‘సన్‌రైజర్స్‌’ కీలక ప్రకటన | Sunrisers Leeds appoint Vettori as head coach Who Will Coach SRH | Sakshi
Sakshi News home page

‘సన్‌రైజర్స్‌’ కీలక ప్రకటన.. మరి SRHకు ఎవరు?

Jan 13 2026 2:14 PM | Updated on Jan 13 2026 2:50 PM

Sunrisers Leeds appoint Vettori as head coach Who Will Coach SRH

కావ్యా మారన్‌- వెటోరి (PC: IPL)

సన్‌రైజర్స్‌ యాజమాన్యం తమ జట్టు హెడ్‌కోచ్‌ పేరును ప్రకటించింది. డానియెల్‌ వెటోరికి స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించింది. ఆండ్రూ ఫ్లింటాఫ్‌ స్థానంలో వెటోరిని నియమించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

2023 సీజన్‌ నుంచి 
కన్‌ఫ్యూజ్‌ అయ్యారా?... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఆటగాడిగా సత్తా చాటిన న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డానియెల్‌ వెటోరి చాన్నాళ్లక్రితమే కోచ్‌ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. గతంలో ఆర్సీబీతో మమేకం అయిన వెటోరి.. 2023 సీజన్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు హెడ్‌కోచ్‌గా కొనసాగుతున్నాడు.

వెటోరి మార్గదర్శనంలో SRH ఐపీఎల్‌-2024లో ఫైనల్‌కు కూడా చేరింది. ఈ క్రమంలో యాజమాన్యం అతడినే హెడ్‌కోచ్‌గా కొనసాగిస్తోంది. 2026లోనూ SRH కోచ్‌గా వెటోరీనే మార్గదర్శనం చేయనున్నాడు. తాజాగా.. సన్‌రైజర్స్‌ లీడ్స్‌ జట్టుకు కూడా హెడ్‌కోచ్‌గా మేనేజ్‌మెంట్‌ అతడిని నియమించింది.

భారీ ధరకు కొనుగోలు
ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్‌ లీగ్‌లో భాగమైన నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌ను సన్ గ్రూపు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 1100 కోట్ల భారీ ధరకు ఈ ఫ్రాంఛైజీని దక్కించుకుని.. సన్‌రైజర్స్‌ లీడ్స్‌గా పేరు మార్చింది. ఈ జట్టుకు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ హెడ్‌కోచ్‌గా ఉండగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని డానియెల్‌ వెటోరీతో భర్తీ చేసింది.

ఫ్లింటాఫ్‌నకు వీడ్కోలు
కాగా గత రెండు సీజన్లుగా ‘నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌’కు కోచ్‌గా వ్యవహరించాడు ఫ్లింటాఫ్‌. అతడి శిక్షణలో 2024లో నాలుగో స్థానంతో సీజన్‌ ముగించిన జట్టు.. 2025లో ఎలిమినేటర్‌ వరకు చేరుకుంది. అయితే, వెటోరీపై నమ్మకంతో ఫ్లింటాఫ్‌నకు వీడ్కోలు పలికి.. అతడిని తమ హెడ్‌కోచ్‌గా నియమించింది సన్‌ గ్రూపు.

ఫ్లింటాఫ్‌నకు గుడ్‌బై 
కాగా లీగ్‌లోని అన్ని ఫ్రాంఛైజీల కంటే తనకు తక్కువ జీతం చెల్లించేందుకు సన్‌రైజర్స్‌ సిద్ధపడిందని ఫ్లింటాఫ్‌ బహిరంగంగానే ఆరోపించాడు. అయితే, యాజమాన్యం మాత్రం.. తాము భారీగానే ఆఫర్‌ చేసినా.. తన స్థాయికి అది తగదంటూ అతడే బంధం తెంచుకున్నాడని పేర్కొంది. 

కాగా సన్‌ గ్రూప్‌ ఐపీఎల్‌లో హైదరాబాద్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈస్టర్న్‌కేప్‌ ఫ్రాంఛైజీలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. కావ్యా మారన్‌ ఈ జట్ల వ్యవహారాలు చూసుకుంటారు.

చదవండి: ఐసీసీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement