రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర స్టార్.. ప్రత్యర్ధి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో గైక్వాడ్ 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ తన సత్తా నిరూపించుకున్నాడని, అతడికి వన్డేల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ మెనెజ్‌మెంట్‌ను సూచించాడు.
కాగా శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరం కావడంతో రుతురాజ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. తొలి వన్డేలో విఫలమైనప్పటికి.. రెండో వన్డేలో మాత్రం కమ్ బ్యాక్ ఇచ్చాడు. సెంచరీతో పాటు విరాట్ కోహ్లీతో కలిసి 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.
"జట్టు సెలక్షన్ విషయంలో ఇకపై పెద్దగా ప్రయోగాలు చేయరని ఆశిస్తున్నాను . రతురాజ్ అద్భుతమైన ఆటగాడు. అతడికి మూడు ఫార్మాట్‌లలోనూ రాణించే సత్తా ఉంది. కచ్చితంగా రుతురాజ్ ఆల్ ఫార్మాట్ జట్టులో ఉండటానికి అర్హుడు.
అతడికి అవకాశాలు ఇవ్వండి. టెస్టుల్లో కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటికే రంజీ ట్రోఫీలో తనను నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అయితే రుతురాజ్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులోకి వచ్చి రాగానే సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది.
అతడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సౌతాఫ్రికా వంటి బౌలింగ్ అటాక్‌పై సెంచరీ కొట్టడం గొప్ప విషయం "అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా?


