ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ | Satwik and Chirag pair in Swiss Open badminton pre quarterfinals | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Mar 12 2026 2:08 AM | Updated on Mar 12 2026 2:08 AM

Satwik and Chirag pair in Swiss Open badminton pre quarterfinals

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–19, 21–19తో ఎంగ్‌ కీల్‌ వెస్లీ–జున్‌సుకె కుబో (సింగపూర్‌) జంటను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్‌ జంట 19–21, 14–21తో రుతానపక్‌–జెనిచా (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. 

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–15, 12–21, 4–21తో జేసన్‌ గుణవాన్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. భారత్‌కే చెందిన కిరణ్‌ జార్జ్‌ 23–21, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్‌ లో కీన్‌ యెవ్‌ (సింగపూర్‌)పై సంచలన విజయం సాధించాడు. ఆయుశ్‌ శెట్టి 18–21, 19–21తో బ్రియాన్‌ యాంగ్‌ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement