breaking news
Sunrisers Leeds
-
కివీస్ బ్యాటర్ వన్‌మ్యాన్ షో.. బట్లర్ సేనదే హండ్రెడ్ టైటిల్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్‌ను ఈజీగా అందుకున్న సూపర్‌జెయింట్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్‌గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు.ట్రెంట్ రాకెట్స్‌కు మెయిడెన్ టైటిల్మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్‌తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, డాని గిబ్సన్ 22 పరుగులతో పర్వాలేదనిపించింది. ట్రెంట్ బౌలర్లలో కిమ్ గార్త్, సమంతా బేట్స్, చార్లీ ఫిలిప్స్, జార్జియా ఆడమ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ మరో 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లే (41) రాణించగా.. బెత్ మూనీ (31 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. జార్జియా ఆడమ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అన్నాబెల్ సదర్లాండ్ (315 పరుగులు, 11 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.We were all Jos Buttler watching that finish 🫣#TheHundredFinal pic.twitter.com/w06H16zE0z— The Hundred (@thehundred) August 16, 2026Five fifties in 10 innings for Tim Seifert in this year's Hundred 🔥pic.twitter.com/XFTJa0GeZV— Cricinfo (@cricinfo) August 16, 2026చదవండి: 'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే' -
సన్‌రైజర్స్ కొంపముంచిన క్లాసెన్.. ఫైనల్లో సూపర్ జెయింట్స్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం సన్‌రైజర్స్ లీడ్స్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్, ఓపెనర్ పాల్ వాల్టర్ విధ్వంసానికి తోడుగా బౌలింగ్‌లో జోష్ టంగ్ అద్భుత ప్రదర్శన సూపర్ జెయింట్స్‌కు విక్టరీని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పాల్ వాల్టర్ (46 బంతుల్లో 80; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), క్లాసెన్ (26 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ జోస్ బట్లర్ (33) రాణించాడు. సన్‌రైజర్స్ లీడ్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, నాథన్ ఎల్లిస్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రియాన్ రికిల్టన్ (54 నాటౌట్) చివరివరకు అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. హ్యారీ బ్రూక్ (49) నిధానంగా ఆడడం జట్టు కొంపముంచింది. ఆద్యంతం సూపర్ జెయింట్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్‌రైజర్స్ లీడ్స్ పరుగులు చేయడంలో విఫలమైంది. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. రేపు జరగనున్న హండ్రెడ్ మెన్స్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌తో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ తలపడనుంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్లాసెన్ హండ్రెడ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌కు ప్రత్యర్థిగా ఆడి వాళ్లు ఫైనల్ చేరకుండా సైంధవుడిలా అడ్డుపడ్డాడు.ఫైనల్లో సన్‌రైజర్స్ వుమెన్ టీంమరోవైపు హండ్రెడ్ వుమెన్ కాంపిటీషన్లో మాత్రం సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సదరన్ బ్రేవ్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ లీడ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (32) టాప్ స్కోరర్. అన్నాబెల్ సదర్లాండ్, హన్నా బేకర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్ జట్టు 89 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. లారెన్ విన్ఫీల్డ్ (37), దీప్తి శర్మ (28 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. రేపే జరగనున్న వుమెన్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.SunRisers Leeds Women enters @thehundred final after beating Southern Brave Women, while Manchester Super Giants Men does so in other match beating #SRL.Lauren Winfield-Hill (37), Deepti Sharma (28* & 1/24) & Hannah Baker (2/13) led #SRLW, while #MSG had Paul Walter (80),…— The CricHub (@thecrichub_live) August 14, 2026 -
ఎలిమినేటర్ ముంగిట సన్‌రైజర్స్ విధ్వంసం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఐదో విజయంతో పట్టికలో రెండో స్థానానికి చేరుకొని ఎలిమినేటర్ పోరుకు మరింత దగ్గరైంది. మంగళవారం రాత్రి మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్ 41 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్లాండ్ (36 బంతుల్లో 62 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ డాని గిబ్సన్ (13 బంతుల్లో 24) రాణించడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో మాడీ విల్లర్స్ 2 వికెట్లు తీసింది. అనంతరం మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఓపెనర్లు స్మృతి మంధాన (17 బంతుల్లో 28), గ్రేస్ స్క్రీవెన్స్ (24 బంతుల్లో 31) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జొనాసన్ 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ, అన్నాబెల్ సదర్లాండ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన అన్నాబెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకుంది.Annabel Sutherland just smashed THREE sixes in a row off the final three balls of the innings 🤯That was special. #TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/oQ9EswA72z— The Hundred (@thehundred) August 11, 2026Smriti Mandhana is on the charge 💥Watch the #RoadToTheEliminator action LIVE on Sky Sports Main Event, Sky Sports Cricket and YouTube 📺#TheHundred pic.twitter.com/VDCdJJu8sk— The Hundred (@thehundred) August 11, 2026చదవండి: తొలి టెస్టుకు వర్షం ముప్పు.. గాలే చేరుకున్న టీమిండియా -
హండ్రెడ్‌లో విధ్వంసం.. కివీస్ బ్యాటర్ సిక్సర్ల వర్షం
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ లీడ్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సూపర్ జెయింట్స్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (40 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ వాల్టర్ (28 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో 128 పరుగుల టార్గెట్‌ను మరో 33 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సూపర్‌జెయింట్స్ పట్టికలో రెండో స్థానానికి చేరింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 127 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32), జాక్ క్రాలీ (31) రాణించగా, రికెల్టన్ (17) పర్వాలేదనిపించాడు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో గస్ అకిన్సన్ మూడు వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు బాదిన టిమ్ సీఫర్ట్ బ్రైడన్ కార్స్ బౌలింగ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. అతడు వేసిన ఇన్నింగ్స్ 7, 8, 9 బంతులను సీఫర్ట్ వరుసగా సిక్సర్లు సంధించాడు. ఇప్పటికే ట్రెంట్ రాకెట్స్ ఫైనల్లో అడుగుపెట్టగా, ఎలిమినేటర్ పోరు కోసం నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. ఇందులో సూపర్‌జెయింట్స్ రెండో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరులో ముందు వరుసలో ఉంది. ఆగస్టు 15న ఎలిమినేటర్ పోరు, ఆగస్టు 16న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.THREE SIXES IN A ROW FOR TIM SEIFERT! 💥#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/rMG9rIKmYE— The Hundred (@thehundred) August 11, 2026Read: స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్‌కు షాక్! -
