూపంలో అవకాశం లభించే సూచనలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్లో ఇప్పటివరకు 79 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన షా.. 147.47 స్ట్రైక్ రేట్‌తో 1,892 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: #Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. -
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన సీఎస్కే.. తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలోనూ చేదు అనుభవం ఎదుర్కొంది. ముల్లాన్‌పూర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు పోరాడి విజయానికి పద్దెనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఆ తప్పులే మా కొంప ముంచాయిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) స్పందిస్తూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. ఫీల్డింగ్ తప్పిదాలే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘గత నాలుగు మ్యాచ్‌లలో ఒకే పొరపాటు.. అదే ఫీల్డింగ్. మేము క్యాచ్‌లు డ్రాప్ చేస్తూనే ఉన్నాం.అతడి బ్యాటింగ్ అద్భుతంతద్వారా ఆ బ్యాటర్లు అదనంగా 15, 20, 30 పరుగులు చేసేందుకు ఆస్కారం ఇస్తున్నాం. ఈరోజు ప్రియాన్ష్ ఆర్య అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి హై రిస్క్‌తో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, పరిస్థితులు అతడికి అనుకూలించాయి.ఇదే వికెట్‌పై మేమూ బ్యాటింగ్ చేశాం. అయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. అంతకుముందు కీలక సమయాల్లో క్యాచ్‌లు కూడా డ్రాప్ చేశాం. ఇంకో 10- 15 పరుగులు కట్టడి చేయాల్సింది. అలాగే ఇంకో మూడు- నాలుగు సిక్సర్లు బాదాల్సింది.బ్యాటింగ్ పరంగా పర్లేదుఏదేమైనా మా ఉత్తమ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే పవర్ ప్లేలో రాణించడం సానుకూలాంశం. బ్యాటింగ్ పరంగా మేము పర్లేదు. ముందుగా చెప్పినట్లు ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సి ఉంది’’ అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌ను ఆస్వాదిస్తేనే తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయని.. టెన్షన్ పడితే మరిన్ని పొరపాట్లకు ఆస్కారం ఉంటుందే తప్ప లాభమేమీలేదని తమ ఫీల్డర్లకు సందేశం ఇచ్చాడు.క్యాచ్‌లు డ్రాప్ చేసి.. మూల్యం చెల్లించారుకాగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్కే ఆరంభంలోనే వరుస వికెట్లు తీసింది. కానీ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య మెరుపు సెంచరీ (42 బంతుల్లో 103)తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఇచ్చిన క్యాచ్‌ను బౌలర్ మిస్ చేశాడు.అదే విధంగా ఐదో ఓవర్ రెండో బంతికి స్టొయినిస్ ఇచ్చిన క్యాచ్‌ను విజయ శంకర్ వదిలేశాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి ప్రియాన్ష్ బంతిని గాల్లోకిలేపగా.. శంకర్ మరోసారి డ్రాప్ చేశాడు. ఇక అశ్విన్ బౌలింగ్‌లో పన్నెండవ ఓవర్ రెండో బంతికి ప్రియాన్ష్ సిక్సర్ బాదగా.. బంతిని అందుకున్న ముకేశ్ చౌదరి బౌండరీ లైన్‌ను తాకాడు.I.C.Y.M.I 𝗣𝗼𝘄𝗲𝗿💪. 𝗣𝗿𝗲𝗰𝗶𝘀𝗶𝗼𝗻👌. 𝗣𝗮𝗻𝗮𝗰𝗵𝗲💥. Priyansh Arya graced the home crowd with his effortless fireworks 🎆Updates ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/7JBcdhok58— IndianPremierLeague (@IPL) April 8, 2025ఆ తర్వాత పదిహేడో ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్‌లో శశాంక్ సింగ్ ఇచ్చిన సిట్టర్‌ను రచిన్ రవీంద్ర డ్రాప్ చేశాడు. ఇలా సీఎస్కే ఫీల్డింగ్ తప్పిదాల వల్ల పంజాబ్ బ్యాటర్లు.. ముఖ్యంగా ప్రియాన్ష్ చాలాసార్లు లైఫ్ పొందాడు. అతడికి తోడుగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్) దుమ్ములేపారు.తప్పని ఓటమిఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సీఎస్కే ఐదు వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమై.. 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్లు రచిన్ రవీంద్ర (23 బంతుల్లో 36), డెవాన్ కాన్వే (49 బంతుల్లో 69 రిటైర్డ్ అవుట్), శివం దూబే (27 బంతుల్లో 42) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో ధోని మెరుపు ఇన్నింగ్స్ (12 బంతుల్లో 27) ఆడాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) మాత్రం మరోసారి విఫలమయ్యాడు.చదవండి: గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ! Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025 -
అదే మా కొంపముంచింది.. ఏదీ కలిసి రావడం లేదు: సీఎస్కే కెప్టెన్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ చెన్నై తేలిపోయింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో విజయ్ శంకర్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫ్యలమే తమ ఓటమికి కారణమని గైక్వాడ్ వెల్లడించాడు."గత కొన్ని మ్యాచ్‌ల నుంచి మాకు ఏదీ కలిసి రావడం లేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ మేము మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాము. కానీ మేము ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో ఎక్కువగా వికెట్లు కోల్పోయాము. బౌలింగ్‌లో కూడా మేము చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాము. అదనంగా 15 నుంచి 20 పరుగులు అదనంగా ఇస్తున్నాం. లేదంటే పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోతున్నాం. లోపాలను సరిదిద్దుకోవాడనికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. పవర్ ప్లేలో మేం అతి జాగ్రత్తగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తుండటం మాకు నష్టం కలిగిస్తోంది అన్పిస్తోంది.పవర్ ప్లేలో ఎక్కువగా వికెట్లు కోల్పోతుండడంతో బ్యాక్‌ఫుట్‌లో ఉండిపోతున్నాము. అందరూ సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ కండీషన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. శివమే దూబే క్రీజులో ఉన్నప్పుడు మేము ఆ మూమెంటమ్ అందుకుంటామని భావించాము. కానీ అలా జరగలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో గైక్వాడ్ పేర్కొన్నాడు. -
CSK vs DC: సీఎస్కేపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
IPL 2025 CSK vs DC Updates: ఐపీఎల్-2025లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అప్డేట్స్ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయంచెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బ్యాటర్లలో విజయ్ శంకర్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ తలా వికెట్ సాధించారు.ఓటమి దిశగా సీఎస్కే..17 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. సీఎస్కే విజయానికి 18 బంతుల్లో 67 పరుగులు కావాలి. క్రీజులో విజయ్ శంకర్(51), ధోని(13) ఉన్నారు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్రవీంద్ర జడేజా రూపంలో సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన జడేజా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో ధోని(4), విజయ్ శంకర్(26) ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్శివం దూబే (15 బంతుల్లో 18) రూపంలో చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. విప్రాజ్ బౌలింగ్‌లో దబే స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 65/4 (9.2). జడేజా క్రీజులోకి వచ్చాడు. శంకర్ 17 పరుగులతో ఉన్నాడు. పవర్ ప్లేలో చెన్నై స్కోరు: 46/3 (6)దూబే 5, శంకర్ 11 రన్స్‌తో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన చెన్నై5.3: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే (13) అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా శివం దూబే క్రీజులోకి వచ్చీ రాగానే ఫోర్ బాదాడు. విజయ్ శంకర్ 11 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45/3 (5.4) రెండో వికెట్ కోల్పోయిన చెన్నై2.3: కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో మెగర్క్కు క్యాచ్ ఇచ్చి రుతు 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. విజయ్ శంకర్ క్రీజులోకి వచ్చాడు. కాన్వే 5 రన్స్‌తో ఉన్నాడు. స్కోరు: 20/2 (2.3)తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే1.5: ముకేశ్ కమార్ బౌలింగ్ రచిన్ రవీంద్ర బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం మూడు పరుగులు చేసి నిష్క్రమించాడు. రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి రాగా కాన్వే ఐదు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 15-1(2)ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు.. ఢిల్లీ స్కోరెంతంటే?చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగైన స్కోరు సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అక్షర్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కాగా తొలి ఓవర్లోనే ఓపెనర్ మెగర్క్ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు.Kamaal KL! 😎🏏KL Rahul brings up a sublime fifty as he leads the charge for #DC, eyeing a historic win at Chepauk, their first since 2010! Watch LIVE action ➡ https://t.co/4Kn2OwL1UW #IPLonJioStar 👉 #CSKvDC, LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar pic.twitter.com/bSx5mXAuoh— Star Sports (@StarSportsIndia) April 5, 2025వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (20 బంతుల్లో 33) ఆది నుంచే దంచికొట్టగా.. రాహుల్ మాత్రం తొలుత ఆచితూచి ఆడాడు. అనంతరం కాస్త స్పీడు పెంచిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆఖరి ఓవర్లో.. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.మిగతా వాళ్లలో కెప్టెన్ అక్షర్ పటేల్ (14 బంతుల్లో 21) , సమీర్ రిజ్వీ (15 బంతుల్లో 21), ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (12 బంతుల్లో 24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఇక సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీషా పతిరణ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు19.2:పతిరణ బౌలింగ్‌లో రాహుల్ (77) వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ధోని మ్యాజిక్.. ఐదో వికెట్ డౌన్19.3: పతిరణ బౌలింగ్‌లో అశుతోశ్ శర్మ (1) రనౌట్ అయ్యాడు. స్టబ్స్‌తో కలిసి పరుగు పూర్తి చేసుకున్న అశుతోశ్‌ను.. వికెట్ల వెనుక వేగంగా కదిలిన ధోని అద్బుత రీతిలో రనౌట్ చేసి వెనక్కి పంపాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ16.1: ఖలీల్ అహ్మద్ మరోసారి అద్భుతం చేశాడు. తొలి ఓవర్లో మేగర్క్ రూపంలో కీలక వికెట్ తీసిన ఈ పేస్ బౌలర్.. తాజాగా సమీర్ రిజ్వీని వెనక్కి పంపాడు.అహ్మద్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిజ్వీ పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 148/4 (16.2)15 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 138/3 (15)కేఎల్ రాహుల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో అతడికి ఇది 38వ ఫిఫ్టీ. మరోవైపు సమీర్ రిజ్వీ నిలకడగానే ఆడుతున్నాడు. పదిహేను ఓవర్లు ముగిసే సరికి రాహుల్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేయగా.. రిజ్వీ 13 బంతుల్లో 19 రన్స్ చేశాడు.10.4: మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీఅక్షర్ పటేల్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ 21 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. స్కోరు: 90/3 (10.4). సమీర్ రిజ్వీ క్రీజులోకి వచ్చాడు.10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 82/2 అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి అక్షర్ 12 బంతుల్లో 20, రాహుల్ 23 బంతుల్లో 29 రన్స్‌తో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ6.5: జోరు మీదున్న పోరెల్‌కు జడేజా చెక్ పెట్టాడు. జడ్డూ బౌలింగ్‌లో పతిరణకు క్యాచ్ ఇచ్చి అతడు 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అక్షర్ పటేల్ క్రీజులోకి రాగా.. రాహుల్ 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 54/2 (6.5) పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ స్కోరు: 51/1 (6)పోరెల్ 32, రాహుల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.నాలుగు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 32/1రాహుల్ 8, పోరెల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 20/1 (2) ముకేశ్ బౌలింగ్‌లో చితక్కొట్టిన అభిషేక్ పోరెల్. 0,4, 6, 4, 4, 1. రాహుల్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తొలి ఓవర్లో ఒక్క పరుగు.. ఒక వికెట్‌ఖలీల్ అహ్మద్ చెన్నై బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి నాలుగు బంతులను డాట్ చేసిన ఖలీల్... ఐదో బంతికి మెగర్క్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి బంతికి అభిషేక్ పోరెల్ ఒక పరుగు చేశాడు. ఢిల్లీ స్కోరు: 1-1 (1)రుతు సారథ్యంలోనేఈ మ్యాచ్‌కు చెన్నై రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడని.. అతడి స్థానంలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని నాయకుడిగా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే, గాయం నుంచి కోలుకున్న రుతు మైదానంలో అడుగుపెట్టడం గమనార్హం.ఫాఫ్ లేడుమరోవైపు.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్.. తొలుత బ్యాటింగ్ చేయనున్నట్లు తెలిపాడు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ వికెట్ స్లోగా మారే అవకాశం ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో కూడా తాము ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. దురదృష్టవశాత్తూ ఫాఫ్ డుప్లెసిస్ ఫిట్‌గా లేడని.. అందుకే అతడి స్థానంలో సమీర్ రిజ్వీ తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.తుదిజట్లుచెన్నైరచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముకేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్‌శివం దూబే, జేమీ ఓవర్టన్, షేక్ రషీద్, కమలేశ్ నాగర్‌కోటిఢిల్లీజేక్ ఫ్రేజర్-మెగర్క్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్‌ముకేశ్ కుమార్, కరుణ్ నాయర్, దర్శన్ నాల్కండే, డొనోవాన్ ఫెరీరా, త్రిపురాణ విజయ్ -
IPL 2025: సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని?
ఐపీఎల్-2025లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నైసూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం(ఏప్రిల్ 5) చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సీఎస్కేకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గైక్వాడ్ కుడి మోచేయికి గాయమైంది. దీంతో అతడు అప్పటి నుంచి నెట్‌ప్రాక్టీస్‌కు దూరమయ్యాడు. తాజాగా రుతురాజ్ అందుబాటుపై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ సందేహం వ్యక్తం చేశాడు. ఒకవేళ రుతురాజ్ దూరమైతే అతడి స్ధానంలో ఎంఎస్ ధోని సీఎస్కే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముందని హస్సీ తెలిపాడు."రేపటి మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. అతడు ఎంపిక అనేది కోలుకునే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇంకా అతడు నొప్పితో బాధపడుతున్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తను ఆడకపోతే, ఎవరు నాయకత్వం వహిస్తారో మేము ఇంకా నిర్ణయించలేదు. కానీ యువ వికెట్ కీపర్ ధోని కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు" అని హస్సీ పేర్కొన్నాడు. కాగా రుతురాజ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాజస్తాన్‌పై ఓటమి పాలైనప్పటికి రుతు 61 పరుగులతో రాణించాడు.కాగా ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌కు సీఎస్కే చాలా కీలకం.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, షేక్రన్ కాన్వే, షేక్రాన్ కాన్వే, సమ్కో కాన్వే శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, నాథన్ ఎల్లిస్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, ఆండ్రీ సిద్దార్థ్ సి, వంశ్ బేడి, దీపక్ హుడాచదవండి: IPL 2025: ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం -
IPL 2025: రాయల్స్ చేతిలో పరాజయం.. సెంచరీ కొట్టిన సీఎస్కే
ఐపీఎల్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల సెంచరీని పూర్తి చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో సీఎస్కే ఈ ల్యాండ్ మార్కును తాకింది. తద్వారా ఐపీఎల్లో 100 పరాజయాలు పూర్తి చేసుకున్న ఏడో జట్టుగా నిలిచింది. సీఎస్కేకు ముందు ఢిల్లీ (134), పంజాబ్ (133), ఆర్సీబీ (128), కేకేఆర్ (118), ముంబై ఇండియన్స్ (117), రాజస్థాన్ రాయల్స్ (108) 100 పరాజయాల మార్కును తాకాయి. మధ్యలో రెండు సీజన్లు మినహా ఐపీఎల్ మొత్తంలో పాల్గొన్న సీఎస్కే ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడి 139 విజయాలు, 100 పరాజయాలను ఎదుర్కొంది. ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో సీఎస్కే రెండో స్థానంలో ఉంది. ముంబై (142) టాప్‌లో ఉండగా.. సీఎస్కే (139), కేకేఆర్ (131), ఆర్సీబీ (123), ఢిల్లీ (114), రాజస్థాన్ (111), పంజాబ్ (110) వరుస స్థానాల్లో ఉన్నాయి.కాగా, ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ గెలిచిన ఆ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో నితీశ్‌తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2), ఖలీల్ అహ్మద్ (4-0-38-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే.. రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్), జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), ధోని (11 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) పోరాడినా లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రాయల్స్ బౌలర్లలో హసరంగ (4-0-35-4), ఆర్చర్ (3-1-13-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్లో సీఎస్కే గెలుపుకు అవసరం కాగా.. సందీప్ శర్మ 13 పరుగులకే ఇచ్చి రాయల్స్‌కు ఈ సీజన్లో తొలి గెలుపును అందించాడు. -
RR VS CSK: మేము చరుగ్గా లేము.. అందుకు సంతోషమే: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నిన్న (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. గౌహతిలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రాయల్స్ కీలకమైన క్షణాలన్నిటినీ అధిగమించి విజేతగా నిలిచింది. ఈ సీజన్లో రాయల్స్‌కు ఇది తొలి విజయం.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేసుండాల్సింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) రాయల్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రాయల్స్ ఊహించిన దానికంటే 20-30 పరుగులు తక్కువ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో నితీశ్‌తో పాటు శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నితీశ్‌ను ఔట్ చేశాక సీఎస్కే పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకుంది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసింది. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను ఈ సీజన్లో చెత్త ఫామ్‌లో ఉన్న జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు. సీఎస్కే గెలుపుకు చివరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాల్సి ఉండింది. ధోని, జడ్డూ క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నిలబడితే సీఎస్కే ఎలాగైనా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఇక్కడే తీక్షణ మ్యాజిక్ చేశాడు. 18వ ఓవర్లో అతను కేవలం 6 పరుగులే ఇచ్చి సీఎస్కేకు లక్ష్యాన్ని మరింత దూరం చేశాడు. 19వ ఓవర్లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో జడ్డూ, ధోని చెలరేగగా (బౌండరీ, 2 సిక్సర్లు) చివరి ఓవర్లో సీఎస్కే లక్ష్యం 20 పరుగులుగా మారింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్చర్‌కు (3-1-13-1) చివరి ఓవర్ ఇవ్వకుండా రాయల్స్ కెప్టెన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆర్చర్‌కు బదులుగా సందీప్ శర్మను నమ్ముకోగా.. అతను కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి బంతికే ధోని వికెట్ తీసి ఆతర్వాత రెండు బంతులను సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్కే గెలుపుకు చివరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు అవసరమయ్యాయి. అక్కడికీ ఓవర్టన్ నాలుగో బంతికి సిక్సర్ బాది సీఎస్కే గెలుపు ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే ఐదో బంతికి రెండు పరుగులే రావడంతో సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. చివరి ఓవర్‌ను సందీప్ శర్మకు ఇవ్వడంతో టెన్షన్ పడ్డ రాయల్స్ అభిమానులు చివరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు (రెండు మ్యాచ్‌ల తర్వాత) రియాన్ పరాగ్ కెప్టెన్‌గా తన తొలి విజయాన్ని నమోదు చేశాడు. ఈ గెలుపు సొంత అభిమానుల మధ్య దక్కడం అతనికి మరింత స్పెషల్.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నితీశ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో అతని ఆటతీరు అమోఘం. నితీశ్ ఎక్కువగా వెనుక భాగంలో షాట్లు ఆడుతున్నాడని తెలిసి కూడా మేము చురుగ్గా లేము. అతన్ని వికెట్‌కు ముందు ఆడించే ప్రయత్నం చేసుండాల్సింది. మిస్ ఫీల్డ్‌ల ద్వారా అదనంగా 8-10 పరుగులు సమర్పించుకున్నాము. ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాలి. ఈ వికెట్‌పై 180 పరుగులు ఛేదించదగ్గ టార్గెటే. ఇన్నింగ్స్ బ్రేక్‌లో సంతోషపడ్డాను. వారు 210 పరుగులకు పైగా స్కోర్ చేస్తారని అనుకున్నాను. మా బౌలర్లు బాగా కంట్రోల్ చేశారు. జరగాల్సిన నష్టం ఆదిలోనే జరిగిపోయింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత కొన్ని సీజన్లలో రహానే 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాయుడు మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకునేవాడు. నేను కూడా మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకోవడానికి కొంచెం ఆలస్యంగా వస్తే మంచిదని భావించాము. అయితే అది వర్కౌట్ కాలేదు. మూడు మ్యాచ్‌ల్లోనూ ఆట ప్రారంభంలోనే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. వేలం సమయంలోనే నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని నిర్ణయించబడింది. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దురదృష్టవశాత్తు ఈ సీజన్లో మాకు మంచి ఆరంభాలు లభించడం లేదు. ఒక్కసారి మా ఓపెనర్లిద్దరూ టచ్‌లోకి వస్తే పరిస్థితులు మారతాయి. ఎప్పటిలాగే నూర్ బాగా బౌలింగ్ చేశాడు. ఖలీల్, జడ్డూ కూడా సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో కొంత ఊపు అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా రాణిస్తే మా జట్టుకు తిరుగుండదు. -
సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ
ఐపీఎల్-2025లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)- చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖాముఖి పోటీలో సీఎస్కేదే పైచేయి అయినా.. ఈసారి మాత్రం ఆర్సీబీ అదరగొట్టింది. చెన్నై కంచుకోటను బద్దలు కొట్టి 2008 తర్వాత మొదటిసారి చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లి (Virat Kohli- 31) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్(14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) రాణించారు.ఇక చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మతీశ పతిరణకు రెండు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 146 పరుగులకే పరిమితం కావడంతో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. Back 2️⃣ back wins! 🔥Chat, how are we feeling? 🤩pic.twitter.com/8xT6VaS7hf— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025 చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.జడేజాతో ముచ్చట్లుఇదిలా ఉంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి.. చెన్నై స్టార్ రవీంద్ర జడేజాతో కలిసి ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలో కోహ్లి కాస్త సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు కనిపించగా.. జడ్డూ మాత్రం నవ్వులు చిందించాడు. ఇంతలో అక్కడికి చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ రాగానే కోహ్లి మరింత సీరియస్ అయినట్లు కనిపించింది. అతడితో వాదనకు దిగిన కోహ్లి.. ఖలీల్ ఏం చెప్తున్నా పట్టించుకోకుండా తన పాటికి తాను ఏదో మాట్లాడుతూనే కనిపించాడు.కోహ్లి చేయి పట్టుకుని మరీ ఖలీల్ అతడిని అనునయించేందుకు ప్రయత్నించగా.. అతడు మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. ఇంతలో కోహ్లికి డ్రెస్సింగ్‌రూమ్ నుంచి పిలుపు రావడటంతో వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’కాగా చెన్నై బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన ఖలీల్.. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ కూడా తానే వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే కోహ్లిని ఎల్బీడబ్ల్యూ(లెగ్ బిఫోర్ వికెట్) చేసినట్లుగా భావించిన ఖలీల్.. సంబరాలు మొదలుపెట్టేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు.అయితే, అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని ఖలీల్.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఒప్పించి డీఆర్ఎస్కు వెళ్లాడు. కానీ అక్కడ చెన్నైకి విరుద్ధంగా థర్డ్ అంపైర్ తీర్పు వచ్చింది. బంతి లెగ్ స్టంప్ ఆవలి దిశగా పిచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో కోహ్లి సేవ్ అవ్వగా.. సీఎస్కే ఓ రివ్యూను కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇదే విషయమై ఖలీల్‌తో సీరియస్‌గా చర్చించి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! Kohli mere bacche shant hoja 😭😭 pic.twitter.com/yGITzOsOXr— n (@humsuffer_) March 29, 2025 -
ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కంచుకోటను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు బద్దలు కొట్టింది. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.మరోవైపు.. సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో పరాభవాన్ని సీఎస్కే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై జట్టు హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రుతురాజ్ సేన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై.. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడింది. చెపాక్‌లో ఈ మాజీ చాంపియన్ల మధ్య జరిగిన పోరులో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ముంబైని 155 పరుగులకు కట్టడి చేసిన సీఎస్కే.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.పాటిదార్, టిమ్ డేవిడ్ మెరుపులుతాజాగా ఆర్సీబీతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగుల మేర మంచి స్కోరు రాబట్టింది.ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31)లతో పాటు దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27) రాణించగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (5), వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించాడు.ధోని ధనాధన్ సరిపోలేదుమిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద చెన్నై నిలిచిపోయింది. ఫలితంగా యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అవుట్‌డేటెడ్ అంటూ సెటైర్లుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియా ముందుకు రాగా.. ‘‘తొలి మ్యాచ్‌లో 20 ఓవర్లలో మీరు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈరోజు 146 పరుగులు చేశారు.మీ బ్రాండ్ క్రికెట్ ఇలాగే ఉంటుందని తెలుసు. కానీ ఇది పాతబడి పోయిందని మీకు అనిపించడం లేదా?’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.ఇందుకు బదులుగా.. ‘‘నా బ్రాండ్ క్రికెట్ అంటే ఏమిటి? మీరు ఫైర్ పవర్ గురించి మాట్లాడుతున్నారా? మా జట్టు సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అసలు మీ ప్రశ్న ఏమిటో నాకు అర్థం కావడమే లేదు.మమ్మల్ని తక్కువ చేయకండితొలి బంతి నుంచే మేము స్వింగ్ చేయడం లేదని మీరిలా అంటున్నారా? మా వ్యూహాల గురించి సానుకూలంగా ఆలోచించడంలో తప్పేముంది? గెలుపు కోసమే ఎవరైనా ప్రయత్నిస్తారు. దీనినే సానుకూల దృక్పథం (పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్) అంటారు.మమ్మల్ని తక్కువగా అంచనా వేయడం.. మా గురించి తక్కువగా మాట్లాడటం చేయకండి. ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడండి! ’’ అని ఫ్లెమింగ్ ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సదరు జర్నలిస్టు.. ‘‘నేను మిమ్మల్ని తక్కువ చేసి చూపడటం లేదు’’అని సమాధానమిచ్చారు. దీంతో.. ‘‘మీరు అలాగే మాట్లాడుతున్నారు.. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేస్తున్నారు’’ అని ఫ్లెమింగ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. చెపాక్‌లో ఆడటం వల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని.. ఇతర వేదికలపై తమ జట్టు సత్తా చాటిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఫ్లెమింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! -
ఈ పిచ్‌పై 170 పరుగులే ఎక్కువ.. ఇంకా భారీ తేడాతో ఓడిపోనందుకు సంతోషించాలి: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ప్రారంభించింది. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం సీఎస్కే బొక్క బోర్లా పడింది. నిన్న (మార్చి 28) సొంత మైదానం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ సేన ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని (50 పరుగుల తేడాతో) ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన సీఎస్కే స్థాయి తగ్గట్టుగా ఆడలేకపోయింది. తొలుత బౌలింగ్‌లో పట్టులేక ప్రత్యర్ధిని 196 పరుగులు చేయనిచ్చింది. ఆతర్వాత ఛేదనలో కనీస పోరాటం కూడా ప్రదర్శించలేక 146 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్‌తో పోలిస్తే సీఎస్కే బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. రచిన్ రవీంద్ర (41) ఒక్కడే కాస్త పోరాడే ప్రయత్నం చేశాడు. చివర్లో ధోని (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించినా అప్పటికే సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్‌లోనూ దారుణంగా విఫలమైంది. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడంతో పాటు లేని పరుగులు సమర్పించుకుంది.మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వాస్తవానికి ఈ వికెట్‌పై 170 పరుగులే చాలా ఎక్కువ. అలాంటిది ఆర్సీబీ 196 పరుగులు చేసి, మా బ్యాటింగ్‌ను మరింత సంక్లిష్టం చేసింది. వారి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ రోజు ఫీల్డింగ్‌లోనూ మేము గొప్పగా లేము. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. ఊహించిన దానికంటే అదనంగా 20 పరుగులను ఛేదిస్తున్నప్పుడు పవర్ ప్లేలో మా బ్యాటింగ్ స్టయిల్ భిన్నంగా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. తొలి ఐదు ఓవర్లు కొత్త బంతి కూడా ఇబ్బంది పెట్టింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. రాహుల్ త్రిపాఠి, నేను చాలా కాన్ఫిడెంట్‌గా షాట్లు ఆడాము. కానీ వర్కౌట్ కాలేదు. మా స్పిన్ త్రయాన్ని ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేశాము. అది కూడా మా ఓటమికి కారణమైంది. తదుపరి మ్యాచ్ కోసం మానసికంగా సిద్దంగా ఉండాలి. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో చెడు రోజు ఉంటుంది. మేము ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాలి.రచిన్ సరిగ్గా ముందుకు సాగలేకపోయాడు. హుడా పరిస్థితి కూడా అలాగే ఉండింది. దూబే నుంచి ప్రామిసింగ్ ఇన్నింగ్స్ ఆశించాము. యశ్ దయాల్ డబుల్ స్ట్రయిక్ (ఒకే ఓవర్లో 2 వికెట్లు) మా ఓటమిని ఖరారు చేసింది. చివర్లో జడేజా, ధోని భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్‌గా ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది. -
BCCI Contracts: రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఈసారి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం. అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వినికిడి.అదేవిధంగా ఏ కేటగిరీలో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను A+ కేటగిరీకి బీసీసీఐ ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా టీ20లకు విడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు A+ కేటగిరీలు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే A+ కేటగిరీలో కొనసాగాలంటే మూడు ఫార్మాట్లో ఆడాల్సిందే. రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్ తగిలే అవకాశముంది. అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రుతురాజ్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడికి వచ్చిన అవకాశాలను కూడా గైక్వాడ్ సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గతేడాది అతడు భారత్ తరపున కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. చివరగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున రుతురాజ్ ఆడాడు. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 133 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా గైక్వాడ్ తన కెరీర్లో ఇప్పటివరకు భారత్ తరపున 6 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. కాగా గైక్వాడ్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- ముంబై ఇండియన్స్ (MI)మధ్య పోరు అని చెప్పవచ్చు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఐపీఎల్-2025లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన తీరు ఇందుకు నిదర్శనం.ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే స్టార్లు రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53)ల మెరుపులు.. మహేంద్ర సింగ్ ధోని మెరుపు స్టంపింగ్‌లతో పాటు.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఓ కుర్రాడు హైలైట్‌గా నిలిచాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ధోని చేత ప్రశంసలు అందుకున్నాడు.ఇంతకీ ఎవరా ప్లేయర్?అతడిపేరు విఘ్నేశ్ పుతూర్. లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్ బౌలర్. 24 ఏళ్ల ఈ కుర్ర బౌలర్ స్వస్థలం కేరళలోని మలప్పురం. పదకొండేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించిన విఘ్నేశ్.. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దృష్టిని ఆకర్షించాడు.అతడి ప్రతిభకు ఫిదా అయిన ముంబై యాజమాన్యం.. ఇంతవరకు కేరళ తరఫున కనీసం దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టకపోయినప్పటికీ... ఐపీఎల్ కాంట్రాక్టు ఇచ్చింది. రూ. 30 లక్షలకు ఐపీఎల్-2025 మెగా వేలంలో అతడిని కొనుగోలు చేసింది.ఈ క్రమంలో పద్దెనిమిదవ ఎడిషన్‌లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా సీఎస్కేతో పోరు సందర్భంగా విఘ్నేశ్‌ను బరిలోకి దించింది. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన ఈ స్పిన్ బౌలర్.. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే (9), దీపక్ హుడా (3) రూపంలో మూడు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.చెన్నై చేతిలో ముంబై సులువుగానే ఓటమిని అంగీకరిస్తుందా? అనే పరిస్థితి నుంచి .. చివరి ఓవర్ దాకా మ్యాచ్ సాగేలా చేయడంలో విఘ్నేశ్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని విఘ్నేశ్‌ను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. అతడి భుజం తట్టి శెభాష్ అంటూ తలా.. ఈ కుర్రాడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.The men in 💛 take home the honours! 💪A classic clash in Chennai ends in the favour of #CSK ✨Scorecard ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/ZGPkkmsRHe— IndianPremierLeague (@IPL) March 23, 2025 తండ్రి ఆటో డ్రైవర్.. కొడుకు ఐపీఎల్ స్టార్అన్నట్లు విఘ్నేశ్ పుతూర్ తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. కష్టపడుతూ కుటుంబాన్ని పోషించే ఆయన.. కొడుకులోని ప్రతిభను గుర్తించి క్రికెట్ ఆడేలా ప్రోత్సహించాడు. కేరళ క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహాతో మీడియం పేసర్ బౌలర్ నుంచి స్పిన్నర్‌గా మారిన విఘ్నేశ్ ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. కలకాలం గుర్తుండిపోతుంది!‘‘ధోని.. విఘ్నేశ్ పుతూర్ భుజం తట్టి అభినందించాడు. నాకు తెలిసి తన జీవితకాలం ఈ కుర్రాడు ఈ సంఘటనను గుర్తుంచుకుంటాడు’’- కామెంటేటర్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును.. విఘ్నేశ్ పుతూర్‌కు ఇది లైఫ్‌టైమ్ మొమరీగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, ఈ సీజన్లో బౌలర్‌గా తనదైన ముద్ర వేయగలిగితే.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాలో చోటు సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో.. త్వరలోనే విఘ్నేశ్ కూడా చేరే అవకాశాలను కొట్టిపారేయలేము!! ఏమంటారు?!ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ ముంబై స్కోర్లు👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై👉టాస్: చెన్నై.. తొలుత బౌలింగ్👉ముంబై స్కోరు: 155/9 (20)👉చెన్నై స్కోరు: 158/6 (19.1)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ముంబైపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నూర్ అహ్మద్ (చెన్నై స్పిన్నర్- 4/18).చదవండి: జట్టు స్వరూపమే మారిపోయింది.. కావ్యా మారన్‌కు ఇంతకంటే ఏం కావాలి? -
IPL 2025: ఈ ఏడాది ధోని మరింత ఫిట్‌గా ఉన్నాడు.. యవ్వనంగా కనిపిస్తున్నాడు: రుతురాజ్
ఐపీఎల్-2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓడటం ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా 13వ సారి. ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ నుంచి ఇప్పటివరకు ముంబైతో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో సీఎస్కే ఏడింట విజయాలు సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో సీఎస్కేను అరంగేట్రం ఆటగాడు నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనలతో గెలిపించారు.తొలుత నూర్ (4-0-18-4) తన మాయాజాలం ప్రదర్శించి ముంబైని 155 పరుగులకే పరిమితం చేయగా.. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తమ బ్యాటింగ్ విన్యాసాలతో సీఎస్కేను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ (4-0-29-3) కూడా రాణించాడు. ధోని మెరుపు స్టంపింగ్ (సూర్యకుమార్ యాదవ్) చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.ఈ మ్యాచ్‌లో ముంబై స్వల్ప స్కోర్‌కే పరిమితమైనా.. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ముంబై బౌలర్లు సీఎస్కేను అంత ఈజీగా గెలవనివ్వలేదు. రుతురాజ్ క్రీజ్‌లో ఉన్నంత సేపు సీఎస్కే వైపే ఏకపక్షంగా సాగిన మ్యాచ్.. ఆతను ఔటయ్యాక మలుపులు తిరిగింది. ఓ దశలో ముంబై అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) రెచ్చిపోవడంతో సీఎస్కే కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే రచిన్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి సిక్సర్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (17) రనౌట్ కావడంతో ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. ధోని బ్యాటింగ్‌కు దిగినా పరుగులేమీ చేయలేదు (2 బంతులు ఎదుర్కొని). ధోని రాకతో చెపాక్ స్టేడియం హోరెత్తింది. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్‌తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను తెగ ఇబ్బంది పెట్టారు. అంతకుముందు ముంబై బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటై నిరాశపర్చగా.. విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలిచిన జట్టులో ఉండటం ఆనందంగా ఉంది. మరింత క్లినికల్‌గా ఉండటం నాకు చాలా ఇష్టం. కానీ ఆట ఇలాగే సాగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో రావడంపై స్పందిస్తూ.. అది జట్టు అవసరం. నేను మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం జట్టుకు మరింత సమతుల్యతను ఇస్తుంది. నా స్థానాన్ని మార్చుకోవడం (గతంలో ఓపెనర్‌గా వచ్చే వాడు) పట్ల నాకు ఎలాంటి బాధ లేదు. వాస్తవానికి ఇంకా సంతోషంగా ఉంది.స్పిన్నర్లు సరైన పాయింట్‌పై ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వారు ముగ్గురు (నూర్, అశ్విన్, జడేజా) మంచి లయతో బౌలింగ్ చేశారు. ఇది మాకు శుభసూచకం. ఖలీల్ అనుభవజ్ఞుడు. అతని అనుభవం మాకు కలిసొచ్చింది. నూర్ ఓ ఎక్స్ ఫ్యాక్టర్, అందుకే అతన్ని జట్టులో చేర్చుకోవాలనుకున్నాము. అశ్విన్ జట్టులో ఉండటం మాకు బలాన్ని ఇస్తుంది. ధోని ఈ సంవత్సరం మరింత ఫిట్‌గా ఉన్నాడు. అతను ఇప్పటికీ యవ్వనంగా కనిపిస్తున్నాడు. -
వరుసగా 13వ ఏడాది...
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై జట్టు ఐపీఎల్లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గతేడాది పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోయిన ముంబై... బౌలింగ్‌లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చెన్నై: ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. 2012 ఐపీఎల్లో చివరిసారి తాము ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు మొదటి పోరులో శుభారంభం చేయలేకపోయింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ యువతార ఠాకూర్ తిలక్ వర్మ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చెన్నై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) దూబే (బి) ఖలీల్ 0; రికెల్టన్ (బి) ఖలీల్ 13; జాక్స్ (సి) దూబే (బి) అశ్విన్ 11; సూర్యకుమార్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 29; తిలక్ వర్మ (ఎల్బీ) (బి) నూర్ 31; రాబిన్ (సి) జడేజా (బి) నూర్ 3; నమన్ (బి) నూర్ 17; సాంట్నర్ (ఎల్బీ) (బి) ఎలీస్ 11; దీపక్ చాహర్ (నాటౌట్) 28; బౌల్ట్ (సి) రుతురాజ్ (బి) ఖలీల్ 1; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–36, 4–87, 5–95, 6–96, 7–118, 8–128, 9–141. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–29–3; స్యామ్ కరన్ 1–0–13–0; ఎలీస్ 4–0–38–1; అశ్విన్ 4–0– 31–1; జడేజా 3–0–21–0; నూర్ అహ్మద్ 4–0– 18–4. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (నాటౌట్) 65; రాహుల్ త్రిపాఠి (సి) రికెల్టన్ (బి) చాహర్ 2; రుతురాజ్ (సి) జాక్స్ (బి) విఘ్నేశ్ 53; దూబే (సి) తిలక్ వర్మ (బి) విఘ్నేశ్ 9; దీపక్ హుడా (సి) సత్యనారాయణ (బి) విఘ్నేశ్ 3; కరన్ (బి) జాక్స్ 4; జడేజా (రనౌట్) 17; ధోని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–95, 4–107, 5–116, 6–152. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–0; చాహర్ 2–0–18–1; సత్యనారాయణ 1–0–13–0; సాంట్నర్ 2.1–0–24–0; జాక్స్ 4–0–32–1; విఘ్నేశ్ 4–0–32–3; నమన్ 3–0–12–0. ఐపీఎల్లో నేడుఢిల్లీ X లక్నో వేదిక: విశాఖపట్నంరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఐపీఎల్-2025లో బోణీ కొట్టిన సీఎస్కే.. ముంబైపై విక్టరీ
ఐపీఎల్-2025ను చెన్నై సూపర్ కింగ్స్ అద్బుతమైన విజయంతో ఆరంభించింది. చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓ దశలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటికి.. రవీంద్ర మాత్రం ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను ముగించాడు.ముంబై బౌలర్లలో విఘ్నేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జాక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ(0) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఇక సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.చదవండి: IPL 2025: వారెవ్వా ధోని.. కేవలం 0.12 సెకన్లలోనే! వీడియో వైరల్ -
IPL 2025: స్పిన్-టు-విన్ వ్యూహం.. ఆరో టైటిల్‌కు గురి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings). రికార్డు స్థాయిలో ఆరవ టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈసారి బరిలోకి దిగుతోంది. 2024లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన బాధ ఇంకా చెన్నై ఆటగాళ్ల మనసులో కదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి పూర్వ వైభవం సాధించాలని సీఎస్కే పట్టుదలతో ఉందనడంలో సందేహం లేదు.యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్‌కు ముందు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంత అనుభవం గడించిన నేపథ్యంలో ఈ సీజన్లో కొత్త కెప్టెన్ మరింత మెరుగ్గా వ్యవహరించే అవకాశముందని భావిస్తున్నారు. కాగా.. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ స్థానాన్ని కూడా సాధించలేకపోయింది.7 విజయాలు, 7 ఓటములతో కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించి గత సీజన్లో పేలవంగా ఐదో స్థానం తో ముగించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న చెన్నైలోని ఎం ఎ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ తో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.స్పిన్-టు-విన్ వ్యూహంఈ నేపథ్యంలో ఈ సారి భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరియు చెన్నై అభిమానుల ఫేవరెట్ ఆటగాడు సామ్ కుర్రాన్‌తో సహా అనేక సుపరిచితమైన ఆటగాళ్లను చెన్నై మళ్ళీ జట్టులోకి తీసుకుంది. భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వెనుక నుంచి తన వ్యూహరచనలో జట్టును ముందుండి నడిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇక జట్టును చూస్తే, గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాల్ని ఇచ్చిన 'స్పిన్-ట్రిక్' కు కట్టుబడి ఉండాలని చెన్నై భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రవీంద్ర జడేజా, న్యూజిలాండ్‌కు చెందిన భారత్ సంతతి ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రతో పాటు నూర్ అహ్మద్, అశ్విన్‌లను చేర్చడం, ముఖ్యంగా సొంత గడ్డ పై గరిష్ట ప్రభావాన్ని చూపడానికి టర్నర్లను ఉపయోగించాలనే వారి ధోరణిని గుర్తుచేస్తుంది.అశ్విన్, నూర్ లతో పాటు జడేజా ఎడమచేతి ఫింగర్స్పిన్, గోపాల్ లెగ్‌స్పిన్, ఇంకా దీపక్ హుడా పార్ట్-టైమ్ ఆఫ్‌స్పిన్ వంటి బౌలర్లు చెన్నై స్పిన్ బౌలింగ్ కి వెరైటీ సమకూరుస్తున్నారు. ఇది చెపాక్‌లో స్పిన్-టు-విన్ వ్యూహానికి సరిగ్గా సరిపోతుంది.బలీయంగా కనిపిస్తున్న బ్యాటింగ్ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, న్యూ జిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి బ్యాటింగ్‌ను ప్రారంభించే అవకాశముంది. ఈ జంట 2023 సీజన్లో చాలా విజయవంతమైంది. కానీ గత సీజన్లో గాయం కారణంగా కాన్వే ఆడలేక పోయాడు. ఈ సీజన్లో ఈ ఇద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో చెన్నై మళ్ళీ పుంజుకోవాలని భావిస్తోంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజృంభించిన ఆడిన రచిన్ రవీంద్రను మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే అవకాశముంది.కీలకమైన నాల్గవ స్థానంలో దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి లేదా విజయ్ శంకర్ ఒకరు వచ్చే అవకాశముంది. ఆ తర్వాత హార్డ్ హిట్టింగ్ శివమ్ దూబేను ఐదవ స్థానంలో, ఆ తర్వాత ఆరో స్థానంలో వచ్చే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ తన నైపుణ్యంతో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. జడేజా తర్వాత, ఎంఎస్ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశముంది. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో గత సీజన్లో కీలక పాత్ర పోషించిన ధోని మరోసారి ప్రభావం చూపే అవకాశం ఉంది.జట్టులో ప్రధాన ఆటగాళ్ళు:రుతురాజ్ గైక్వాడ్: గత కొన్ని సీజన్లగా చెన్నై తరఫున నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నవారిలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. రుతురాజ్ తన జట్టు బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకగా నిలిచాడు, 41.75 సగటుతో మరియు 136.86 స్ట్రైక్ రేట్‌తో 2380 పరుగులు సాధించాడు. అతని నాయకత్వంలో పసుపు బ్రిగేడ్ గత సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేక పోయినా, గైక్వాడ్ ఈ సీజన్లో మెరుగైన ఆటతీరుతో చెన్నై ని ముందుకు నడిపించాలని పట్టుదలతో ఉన్నాడు.రవిచంద్రన్ అశ్విన్: అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్, తన కెరీర్ ప్రారంభ దశలో తనను వెలుగులోకి తెచ్చిన ఫ్రాంచైజీ అయిన చెన్నై కి ఐపీఎల్ టైటిల్‌ను అందించాలని భావిస్తున్నాడు. 212 మ్యాచ్‌ల్లో 7.12 ఎకానమీ రేటుతో 180 వికెట్ల తో అశ్విన్ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఆఫ్ స్పిన్నర్ తాను బ్యాట్‌తో దూకుడుగా ఉండగలనని మరియు అవసరమైనప్పుడు ఫ్లోటర్‌గా వ్యవహరించగలనని చూపించాడు.నాథన్ ఎల్లిస్: వేగంగా బౌలింగ్ చేయగల మరియు తన వైవిధ్యాలను చాలా చక్కగా ఉపయోగించుకునే సామర్థ్యంతో, నాథన్ ఎల్లిస్ చెన్నై జట్టులో కీలకమైన బౌలర్‌గా రాణిస్తాడని భావిస్తున్నారు.శివం దూబే: దూకుడుతో బ్యాటింగ్ చేసే శివం దూబే చెన్నై జట్టుకు మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాడు. సూపర్ కింగ్స్ తరఫున 39 ఇన్నింగ్స్‌లలో 34.47 సగటు మరియు 159.16 స్ట్రైక్ రేట్‌తో 1103 పరుగులు చేశాడు. చెన్నై జట్టుకి మిడిల్ ఓవర్లలో శివం దూబే ను గేమ్-ఛేంజర్ గా భావించవచ్చు.రాహుల్ త్రిపాఠి: డైనమిక్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మూడు లేక నాలుగో స్థానంలో ఆడే అవకాశముంది. త్రిపాఠి ఐపీఎల్లో ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 27.27 సగటుతో, 139.3 స్ట్రైక్ రేట్‌తో 2236 పరుగులు చేశాడు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్.చదవండి: అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే: సీఎస్కే మాజీ స్పిన్నర్ -
కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెమినిదవ ఎడిషన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో శనివారం (మార్చి 22) ఐపీఎల్-2025కి తెరలేవనుంది. ఇక ఈ సీజన్‌కు ముందు మెగా వేలం జరగడంతో జట్లలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్ప.. మిగిలిన ఐదు జట్లు తమ కెప్టెన్లను కూడా మార్చేశాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు చేసి.. అతడిని తమ సారథిగా నియమించుకుంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి కెప్టెన్ కోసం భారీగానే ఖర్చుపెట్టింది. భారత జట్టు మిడిలార్డర్ స్టార్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరి మిగిలిన జట్ల కెప్టెన్లు, వారి జీతాలు ఈసారి ఎలా ఉన్నాయో చూద్దామా?కోల్‌కతా నైట్ రైడర్స్2012, 2014 2024లో చాంపియన్‌గా నిలిచిన జట్టు. గతేడాది తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్న కేకేఆర్.. ఈసారి అనూహ్య రీతిలో ఓ వెటరన్ ప్లేయర్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది.మెగా వేలం-2025లో తొలి రౌండ్లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అజింక్య రహానేను రూ. 1.5 కోట్లకు కొని.. పగ్గాలు అప్పగించింది. అతడికి డిప్యూటీగా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో అతి తక్కువ జీతం అందుకున్న కెప్టెన్ రహానేనే కావడం గమనార్హం. అన్నట్లు వెంకటేశ్ అయ్యర్ జీతం రూ.23.75 కోట్లు.సన్‌రైజర్స్ హైదరాబాద్గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈసారీ తమ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌ను కొనసాగించింది. అయితే, గతేడాది అతడికి రూ. 20.50 కోట్ల మేర ముట్టజెప్పిన ఫ్రాంఛైజీ.. ఈసారి రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకోవడం గమనార్హం.రాజస్తాన్ రాయల్స్ఐపీఎల్ తొట్టతొలి విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ గత కొన్నేళ్లుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్ను తమ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. ఈసారి కూడా ‘పింక్’ జట్టును సంజూ ముందుండి నడిపించనున్నాడు. ఇందుకోసం రూ. 18 కోట్ల జీతం అందుకుంటున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై.. గతేడాది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతోంది. ఈసారీ అతడినే కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్కే.. ఇందుకోసం అతడిని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ఈసారి కెప్టెన్‌ను మార్చిన ఫ్రాంఛైజీల జాబితాలో ఢిల్లీ ఒకటి. గతేడాది రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ.. ఈసారి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇందుకోసం తమ కెప్టెన్‌కు రూ. 16.50 కోట్ల మేర చెల్లిస్తోంది.గుజరాత్ టైటాన్స్అరంగేట్ర సీజన్లో తమకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడిన తర్వాత.. అంటే గతేడాది టీమిండియా నయా సూపర్ స్టార్ శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందు గిల్‌ను రూ. 16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ ఈసారీ అతడినే సారథిగా కొనసాగిస్తోంది.ముంబై ఇండియన్స్ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని.. గతేడాది హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్‌ను చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారీ అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై... పాండ్యాను రూ. 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుఎంత క్రేజ్ ఉన్నా ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. ఈసారి ఊహించని రీతిలో రజత్ పాటిదార్‌ను సారథిగా నియమించింది. విరాట్ కోహ్లి మరోసారి పగ్గాలు చేపడతాడనే ప్రచారం జరిగగా.. బెంగళూరు ఫ్రాంఛైజీ ప్రకటనతో అది జరగదని తేలింది. అన్నట్లు వేలానికి ముందు రూ. 11 కోట్లకు పాటిదార్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో రహానే తర్వాత తక్కువ జీతం ఆర్సీబీ సారథికే!చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’!
