IPL 2026: యుద్ధం జరిగినా ఆ చాన్స్‌ లేదు! | IPL 2026 Kicks Off With 20 Matches Amid Gas Shortages And State Elections, BCCI Ready With Contingency Plans | Sakshi
Sakshi News home page

IPL 2026: యుద్ధం జరిగినా ఆ చాన్స్‌ లేదు!

Mar 12 2026 10:48 AM | Updated on Mar 12 2026 11:53 AM

IPL 2026 Unlikely Face Oil-LPG-Disruptions-BCCI Ready With Contingency Plans

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2026 షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 28 నుంచి జరగనున్న సీజన్‌లో దేశంలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తొలి విడత షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. తొలి విడతలో 20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో గతేడాది చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి. ఈ సంగతి పక్కనబెడితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్‌, సహజ వాయువుల సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సంక్షోభం భారత్‌కు కూడా పాకింది. గ్యాస్‌ సంక్షోభం ఏర్పడడంతో బెంగళూరు, ముంబై సహా చాలా నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. చమురు, గ్యాస్‌ సంక్షోభం సెగ ఐపీఎల్‌కు తగిలే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా మ్యాచ్‌లు జరగబోయే స్టేడియం ఫ్లడ్‌లైట్లకు ఉపయోగించే ఇంధన సరఫరాతో పాటు ఆటగాళ్లకు, సిబ్బంది బస చేసే హోటళ్లలో గ్యాస్‌ సంక్షోభం ఏర్పడే అవకాశముందని ఐపీఎల్‌ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

దీనిపై అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇప్పుడైతే పరిస్థితులు బాగానే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఏదైనా సమస్యలు ఏర్పడినా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఐపీఎల్‌ ఆడేందుకు వచ్చే విదేశీ క్రికెటర్ల ప్రయాణాల్లోనూ కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.

పశ్చిమాసియా యుద్ధం కారణంగా విదేశీ ఆటగాళ్ల ఆగమనానికి సంబంధించిన ఇబ్బందులతో పాటు తమిళనాడు, అస్సాం, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌నే ప్రకటించారు. మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాకా పూర్తి సీజన్‌ ప్రకటిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

చదవండి: 'వరల్డ్‌కప్ కంటే.. నాన్నతో గడిపిన క్షణాలే విలువైనవి'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement