క్రైస్ట్చర్చ్లో వెస్టిండీస్తో ఇవాళ (డిసెంబర్ 2) మొదటి టెస్ట్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 102 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి ఔటైన అతడు.. విండీస్పై టెస్ట్ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో న్యూజిలాండ్ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
కేన్కు ముందు రాస్ టేలర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత విండీస్పై కేన్ టెస్ట్ పరుగుల సంఖ్య 1022 పరుగులకు చేరగా.. రాస్ టేలర్ పరుగుల సంఖ్య 1136గా ఉంది.
ఈ ఇన్నింగ్స్తో కేన్ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. టెస్ట్ల్లో విండీస్పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా నాథన్ ఆస్టల్ రికార్డును సమం చేశాడు. కేన్, ఆస్టల్ ఇద్దరూ విండీస్పై తలో 8 టెస్ట్ ఫిఫ్టీలు చేశారు.
కేన్ రికార్డులను పక్కన పెడితే.. ఈ మ్యాచ్లో కివీస్ తడబాటుకు లోనైంది. 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌటయ్యాక కేన్, కెప్టెన్ లాథమ్ (24) కాసేపు నిలకడగా బ్యాటింగ్ చేశారు.
94 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేన్ ఔట్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. జట్టు స్కోర్కు మరో పరుగు జోడించబడగానే లాథమ్ కూడా ఔటయ్యాడు. మరో 8 పరుగుల వ్యవధిలో రచిన్ రవీంద్ర (3) కూడా ఔటయ్యాడు. మరో 17 పరుగుల తర్వాత విల్ యంగ్ (14) కూడా పెవిలియన్కు చేరాడు.
విండీస్ బౌలర్లలో రోచ్, సీల్స్, లేన్ తలో వికెట్ తీయగా.. గ్రీవ్స్ 2 వికెట్లు పడగొట్టాడు. 48 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 148 పరుగులుగా ఉంది. టామ్ బ్లండల్ (29), బ్రేస్వెల్ (6) క్రీజ్లో ఉన్నారు.


