బీసీసీఐ వీడియో అనలిస్టుపై నిషేధం | BCCI Video Analyst Banned By BCCI For Encouraging Player To Fix Ranji Trophy Match, Check More Details Inside | Sakshi
Sakshi News home page

బీసీసీఐ వీడియో అనలిస్టుపై నిషేధం

Mar 13 2026 7:51 PM | Updated on Mar 13 2026 8:14 PM

Ban On BCCI Video Analyst Reason Is

బీసీసీఐ వీడియో అనలిస్టుపై నిషేధం

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌ చేసేందుకు ఆటగాడిని ప్రోత్సహించిన బీసీసీఐ వీడియో అనలిస్ట్‌పై యాంటీ కరప్షన్‌ యూనిట్‌ చర్య తీసుకుంది. ఆంధ్ర క్రికెట్‌ జట్టు వీడియో అనలిస్ట్‌ రాజా రెడ్డిపై నిషేధం విధిస్తున్నట్లు బోర్డు అంబుడ్స్‌మన్‌ ప్రకటించాడు. 

రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై బోర్డు విచారణ పూర్తి చేసింది. 2023–24 సీజన్‌లో భాగంగా ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఆటగాడు గిరినాథ్‌ రెడ్డిని ఫిక్సింగ్‌ చేసేందుకు రాజారెడ్డి ప్రోత్సహించాడు. దాంతో ఈ విషయాన్ని అతను వెంటనే టీమ్‌ మేనేజర్‌ జుగల్‌ కిషోర్‌కు తెలియజేశాడు. అనంతరం దీనిపై రాజారెడ్డి వాట్సప్‌ తదితర సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటా విచారణ చేపట్టిన యాంటీ కరప్షన్‌ యూనిట్‌ తమ నివేదికను అందించింది.  

Advertisement
 
Advertisement
Advertisement