క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలైంది. బీసీసీఐ ముందుగా ప్రకటించినట్లుగానే తొలి దశ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను వెల్లడించింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది.
🚨 News 🚨
Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️
Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.
More details ▶️… pic.twitter.com/8Iq492v8TE— IndianPremierLeague (@IPL) March 11, 2026
ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.
తొలి విడతలో 20 మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో (బెంగళూరు, ముంబై, గౌహతి, కొత్త చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) జరుగనున్నాయి. బెంగళూరులో జరిగాల్సిన మ్యాచ్‌లు మార్చి 13న నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి.
తొలి విడతలో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. తొలి డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఏప్రిల్ 4న జరుగుతాయి. ఈ విడతలో హైదరాబాద్‌లో ఒకే ఒక మ్యాచ్ జరుగనుంది. ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది.


