ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొనం: ఇరాన్‌ | Iran Officially Withdraws From 2026 Mens Football World Cup In US Citing Security Concerns | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొనం: ఇరాన్‌

Mar 12 2026 7:37 AM | Updated on Mar 12 2026 12:29 PM

Iran All Set To Withdraw From FIFA World Cup 2026

దుబాయ్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొనబోమని ఇరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఉమ్మడిగా ఈ జూన్, జూలైల్లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ప్రస్తుతం తమ దేశం మీదపడి దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే మా జట్టుకు హాని చేయకుండా ఉండదని ఇరాన్‌ ఆరోపించింది. 

"అత్యంత క్రూరంగా అమెరికా ప్రవర్తిస్తోంది. గడిచిన ఎనిమిది తొమ్మిది నెలల్లోనే రెండోసారి మాపై యుద్ధం చేస్తోంది. వేల సంఖ్యలో మా ప్రజల ఉసురు తీస్తోంది. ఇలాంటి దేశానికి వెళ్లి మేం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడే పరిస్థితి ఉంటుందా? ఆ దేశంలో ఆడే ప్రసక్తే లేదు" అని ఇరాన్‌ క్రీడల మంత్రి అహ్మద్‌ దొన్యమలి ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. 

దీంతో అధికారికంగా అమెరికా ఆతిథ్యమిచ్చే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఇరాన్‌ బహిష్కరించనుందని తేటతెల్లమైంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ ఇరాన్‌ బహిష్కరణ వాఖ్యల్ని బేఖాతరు చేస్తూ తేలిగ్గా కొట్టిపారేశారు.
చదవండి: రిచాకు రూ. 61 లక్షలుదీప్తికి రూ. 34 లక్షలు

Advertisement
 
Advertisement
Advertisement