రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 359 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
పదే పదే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌ను సఫారీ బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఈ కర్ణాటక పేసర్ 8.2 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 85 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ద్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి భారీగా పరుగులివ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
మ్యాచ్ మధ్యలో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ప్రసిద్ద్ కృష్ణపై అగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలో ఎంతో ప్రశాతంగా ఉండే రాహుల్.. ప్రసిద్ద్ కృష్ణ చెత్త బౌలింగ్ కారణంగా తన సహనాన్ని కోల్పోయాడు.
ఏమి జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో ప్రసిద్ద్ షార్ట్ పిచ్ బంతులు ఎక్కువగా సంధించి బ్యాటర్లకు టార్గెట్‌గా మారాడు. ఈ క్రమంలో ప్రోటీస్ ఇన్నింగ్స్ 42 ఓవర్ వేసిన ప్రసిద్ద్.. టోనీ డి జోర్జి హెడ్‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశాడు. అలా బౌలింగ్ చేయవద్దని రాహుల్ అంతకుముందే అతడికి చెప్పాడు.
కానీ ప్రసిద్ద్ మరోసారి అలానే బౌలింగ్ చేయడంతో కేఎల్ తన నోటికి పనిచెప్పాడు. ప్రసిద్ద్ నీ సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు. నేను చెప్పినట్లు చెయ్యి. ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాను కదా. అదే చేయ్యి అని రాహుల్ గట్టిగా అరుస్తూ ప్రసిద్ద్‌తో కన్నడలో అన్నాడు. అందుకు బదులుగా హెడ్‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయాలా అని ప్రసిద్ద్ బదులిచ్చాడు.
అరే షార్ట్ పిచ్ బంతులు వేయాల్సిన అవసరం లేదు. నీకు ఇప్పుడే చెప్పాను కదా. మళ్లీ అదే చేస్తున్నావు అని రాహల్ అన్నాడు. ఈ సంభాషణంతా స్టంప్ మైక్‌లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అవుతోంది. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా జరగనుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ಪಂದ್ಯದ ನಡುವೆ Prasidh Krishna ಅವರಿಗೆ KL Rahul ರವರ ವಿಶೇಷ ಕಿವಿಮಾತು!👏🏻🗣
📺 ವೀಕ್ಷಿಸಿ | #INDvSA 👉 2nd ODI | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports 2 ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TeamIndia pic.twitter.com/OkNN2aqkMc— Star Sports Kannada (@StarSportsKan) December 3, 2025


