సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ జట్టు వరుసగా నాలుగో ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2025-26 ఎడిషన్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాడు జేమ్స్ కోల్స్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సన్‌రైజర్స్‌కు గెలిపించాడు.
తొలుత బ్యాటింగ్‌లో (34 బంతుల్లో 61; 10 ఫోర్లు) ఇరగదీసి, ఆతర్వాత బౌలింగ్‌లోనూ (4-0-34-2) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. కోల్స్, డికాక్ (54) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
మిగతా ఆటగాళ్లలో జానీ బెయిర్‌స్టో 18, మాథ్యూ బ్రీట్జ్కీ 3, జోర్డన్ హెర్మన్ 13, ట్రిస్టన్ స్టబ్స్ 23 (నాటౌట్) పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డొనొవన్ ఫెరియెరా 2, నండ్రే బర్గర్, అకీల్ హొసేన్, వియన్ ముల్దర్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో.. ముత్తుసామి (4-0-26-3), కోల్స్ (4-0-34-2), మార్కో జన్సెన్ (3.1-0-33-2), నోర్జే (4-0-13-1), ఆడమ్ మిల్నే (3-0-10-1) ధాటికి సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లలో 117 పరుగులకే చాప చుట్టేసింది. ఆ జట్టు తరఫున 30 పరుగులు చేసిన జేమ్స్ విన్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మరో ఐదు మంది రెండంకెల స్కోర్లు చేయగలగినా, ఒక్కరే 20 పరుగుల మార్కును దాటారు. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టు సన్‌రైజర్స్. పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మిగతా ప్లే ఆఫ్స్ బెర్త్‌లక కోసం పోటీ పడుతున్నాయి.