క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రూపంలో మెగా ఈవెంట్ సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19న ఈ ఐసీసీ టోర్నమెంట్ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇక ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొనున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... అదే విధంగా గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. బీసీసీఐ కూడా పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలు వెల్లడించింది.అయితే, టీమిండియాలో ప్రతిభ గల ఆటగాళ్లకు కొదవలేదు. కానీ కొన్ని సందర్భాల్లో తుదిజట్టు కూర్పు, పిచ్ స్వభావం, టోర్నీకి ముందు ప్రదర్శన.. తదితర అంశాల ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికకాని స్టార్లు చాలా మందే ఉన్నారు. మరి వారితో కూడిన భారత జట్టు, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూద్దామా?..ఓపెనర్లుగా ఆ ఇద్దరురుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)లను ఓపెనర్లుగా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. రుతు లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో 56.15 సగటు కలిగి ఉండి.. ఫార్మాట్ చరిత్రలోనే అత్యధిక యావరేజ్ కలిగిన ఐదో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.మరోవైపు జైస్వాల్ బ్యాటింగ్ సగటు కూడా ఇందులో 52.62గా ఉంది. 33 మ్యాచ్‌లు ఆడిన అతడి ఖాతాలో ఐదు శతకాలు, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నాయి ఇక వీరిద్దరికి అభిషేక్ శర్మను బ్యాకప్ ప్లేయర్‌గా జట్టులోకి తీసుకోవచ్చు.వికెట్ కీపర్‌గా ఇషాన్మరో ఓపెనింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ కోటాలో ఎంపిక చేయవచ్చు. వన్డేల్లో అతడి ఖాతాలో ఏకంగా ద్విశతకం ఉంది. అంతేకాదు.. వన్డే ప్రపంచకప్-2023లోనూ ఆడిన అనుభవం కూడా పనికి వస్తుంది.శతకాల ధీరుడు లేకుంటే ఎలా?ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారా అంటే.. కరుణ్ నాయరే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అతడు పరుగుల వరద పారించాడు. తాజా సీజన్లో ఏకంగా ఐదు శతకాలు బాది 750కి పైగా పరుగులు చేశాడు. కానీ అతడిని టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు.ఏదేమైనా మిడిలార్డర్లో తిలక్ వర్మతో కలిసి కరుణ్ నాయర్ ఉంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఇక ఆల్రౌండర్లుగా శివం దూబే, రియాన్ పరాగ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. వీరిద్దరు గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడారు.బౌలర్ల దళంచాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు దుబాయ్ వేదికగా కాబట్టి పరాగ్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను తుదిజట్టులోకి తీసుకుంటే బెటర్. యుజువేంద్ర చహల్‌తో పాటు ఆర్. సాయికిషోర్ ఇక్కడ మన ఛాయిస్. ఈ ముగ్గురు మూడు రకాల స్పిన్నర్లు.పరాగ్ రైట్, కిషోర్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు అయితే.. చహల్ మణికట్టు స్పిన్నర్.. వీరికి బ్యాకప్‌గా రవి బిష్ణోయి ఉంటే సానుకూలంగా ఉంటుంది.ఇక పేసర్ల విషయానికొస్తే.. ముగ్గురు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. మహ్మద్ సిరాజ్‌తో పాటు ప్రసిద్ కృష్ణ.. వీరికి బ్యాకప్‌గా ఆవేశ్ ఖాన్. ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్‌కు బ్యాకప్‌గా ధ్రువ్ జురెల్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఇక యశస్వి జైస్వాల్‌తో పాటు శివం దూబే చాంపియన్స్ ట్రోఫీ నాన్- ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్న విషయం తెలిసిందే.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక కాని, అత్యుత్తమ భారత తుదిజట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, కరుణ్ నాయర్, శివమ్ దూబే*, రియాన్ పరాగ్, ఆర్. సాయి కిషోర్, యుజువేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్*, ప్రసిద్ కృష్ణ.బెంచ్: అభిషేక్ శర్మ, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ధృవ్ జురెల్.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
బరోడాను చిత్తు చేసిన రుతురాజ్ టీమ్.. ఏకంగా 439 పరుగులతో
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా నాసిక్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 439 పరుగుల తేడాతో మహారాష్ట్ర ఘన విజయం సాధించింది. 617 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్ చౌదరి 5 వికెట్లు పడగొట్టగా.. రజనీష్ గుర్బానీ మూడు వికెట్లు, రామక్రిష్ణ రెండు వికెట్లు సాధించారు.బరోడా బ్యాటర్లలో అతి సేథ్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..జ్యోత్స్నిల్ సింగ్(40) పరుగులతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా(12, 6) తీవ్ర నిరాశపరిచాడు. కాగా మహారాష్ట్ర జట్టు 464/7 వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మహారాష్ట్ర బ్యాటర్లలో సౌరభ్ నవలే(126) సెంచరీతో మెరవగా..రామక్రిష్ణ(99), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(89) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 152 పరుగుల ఆధిక్యాన్ని జోడించి బరోడా ముందు 617 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని బరోడా చేధించడంలో చతకలపడింది. కాగా మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ కాగా..బరోడా 145 పరుగులకే తమ మొదటి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా -
జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?: అశ్విన్
టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవిపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సెలక్షన్ కమిటీ చైర్మన్ అయ్యే అవకాశం వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాధ్యతలు చేపట్టబోనని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఉండటం తలనొప్పితో కూడిన పని అని అశూ వ్యాఖ్యానించాడు.ఆచితూచి...భారత్‌లో ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని.. అయితే, వారిలో ఎవరిని జట్టుకు ఎంపిక చేయాలనేది ఎల్లప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుందని అశ్విన్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఓ ఆటగాడి వైపు మొగ్గు చూపేటపుడు ప్రదర్శన, ప్రత్యేక నైపుణ్యాల ఆధారంగానే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.కాగా ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్లను ప్రకటించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అతడి గురించే ఎక్కువగా చర్చముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కని సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంగ్లండ్‌తో వన్డేల్లోనైనా అవకాశం ఇవ్వాల్సిందని కొంతమంది అభిప్రాయపడగా.. సంజూ శాంసన్‌కు ఈసారీ అన్యాయం జరిగిందంటూ సునిల్ గావస్కర్, మహ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.వన్డేల్లో రిషభ్ పంత్ కంటే మెరుగ్గా ఉన్న సంజూ శాంసన్‌ను వికెట్ కీపర్ కోటాలో చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ టీ20లకి తిరిగి వస్తే.. అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ పరిస్థితి ఏమిటి?వీరే కాకుండా ఓపెనింగ్ కోటాలో రుతురాజ్ గైక్వాడ్‌కు దక్కుతున్న ప్రాధాన్యం ఎంత? దేశవాళీ క్రికెట్ వన్డే ఫార్మాట్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్‌ను సెలక్టర్లు కనికరించకపోవడానికి కారణం? .. ఇలాంటి చర్చలు భారత క్రికెట్ వర్గాల్లో జరుగుతున్నాయి.జైస్వాల్ టీ20 జట్టులో ఉండాలి.. గైక్వాడ్ సంగతేంటి?ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అంతర్జాతీయ టీ20లలోకి యశస్వి జైస్వాల్ తప్పక తిరిగి రావాలి. అతడు వరల్డ్ కప్ జట్టులో ఉన్న వ్యక్తి. మొదటి ప్రాధాన్యం కలిగిన ఓపెనర్.ఒకవేళ వచ్చే ఐపీఎల్ సీజన్లో శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ భారీగా పరుగులు చేస్తే.. సెలక్టర్లకు తలనొప్పి మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా లేదంటే.. టీమ్ మేనేజర్‌గా.. అదీ కాదంటే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందంలో ఉండే అవకాశం వస్తే మాత్రం నేను అస్సలు తీసుకోను.ప్రతిభ ఉన్న క్రికెటర్లకు కొదువలేకపోవడం అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, సెలక్టర్లకు మాత్రం ఇది ఒక సమస్య. ఏదేమైనా.. పోటీలో ఉన్న ఆటగాళ్లందరి ప్రదర్శన, ప్రధాన టోర్నమెంట్లో ఒత్తిడిని ఏమేరకు జయించగలరన్న అంశాల ఆధారంగా ఎంపిక చేస్తే బాగుంటుంది.క్లిష్ట పరిస్థితుల్లోనూ రాణించగలిగే వాళ్లకే పెద్దపీట వేయాలి. ఎవరు గొప్ప ఆటగాడు అన్న ప్రశ్నలకు సమాధానమిచ్చే కొలమానాలు ఏవీ లేవు’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. అయితే, అరుదైన నైపుణ్యాలు, ఫామ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు. చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియా పర్యటనలో పరాభవం చవిచూసిన టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 22 నుంచి తొలి టీ20తో ఈ మెగా సమరం మొదలుకానుంది.ఈ సిరీస్‌తో షమీ రీఎంట్రీఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే టీ20 సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే ఈ జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేయనున్నాడు.స్టార్ క్రికెటర్లు దూరంవన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీ20లకు యశస్వి జైస్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు.బ్యాటర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ చోటుదక్కించుకోగా.. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్‌లకు అవకాశం దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండగా.. బౌలింగ్ విభాగంలో పేసర్లు మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాతో పాటు.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి స్థానం సంపాదించారు.శివం దూబేకు దక్క ని చోటుఅయితే, ఈ జట్టులో భారత ఆల్‌రౌండర్, విధ్వంసకర వీరుడు శివం దూబే(Shivam Dube)కు మాత్రం చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో పాటు.. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు దంచికొట్టాడు. అయినప్పటికీ సెలక్టర్లు దూబే పేరును పరిగణనలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. ‘‘శివం దూబేకు ఏమైంది? నిజానికి రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తన బ్యాటింగ్ స్థానం(ఓపెనర్) దృష్ట్యా అతడిని ఎంపిక చేయడం వీలుకాకపోవచ్చు.అలాగే రజత్ పాటిదార్‌కు కూడా మొండిచేయి ఎదురైంది. కానీ.. శివం దూబేను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 ప్రపంచకప్ చాంపియన్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?కాబట్టి జట్టు గెలిచినపుడు.. జట్టులోని ప్రతి సభ్యుడికి తమ క్రెడిట్ ఇవ్వాలి. వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లలో ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయంలో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అతడు అన్నీ సరిదిద్దుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయ్యాడు. అయినా.. ఎందుకు అతడిని టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు?’’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత.. విధ్వంసకర శతకం! సెలక్టర్లకు మెసేజ్
విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారీ శతకం(Ruturaj Gaikwad Century) బాదాడు. సర్వీసెస్ జట్టు బౌలింగ్‌పై విరుచుకుపడుతూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి మహారాష్ట్రను విజయతీరాలకు చేర్చాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ(Vijay Hazare Trophy 2024-25)లో భాగంగా మహారాష్ట్ర.. సోమవారం సర్వీసెస్‌తో తలపడింది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది.రాణించిన సర్వీసెస్ కెప్టెన్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు సర్వీసెస్ 204 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మోహిత్ అహ్లావత్(61) అర్ధ శతకం బాదగా.. ఓపెనర్ సూరజ్ వశిష్ట్(22), మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పలివాల్(22), అర్జున్ శర్మ(24), పూనం పూనియా(26) ఫర్వాలేదనిపించారు.మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్ దాధే, సత్యజీత్ బచ్చవ్ మూడేసి వికెట్లు కూల్చగా.. ముకేశ్ చౌదరి రెండు, అజిమ్ కాజీ, రజ్నీశ్ గుర్బానీ ఒక్కో వికెట్ తీశారు. వీరి దెబ్బకు 48 ఓవర్లలోనే సర్వీసెస్ బ్యాటింగ్ కథ ముగిసింది.57 బంతుల్లోనే రుతు శతకంఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 20.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విశ్వరూపం ప్రదర్శించాడు. 57 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రుతు.. మొత్తంగా 74 బంతుల్లో 16 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 148 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఓం భోస్లే(24) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ 22 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇక మహారాష్ట్రను ఒంటి చేత్తో గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మెగా టోర్నీకి రెడీఇక ఈ టోర్నీలో మహారాష్ట్రకు ఇది రెండో విజయం. తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్ర రాజస్తాన్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు రుతురాజ్ బ్యాట్ ఝులిపించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఫామ్ కొనసాగిస్తే మెగా టోర్నీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా తన భారీ సెంచరీతో సెలక్టర్లకు గట్టి సందేశం పంపించాడని పేర్కొంటున్నారు.చదవండి: నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. సుడిగాలి ఇన్నింగ్స్!
భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల సునామీ సృష్టించాడు. అయితే, శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు రుతురాజ్ అవుట్ కావడం దురదృష్టకరం.కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల రంజీ ట్రోఫీ(ఫస్ట్‌క్లాస్ క్రికెట్)లో అదరగొట్టాడు. అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం రుతుకు శుభారంభం లభించలేదు. గత నాలుగు మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చేసిన పరుగులు వరుసగా.. 1, 19, 4, 2.48 బంతుల్లోనే 97 పరుగులుఈ నేపథ్యంలో రుతు టీ20 బ్యాటింగ్ తీరుపై విమర్శలు రాగా.. సర్వీసెస్‌తో మ్యాచ్ సందర్భంగా బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఆష్రిన్ కులకర్ణి(29)తో కలిసి మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఆరంభించిన రుతు.. 48 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.ఇక 202కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన రుతు.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నపుడు అవుటయ్యాడు. సర్వీసెస్ బౌలర్ మోహిత్ రాఠీ బౌలింగ్‌లో వికాస్ హథ్వాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి విఫలంమిగతా వాళ్లలో రాహుల్ త్రిపాఠి(13) విఫలం కాగా.. సిద్ధార్థ్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 32), ధన్‌రాజ్ షిండే(14 బంతుల్లో 32) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
మహారాష్ట్ర కెప్టెన్‌గా రుతురాజ్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024 కోసం మహారాష్ట్ర జట్టును నిన్న (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువకుల మేళవింపుగా ఉంది. అంకిత్ బవానే, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ చౌదరీ లాంటి సీనియర్లు జట్టులో ఉన్నారు. నిఖిల్ నాయక్, ధన్‌రాజ్ షిండే వికెట్కీపర్లుగా ఎంపికయ్యారు. రాజవర్ధన్ హంగర్గేకర్, ప్రశాంత్ సోలంకి బౌలింగ్ విభాగంలో కీలకంగా ఉంటారు.ఈ టోర్నీలో మహారాష్ట్ర గ్రూప్-ఈలో ఉంది. ఈ గ్రూప్‌లో కేరళ, ముంబై, ఆంధ్రప్రదేశ్, గోవా, సర్వీసెస్, నాగాలండ్ లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 23న ఆనుంది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సేన నాగాలాండ్‌తో తలపడుతుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర గతేడాది నాకౌట్ దశకు చేరలేకపోయింది. ఈసారి పటిష్ట జట్టు ఉండటంతో పాటు రుతురాజ్ సారథ్యం తోడవ్వడంతో మహారాష్ట్ర టైటిల్‌పై కన్నేసింది.కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఈసారి రసవత్తరంగా మారనుంది. ఈ ఎడిషన్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు జట్లను ముందుండి నడిపించనున్నారు. మహారాష్ట్రకు రుతురాజ్ సారథ్యం వహిస్తుండగా.. ముంబైకు శ్రేయస్ అయ్యర్, ఉత్తర్‌ప్రదేశ్‌కు భువనేశ్వర్ కుమార్, కేరళకు సంజూ శాంసన్, బరోడాకు కృనాల్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా (బరోడా), మొహమ్మద్ షమీ (బెంగాల్) లాంటి టీమిండియా స్టార్లు కూడా పాల్గొననున్నారు. ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 135 మ్యాచ్‌లు జరుగనున్నాయి.మహారాష్ట్ర జట్టు..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అంకిత్ బవానే, అర్షిన్ కులకర్ణి, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ (వికెట్‌కీపర్), ధన్‌రాజ్ షిండే (వికెట్‌కీపర్), దివ్యాంగ్ హింగనేకర్, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, అథర్వ కాలే, సిద్ధార్థ్ మాత్రే, సత్యజీత్ బచ్చవ్, రాజవర్ధన్ హంగర్గేకర్, అజీమ్ కాజీ, రుషబ్ రాథోడ్, సన్నీ పండిట్ -
సిక్సర్ల వర్షం కురిపించిన రుతురాజ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్, భారత్-ఏ మధ్య వాకా వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏకు ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రెండు.. మానవ్ సుతార్, హర్షిత్ రాణా బౌలింగ్‌లో తలో సిక్సర్ బాదాడు. ఈ మ్యాచ్‌లో గంటకు పైగా బ్యాటింగ్ చేసిన రుతురాజ్ ఆతర్వాత సర్ఫరాజ్ ఖాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. రుతురాజ్ ఇటీవలే ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్-ఏ జట్టుకు సారథ్యం వహించాడు. ఈ సిరీస్‌లో రుతురాజ్ ఆశించిన మేరకు రాణించకపోయినప్పటికీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాత్రం ఇరగదీశాడు. తాజా ఇన్నింగ్స్‌తో రుతురాజ్ టీమిండియా మేనేజ్మెంట్ను మెప్పించి తుది జట్టులో (ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు) చోటు దక్కించుకుంటాడేమో వేచి చూడాలి.🚨 Updates from Perth 4 Sixes from Ruturaj Gaikwad - 2 Vs Ashwin 1 Vs Sutar and one vs Rana - After playing for more than an hour made his way to Sarfaraz Khan.#AUSvsIND pic.twitter.com/yGMIjk4Wzp— RevSportz Global (@RevSportzGlobal) November 16, 2024చెమటోడ్చిన విరాట్, యశస్వి, గిల్రుతురాజ్ విషయాన్ని పక్కన పెడితే, టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెమటోడ్చారు. ఈ ముగ్గురు ఈ మ్యాచ్‌లో తలో రెండుసార్లు బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆశాజనకమైన ప్రదర్శన చేశాడు. యశస్వి జైస్వాల్ షార్ట్ బాల్స్‌ను మంచి టెక్నిక్‌తో ఎదుర్కొన్నాడు. శుభ్‌మన్ గిల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తడబడినప్పటికీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్థాయి మేరకు రాణించాడు. బౌలర్లలో ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముకేశ్ ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. అయితే అతను భారత మెయిన్ జట్టులో లేని విషయం తెలిసిందే. భారత సెలెక్టర్లు ముకేశ్‌ను ట్రావెలింగ్ రిజర్వగా ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’.. మండిపడ్డ రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ సహనం కోల్పోయాడు. అంపైర్ల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్‌ను అవుట్ చేసేందుకు మరీ ఇంత దిగజారాలా అంటూ సర్వీసెస్ జట్టు తీరును విమర్శించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? రుతురాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనభారత్-‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. ఆస్ట్రేలియా-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. అక్కడ రుతు స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలబడ్డాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు. ఆసీస్-‘ఎ’ జట్టుతో నాలుగు ఇన్నింగ్స్‌లో రుతురాజ్ చేసిన పరుగులు వరుసగా 0, 5, 4 ,11.దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్గాఇక రుతురాజ్ సారథ్యంలో భారత్-‘ఎ’ జట్టు ఇప్పటికే తొలి టెస్టులో ఓడి.. రెండో మ్యాచ్‌లోనూ పరాజయం దిశగా పయనిస్తోంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ నడుస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర జట్టు తమ నాలుగో మ్యాచ్‌లో సర్వీసెస్‌తో తలపడుతోంది. పుణె వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సర్వీసెస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ అయింది. 185 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 185 పరుగులకే కుప్పకూలింది. నిజానికి మహారాష్ట్ర ఈ మేర కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేయడానికి కారణం ఆ జట్టు కెప్టెన్ అంకిత్ బావ్నే. రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరీలో మహారాష్ట్ర టీమ్‌ను ముందుకు నడిపిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అర్ధ శతకంతో మెరిశాడు.సర్వీసెస్‌తో మ్యాచ్‌లో తమ మొదటి ఇన్నింగ్స్‌లో 104 బంతులు ఎదుర్కొన్న అంకిత్.. 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులు చేశాడు. అయితే, అతడు అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. వివాదాస్పద రీతిలో అంకిత్ అవుట్క్రీజులో పాతుకుపోయిన అంకిత్ వికెట్ తీయాలన్న పట్టుదలతో ఉన్న సర్వీసెస్.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న తమ పేసర్ అమిత్ శుక్లాను రంగంలోకి దించింది.అతడి బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అంకిత్ విఫలమయ్యాడు. అంకిత్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభం రోహిలా చేతిలో పడ్డట్లు కనిపించింది. దీంతో సర్వీసెస్ అప్పీలు చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. అయితే, రీప్లేలో మాత్రం.. ఫీల్డర్ చేతిలో పడే కంటే ముందే బాల్ నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.అయినప్పటికీ అంకిత్ బావ్నేను అవుట్‌గా ప్రకటించడంతో మహారాష్ట్ర కీలక వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో అంకిత్ అవుటైన తీరుపై రుతురాజ్ ఘాటుగా స్పందించాడు. ‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘లైవ్ మ్యాచ్‌లో.. దీనిని ఎలా అవుట్‌గా ప్రకటిస్తారు? అసలు అది క్యాచ్ అవుట్ అని అప్పీలు చేయడం కూడా నిజంగా సిగ్గుచేటు’’ అని మహారాష్ట్ర రెగుల్యర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మండిపడ్డాడు.ఇక రంజీ తాజా సీజన్లో ఎలైట్ గ్రూప్-ఎ మ్యాచ్‌లలో భాగంగా తొలుత కశ్మీర్‌తో మ్యాచ్ డ్రా చేసుకున్న మహారాష్ట్ర.. ఆ తర్వాత ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. మేఘాలయపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి గెలుపుబాట పట్టింది.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య Ruturaj Gaikwad was fuming with Ankit Bawne's controversial dismissal against Services #RanjiTrophy2024 Source: Gaikwad's Instagram story pic.twitter.com/HParORg3YQ— Vijeet Rathi (@vijeet_rathi) November 7, 2024 -
Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రుతురాజ్ సేన ఓటమి దిశగా పయనిస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు భారత్-‘ఎ’- ఆసీస్- ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది.రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో.. బీజీటీకి ఎంపికైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ తదితరులు ముందుగానే భారత్-‘ఎ’ జట్టుతో చేరగా.. రెండో టెస్టు కోసం కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా కంటే ముందే ఆసీస్‌కు వచ్చారు.తొలిరోజు ఇలాఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుకాగా.. భారత్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (4), అభిమన్యు ఈశ్వరన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (16) అందివచ్చిన చక్కని అవకాశాన్ని అందుకోలేక మరోసారి చేతులెత్తేశాడు. ఒకే ఒక్కడు ధ్రువ్ జురేల్ (186 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్ ‘ఎ’ జట్టును ఆదుకున్నాడు.ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన అభిమన్యుతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (0)లను జట్టు ఖాతా తెరవకముందే నెసర్ తొలి ఓవర్ వరుస బంతుల్లోనే అవుట్ చేశాడు. రెండో ఓవర్లో రాహుల్, మూడో ఓవర్లో కెప్టెన్ రుతురాజ్ (4) నిష్క్రమించడంతో 11 పరుగులకే టాప్–4 బ్యాటర్లను కోల్పోయింది. ఈ దశలో దేవ్‌దత్ పడిక్కల్ (26; 3 ఫోర్లు)కు జతయిన జురేల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలకుండా ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించాక పడిక్కల్‌ను నెసర్ అవుట్ చేశాడు. జురెల్ ఈసారి నితీశ్‌తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో వెబ్‌స్టర్ ఒకే ఓవర్లో నితీశ్, తనుశ్ (0), ఖలీల్ అహ్మద్ (1)లను అవుట్ చేసి భారత్‌ను ఆలౌట్‌కు సిద్ధం చేశాడు. ప్రసిద్ కృష్ణ (14) సహకారంతో జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో నెసర్ (4/27), వెబ్‌స్టర్ (3/19) భారత్‌ను దెబ్బ కొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.ఆసీస్ 223 ఆలౌట్‌ఈ క్రమంలో 53/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత బౌలర్లు 223 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లు ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ మూడు వికెట్లు కూల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించాడు.మరోసారి విఫలమైన భారత బ్యాటర్లుఈ నేపథ్యంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(17), కేఎల్ రాహుల్(10) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 3 పరుగులకే నిష్క్రమించాడు.ఇక కెప్టెన్ రుతురాజ్(11) మరోసారి దారుణంగా విఫలం కాగా.. దేవ్‌దత్ పడిక్కల్ ఒక్క పరుగే చేయగలిగాడు. ధ్రువ్ జురెల్ మరోసారి పోరాటం చేస్తుండగా.. నితీశ్ రెడ్డి అతడికి తోడుగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్-‘ఎ’ 31 ఓవర్లు ఆడి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 73 పరుగులు చేసింది. ఆట పూర్తయ్యేసరికి జురెల్ 19, నితీశ్ రెడ్డి 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ మెక్ ఆండ్రూ, బ్యూ వెబ్స్టర రెండేసి వికెట్లు తీయగా.. కోరే రొచిసియోలి ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య -
అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య
యువ ఆటగాళ్లతో కూడిన భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం భారత్- ప్రొటిస్ జట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. జైత్రయాత్రను కొనసాగించాలని టీమిండియా.. పరాభవాల నుంచి కోలుకోవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ గురించి ప్రశ్న ఎదురైంది. అతడిని సౌతాఫ్రికా సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని విలేఖరులు అడుగగా.. ‘‘రుతు అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు.అతడి కంటే ముందు చాలా మందే ఉన్నారుఇక అతడి కంటే ముందు చాలా మంది ఆటగాళ్లు కూడా ఇలాగే అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆడించాలో మేనేజ్మెంట్కు బాగా తెలుసు. యాజమాన్యం నిర్ణయాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. రుతు ఇంకా యువకుడే. అతడికీ ఏదో ఒక రోజు టైమ్ వస్తుంది’’ అని సూర్య కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానమిచ్చాడు.కొత్త జోడీకాగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే, టీ20 ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో టీమిండియాలో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. అతడి బ్యాటింగ్ స్థానమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ముఖ్యంగా టీ20లలో యశస్వి జైస్వాల్- శుబ్‌మన్ గిల్ జోడీ ఓపెనర్లుగా పాతుకుపోగా.. వారి గైర్హాజరీలో కొత్తగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడీని బీసీసీఐ పరిశీలిస్తోంది.కెప్టెన్‌గా అవకాశాలుఅయితే, సౌతాఫ్రికాతో సిరీస్ కంటే ముందే భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు ప్రొటిస్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ రుతు చివరగా జింబాబ్వే పర్యటనలో టీమిండియా తరఫున టీ20 సిరీస్ ఆడాడు. ఆ టూర్లో 158కి పైగా స్ట్రైక్‌రేటుతో 133 పరుగులు సాధించాడు.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల దేశీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆసీస్ గడ్డపై విఫలంఅంతేకాదు.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న రుతు.. అక్కడ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. తొలి టెస్టులో 0, 5 పరుగులు చేసిన రుతు.. రెండో టెస్టులో 4, 11 రన్స్ చేశాడు. ఇక తొలి టెస్టులో ఏడు వికెట్ల తేడాతో ఓడిన భారత్-ఎ.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే' -
Aus A vs Ind A: రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్.. జురెల్ ఒక్కడే!.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. ఆట మొదటి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది.తొలి టెస్టులో ఓటమికాగా ఆసీస్-‘ఎ’- భారత్-‘ఎ’- జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మెకే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఈ మేర పరాభవం తప్పలేదు.అదొక్కటే సానుకూలాంశంఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం ఒక్కటే సానుకూలాంశం. ఈ క్రమంలో ఓటమిభారంతో గురువారం రెండో టెస్టు మొదలుపెట్టిన భారత జట్టు.. మరోసారి విఫలమైంది. రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్మెల్బోర్న్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. అయితే, ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. పెవిలియన్‌కు గత మ్యాచ్‌లో శతకం బాదిన వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి సున్నాకే అవుట్‌కాగా.. కెప్టెన్ రుతురాజ్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో మిడిలార్డర్లో దేవ్‌దత్ పడిక్కల్(26) కాసేపు పోరాడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పట్టుదలగా నిలబడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 186 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 80 పరుగులు సాధించాడు.నితీశ్ రెడ్డి మరోసారిమిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(16) మరోసారి నిరాశపరచగా.. మరో ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్(0), టెయిలెండర్లు ఖలీల్ అహ్మద్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ కృష్ణ 14 పరుగులు చేయగా.. ముకేశ్ కుమార్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.చెలరేగిన నాసెర్ఆసీస్ బౌలర్లలో పేసర్ మైకేల్ నాసెర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. స్పిన్నర్ కోరే రోచిసియెలి, కెప్టెన్ నాథన్ మెక్స్వినే(జురెల్ వికెట్) తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను ముందుగానే బీసీసీఐ అక్కడికి పంపించింది. వీరిలో జురెల్ హిట్ కాగా.. రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఇక బీజీటీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. చదవండి: WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్! వీడియో -
Aus A vs Ind A: శతక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆసీస్ టార్గెట్?
Australia A vs India A, 1st unofficial Test Day 3: ఆస్ట్రేలియా ‘ఎ’తో మొదటి అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచింది. మెక్కే వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన రుతురాజ్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పట్టుదలగా నిలబడింది. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా 312 పరుగులు చేయగలిగింది.సాయి సుదర్శన్ 200 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శతకం సాధించగా.. దేవ్‌దత్ పడిక్కల్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 199 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల సాయంతో 88 పరుగులు రాబట్టాడు. వీరితో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (32) రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.💯 for Sai Sudharsan Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSvIND pic.twitter.com/xIWxfavDFh— cricket.com.au (@cricketcomau) November 2, 2024ఆసీస్ టార్గెట్?ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసిన భారత్-ఎ ఓవరాల్‌గా 224 పరుగుల ఆధిక్యం సాధించింది. తద్వారా ఆసీస్‌కు 225 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో టీ సమయానికి ఆసీస్ జట్టు 21 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. తన బ్యాటింగ్ తీరుతో జూనియర్ రికీ పాంటింగ్‌గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్(16) మరోసారి విఫలమయ్యాడు. మార్కస్ హ్యారిస్ 29, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.First runs for Australia A from Sam Konstas 👀Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSAvINDA pic.twitter.com/an2oO9LPH9— cricket.com.au (@cricketcomau) November 2, 2024తొలి ఇన్నింగ్స్‌లో మూకుమ్మడిగా విఫలంకాగా శుక్రవారం నాటి రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 64 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. గురువారం మొదటి రోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ 47.4 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (36; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, ఆసీస్ ‘ఎ’ బౌలర్ బ్రెండన్ డగెట్ 6 వికెట్లు తీశాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 62.4 ఓవర్లలో 195 పరుగుల వద్ద ఆలౌటైంది. ముకేశ్ కుమార్ (6/46), ప్రసిధ్ కృష్ణ (3/59) ఆసీస్‌ను 136/7 స్కోరు వద్ద కట్టడి చేసినప్పటికీ మర్ఫీ (33), ఓనీల్ (13) ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శుక్రవారం రెండో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టగానే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), అభిమన్యు ఈశ్వరన్ (12) వికెట్లను కోల్పోయింది. ఆ దశలో సుదర్శన్, పడిక్కల్ జట్టును ఒడ్డున పడేసే ఆట ఆడారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 178 పరుగులు జోడించారు. తుదిజట్లుభారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.ఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్‌స్టాస్, మార్కస్ హ్యారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డగెట్, జోర్డాన్ బకింగ్‌హామ్.చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
Aus A vs Ind A: ముకేశ్ దెబ్బకు.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ జట్టుకు శుభారంభం లభించలేదు. ఆసీస్‌తో గురువారం మొదలైన అనధికారిక టెస్టు తొలి రోజు ఆటలోనే రుతురాజ్ సేనకు గట్టి షాక్ తగిలింది. కంగారూ బౌలర్ల విజృంభణ నేపథ్యంలో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.బ్యాటర్లు విఫలంఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(7), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) సహా బాబా ఇంద్రజిత్(9), వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4), నితీశ్ కుమార్ రెడ్డి(0), టెయిలెండర్లు మానవ్ సుతార్(1), ప్రసిద్ కృష్ణ(0) పూర్తిగా విఫలమయ్యారు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(21)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్(36), టెయిలెండర్ నవదీప్ సైనీ(23) ఓ మోస్తరుగా రాణించడంతో భారత్ వంద పరుగులు దాటగలిగింది. 47.4 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో సత్తా చాటగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ తలా ఒక వికెట్ పడగొట్టారు. Buckingham's got two! Watch #AUSAvINDA live: https://t.co/XcQLyyTDJ5 pic.twitter.com/RccWM8CX5R— cricket.com.au (@cricketcomau) October 31, 2024 ఆసీస్‌కూ ఆదిలోనే షాక్.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా-ఎ జట్టుకు భారత పేసర్ ముకేశ్ కుమార్ ఆదిలోనే షాకిచ్చాడు. తన అద్భుత ఆట తీరుతో ‘జూనియర్ రికీ పాంటింగ్’గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కన్‌స్టాస్(Sam Konstas)ను డకౌట్ చేశాడు. Mukesh gets Konstas in the first over! #AUSAvINDA pic.twitter.com/8E61yX0zTM— cricket.com.au (@cricketcomau) October 31, 2024మొత్తంగా మూడు బంతులు ఎదుర్కొన్న స్యామ్ ముకేశ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.టీమిండియాతో టెస్టుకు ఆసీస్ ఓపెనర్ల పోటీలో కాగా 19 ఏళ్ల స్యామ్ ఇప్పటి వరకు ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి రెండు శతకాలు బాదడం సహా సగటు 45.70గా నమోదు చేశాడు. భారత్-ఎ జట్టుతో మ్యాచ్‌లో గనుక రాణిస్తే తదుపరి టీమిండియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అతడు ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ లేకపోలేదు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ముకేశ్ రూపంలో స్యామ్‌కు గట్టి షాక్ తగిలింది.పాతుకుపోయిన కెప్టెన్ఇదిలా ఉంటే.. ప్రసిద్ కృష్ణ సైతం అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తొలుత కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను డకౌట్ చేసిన ప్రసిద్.. తర్వాత ఆసీస్-ఎ మరో ఓపెనర్ మార్కస్ హ్యారిస్(17) వికెట్ పడగొట్టాడు. ఇలా టాపార్డర్‌ను భారత బౌలర్లు కుదేలు చేసినా.. మిడిలార్డర్లో వచ్చిన కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ క్రీజులో పాతుకుపోయి ఇబ్బంది పెట్టాడు.అతడికి తోడుగా బ్యూ వెబ్‌స్టర్(33) రాణించాడు. అయితే, ముకేశ్ కుమార్ ఈ జోడీని విడదీయగా.. నాథన్‌కు జతైన కూపర్ కానొలీ సైతం పట్టుదలగా నిలబడ్డాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ 39 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి.. పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం ఆట ముగిసే సరికి నాథన్ 29, కూపర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆస్ట్రేలియా- ‘ఎ’ వర్సెస్ భారత్- ‘ఎ’ అనధికారిక తొలి టెస్టు(డే-1)👉వేదిక: గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎరీనా, మెక్కే👉టాస్: ఆస్ట్రేలియా-ఎ.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 107👉ఆసీస్ స్కోరు: 99/4 (39).. తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు భారత్ కంటే ఎనిమిది పరుగుల వెనుకంజతుదిజట్లుఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్‌స్టాస్, మార్కస్ హారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డోగెట్, జోర్డాన్ బకింగ్‌హామ్.భారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.చదవండి: IPL 2025: షాకింగ్.. అతడి కోసం జడ్డూను వదులుకున్న సీఎస్కే! -
Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం
ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక తొలి టెస్టులో భారత-‘ఎ’ జట్టు ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. రంజీల్లో పరుగుల వరద పారించిన ఓపెనింగ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్(35 బంతుల్లో 21), నాలుగో నంబర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(77 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో పేసర్ నవదీప్ సైనీ(23) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు.బాబా అపరాజిత్(9)తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4) విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. మానవ్ సుతార్ (1), ప్రసిద్ కృష్ణ(0) కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో వచ్చిన ముకేశ్ కుమార్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 47.4 ఓవర్లలో 107 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. మూకుమ్మడిగా విఫలంకాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భారత తుది జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా భారత యువ ఆటగాళ్లు అనధికారిక టెస్టులపై దృష్టి పెట్టారు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటి టీమ్ మేనేజ్మెంట్ను ఇంప్రెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్-ఎతో గురువారం నుంచి భారత్-ఎ తొలి అనధికారిక టెస్టు మొదలైంది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లోనే అందరూ మూకుమ్మడిగా విఫలం కావడం గమనార్హం. ముఖ్యంగా సీనియర్ టీమ్‌కు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో నిరాశపరచగా.. ప్రసిద్ కృష్ణ వికెట్లు తీస్తేనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు.దేశవాళీల్లో సత్తా చాటి... 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఈశ్వరన్ భారీగా పరుగులు సాధించినా దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. 99 మ్యాచ్‌లలో అతను 7638 పరుగులు సాధించగా, ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న తాజా మ్యాచ్ అతడికి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ .ఇంతటి అపార అనుభవం ఉన్న ఈశ్వరన్ పేరు పెర్త్‌లో జరిగే తొలి టెస్టు కోసం ఇప్పటికే పరిశీలనలో ఉంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉండటంతో రెగ్యులర్ ఓపెనర్‌గా ఈశ్వరన్కే తొలి ప్రాధాన్యత ఉంది. గాయాల నుంచి కోలుకునిఇక గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత దులీప్ ట్రోఫీ, ఇరానీ, రంజీలలో పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆడాడు. వీటిలో ప్రదర్శన గొప్పగా లేకపోయినా... అతని బౌలింగ్ శైలికి ఆసీస్ పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. ఇదే కారణంతో అతను సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు తన ఫామ్‌ను అందుకోవడంతో పాటు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు కూడా ప్రసిద్‌కు ఇది సరైన వేదిక కానుంది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తోఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పరిస్థితి వీరితో పోలిస్తే భిన్నం. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్‌పై టి20లో చెలరేగిన నితీశ్ ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతంగా ఏమీ లేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు సార్లు డకౌట్ అయిన అతను... 48 ఓవర్లు బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.అయినా సరే శార్దుల్ ఠాకూర్‌లాంటి ఆల్‌రౌండర్‌ను కాదని నితీశ్‌ను సెలక్టర్ల టెస్టు టీమ్‌కు ఎంపిక చేశారు. గత ఏడాది రంజీ సీజన్లో 25 వికెట్లు తీసిన నితీశ్ ప్రదర్శన కూడా ఒక కారణం కాగా... వికెట్‌కు ఇరు వైపులా బంతిని చక్కగా స్వింగ్ చేసే అతని నైపుణ్యం ఆసీస్ పిచ్‌లపై పనికొస్తుందని వారు భావించారు. ఈ నేపథ్యంలో తానేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత నితీశ్పైనే ఉంది. టెస్టు క్రికెటర్లు కూడా... భారత్ తరఫున ఇంకా టెస్టులు ఆడని రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో భారత ‘ఎ’ జట్టు బరిలోకి దిగింది. ఇప్పటికే భారత్‌కు ఆడిన ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, దేవదత్ పడిక్కల్, ముకేశ్ కుమార్లాంటి ప్లేయర్లు మరోసారి ఎరుపు బంతితో తమ ఆటను నిరూపించుకోవాల్సి ఉంది.ఆసీస్ క్రికెటర్లకూ పరీక్షఇక రంజీ, దులీప్ ట్రోఫీలో రాణించి ఈ టీమ్‌కు ఎంపికైన బాబా ఇంద్రజిత్, రికీ భుయ్, ఖలీల్, తనుశ్ కొటియాన్, సాయిసుదర్శన్ రాణించడం వారి భవిష్యత్తుకు కీలకం. మరోవైపు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో కూడా పలువురు టెస్టు క్రికెటర్లు ఉన్నారు. మైకేల్ నెసర్, మార్కస్ హారిస్, స్కాట్ బోలండ్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, టాడ్ మర్ఫీ ఆసీస్ ప్రధాన జట్టులోకి పునరాగమనం చేసే ప్రయత్నంలో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.ఇక పరిమిత ఓవర్ల పోటీల్లో సత్తా చాటిన జోష్ ఫిలిప్ కూడా ఇక్కడ రాణించి టెస్టు అరంగేట్రాన్ని ఆశిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన 19 ఏళ్ల ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా సెలక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు.‘జూనియర్ రికీ పాంటింగ్’గా అందరూ పిలుస్తున్న ఈ బ్యాటర్ 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 2 సెంచరీలు సహా 45.70 సగటుతో పరుగులు సాధించాడు. ఇక్కడ బాగా ఆడితే భారత్‌తో టెస్టుకు అతడు కొత్త ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఎ’ జట్ల పోరు కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం. చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్Waking up early just to see Ruturaj score a golden duck. Bro not doing justice to his fans now pic.twitter.com/KDfzJmXXZ2— Div🦁 (@div_yumm) October 31, 2024 -
ఆసీస్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. ఆంధ్ర ప్లేయర్లకు చోటు
ఆస్ట్రేలియా గడ్డపై జరిగే రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇద్దరు ఆంధ్ర ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, రికీ భుయ్‌లకు ఇందులో చోటు లభించింది.భారత సీనియర్ టీమ్‌లో స్థానం కోల్పోయిన ఇషాన్ కిషన్‌కు ఈ జట్టులో అవకాశం దక్కడం విశేషం. ఈ టూర్లో భాగంగా ఆ్రస్టేలియా ‘ఎ’తో మెకే, మెల్బోర్న్లలో భారత్ ‘ఎ’ నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడుతుంది. ఆ తర్వాత టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న భారత సీనియర్ టీమ్‌తో పెర్త్‌లో మూడు రోజుల మ్యాచ్‌లో కూడా తలపడుతుంది. ‘ఎ’ జట్టు ప్రదర్శన ద్వారా కూడా బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం కూడా ఒకరిద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. భారత ‘ఎ’ జట్టు వివరాలు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయిసుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, దేవ్‌దత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, అభిషేక్ పొరేల్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాళ్, నవదీప్ సైనీ, మానవ్ సుథార్, తనుశ్ కొటియాన్.చదవండి: అభిషేక్ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం -
IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల (అక్టోబరు) 31 నాటికి.. అట్టిపెట్టకునే ఆటగాళ్ల తుదిజాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) రిటెన్షన్స్‌కు సంబంధించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.కాగా ఐపీఎల్ పాలక మండలి రిటెన్షన్ విధానంలో భాగంగా కొత్త నిబంధనలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఆరుగురు(ఆర్టీఎమ్) ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో రిటెన్షన్ స్లాబ్‌లో మొదటి ఆటగాడికిరూ. 18 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 14 కోట్లు, మూడో క్రికెటర్‌కు రూ. 18 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 14 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 11 కోట్లు, ఆరో ఆటగాడికి రూ. 4 కోట్లు(అన్క్యాప్డ్) చెల్లించాల్సి ఉంటుంది.సీఎస్కే రిటైన్ చేసుకునేది వీరినే? ఎవరికి ఎన్ని కోట్లుఇక తాజా సమాచారం ప్రకారం సీఎస్కే తమ టాప్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరణలను రిటైన్ చేసుకోవాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇందులో ధోనిని అన్క్యాప్డ్ కోటాలో ఎంపిక చేసుకుని రూ. 4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన ఫ్రాంఛైజీ.. రుతుతో పాటు జడ్డూకు రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. రుతురాజ్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2008లో ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. జట్టును అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి ఈ ఘనత సాధించిన రెండో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అయితే, గతేడాది సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని ఆటగాడిగా కొనసాగాడు.సీఎస్కే అంటే ధోనినిజానికి ధోని అంటే సీఎస్కే.. సీఎస్కే అంటే ధోని. ధోని బ్రాండ్ వల్లే చెన్నై ఫ్రాంఛైజీకి ఆదరణ పెరుగిందనేద కాదనలేని వాస్తవం. అంతేకాదు.. వేలం మొదలు కెప్టెన్సీ వరకు ధోని ఆజ్ఞ లేనిదే అక్కడ ఏ పని జరగదని సన్నిహిత వర్గాలు అంటాయి. మరి అలాంటి ధోని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఎలా? అంటే.. బీసీసీఐ నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లను ఫ్రాంఛైజీలో ఈ కోటాలో వేసుకోవచ్చు.PC: BCCIఇద్దరు శిష్యులుచెన్నైకి రుతుతో పాటు జడేజా కూడా ముఖ్యం కాబట్టి వాళ్లిద్దరికి రూ. 18 కోట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. కాగా రుతురాజ 2019లో సీఎస్కేలో చేరాడు. 2020లో అరంగేట్రం చేసిన అతడు ఆ మరుసటి ఏడాదే ఆరెంజ్‌క్యాప్ హోల్డర్ అయ్యాడు. ఆసియా క్రీడలు-2023లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథ్యం వహించి గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత.. ఈఏడాది సీఎస్కే పగ్గాలు చేపట్టాడు.ఇక రవీంద్ర జడేజాకు సీఎస్కేతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2022లో కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. కానీ వరుస ఓటముల నేపథ్యంలో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేశాడు. ఈ ఇద్దరికి వరుస అవకాశాలు ఇచ్చి జట్టులో కీలక సభ్యులుగా నిలబెట్టింది మాత్రం ధోనినే!చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన -
సూర్యకుమార్ మళ్లీ ఫెయిల్.. రుతురాజ్ సూపర్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. తొలుత జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో 86 పరుగులతో రాణించిన ఈ మహారాష్ట్ర కెప్టెన్.. ముంబైతో మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. తద్వారా తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో ఏడో సెంచరీని నమోదు చేశాడు.కాగా రంజీ టోర్నీలో భాగంగా ముంబై- మహారాష్ట్ర మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీలో వేదికగా టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రుతురాజ్ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కావడం ప్రభావం చూపింది.సూర్యకుమార్ మళ్లీ ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆదిలోనే ఓపెనర్ పృథీ షా(1) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ(176)తో రాణించాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(142) కూడా శతక్కొట్టాడు. అయితే, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం మరోసారి రెడ్‌బాల్ క్రికెట్లో విఫలమయ్యాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.రుతురాజ్ సూపర్ సెంచరీఅయితే, ఆయుశ్, శ్రేయస్‌ల భారీ సెంచరీల వల్ల ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఓపెనర్ సచిన్ దాస్(98) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 171 బంతులు ఎదుర్కొన్న అతడు 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 145 రన్స్ సాధించాడు.మూడో రోజు ఆటలో భాగంగా ఆదివారం రుతుతో పాటు అంకిత్ బావ్నే తన సూపర్ హాఫ్ సెంచరీని శతకం దిశగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 377 రన్స్ స్కోరు చేసింది. కాగా ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌కు ప్రకటించిన భారత్-‘ఎ’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ ఇటీవల దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగి కేవలం ఐదు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.మహారాష్ట్ర వర్సెస్ ముంబై తుదిజట్లుమహారాష్ట్రరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, అంకిత్ బావ్నే, నిఖిల్ నాయక్ (వికెట్ కీపర్), సచిన్ దాస్, అజీమ్ కాజీ, సత్యజీత్ బచావ్, సిద్ధేష్ వీర్, ఆర్ఎస్ హంగర్గేకర్, ప్రదీప్ దధే, హితేష్ వాలుంజ్.ముంబైపృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, షామ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి, రాయిస్టన్ డైస్.చదవండి: సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్Ruturaj Gaikwad reaches a brilliant hundred and is still going strong! 💯🔥 Leading Maharashtra’s charge against Mumbai with his classy batting, more runs to come!#RuturajGaikwad #CenturyInProgress #RanjiTrophy2024 #MaharashtraCricket pic.twitter.com/J6EwHQPZtC— Maharashtra Cricket Association (@MahaCricket) October 20, 2024 -
ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్! తెలుగోడికి చోటు?
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆసీస్-ఎ జట్టుతో భారత్ రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు పంపే జట్టును సెలక్టర్లు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన భారత్-ఎ జట్టుకు స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నట్లు సమాచారం. రుతురాజ్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ క్రికెట్లో తను ఏంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మహారాష్ట్రకు గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి భారత-ఎ జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు వినికిడి.కిషన్‌కు చోటు?అదేవిధంగా ఆసీస్ టూర్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన కిషన్.. ప్రస్తుతం రంజీల్లో జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో కిషన్ పర్వాలేదన్పిస్తున్నాడు. అంతకముందు దులీప్ ట్రోఫీలో కూడా ఇషాన్ సత్తాచాటాడు. ఈ క్రమంలో అతడిని ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టులో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రికీ భుయ్ కూడా చోటు సంపాదించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ టూర్‌కు భారత్- ఎ జట్టు(అంచనా)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్,సాయి సుదర్శన్, బి ఇంద్రజిత్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, రికీ భుయ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవ్‌దీప్ సైనీ, ఖాలీల్ అహ్మద్, తనుష్ కోటియన్, యశ్ దయాళ్చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
సెంచరీ చేజార్చుకున్న రుతురాజ్
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్, టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రుతు 86 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ పక్క రుతురాజ్ సెంచరీ చేజార్చుకోగా సహచరుడు సిద్దేశ్ వీర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మూడో రోజు టీ విరామం సమయానికి మహారాష్ట్ర స్కోర్ 3 వికెట్ల నష్టానికి 221 పరుగులుగా ఉంది. సిద్దేశ్ వీర్ (100), అంకిత్ బావ్నే (9) క్రీజ్‌లో ఉన్నారు. మహారాష్ట్ర ఇన్నింగ్స్‌లో ముర్తజా ట్రంక్వాలా (0), సచిన్ దాస్ (10) నిరాశపరిచారు. జమ్మూ అండ్ కశ్మీర్ బౌలర్లలో రసిక్ దార్ సలామ్ రెండు వికెట్లు పడగొట్టగా.. యుద్ద్‌వీర్ సింగ్ చరక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం మహారాష్ట్ర జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 298 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభమ్ ఖజూరియా డబుల్ సెంచరీతో (255), శివాంశ్ శర్మ (106 నాటౌట్) అజేయ సెంచరీతో విజృంభించారు. వీరిద్దరు మినహా జమ్మూ అండ్ కశ్మీర్ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శుభమ్ పుండిర్ 37, డోగ్రా 30, ఆబిద్ ముస్తాక్ 29 (నాటౌట్) పరుగులు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో హితేశ్ వలుంజ్ 4 వికెట్లు పడగొట్టగా.. అర్షిన్ కులకర్ణి, ముకేశ్ చౌదరీ, రజినీష్ గుర్బానీ తలో వికెట్ దక్కించుకున్నారు. -
‘భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. మూడో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అభిమానులు రుతు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే, భారత టెస్టు జట్టుకు ఎంపిక కావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.కాగా రంజీ చాంపియన్ ముంబై- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతోంది. లక్నో వేదికగా అక్టోబరు 1న మొదలైన ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.సర్ఫరాజ్ డబుల్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (276 బంతుల్లో 221 బ్యాటింగ్; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 237/4తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై రెండో రోజంతా అదే జోరు కనబర్చింది.కెప్టెన్ అజింక్య రహానే, షమ్స్ ములానీ (5) త్వరగానే ఔటైనా... తనుశ్ కోటియాన్ (124 బంతుల్లో 64; 6 ఫోర్లు)తో కలిసి సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 183 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ముంబై ఆటగాడిగా సర్ఫరాజ్ రికార్డు సృష్టించాడు.భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!ఇలా... టీమిండియా టెస్టు జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలని చూస్తున్న సర్ఫరాజ్ దేశవాళీల్లో భీకర ఫామ్ కొనసాగిస్తూ చెలరేగగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వద్ద ఉండగా.. ముంబై ప్లేయర్ జునైద్ ఖాన్ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆదిలోనే రెస్ట్ ఆఫ్ ఇండియాకు షాక్ తగిలింది.అయితే, మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అర్ధ శతకంతో అదరగొట్టి సెంచరీ దిశగా పయనిస్తుండగా.. సాయి సుదర్శన్(32) అతడికి సహకారం అందించాడు. ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆటలో 36 ఓవర్లు ముగిసేసరికి రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై కంటే 396 పరుగులు వెనుకబడి ఉంది.సెలక్టర్లు మాత్రం ఏం చేస్తారు?కాగా టీమిండియా టెస్టు ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ పాతుకుపోయిన విషయం తెలిసిందే. రోజురోజుకూ బ్యాటింగ్ మెరుగుపరచుకుంటూ ఈ యంగ్‌స్టర్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇలాంటి తరుణంలో బ్యాకప్ ఓపెనర్‌గా అయినా స్థానం దక్కించుకునేందుకు రుతు ప్రయత్నిస్తున్నాడు.ఈ క్రమంలో.. ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టు సారథిగా వ్యవహరించిన రుతురాజ్.. మూడు మ్యాచ్‌లలో కలిపి 232 పరుగులు చేయగలిగాడు. అయితే, తాజాగా ఇరానీ కప్ మ్యాచ్‌లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. కాగా టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రుతురాజ్ కూడా జట్టుకు ఎంపికవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇలాంటి ఆట తీరుతో అతడు సెలక్టర్లను ఆకట్టుకోవడం కష్టమేనని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.చదవండి: కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ Maiden First-Class wicket for Mohammad Juned Khan on debut 🙌What a way to get off the mark! He gets the big wicket of captain Ruturaj Gaikwad 👌#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/KvUOFHK6Nx— BCCI Domestic (@BCCIdomestic) October 3, 2024 -
రుతురాజ్ గైక్వాడ్‌కు బంపరాఫర్.. టీమిండియా ఓపెనర్‌గా!?
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. రెగ్యూలర్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్‌కు విశ్రాంతి ఇచ్చినప్పటకి రుతురాజ్ వైపు మాత్రం సెలక్టర్లు మొగ్గు చూపలేదు.దీంటో టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి రుతుకు జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని చాలా మంది తప్పుబట్టారు. అయితే బంగ్లాతో టీ20 సిరీస్‌కు గైక్వాడ్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.ఆసీస్ టూర్‌కు రుతురాజ్..రుతురాజ్ గైక్వాడ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. ఆసీస్ టెస్టు సిరీస్‌కు రుతురాజ్‌ను టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడిని బంగ్లాతో టీ20లకు ఎంపిక చేయకుండా, ఇరానీ కప్‌లో ఆడేందుకు సెలక్టర్లు అవకాశమిచ్చినట్లు ఓ రిపోర్ట్ పేర్కొంటుంది.ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు గైక్వాడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆసీస్ సిరీస్‌కు ముందు అతడిని వీలైనన్ని ఎక్కువ రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడనమని సెలక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత భారత జట్టులో మూడో ఓపెనర్ కోసం ఎక్కువ మంది ఆటగాళ్లు లేరు. ఒకవేళ రోహిత్, జైశ్వాల్ గాయపడితో వారికి బ్యాకప్‌గా రుతురాజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది నవంబర్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం.. -
'అతడేం తప్పు చేశాడు.. నిజంగా సిగ్గు చేటు'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అయితే ఈ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.టీమిండియా తరపున అవకాశం వచ్చినప్పుడల్లా ఆకట్టుకున్న రుతురాజ్‌కు చోటు కల్పించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అతడి అభిమానులు భారత సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు అంటూ తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు.రుతురాజ్ గైక్వాడ్ టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. జింబాబ్వే పర్యటనలో అతడు అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఏ స్ధానంలో నైనా బ్యాటింగ్ చేస్తే సత్తా రుతుకు ఉంది. అటువంటి ఆటగాడి ఎందుకు పక్కన పెడుతున్నారు. నిజంగా సిగ్గు చేటు అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.భీకర ఫామ్‌లో రుతు..రుతురాజ్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. దేశీవాళీ క్రికెట్‌తో పాటు టీమిండియా తరపున కూడా తాను ఏంటో నిరూపించుకున్నాడు. భారత్ తరఫున 23 టీ20లు ఆడిన రుతురాజ్ 39.56 యావరేజ్ 633 రన్స్ చేశాడు. అటువైపు ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ రుతురాజ్ తన ప్రదర్శనలతో అకట్టుకున్నాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో కూడా గైక్వాడ్ దమ్ములేపాడు. ఈ ఏడాది సీజన్లో సీఎస్కే తరపున 14 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ ఏకంగా 583 పరుగులు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలోనూ సత్తాచాటాడు. ఆ తర్వాత అతడికి వరుసగా శ్రీలంక, బంగ్లాతో సిరీస్‌లకు సెలక్టర్లు చోటు ఇవ్వలేదు. బంగ్లాతో టీ20లకు ఓపెర్లు జైశ్వాల్, గిల్‌కు విశ్రాంతి ఇచ్చినప్పటికి.. రుతురాజ్ వైపు మాత్రం సెలక్టర్లు మొగ్గు చూపలేదు. ఇక ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.బంగ్లాతో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా . -
Ind vs Ban: గిల్, జైస్వాల్‌లకు రెస్ట్.. వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!
టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా వచ్చే నెల 6, 9, 12వ తేదీల్లో మూడు మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలోనే జట్టును ప్రకటించనుంది.ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ పొట్టి సిరీస్‌కు శుబ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌కు విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. కాగా సొంతగడ్డపై నవంబరులో టీమిండియా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే భారత్‌కు ఈ సిరీస్ కీలకం.గిల్, జైస్వాల్‌పై పనిభారం పడకుండాఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్‌పై పనిభారం పడకుండా చూసుకునేందుకు.. మేనేజ్మెంట్ ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత.. గిల్- జైస్వాల్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా ప్రధాన ఓపెనింగ్ జోడీగా మారారు.వాళ్లిద్దరికి లక్కీ ఛాన్స్!అయితే, కివీస్‌తో సిరీస్ కారణంగా వీరిద్దరు గనుక దూరమైతే.. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు లక్కీ ఛాన్స్ వచ్చినట్లే! వీరిద్దరు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. అయితే, రుతురాజ్ ఇరానీ కప్-2024 మ్యాచ్ కారణంగా తొలి టీ20కి దూరం కానున్నాడని.. అందుకే జైస్వాల్ ఆ ఒక్కమ్యాచ్కి అందుబాటులో ఉంటాడనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.కాగా ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-‘సి’ కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మ్యాచ్ అక్టోబరు 1-5 వరకు జరుగనుంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపిక కానుండగా.. జితేశ్ శర్మను అతడికి బ్యాకప్‌గా సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.విధ్వంసకర సెంచరీ హీరో అభిషేక్ శర్మటీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో స్థానం దక్కించుకున్న పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తొలిటీ20 సందర్భంగా అరంగేట్రం చేశాడు.అయితే, తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయి విమర్శపాలైన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో టీ20లో శతకంతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకుని.. ఆ తర్వాత అవుటయ్యాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు అతడికి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. ఇక టీమిండియా విషయానిస్తే.. బంగ్లాతో తొలి టెస్టు గెలిచి.. శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆడనుంది.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్ -
జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్
ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ జట్టుకు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే దులీప్ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌కు మాత్రం బీసీసీఐ సెలక్టర్లు మొండి చేయిచూపించింది. అతడికి ఇరానీ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వలేదు. అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత క్రికెటర్లు ధ్రువ్ జురెల్, యష్ దయాల్‌ను ఈ జట్టులో సెలెక్టర్లు చేర్చారు. దీంతో వీరిద్దరూ రెండు టెస్టుకు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. మరోవైపు ఈ ఇరానీ కప్‌లో ముంబై జట్టుకు సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు.ఇరానీ ట్రోఫీకి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్*, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్చదవండి: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం.. ట్రోఫీ మాదే: హర్మన్ -
ఆవేశ్‌ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్‌లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు వెనుకబడి ఉంది.టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్‌తో అదరగొట్టాడు.టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు. -
అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. నిరాశపరిచిన స్కై, రుతు, ఇషాన్
దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతపురం వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్‌లో ఈశ్వరన్ 116 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (39), రాహుల్ చాహర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, ఆధిత్య థాకరే 2, సౌరభ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇండియా-డి తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 139 పరుగులు వెనుకపడి ఉంది.సూర్యకుమార్ యాదవ్ విఫలంఇండియా-బి ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు మాత్రమే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఎన్ జగదీషన్ (13), సుయాశ్ ప్రభుదేశాయ్ (16), ముషీర్ ఖాన్ (5), నితీశ్ రెడ్డి (0) కూడా విఫలమయ్యారు.సంజూ మెరుపు సెంచరీసంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవ్‌దీప్ సైనీ ఐదు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్ కిషన్అనంతపురంలోనే జరుగుతున్న మరో మ్యాచ్‌లో (ఇండియా-ఏతో) ఇండియా-సి ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.రాణించిన అభిషేక్ పోరెల్ఇండియా-సి ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (82) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. పుల్కిత్ నారంగ్ (35 నాటౌట్), విజయ్ కుమార్ వైశాఖ్ (14 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-ఏ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇండియా-సి ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకిబ్ ఖాన్ 3, షమ్స్ ములానీ 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.శాశ్వత్ రావత్ సెంచరీ.. హాఫ్ సెంచరీ చేసిన ఆవేశ్ ఖాన్శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. ఆవేశ్ ఖాన్ (51 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. టెయిలెండర్లు షమ్స్ ములానీ (44), ప్రసిద్ద్ కృష్ణ (34) పర్వాలేదనిపించారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: IND VS BAN 1st Test: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్ -
అన్షుల్ కాంబోజ్ సరికొత్త చరిత్ర.. అగ్రస్థానంలోకి ‘సి’ జట్టు
దులిప్ ట్రోఫీ-2024 సందర్భంగా ఇండియా-‘సి’ బౌలర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన పేసర్‌గా నిలిచాడు. ఇండియా-‘బి’తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందు దేబాశీష్ మొహంతి (10/46) ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్.. తొలి రెండు రౌండ్లలో కలిపి జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఫలితం తేలగా మరో మ్యాచ్ మాత్రం పేలవమైన ‘డ్రా’గా ముగిసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనంతపురం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ఇండియా-‘బి’, ఇండియా-‘సి’ జట్లు సమంగా నిలిచాయి. ఆట నాలుగో రోజు ఉదయం వరకు కూడా ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 309/7తో ఆట కొనసాగించిన ‘బి’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్షుల్ కాంబోజ్ (8/69) ప్రత్యర్థిని పడగొట్టాడు.అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ‘సి’ తమ రెండో ఇన్నింగ్స్‌ను 37 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ దశలో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల ఆధిక్యం సాధించిన ‘సి’ టీమ్‌కు 3 పాయింట్లు, ‘బి’ టీమ్‌కు 1 పాయింట్ లభించాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఓవరాల్‌గా తొమ్మిది పాయింట్లతో ఇండియా-‘సి’ ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అర్ధ శతకంతో మెరిసిన రుతురాజ్ఆదివారం భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 7 ఓవర్లు సరిపోయాయి. తమ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడూ పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఖాతాలోకే వెళ్లగా... కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఏకంగా 193 పరుగుల ఆధిక్యం ఉండి కాస్త దూకుడుగా ఆడి విజయం కోసం సవాల్ విసిరే స్థితిలో ఉన్న ‘సి’ టీమ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సాయి సుదర్శన్ (11) విఫలం కాగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (93 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ చేశాడు. రుతురాజ్, రజత్ పటిదార్ (84 బంతుల్లో 42; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 96 పరుగులు జత చేశారు.ఇండియా-‘బి’ వర్సెస్ ఇండియా-‘సి’ స్కోర్లుఇండియా-‘బి’- 332 ఇండియా-‘సి’- 525 & 128/4 డిక్లేర్డ్ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్రెండో రౌండ్ ముగిసిన దులిప్ ట్రోఫీ-2024 పాయింట్ల పట్టిక ఇలా..👉ఇండియా- ‘సి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 9👉ఇండియా- ‘బి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 7👉ఇండియా- ‘ఎ’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(0)-ఓడినవి(1)- పాయింట్లు 7👉ఇండియా- ‘డి’- 2(ఆడినవి)- గెలిచినవి(0)- డ్రా(0)- ఓడినవి(2)- పాయింట్లు 0.చదవండి: మూడు వందల వికెట్ల క్లబ్‌కు చేరువలో కుల్దీప్ -
భారత్ ‘సి’తో మ్యాచ్.. ఇండియా ‘బి’ దీటైన జవాబు
సాక్షి, అనంతపురం: టాపార్డర్, లోయర్ ఆర్డర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యాట్‌కు పని చెప్పడంతో... అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో పరుగుల వరద పారుతోంది. భారత్ ‘సి’తో జరుగుతున్న మ్యాచ్‌లో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘బి’ 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు సాధించింది. కెప్టెన్అభిమన్యు ఈశ్వరన్ (91 బంతుల్లో 51 బ్యాటింగ్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జగదీశన్ (126 బంతుల్లో 67 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్ ‘బి’ ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 401 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 357/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘సి’ 124.1 ఓవర్లలో 525 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74 బంతుల్లో 58; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ (156 బంతుల్లో 82; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. ఆఖర్లో అన్షుల్ కంబోజ్ (27 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ (బి) ముకేశ్ 58; సాయి సుదర్శన్ (సి) నవ్‌దీప్ సైనీ (బి) ముకేశ్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్‌దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ 12; మానవ్ సుతార్ (బి) రాహుల్ చహర్ 82; మయాంక్ మార్కండే (బి) నితీశ్ కుమార్ రెడ్డి 17; అన్షుల్ (బి) రాహుల్ చహర్ 38; విజయ్ కుమార్ వైశాఖ్ (సి) ఈశ్వరన్ (బి) రాహుల్ చహర్ 12; సందీప్ వారియర్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు: 23; మొత్తం (124.1 ఓవర్లలో ఆలౌట్) 525. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345, 6–382, 7–406, 8–461, 9–489, 10–525, బౌలింగ్: ముకేశ్ కుమార్ 32–4–126–4; సైనీ 23–3–101–1; వాషింగ్టన్ సుందర్ 18–1–67–0; నితీశ్ కుమార్ రెడ్డి 17–2–69–1; సాయికిశోర్ 18–2–78–0; రాహుల్ చహర్ 16.1–2–73–4. భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: అభిమన్యు ఈశ్వరన్ (బ్యాటింగ్) 51; జగదీశన్ (బ్యాటింగ్) 67; ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: (36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 124. బౌలింగ్: సందీప్ వారియర్ 1.1–0– 8–0; విజయ్ వైశాఖ్ 10–2–29–0; అన్షుల్ 8.5–2–30–0; మయాంక్ మార్కండే 5–0–18–0; మానవ్ సుతార్ 10–0–34–0.చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం -
రీఎంట్రీ ఇచ్చిన రుతురాజ్
ఇండియా-బితో జరుగుతున్న రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతను ఇన్నింగ్స్ ఆరంభంలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సింగిల్ తీసే క్రమంలో రుతురాజ్ కాలి మడమ మెలిక తిరగడంతో పెవిలియన్‌కు చేరాడు. అయితే, సెంచరీ హీరో ఇషాన్ కిషన్ ఔటయ్యాక రుతురాజ్ తిరిగి క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం అతను 46 పరుగులతో అజేయంగా ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రుతురాజ్‌తో పాటు మానవ్ సుతార్ (8) క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా-సి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 43, రజత్ పాటిదార్ 40, ఇషాన్ కిషన్ 111, బాబా ఇంద్రజిత్ 78, అభిషేక్ పోరెల్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, నవ్‌దీప్ సైనీ, రాహుల్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.ఇషాన్ సూపర్ సెంచరీఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు. గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. తొలి రౌండ్ మ్యాచ్‌కు ముందు బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ సెంచరీతో మెరిశాడు.ఆదుకున్న ములానీఇవాళే మొదలైన మరో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. అనంతపురం వేదికగానే జరుగుతున్న ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రథమ్ సింగ్ (7), మయాంక్ అగర్వాల్ (7), తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37), షాశ్వత్ రావత్ (15), కుమార్ కుషాగ్రా (28), తనుశ్ కోటియన్ (53), ప్రసిద్ధ్ కృష్ణ (8) ఔట్ కాగా.. షమ్స్ ములానీ (88), ఖలీల్ అహ్మద్ (15) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో విధ్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత రాణా తలో 2, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: ఇండియా-సికి బిగ్ షాక్.. రుతురాజ్‌కు గాయం -
ఇండియా-సికి బిగ్ షాక్.. రుతురాజ్‌కు గాయం
దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అనంతపురం వేదికగా ఇండియా బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్, భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ సాయి సుదర్శన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేందుకు క్రీజులోకి వచ్చాడు. తొలి బంతికే ఫోర్ కొట్టి మంచి ఆరంభాన్ని అందుకున్నాడు. కానీ రెండో బంతికే గాయపడి గైక్వాడ్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అయితే రుతురాజ్ గాయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఈ మ్యాచ్ టెలికాస్ట్ లేనందున అతడికి ఏమైందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఆదిలోనే గైక్వాడ్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడంతో ఇండియా-సి జట్టు బాధ్యతను పాటిదార్, సాయిసుదర్శన్ తమ భుజాలపై వేసుకున్నారు. 22 ఓవర్లు ముగిసే సరికి ఇండియా-సి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. సుదర్శన్(39), రజిత్ పాటిదార్(35) పరుగులతో ఆజేయంగా ఉన్నారు.తుది జట్లుఇండియా సి: అభిషేక్ పోరెల్ (వికెట్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పటీదార్, అన్షుల్ కాంబోజ్, బాబా ఇంద్రజిత్, బి సాయి సుదర్శన్, మయాంక్ మార్కండే, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, వైషక్ విజయ్‌కుమార్, సందీప్ వారియర్ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, ముఖేష్ కుమార్, ముషీర్ అహ్మద్ ఖాన్, నారాయణ్ జగదీసన్ (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, రాహుల్ చాహర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రింకు సింగ్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే జట్టులో విరాట్ కోహ్లి, బాబర్ ఆజం? -
మహారాష్ట్ర శాంసన్‌లా అతడి పరిస్థితి: బీసీసీఐపై ట్రోల్స్
రుతురాజ్ గైక్వాడ్.. దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్‌గా సత్తా చాటుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలుత అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన అతడు.. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఆరు వన్డేలు, 23 టీ20లు ఆడాడు.వన్డేల్లో 73.25 స్టైక్‌రేటుతో 115 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. పొట్టి ఫార్మాట్లో 143.54 స్టైక్‌రేటుతో 633 రన్స్ చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ సగటు 42.69. ఇప్పటి వరకు 29 ఇన్నింగ్స్ ఆడి 2092 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి.అయితే, రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం ఇంతవరకు టెస్టుల్లో అవకాశం రాలేదు. ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు కెప్టెన్‌గా అతడి పేరును ప్రకటించగానే.. త్వరలోనే రుతు టెస్టు అరంగేట్రం ఖాయమని అభిమానులు సంతోషపడిపోయారు. బ్యాటర్‌గా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఈ మహారాష్ట్ర ఆటగాడిని బంగ్లాదేశ్‌తో టెస్టులకు ఎంపిక చేస్తారని ఆశించారు.ఎందుకు అవకాశాలు ఇవ్వరు?కానీ.. తొలి టెస్టుకు ప్రకటించిన జట్టులో రుతుకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లను ట్రోల్ చేస్తూ నెట్టింట విమర్శలకు దిగాను రుతు ఫ్యాన్స్. వన్డే, టీ20 వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పోలుస్తూ రుతురాజ్‌కు తీరని అన్యాయం జరుగుతోందంటూ మండిపడుతున్నారు. ఇరవై ఐదేళ్ల గిల్‌కు లెక్కలేనన్ని అవకాశాలు ఇచ్చారని.. అదే 27 ఏళ్ల రుతు విషయంలో మాత్రం ఎందుకు వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు. టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా పాతుకుపోగా.. గిల్‌ను మూడో స్థానంలో ఆడిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.మహారాష్ట్ర శాంసన్‌లా అతడి పరిస్థితివన్డౌన్లో గిల్ విఫలమవుతున్నా అతడికి ఛాన్సులు ఇస్తున్న మేనేజ్మెంట్.. కనీసం బ్యాకప్ ఓపెనర్‌గా అయినా రుతురాజ్‌ను ఎందుకు ఎంపికచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ మాదిరే.. రుతుపై వివక్ష చూపుతున్నారని.. మహారాష్ట్ర శాంసన్ అంటూ రుతు పేరును ట్రెండ్ చేస్తున్నారు. కాగా దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి కెప్టెన్‌గా వ్యవహరించిన రుతురాజ్ గైక్వాడ్ ఇండియా-డితో మ్యాచ్‌లో 5, 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ఇండియా- ఎ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 25, 21 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాతో తొలి టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం రాత్రి ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో రుతురాజ్‌కు చోటు దక్కలేదు.చదవండి: Ind vs Ban: అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు!Squad is out. Shubman Gill makes the cut, but Ruturaj Gaikwad doesn't! Honestly, isn't this BCCI politics at play!? No matter how well guy performs and wins, he can never find a place in Rohit Sharma's team!What partiality, Mann.#INDvBAN #RuturajGaikwad #BCCI— Sharon Solomon (@BSharan_6) September 8, 2024


