క్రైస్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ బౌలర్లు చెలరేగిపోయారు. తలో చేయి వేసి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. కీమర్ రోచ్, సీల్స్, షీల్డ్స్, గ్రీవ్స్ తలో 2.. లేన్, ఛేజ్ చెరో వికెట్ తీసి కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 231 పరుగులకే కుప్పకూల్చారు.
కివీస్ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ (52) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. బ్రేస్‌వెల్ (47), బ్లండల్ (29), లాథమ్ (24), నాథన్ స్మిత్ (23), యంగ్ (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాన్వే (0), రచిన్ (3), ఫౌల్క్స్ (4), హెన్రీ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో కివీస్‌పై విండీస్ స్పష్టమై ఆధిపత్యం చలాయించింది.
అనంతరం బరిలోకి దిగిన విండీస్ బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపిస్తుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. షాయ్ హోప్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ 38, కెప్టెన్ ఛేజ్ 0 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 126 పరుగులు వెనుకపడి ఉంది. ప్రస్తుతం రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ ఇది.


