మైదానంలో అతి.. హార్దిక్ పాండ్యాపై కేసు న‌మోదు | Complaint Filed Against Hardik Pandya For Insulting National Flag After T20 World Cup Final, Know Full Details Inside | Sakshi
Sakshi News home page

T20 WC 2026: మైదానంలో అతి.. హార్దిక్ పాండ్యాపై కేసు న‌మోదు

Mar 12 2026 9:30 AM | Updated on Mar 12 2026 9:44 AM

Complaint Filed Against Hardik Pandya For Insulting National Flag After T20 World Cup Final

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ప‌డ్డాడు. పాండ్యా జాతీయ జెండాను అవమానించాడ‌ని పుణేకు చెందిన వాజిద్ ఖాన్ అనే అడ్వ‌కేట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. టీ20 ప్రపంచకప్ విజయోత్సవాల‌లో భాగంగా హార్దిక్‌ జాతీయ ప‌తాకాన్ని తన శరీరానికి చుట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో వాజిద్ పేర్కొన్నారు.

శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు న‌మోదైంది. జాతీయ జెండాను ఆ గౌర‌వ ప‌ర‌చ‌డం చట్టరీత్యా నేరమని, ప్రతి పౌరుడు జెండాను గౌరవించడం బాధ్యత అని అడ్వకేట్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొంటున్న‌ట్లు స‌మాచారం.

ఏమి జ‌రిగిందంటే?
ఫైన‌ల్లో న్యూజిలాండ్‌ను భార‌త్‌ చిత్తు చేసిన త‌ర్వాత తర్వాత నరేంద్ర మోదీ స్టేడియంలో విజయోత్సవాలు నిర్వహించారు. భార‌త ప్లేయ‌ర్ల కుటంబ స‌భ్యులను కూడా మైదానంలో అనుమతించారు. ఈ స‌మ‌యంలో పాండ్యా హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించాడు. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ మహికా శర్మ‌ను హగ్ చేసుకుంటూ ముద్దుల వర్షం కురిపించాడు.

ఆ స‌మ‌యంలో అత‌డి ఒంటిపై భార‌త జెండా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే అత‌డిపై పోలీసుల‌కు వాజిద్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. హార్దిక్ ప్ర‌వ‌ర్త‌నపై నెటిజ‌న్లు సైతం తీవ్ర అగ్ర‌హం వ్యక్తం చేశారు. కాగా ఈ టోర్నీలో పాండ్యా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. రెండు అర్ధ సెంచరీలు, 9 వికెట్ల‌తో భార‌త్ ఛాంపియ‌న్‌గా నిల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.
చదవండి: 'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement