క్రైస్ట్‌చర్చ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. టామ్ లాథమ్ (145), రచిన్ రవీంద్ర (176) భారీ శతకాలతో కదంతొక్కడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 481 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు స్కోర్ 417/4గా ఉంది. విల్ యంగ్ (21), బ్రేస్‌వెల్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో రోచ్, షీల్డ్స్‌కు తలో 2 వికెట్లు దక్కాయి.
అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే ఆలౌటైంది. చంద్రపాల్ (52), హోప్ (56) మాత్రమే అర్ద సెంచరీలతో రాణించారు. జేకబ్ డఫీ 5 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బేశాడు. హెన్రీ 3, ఫౌల్క్స్ 2 వికెట్లు తీశారు.
దీనికి ముందు న్యూజిలాండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే (231) ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (52), బ్రేస్‌వెల్ (47) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్ బౌలర్లు తలో చేయి వేసి న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు.