చరిత్ర సృష్టించిన మిచెల్ మార్ష్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ మిచెల్ మార్ష్ పొట్టి క్రికెట్లో అరుదైన రికార్డు సాధించాడు. ఒకే ఏడాదిలో 1500 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి ఆసీస్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. హండ్రెడ్ 2026లో సన్‌రైజర్స్ లీడ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. తాజాగా వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో (34 బంతుల్లో 50) ఈ ఘనత సాధించాడు.మిచ్ మార్ష్‌కు ముందు ఈ రికార్డు టిమ్ డేవిడ్ పేరిట ఉండేది. 2022లో అతడు 1461 పరుగులు చేశాడు. 2024లో ట్రావిస్ హెడ్ 1442 పరుగులతో టిమ్‌కు దగ్గరగా వచ్చాడు.ఈ ఏడాది ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు ఆడిన మార్ష్.. 44.17 సగటున, 160కి దగ్గరగా స్ట్రైక్‌రేట్‌తో, రెండు సెంచరీలు, 11 అర్ధ సెంచరీల సాయంతో 1502 పరుగులు చేసి టిమ్ డేవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు.మార్ష్ అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా తరఫున, బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, ది హండ్రెడ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున ఆడుతూ ఈ పరుగులు సాధించాడు.కోహ్లి, ఏబీడీ సరసన చోటుఈ ఏడాది టీ20ల్లో 1500 పరుగులు సాధించడంతో మార్ష్ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ సరసన చేరాడు. విరాట్ 2016లో 1614 పరుగులు చేయగా.. ఏబీడీ 2019లో 1580 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగుల ప్రపంచ రికార్డు మాత్రం వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ పేరిట ఉంది. 2024లో పూరన్ ఏకంగా 2331 పరుగులు చేశాడు.హండ్రెడ్‌లోనూ చరిత్రకు చేరువలో..!హండ్రెడ్‌లోనూ మార్ష్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో 374 పరుగులు చేసిన అతడు.. ఓ హండ్రెడ్ సీజన్లో అత్యధిక పరుగుల రికార్డుకు 51 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు ప్రస్తుతం జేమ్స్ విన్స్ పేరిట ఉంది. విన్స్ 2024లో సదర్న్ బ్రేవ్ తరఫున 424 పరుగులు చేశాడు.గత కొన్నేళ్లలో మార్ష్ తన బ్యాటింగ్ తీరును చాలా మార్చుకున్నాడు. ఒకప్పుడు ప్రధానంగా ఆల్‌రౌండర్‌గా కనిపించిన అతడు ఇప్పుడు టాపార్డర్‌లో విధ్వంసక బ్యాటర్‌గా మారాడు. మొత్తం టీ20 కెరీర్లో మార్ష్ ఇప్పటివరకు 7033 పరుగులు చేశాడు. అతడి సగటు 34.64 కాగా.. స్ట్రైక్‌రేట్ 141.48. -
దంచికొట్టిన రికెల్టన్.. దూసుకెళ్తున్న సన్‌రైజర్స్
‘ది హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్’-2026 టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్ వరుస విజయాలతో దూసుకువెళ్తోంది. తాజాగా బర్మింగ్‌హామ్ ఫొనిక్స్ జట్టును ఓడించిన సన్‌రైజర్స్.. సీజన్లో నాలుగో విజయం నమోదు చేసింది. తద్వారా పదహారు పాయింట్లతో పట్టికలో రెండోస్థానానికి దూసుకువచ్చింది.సన్‌రైజర్స్ లీడ్స్ ప్రయాణం ఇలాది హండ్రెడ్ తాజా ఎడిషన్‌లో భాగంగా సన్‌రైజర్స్ తొలి మ్యాచ్‌లో ఎంఐ లండన్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సదరన్ బ్రేవ్‌తో తలపడి ఐదు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. విజయాల ఖాతా తెరిచింది. ఆ తర్వాత మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్‌కు.. ట్రెంట్ రాకెట్స్ షాకిచ్చింది. దీంతో సీజన్లో రెండో పరాజయం చవిచూసిన సన్‌రైజర్స్.. లండన్ స్పిరిట్‌పై గెలిచి మరోసారి గెలుపుబాట పట్టింది.దంచికొట్టిన రికెల్టన్తాజాగా బర్మింగ్హాన్ ఫినిక్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్ 45 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో మిచెల్ మార్ష్ (34) ఫర్వాలేదనిపించగా.. రియాన్ రికెల్టన్ దంచికొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 65 పరుగులు సాధించాడు.Easy picking ft. Rickelton 🙌 pic.twitter.com/HGftI8yMmi— SunRisers Leeds (@sunrisersleeds) August 7, 2026మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్ 19, డాన్ లారెన్స్ 14 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ జాక్ క్రాలే (3) విఫలమయ్యాడు. ఫలితంగా నిర్ణీత 100 బంతుల్లో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బర్మింగ్‌హామ్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ రెండు వికెట్లు తీయగా.. క్రిస్ వుడ్, టామ్ హెల్మ్, జోర్డాన్ థాంప్సన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.124 పరుగులకే పరిమితంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బర్మింగ్‌హామ్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో ఎనిమిది వికెట్లు నష్టపోయి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో సన్‌రైజర్స్ 45 పరుగుల తేడాతో గెలిచింది. బర్మింగ్‌హామ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జో క్లార్క్ 25, సీన్ డెక్సాన్ 34, జోర్డాన్ థాంప్సన్ 25 (నాటౌట్) ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.రెండోస్థానానికిసన్రైజర్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. నాథన్ ఎల్లిస్, అబ్రార్ అహ్మద్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు ఆరింట ఇది నాలుగో విజయం. ఎంఐ లండన్‌తో పాయింట్ల పరంగా (16) సమానంగా ఉన్నప్పటికీ.. నెట్‌రన్‌రేటు పరంగా మెరుగైన స్థితిలో ఉన్న సన్‌రైజర్స్ (+0.674) పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. మరోవైపు.. బర్మింగ్‌హామ్ జట్టు ఎలిమినేట్ అయింది.చదవండి: IND vs SL: కేఎల్ రాహుల్ అలా.. పడిక్కల్ ఇలా -
సన్‌రైజర్స్ ఓపెనర్ విధ్వంసం.. టోర్నీ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిప్టీ
హండ్రెడ్ మహిళల కాంపిటేషన్- 2026లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హామ్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో దీప్తీ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. కాట్ క్రాస్ రెండు, జానెసన్, సదర్లాండ్ తలా వికెట్ సాధించారు. ఫినిక్స్ బ్యాటర్లలో ఎమ్మా లాంబ్(47), కెప్టెన్ పెర్రీ(31) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.లిచ్‌ఫీల్డ్ విధ్వంసంఅనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 69 బంతుల్లోనే ఊదిపడేసింది. యువ ఓపెనర్, ఆసీస్ స్టార్ ఫీబీ లిచ్‌ఫీల్డ్ విధ్వంసం సృష్టించింది. బర్మింగ్‌హామ్ బౌలర్లను ఉతికారేసింది. కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం సాధించి అందరిని ఆశ్చర్యపరించింది.తద్వారా ది హండ్రెడ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన మహిళా బ్యాటర్‌గా ఆమె రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత ఓపెనర్ షఫాలీ వర్మ పేరిట ఉండేది. 2021లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షఫాలీ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. తాజా మ్యాచ్‌లో షఫాలీ ఆల్‌టైమ్ రికార్డును లిచ్‌ఫీల్డ్ బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్ 33 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.చదవండి: 'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్ హెల్ప్ చేయండి -
సన్ రైజర్స్ పై స్మృతి విధ్వంసం.. 11 ఫోర్లు, సిక్సర్లతో..
-
మిచెల్ మార్ష్ మాస్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్ రికార్డు విజయం
ది హండ్రెడ్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు సన్‌రైజర్స్ లీడ్స్ షాకిచ్చింది. బుధవారం హెడ్డింగ్లీ వేదికగా జరిగిన పదో మ్యాచ్‌లో మాంచెస్టర్‌ను 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (16 బంతుల్లో 28), ఐడెన్ మార్క్రమ్ (23 బంతుల్లో 32) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత జోస్ బట్లర్ (33 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 53; 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ లీడ్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 47 బంతుల్లోనే 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.మార్ష్ విధ్వంసం..అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ లీడ్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఊదిపడేసింది. ఈ భారీ లక్ష్య చేధనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఆసీస్ కెప్టెన్ మాంచెస్టర్ బౌలర్లను ఉతికారేశాడు.కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ జాక్ క్రాలీ(56 నాటౌట్), హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. మాంచెస్టర్ బౌలర్లలో టంగ్, బాకర్ తలా వికెట్ సాధించారు. కాగా ఇది పురుషుల హండ్రెడ్‌లో మూడవ అత్యధిక విజయవంతమైన ఛేజ్ కావడం విశేషం.చదవండి: WTC 2025-26: పాక్‌కు భారీ షాక్.. ఫైనల్ రేసు నుంచి అవుట్! మరి భారత్? -
హండ్రెడ్‌లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. తాజాగా సదరన్ బ్రేవ్ జట్టు ప్లేయర్ జేమిమా రోడ్రిగ్స్ అజేయ ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో జట్టును గెలిపించింది. విషయంలోకి వెళితే శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్, సదరన్ బ్రేవ్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 116 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాని స్మిత్ (48), అనాబెల్ సదర్లాండ్ (22), దీప్తి శర్మ (23) రాణించారు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో ఇస్సీ వాంగ్ మూడు వికెట్లు తీయగా, టిల్లీ కొలెమన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం సదరన్ బ్రేవ్స్ 96 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జేమిమా రోడ్రిగ్స్ (34 బంతుల్లో 42 నాటౌట్, 4 ఫోర్లు) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. సన్‌రైజర్స్ లీడ్స్ బౌలర్లలో కాసిడి మెక్‌కార్తీ 2 వికెట్లు తీయగా, జెస్ జొనాసన్, అనాబెల్ సదర్లాండ్, డానియెల్లె గిబ్సన్ తలా ఒక వికెట్ తీశారు. మరో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లండన్‌పై వెల్ష్ ఫైర్ జట్టు 60 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ వుమెన్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సోఫి డివైన్ (52) అర్ధసెంచరీ సాధించగా, జార్జియా వోల్ (42), జార్జియా వర్హెమ్ (43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ లండన్ 92 బంతుల్లో 117 పరుగులకు కుప్పకూలింది. చినెల్లి హెన్రీ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. గ్రేస్ పాట్స్ 3 వికెట్లు పడగొట్టింది. Ice in her veins! Jemimah Rodrigues closes out the chase 💫She delivers a memorable victory under pressure!#TheHundred 2026 👉 Sunrisers Leeds v Southern Brave pic.twitter.com/6YyTj5DWuM— Star Sports (@StarSportsIndia) July 25, 2026"Stay calm, stick to our plans, keep it simple and enjoy cricket" 🏏Hear from the Match Hero Jemimah Rodrigues after her fantastic knock to help Southern Brave beat Sunrisers Leeds 💯 pic.twitter.com/5aXY4eGnZ9— Sky Sports Cricket (@SkyCricket) July 25, 2026చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్! -
క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ముంబై, సన్‌రైజర్స్ అరుదైన ఫీట్!
ఇంగ్లండ్ వేదికగా ప్రారంభమైన హండ్రెడ్ లీగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలు శుభారంభం చేశాయి. ఏకకాలంలో ప్రారంభమైన హండ్రెడ్ మెన్స్, హండ్రెడ్ వుమెన్స్ టోర్నీల్లో విజయాలు అందుకున్నాయి. పురుషుల హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోగా, అటు మహిళల విభాగంలో ముంబై ఇండియన్స్ లండన్‌పై సన్‌రైజర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. ఏకకాలంలో రెండు జట్లు ఒక దానిపై ఒకటి వేర్వేరుగా విజయాలు నమోదు చేయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.దంచికొట్టిన పూరన్..పురుషుల హండ్రెడ్ లీగ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 99 బంతుల్లో 143 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (27 బంతుల్లో 41), టామ్ అల్సోప్ (18 బంతుల్లో 31) దూకుడుగా ఆడారు. ముంబై బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 4 వికెట్లు తీయగా, సామ్ కరన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 84 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సామ్ కరన్ (39 బంతుల్లో 60 నాటౌట్), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 58 నాటౌట్) విధ్వంసం సృష్టించారు.రాణించిన దీప్తి శర్మమహిళల హండ్రెడ్ టోర్నీ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ లండన్ జట్టు 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (33), డానీ వ్యాట్ (29) పర్వాలేదనిపించారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, డానియెల్లి గిబ్సన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ 69 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఫోబె లిచ్‌ఫీల్డ్ (3), అనాబెల్ సదర్లాండ్ (30) విజయంలో కీలకపాత్ర పోషించారు. -
సన్‌రైజర్స్‌కు ఆడేందుకు పాక్ ఆటగాడికి అనుమతి
పాకిస్తాన్ వివాదాస్పద బౌలర్ అబ్రార్ అహ్మద్‌కు భారత యాజమాన్యంలో నడిచే ఓ ఫ్రాంచైజీకి ఆడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతిచ్చింది. అబ్రార్ సహా 21 మంది పాక్ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్‌ల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు పాక్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేసింది.అబ్రార్‌ను కొద్ది రోజుల కిందట జరిగిన ద హండ్రెడ్ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ అనే ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఈ ఫ్రాంచైజీ ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సిస్టర్ ఫ్రాంచైజీ. ఈ రెండు ఫ్రాంచైజీలు సన్ గ్రూప్ సహా అధినేత్రి కావ్యా మారన్‌కు చెందినవి. భారత యజమానికి చెందిన ఫ్రాంచైజీలో పాక్ ఆటగాడిని చేర్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా ఉండింది. ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు కూడా అబ్రార్‌కు ఎన్వోసీ ఇవ్వడంతో క్రికెట్ అభిమానులు అవాక్కవుతున్నారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. అబ్రార్‌ను సిగ్గులేని వాడని భారత క్రికెట్ అభిమానులు హేళన చేస్తున్నారు. భారత యజమాని కింద ఆడటానికి అనుమతిచ్చినందుకు పాక్ క్రికెట్ బోర్డుపై సైతం వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. గతంలో అబ్రార్ భారత్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో కామెంట్లు చేయడమే అభిమానుల ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. అబ్రార్ అహ్మద్‌ను కావ్వా మారన్ దాదాపు రెండున్నర కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, అబ్రార్‌తో పాటు షాదాబ్ ఖాన్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్దుల్లా షఫీక్, ఉస్మాన్ తారిక్, మహ్మద్ హారిస్, సుఫ్యాన్ మొకీమ్ తదితరులు హండ్రెడ్ లీగ్, లంకా ప్రీమియర్ లీగ్ (LPL), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), గ్లోబల్ సూపర్ లీగ్ (GSL) వంటి టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతులు పొందారు. -
‘కాల్ మీ’.. లలిత్ మోదీ ఆసక్తికర పోస్టు!
హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై భారత్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. కావ్యామారన్‌కు చెందిన సన్‌రైజర్స్ యాజమాన్యంపై పాకిస్థాన్ ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు భారత్‌లో సన్‌రైజర్స్ లీడ్స్‌కు చెందిన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ 190,000 పౌండ్లు (సుమారు రూ.2.34 కోట్లు) దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సన్‌రైజర్స్ లీడ్స్‌కు ఆసక్తికర సందేశాన్ని పంపించారు. ‘పాకిస్తాన్ ఆటగాడిపై రూ.2.34 కోట్లు పెట్టుబడి పెట్టడంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో పడిపోయిన ఇమేజ్ను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకోవా లనేది నాకు తెలుసు. అందుకే ఒకసారి నాకు కాల్ చేయండి’ అంటూ పోస్టు పెట్టాడు. అయితే లలిత్ మోదీ తన పోస్ట్‌లో ఎక్కడా కూడా కావ్య మారన్ పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ లలిత్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన సందేశం మాత్రం సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని ఉద్దేశించే అని స్పష్టంగా అర్థమవుతోంది.అయితే తాజాగా భారత్‌లో ఐపీఎల్ ప్రారంభమవుతున్న వేళ అభిమానుల్లో సఖ్యత సాధించేందుకే లలిత్ మోదీ.. కావ్యామారన్‌కు ఇలాంటి సందేశాన్ని పంపించి ఉంటారని తెలుస్తోంది. 2010లో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఐపీఎల్ ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో లలిత్ మోదీ దేశం విడిచి వెళ్లాడు. ఈడీ ప్రకారం 2009లో ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ హక్కుల కేటాయింపులో మోదీ అవకతవకలు చేసి రూ.125 కోట్లకు పైగా లాభం పొందినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. లలిత్ మోదీ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. భారత్‌లో పలు ఆర్థిక అవకతవకల కేసులు కూడా ఉన్నాయి. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. అప్పటి నుంచి విదేశీల లీగ్‌లలో కూడా భారతీయ ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయ ర్లను దాదాపు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే, ఈ సంప్రదాయాన్ని సన్‌రైజర్స్ పక్కనబెట్టి మరీ అబ్రార్ అహ్మద్‌ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.చదవండి: మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్ ఫిలిప్స్ -
దిగ్గజ క్రికెటరన్న గౌరవం లేదా?
హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ పాకిస్థాన్ క్రికెటర్లను కొనుగోలు చేయడంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ సన్‌రైజర్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాక్ ఆటగాళ్లకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణాలు తీస్తుందని వ్యాఖ్యానించారు. అయితే సునీల్ గావస్కర్ వ్యాఖ్యలను పాక్ సంతతికి చెందిన ఇంగ్లీష్ క్రికెటర్ అజీమ్ రఫిక్ ఖండించడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక దిగ్గజ క్రికెటర్ అనే కనీసం గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడి కొత్త వివాదానికి తెరలేపాడు. ‘సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవే. అసలు ఆయన మాట్లాడిన మాటలను ఎవరైనా అంగీకరించగలరా చెప్పండి? అయినా మీరు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్ని పరుగులు చేశారన్నది నాకు అనవసరం. కానీ సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు మాత్రం అర్థరహితం’ అని పేర్కొన్నాడు. అయితే అజీమ్ రఫిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం లేదన్న విషయం నిరూపించగలవా? అక్కడ నాన్ ముస్లింలనే లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించడం ఎంతవరకు సమంజసం’..‘భారత్‌పై పడి ఏడ్వడం మానండి. సునీల్ గావస్కర్ ఒక దిగ్గజ క్రికెటర్ అన్న కనీస మర్యాద కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. ఆయన అనుభవమంత వయసు కూడా నీకు లేదు. ముందు ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆ తర్వాత ఉపన్యాసాలు ఇవ్వొచ్చు’.. ‘పాక్ క్రికెటర్లు సుద్దపూసలైతే ఆసియా కప్‌లో ఆ జట్టు బోర్డు చైర్మన్ ప్రవర్తించిన తీరు సరైనదేనా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది?’ అని కామెంట్లు పెట్టారు.This is absolutely ridiculous & should be condemned ..How are these comments acceptable? I don’t care how many runs you have scoredVile stuff from Gavaskar https://t.co/sLYtUKmGnZ— Azeem Rafiq (@AzeemRafiq30) March 16, 2026చదవండి: క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్! -
‘వాళ్ల ఫీజు మన సైనికుల ప్రాణాలు తీస్తోంది’
హండ్రెడ్ మెన్స్ టీ20 టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో కావ్యా మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వేలంలో అబ్రార్ అహ్మద్‌ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది. అయితే పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం పట్ల సోషల్ మీడియాలో భారత మాజీ క్రికెటర్లు సహా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్‌రైజర్స్ లీడ్స్‌కు సంబంధించి ‘ఎక్స్’ ఖాతాను కూడా సస్పెండ్ చేయడం గమనార్హం. తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా సన్‌రైజర్స్ పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ది హండ్రెడ్ టోర్నీలో ఒక ప్రాంచైజీ పాకిస్థాన్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ భారత్‌కు చెందిన ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ పాక్ ఆటగాళ్లను తీసుకోవడం నచ్చడం లేదు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్‌తో సంబంధాలు క్షీణించడంతో ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఐపీఎల్ వేలంలోనూ పాక్ ఆటగాళ్లను విస్మరించడం జరిగింది. ఐపీఎల్ 2008 సీజన్ మినహా పాక్ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్లో కనిపించలేదు. కానీ తాజాగా సన్‌రైజర్స్ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసింది. సదరు ఫ్రాంచైజీ పాక్ ఆటగాడికి ఫీజు రూపంలో చెల్లించే డబ్బులను అతడు తన దేశానికి పన్నుల రూపంలో చెల్లించడం జరుగుతుంది. పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతోనే పాక్ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తున్నది. ఆ ఆయుధాలే ఇవాళ మన భారత సైనికులు, పౌరుల మరణాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. దీంతో తెలిసీ తెలియకో సన్‌రైజర్స్ లీడ్స్ ఒక రకంగా ప్రాణనష్టానికి పాల్పడుతున్న దేశంతో సంబంధం కొనసాగిస్తున్నట్లే అవుతుంది. అందుకే అభిమానుల ఆగ్రహంలో నాకు తప్పు కనిపించలేదు. ఈ ఆగ్రహం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాత్రం.. ‘ఇది మాకు సంబంధించిన విషయం కాదు. అదొక విదేశీ లీగ్. తుది నిర్ణయం ఆ ఫ్రాంచైజీయే తీసుకోవాలి. మేము జోక్యం చేసుకోలేము’ అని పేర్కొన్నారు.కాగా గతేడాది సీజన్ అనంతరం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీని సన్ గ్రూపు కొనుగోలు చేసింది. తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్యా మారన్ దాదాపు 100 మిలియన్ పౌండ్ల (సుమారు ₹1,100 కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించి పూర్తి టేకోవర్ చేసుకుంది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు పేరును సన్‌రైజర్స్ లీడ్స్‌గా మార్చారు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ గతేడాది చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.చదవండి: నడవలేని స్థితిలో టీమిండియా స్టార్ క్రికెటర్.. వీడియో -
భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రశాంత పహల్గామ్ లోయలో అమాయకులను కాల్చి చంపిన ఉగ్రమూకలపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’తో ఉక్కుపాదం మోపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.కరచాలనానికి నిరాకరించిఇందుకు ప్రతిగా పాక్ సైన్యం రంగంలోకి దిగగా.. భారత ఆర్మీ వారి దాడుల్ని విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2025లో భారత క్రికెట్ జట్టు పాక్ జట్టుతో కరచాలనానికి నిరాకరించి నిరసన తెలియజేసింది. దీంతో పాక్ బోర్డు రాద్ధాంతం చేయగా ఐసీసీ రంగంలోకి దిగి చివాట్లు పెట్టింది.మొట్టికాయలు వేసిన ఐసీసీఅదే విధంగా టీమిండియాతో మ్యాచ్‌లో అతి చేసిన పాక్ ఆటగాళ్లకు గట్టిగానే మొట్టికాయలు కూడా వేసింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వగా.. పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు.చెలరేగిన వివాదంఅయినా సరే బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని పాక్ బోర్డు మరోసారి డ్రామాలు ఆడి.. బొక్కబోర్లా పడింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘ది హండ్రెడ్ లీగ్-2026’ వేలంలో సన్ గ్రూపునకు చెందిన కావ్యా మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది.టీమిండియాతో మ్యాచ్‌లో అతి చేస్తూ.. ఆపరేషన్ సిందూర్‌ను కించపరిచే విధంగా వ్యవహరించిన అబ్రార్ కోసం సన్‌రైజర్స్ రూ. 2.34 కోట్లు వెచ్చించడంతో.. భారతీయ నెటిజన్లు లీడ్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ‘ది హండ్రెడ్ (ఇంగ్లండ్)’ విదేశీ లీగ్ కాబట్టి.. తాము ఈ విషయంలో జోక్యంచేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరమీదకు వచ్చింది. సన్‌రైజర్స్ తాజాగా విదేశీ లీగ్‌లో పాక్ ఆటగాడిని ఎంచుకోగా.. ఇంతకు ముందే పలు భారత టీ20 ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయర్లకు తమ జట్టులో చోటు ఇచ్చాయి. అవేమిటంటే..భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు👉పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్, టీ20 ప్రపంచకప్ టోర్నీ-2026లో తన బౌలింగ్ యాక్షన్‌తో వార్తల్లోకి ఎక్కిన స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ఆడారు. ఈ జట్టుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానులైన షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతానే ఓనర్లు.👉ఇక అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (MCL)లో గతేడాది పాక్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం సీటెల్ ఆర్కాస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ జట్టు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంలో భాగమైన GMR గ్రూప్‌నకు చెందినది. 👉కాగా ఇమాద్ వసీం 2023-24 ILT20 సీజన్లో కేకేఆర్‌కు చెందిన అబు దాబి ఫ్రాంఛైజీకి ఆడాడు. ఇక పాక్ మరో క్రికెటర్ ఉస్మాన్ ఖాన్ ILT20 2025 సీజన్లో.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 👉ఇదిలా ఉంటే.. ది హండ్రెడ్ వేలంలో అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనగా.. మరో పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్ ఫొనిక్స్ కొనుగోలు చేసింది. ఈసారి ఈ వేలంలో పాక్ నుంచి వీరిద్దరే అమ్ముడుపోగా.. సయీమ్ ఆయుబ్, హ్యారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ వంటి వాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. చదవండి: T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు -
పాక్ ఆటగాడి ఎంపికపై సన్‌రైజర్స్ కోచ్ వివరణ
హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారత యాజమాన్యంలోని సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. పాక్ ఆటగాడిని ఎలా తీసుకుంటారని భారత క్రికెట్ అభిమానులు సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సోషల్‌మీడియాలో ఫ్యాన్స్ ట్రోలింగ్ పతాక స్థాయికి చేరడంతో ఎక్స్ ఏకంగా లీడ్స్ ఖాతానే సస్పెండ్ చేసింది. ఈ వివాదంపై లీడ్స్ యాజమాన్యం తొలిసారి స్పందించింది. ఆ ఫ్రాంచైజీ తరఫున హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ వివరణ ఇచ్చాడు.బీబీసీ స్పోర్ట్స్‌తో ఆయన మాట్లాడుతూ.. అబ్రార్ ఓ ప్రత్యేకమైన బౌలర్. అతడి వద్ద ఉన్న వేరియేషన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ దేశీయ ఆటగాళ్లు అబ్రార్‌ను ఇంతవరకు ఎక్కువగా ఎదుర్కోలేదు. వేలంలో అందుబాటులో ఉన్న స్పిన్నర్లలో అబ్రార్ మాకు ఉపయోగపడతాడని అనుకున్నాం. అందుకే అతనికి ప్రాధాన్యత ఇచ్చామని అన్నాడు.అబ్రార్ ఎంపికపై వెటోరి వివరణ ఇచ్చినప్పటికీ.. అది సమర్దనగా ఉందని భారత క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హెండ్రెడ్ లీగ్ వేలంలో భారత యాజమాన్యాల్లోని ఫ్రాంచైజీల్లో సన్‌రైజర్స్ లీడ్స్ మాత్రమే పాకిస్తాన్ ఆటగాడిని ఎంపిక చేసుకుంది. సన్‌రైజర్స్‌కు ఇతర లీగ్‌ల్లో (ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్) కూడా ఫ్రాంచైజీలు ఉన్నా.. ఎక్కడా పాకిస్తాన్ ఆటగాళ్లను తీసుకోలేదు. పహల్గాం ఉదంతం తర్వాత భారత్-పాక్ మధ్య అన్ని రకాల సంబంధాలు పూర్తిగా క్షీణించిపోవడంతో పాక్ ఆటగాళ్లను భారతీయులు ఎక్కడా ఉపేక్షించడం లేదు. ఇప్పుడు ఏకంగా ఓ పాక్ ఆటగాడిని భారత యాజమాన్యంలో నడిచే ఫ్రాంచైజీ జట్టులోకి తీసుకోవడం పెద్ద వివాదంగా మారింది. అబ్రార్ ఎంపికలో మరో ఫ్రాంచైజీ (ట్రెంట్ రాకెట్స్) పోటీపడుతున్నా, సన్‌రైజర్స్ తగ్గకుండా అతన్ని దక్కించుకోవడం భారత క్రికెట్ అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఈ ప్రభావం ఐపీఎల్ జట్టైన ఎస్ఆర్హెచ్పై కూడా పడింది. ఎస్ఆర్హెచ్ను కూడా బ్యాన్ చేయాలంటూ భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.కాగా, నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్ లీగ్ తొట్టతొలి వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ అబ్రార్‌ను 190,000 పౌండ్ల (సుమారు ₹2.34 కోట్లు) భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ లీగ్ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మాత్రమే అమ్ముడుపోయాడు. ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.ఈ వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు (లండన్ స్పిరిట్) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది. -
పాక్ ఆటగాడి కొనుగోలు.. కావ్యా మారన్‌కు భారీ ఝలక్
హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ సహ యజమాని కావ్యా మారన్‌కు భారీ షాక్ తగిలింది. అబ్రార్ ఎంపిక జరిగిన కొన్ని గంటలకే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయ్యింది.అబ్రార్‌ను కొనుగోలు చేసిన వార్త బయటికి రాగానే భారత క్రికెట్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కావ్యా మారన్, సన్‌రైజర్స్ లీడ్స్‌పై విరుచుకుపడ్డారు. పాక్ ఆటగాడిని ఎలా కొనుగోలు చేస్తారంటూ అసభ్యపదజాలాలతో దుమ్మెత్తిపోశారు. సన్‌రైజర్స్‌ను బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు.భారీ ట్రోలింగ్ నేపథ్యంలో ఎక్స్ సన్‌రైజర్స్ లీడ్స్ ఖాతాను సస్పెండ్ చేసింది. వారి అకౌంట్‌ను యాక్సెస్ చేయాలని ప్రయత్నించిన వారికి “Account suspended. X suspends accounts that violate the X rules” అనే సందేశం కనిపించింది. ఇది భారతీయ అభిమానుల నుంచి పెల్లుబికిన ఆగ్రహజ్వాలల నేపథ్యంలో తీసుకున్న చర్చగా తెలుస్తుంది.కాగా, నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్ లీగ్ తొట్టతొలి వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ అబ్రార్‌ను 190,000 పౌండ్ల (సుమారు ₹2.34 కోట్లు) భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. హండ్రెడ్ లీగ్ వేలంలో పాక్ ప్లేయర్‌ను కొన్న ఏకైక భారతీయ ఫ్రాంచైజీగా సన్‌రైజర్స్ లీడ్స్ నిలిచింది.ఈ లీగ్ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మాత్రమే అమ్ముడుపోయాడు. ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.ఈ వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు (లండన్ స్పిరిట్) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది. -
వివాదంలో కావ్యా మారన్.. సన్‌రైజర్స్‌లోకి పాక్ ఆటగాడు
సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్వా మారన్ వివాదంలో చిక్కుకుంది. హండ్రెడ్ లీగ్-2026 వేలంలో పాక్ ఆటగాడిని కొనుగోలు చేసి, భారత క్రికెట్ అభిమానుల నుంచి భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. కావ్యా మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ ఇటీవలే హండ్రెడ్ లీగ్‌లోని సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో మెజార్టీ శాతం వాటాను సొంతం చేసుకుంది.ఈ క్రమంలో తొలిసారి జరుగుతున్న వేలంలో పాల్గొన్న ఆమె.. పాక్ ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను 1.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు) కొనుగోలు చేసింది. మరో ఫ్రాంచైజీతో (ట్రెంట్ రాకెట్స్) పోటీపడి మరీ అబ్రార్‌ను దక్కించుకుంది. ఈ చర్యతో కావ్వా భారత క్రికెట్ అభిమానుల పాలిట విలన్‌గా మారిపోయింది. అబ్రార్ అహ్మద్ ఇటీవలికాలంలో టీమిండియాతో ఆడిన మ్యాచ్‌ల్లో ఓవరాక్షన్ చేశాడు. ఓ సందర్భంలో భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేసి చాలా అతి చేశాడు. ఇందుకు భారత ఆటగాళ్లు కూడా తగిన కౌంటర్లు ఇచ్చినప్పటికీ భారతీయుల కసి తీరలేదు. అలాంటి అబ్రార్‌ను కావ్యా మారన్ జట్టులో చేర్చుకోవడం భారతీయులకు మింగుడుపడటం లేదు.దీనికి ముందే కావ్యా మరో పాక్ ఆటగాడు (హరీస్ రౌఫ్) వేలానికి రాగా, అతన్ని రిజెక్ట్ చేసింది. అప్పుడు శభాష్ అనుకున్న భారత క్రికెట్ అభిమానులు, అబ్రార్ తీసుకున్న వెంటనే సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ ప్రారంభించారు. ఇదే వేలంలో మరో పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. వేలంలో ఇప్పటివరకు అమ్ముడుపోయిన పాక్ ఆటగాళ్లు ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్ మాత్రమే. మరో పాక్ ఆటగాడు షాదాబ్ ఖాన్ కూడా వేలానికి వచ్చినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. కాగా, కొద్ది గంటల ముందే పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఈ వేలం బరి నుంచి వైదొలిగాడు. ఈ వేలంలో మొత్తం 13 మంది పాక్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్‌లో తొలిసారి ఆటగాళ్ల వేలం జరుగుతుంది. ఈ సీజన్ (2026) నుంచే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్ ద్వారా జరిగేది. ఈ సీజన్‌తో తొలిసారి ఐపీఎల్ తరహా వేలం జరుగుతుంది. నిన్న (మార్చి 11) మహిళల విభాగం వేలం పూర్తి కాగా.. ఇవాళ (మార్చి 12) పురుషుల వేలం జరుగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి.ఇప్పటివరకు జరిగిన పురుషుల వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు (లండన్ స్పిరిట్) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది. -
హండ్రెడ్ లీగ్ వేలం.. టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం
ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ క్రికెట్ లీగ్‌లో తొలిసారి వేలం జరుగుతుంది. 2026 సీజన్ కోసం ఇవాళ (మార్చి 11) మహిళల విభాగం ఆక్షన్ నడుస్తుంది. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు 178 మంది ప్లేయర్ల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్లేయర్లను రిటైన్, డైరెక్ట్ సైనింగ్ చేసుకోగా.. మిగతా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు వేలంలో పోటీపడుతున్నాయి.ఈ వేలంలో భారత మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, రిచా ఘోష్‌పై కనకవర్షం కురిసింది. రిచాను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ రూ. 61.73 లక్షలకు దక్కించుకోగా.. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను సన్‌రైజర్స్ లీడ్స్ రూ. 33.96 లక్షలకు సొంతం చేసుకుంది. మరికొంతమంది భారత క్రికెటర్లు ఆరంభ రౌండ్లలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. యస్తికా భాటియా, శ్రీచరణిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, కశ్వీ గౌతమ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, నందిని శర్మ, ఆశా శోభన, రాధా యాదవ్ ఇంకా వేలానికి రాలేదు. ఈ వేలంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పాల్గొనడం లేదు. స్టార్ ప్లేయర్లు స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్‌ను వేర్వేరు ఫ్రాంచైజీలు ప్రీ సైనింగ్ చేసుకున్నాయి.ఫ్రాంచైజీలు రీటైన్, ప్రీ సైనింగ్ చేసుకున్న ప్లేయర్లు..మాంచెస్టర్ సూపర్ జెయింట్స్: సోఫీ ఎక్లెస్టోన్ (రీటైన్) స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్ (ప్రీ సైనింగ్)లండన్ స్పిరిట్: గ్రేస్ హారిస్, చార్లీ డీన్ (రీటైన్), మారిజాన్ కాప్, మహికా గౌర్ (ప్రీ సైనింగ్)బర్మింగ్‌హామ్ ఫీనిక్స్: ఎల్లీస్ పెర్రీ (రీటైన్), ఆలిస్ కాప్సే, లూసీ హామిల్టన్, లారెన్ ఫైలర్ (ప్రీ సైనింగ్)ఎంఐ లండన్: హేలీ మాథ్యూస్, డాని వ్యాట్-హాడ్జ్, మెలీ కెర్ ప్రీ సైనింగ్)సదరన్ బ్రేవ్: లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మైయా బౌచియర్ (రీటైన్), జెమిమా రోడ్రిగ్స్ (ప్రీ సైనింగ్)సన్‌రైజర్స్ లీడ్స్: కేట్ క్రాస్, అన్నాబెల్ సదర్లాండ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (రీటైన్)ట్రెంట్ రాకెట్స్: నాట్ స్కైవర్-బ్రంట్, యాష్ గార్డ్నర్ (రీటైన్), సోఫియా డంక్లీ, కిమ్ గార్త్ (ప్రీ సైనింగ్)వెల్ష్ ఫైర్: జార్జియా వేర్హమ్, ఫ్రెయా కెంప్, జార్జియా వోల్ (ప్రీ సైనింగ్)కాగా, రేపు (మార్చి 12) పురుషుల విభాగంలో వేలం జరుగనుంది. -
పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ షాక్!
పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ‘ది హండ్రెడ్ లీగ్’-2026 వేలంలో పాక్ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం ఉండబోతున్నట్లు సమాచారం. కాగా ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.ఐపీఎల్.. లీగ్స్ కా బాప్!అయితే, అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా వెలుగొందుతోంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక్కసారి ఆడితే ఆటగాళ్ల రాతే మారిపోతుందనేంతలా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ఐపీఎల్లో పది జట్లు ఉండగా.. ఇందులోని మెజారిటీ ఫ్రాంఛైజీలు విదేశీ లీగ్‌లలోనూ పెట్టుబడులు పెడుతున్నాయి.సౌతాఫ్రికా లీగ్ ‘మనోళ్ల’దే ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు రాంఛైజీలూ ఐపీఎల్ జట్ల యజమానుల చేతిలోనే ఉన్నాయి. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్, ఎంఐ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ కింగ్స్, పర్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్.. ఐపీఎల్‌లోని హైదరాబాద్, ముంబై, లక్నో, చెన్నై, రాజస్తాన్, ఢిల్లీ ఫ్రాంఛైజీల యాజమాన్యంలో కొనసాగుతున్నాయి.ది హండ్రెడ్‌లోనూ అడుగుఇక ఇటీవల ‘ది హండ్రెడ్ లీగ్’లోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీల యజమానులు అడుగుపెట్టారు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ఎంఐ లండన్, సదరన్ బ్రేవ్, సన్‌రైజర్స్ లీడ్స్ వీరి చేతుల్లోనే ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్ తాజా ఎడిషన్‌కు సంబంధించి మార్చి 11న మహిళలు, మార్చి 12న పురుష ప్లేయర్ల వేలం లండన్‌లో జరుగనుంది.వెయ్యి మంది పేర్లు రిజిస్టర్ఇందుకోసం పద్దెనిమిది దేశాల నుంచి దాదాపుగా వెయ్యి మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో పాకిస్తానీ క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే, మాంచెస్టర్, లండన్, సదరన్ బ్రేవ్, సన్‌రైజర్స్ యాజమాన్యాలు పాక్ క్రికెటర్లను ఎంచుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.పీసీబీ ఓవరాక్షన్టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. తమకోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసినా.. బంగ్లాదేశ్ కోసమంటూ భారత్‌ను నిందించింది.బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచి బహిష్కరిస్తామని తొలుత ప్రగల్భాలు పలికింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్ మాత్రమే బాయ్‌కాట్ చేస్తామని ప్రకటించింది. అయితే, అందరూ ఊహించినట్లుగానే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందనే భయంతో యూటర్న్ తీసుకుని భారత్‌తో ఆడింది. టీమిండియా చేతిలో మరోసారి చిత్తుగా ఓడింది.ఐపీఎల్లో నిషేధంఇక ఇప్పటికే పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ క్రికెటర్లపై ఐపీఎల్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పీసీబీ మరింత ఓవరాక్షన్ చేసిన నేపథ్యంలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాదిరిగానే.. ది హండ్రెడ్‌లోనూ భారత్‌కు చెందిన ఫ్రాంఛైజీలు పాక్ క్రికెటర్లను సెలక్ట్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈసీబీ స్పందన ఇదేఈ విషయం గురించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) అధికారి ఒకరు బీబీసీకి అనధికారిక సమాచారం ఇచ్చారు. అయితే, ఈసీబీ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గుడ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘రిజిస్టర్ చేసుకున్న ప్రతీ దేశం నుంచి ఆటగాళ్ల కొనుగోలు జరుగుతుంది.ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఎంచుకుంటాయి. ఇంగ్లండ్ క్రికెట్లో వివక్షకు తావులేదు. ఒకవేళ ఎవరైనా మా నిబంధనలు ఉల్లంఘిస్తే బోర్డు తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని పేర్కొన్నాడు.కాగా మెన్స్ హండ్రెడ్ లీగ్‌లో మొహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం, షాహిన్ ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. అయితే, వుమెన్ హండ్రెడ్ లీగ్‌లో ఒక్క పాక్ ప్లేయర్ కూడా ఇంత వరకు ఆడిన దాఖలాలు లేవు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో పాటు ILT20లోనూ పాక్ ప్లేయర్లపై అనధికారిక నిషేధం కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగమైన అమెరికాకు చెందిన డిజర్ట్ వైపర్స్ మాత్రమే పాకిస్తాన్‌ను కొంతమంది ఆటగాళ్లను ఎంచుకుంది. ఇదిలా ఉంటే.. ది హండ్రెడ్ లీగ్‌లో వంద బంతుల ఆట ఉంటుంది. ఇందులో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి.చదవండి: T20 WC 2026: అఫ్గాన్ అద్భుత విజయం.. ట్రాట్‌కు ఘన వీడ్కోలు -
‘సన్‌రైజర్స్’ కీలక ప్రకటన
సన్‌రైజర్స్ యాజమాన్యం తమ జట్టు హెడ్‌కోచ్ పేరును ప్రకటించింది. డానియెల్ వెటోరికి స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించింది. ఆండ్రూ ఫ్లింటాఫ్ స్థానంలో వెటోరిని నియమించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.2023 సీజన్ నుంచి కన్ఫ్యూజ్ అయ్యారా?... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆటగాడిగా సత్తా చాటిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియెల్ వెటోరి చాన్నాళ్లక్రితమే కోచ్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. గతంలో ఆర్సీబీతో మమేకం అయిన వెటోరి.. 2023 సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్‌కోచ్‌గా కొనసాగుతున్నాడు.వెటోరి మార్గదర్శనంలో SRH ఐపీఎల్-2024లో ఫైనల్‌కు కూడా చేరింది. ఈ క్రమంలో యాజమాన్యం అతడినే హెడ్‌కోచ్‌గా కొనసాగిస్తోంది. 2026లోనూ SRH కోచ్‌గా వెటోరీనే మార్గదర్శనం చేయనున్నాడు. తాజాగా.. సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుకు కూడా హెడ్‌కోచ్‌గా మేనేజ్మెంట్ అతడిని నియమించింది.భారీ ధరకు కొనుగోలుఇంగ్లండ్లో జరిగే ది హండ్రెడ్ లీగ్‌లో భాగమైన నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను సన్ గ్రూపు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 1100 కోట్ల భారీ ధరకు ఈ ఫ్రాంఛైజీని దక్కించుకుని.. సన్‌రైజర్స్ లీడ్స్‌గా పేరు మార్చింది. ఈ జట్టుకు ఆండ్రూ ఫ్లింటాఫ్ హెడ్‌కోచ్‌గా ఉండగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని డానియెల్ వెటోరీతో భర్తీ చేసింది.ఫ్లింటాఫ్‌నకు వీడ్కోలుకాగా గత రెండు సీజన్లుగా ‘నార్తర్న్ సూపర్‌చార్జర్స్’కు కోచ్‌గా వ్యవహరించాడు ఫ్లింటాఫ్. అతడి శిక్షణలో 2024లో నాలుగో స్థానంతో సీజన్ ముగించిన జట్టు.. 2025లో ఎలిమినేటర్ వరకు చేరుకుంది. అయితే, వెటోరీపై నమ్మకంతో ఫ్లింటాఫ్‌నకు వీడ్కోలు పలికి.. అతడిని తమ హెడ్‌కోచ్‌గా నియమించింది సన్ గ్రూపు.ఫ్లింటాఫ్‌నకు గుడ్‌బై కాగా లీగ్‌లోని అన్ని ఫ్రాంఛైజీల కంటే తనకు తక్కువ జీతం చెల్లించేందుకు సన్‌రైజర్స్ సిద్ధపడిందని ఫ్లింటాఫ్ బహిరంగంగానే ఆరోపించాడు. అయితే, యాజమాన్యం మాత్రం.. తాము భారీగానే ఆఫర్ చేసినా.. తన స్థాయికి అది తగదంటూ అతడే బంధం తెంచుకున్నాడని పేర్కొంది. కాగా సన్ గ్రూప్ ఐపీఎల్లో హైదరాబాద్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈస్టర్న్‌కేప్ ఫ్రాంఛైజీలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. కావ్యా మారన్ ఈ జట్ల వ్యవహారాలు చూసుకుంటారు.చదవండి: ఐసీసీపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు


