
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జాతీయ సెలక్టర్లకు సవాలు విసిరాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్ 2లో వెస్ట్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్.. అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట రుతురాజ్ సత్తాచాటాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన తమ జట్టును రుతురాజ్ తన ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్‌కే కెప్టెన్ 131 బంతుల్లో 13 ఫోర్లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఈ మహారాష్ట్ర ఆటగాడు 157 బంతుల్లో 120 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 58 ఓవర్లు ముగిసే సరికి వెస్ట్ జోన్ 5 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. క్రీజులో రుతుతో పాటు తనీష్ కొటియన్(26) ఉన్నాడు.
గైక్వాడ్ టెస్టుల్లో ఎంట్రీ ఇస్తాడా?
టీమిండియా తరపున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన రుతురాజ్ గైక్వాడ్ .. టెస్టు డెబ్యూ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికి గైక్వాడ్‌కు ఒక్కసారి కూడా భారత టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటిలో గైక్వాడ్ టెస్టుల్లో ఆడే సూచనలు కన్పించడం లేదు.
ఎందుకంటే ఓపెనర్లగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ తమ స్ధానాలను సుస్థిరం చేసుకోగా.. మూడు, నాలుగు స్ధానాలు ప్రస్తుతానికి ఖాళీ లేవు. మూడో స్ధానంలో సాయిసుదర్శన్ వస్తుండగా.. నాలుగో ప్లేస్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సాయిసుదర్శన్, కరుణ్ నాయర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఒకవేళ ఆ స్ధానాన్ని మరో ఆటగాడికి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తే రుతురాజ్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి సెలక్టర్లు ఎటువంటి అనుహ్య నిర్ణయాలు తీసుకోపోవచ్చు. కాగా వెస్టిండీస్-భారత్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.