హండ్రెడ్‌ లీగ్‌ వేలం.. టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం | The Hundred 2026: Deepthi Sharma to Sunrisers Leeds, Richa Ghosh to Manchester super giants | Sakshi
Sakshi News home page

హండ్రెడ్‌ లీగ్‌ వేలం.. టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం

Mar 11 2026 6:39 PM | Updated on Mar 11 2026 6:49 PM

The Hundred 2026: Deepthi Sharma to Sunrisers Leeds, Richa Ghosh to Manchester super giants

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ది హండ్రెడ్‌ క్రికెట్‌ లీగ్‌లో తొలిసారి వేలం జరుగుతుంది. 2026 సీజన్‌ కోసం ఇవాళ (మార్చి 11) మహిళల విభాగం ఆక్షన్‌ నడుస్తుంది. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు 178 మంది ప్లేయర్ల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్లేయర్లను రిటైన్‌, డైరెక్ట్‌ సైనింగ్‌ చేసుకోగా.. మిగతా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు వేలంలో పోటీపడుతున్నాయి.

ఈ వేలంలో భారత మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, రిచా ఘోష్‌పై కనకవర్షం కురిసింది. రిచాను మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ రూ. 61.73 లక్షలకు దక్కించుకోగా.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ రూ. 33.96 లక్షలకు సొంతం చేసుకుంది. మరికొంతమంది భారత క్రికెటర్లు ఆరంభ రౌండ్లలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. యస్తికా భాటియా, శ్రీచరణిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 

శ్రేయాంక పాటిల్‌, పూజా వస్త్రాకర్‌, కశ్వీ గౌతమ్‌, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, నందిని శర్మ, ఆశా శోభన, రాధా యాదవ్‌ ఇంకా వేలానికి రాలేదు. ఈ వేలంలో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పాల్గొనడం లేదు. స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్‌ను వేర్వేరు ఫ్రాంచైజీలు ప్రీ సైనింగ్‌ చేసుకున్నాయి.

ఫ్రాంచైజీలు రీటైన్‌, ప్రీ సైనింగ్‌ చేసుకున్న ప్లేయర్లు..

మాంచెస్టర్ సూపర్ జెయింట్స్: సోఫీ ఎక్లెస్టోన్ (రీటైన్‌) స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్ (ప్రీ సైనింగ్‌)

లండన్ స్పిరిట్: గ్రేస్ హారిస్, చార్లీ డీన్ (రీటైన్‌), మారిజాన్ కాప్, మహికా గౌర్ (ప్రీ సైనింగ్‌)

బర్మింగ్‌హామ్ ఫీనిక్స్: ఎల్లీస్ పెర్రీ (రీటైన్‌), ఆలిస్ కాప్సే, లూసీ హామిల్టన్, లారెన్ ఫైలర్ (ప్రీ సైనింగ్‌)

ఎంఐ లండన్: హేలీ మాథ్యూస్, డాని వ్యాట్-హాడ్జ్, మెలీ కెర్ ప్రీ సైనింగ్‌)

సదరన్ బ్రేవ్: లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మైయా బౌచియర్ (రీటైన్‌), జెమిమా రోడ్రిగ్స్ (ప్రీ సైనింగ్‌)

సన్‌రైజర్స్ లీడ్స్: కేట్ క్రాస్, అన్నాబెల్ సదర్లాండ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (రీటైన్‌)

ట్రెంట్ రాకెట్స్: నాట్ స్కైవర్-బ్రంట్, యాష్ గార్డ్నర్ (రీటైన్‌), సోఫియా డంక్లీ, కిమ్ గార్త్ (ప్రీ సైనింగ్‌)

వెల్ష్ ఫైర్: జార్జియా వేర్హమ్, ఫ్రెయా కెంప్, జార్జియా వోల్ (ప్రీ సైనింగ్‌)

కాగా, రేపు (మార్చి 12) పురుషుల విభాగంలో వేలం జరుగనుంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement