టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతున్నాడు.
ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 41 బంతుల్లో అజేయమైన 51 పరుగులు చేసిన అతడు.. ఆతర్వాతి మ్యాచ్‌లో 15 బంతుల్లో 43 పరుగులు బాదాడు. తాజాగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ మరోసారి చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 46 పరుగులు చేశాడు.
ఇదే ఫామ్‌ను సంజూ సౌతాఫ్రికా సిరీస్‌లోనూ కొనసాగిస్తే టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే భారత బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఒక్కో స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఓ రకంగా చూస్తే.. ఆఖరి నిమిషం వరకు సంజూ స్థానానికి కూడా గ్యారెంటీ లేదు. జితేశ్ శర్మ రూపంలో అతడిని బలమైన పోటీ ఉంది.
కాగా, నిన్ననే సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ వికెట్‌కీపర్ బ్యాటర్ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. గాయపడినా ఈ జట్టుకు ఎంపికైన శుభ్‌మన్ గిల్ సిరీస్ సమయానికి అందుబాటులోకి రాకపోతే సంజూ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా
రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్, చండీగఢ్
మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్
నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్
ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.
ముంబైని ఓడించిన తొలి మొనగాడు
ప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబైని ఓడించిన ఏకైక కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రమే. ఈ టోర్నీలో కేరళకు సారధిగా వ్యవహరిస్తున్న సంజూ ఇవాళ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌గా, వికెట్‌కీపర్‌గా, కెప్టెన్‌గా రాణించి ముంబైని ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు.
తొలుత బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంజూ, ఆతర్వాత వికెట్‌కీపింగ్‌లోనూ సత్తా చాటి కీలక సమయంలో శివమ్ దూబేను స్టంపౌట్ చేశాడు. ఈ వికెటే మ్యాచ్‌ను మలుపు తిప్పి, కేరళను గెలిచేలా చేసింది.
స్కోర్ల వివరాలు..
కేరళ-178/5
ముంబై-163 ఆలౌట్


