ఐపీఎల్ 2026 తొలి విడత షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను బీసీసీఐ ఇవాళ (మార్చి 11) ప్రకటించింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.
తొలి విడతలో మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో (బెంగళూరు, ముంబై, గౌహతి, కొత్త చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) జరుగనున్నాయి. బెంగళూరులో జరిగాల్సిన మ్యాచ్‌లు మార్చి 13న నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి. తొలి విడతలో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఈ విడతలో అన్ని జట్లలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. టోర్నీ ఓపెనర్‌లోనే ఆరెంజ్ ఆర్మీ ఆర్సీబీతో తలపడనుంది. సన్‌రైజర్స్ రెండో మ్యాచ్ ఏప్రిల్ 2న కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో జరుగనుంది. మూడో మ్యాచ్ ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో.. నాలుగో మ్యాచ్ ఏప్రిల్ 11న ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగనుంది.

తొలి విడతలో సన్‌రైజర్స్ తమ హోం గ్రౌండ్ హైదరాబాద్‌లో ఒకే ఒక మ్యాచ్ (ఏప్రిల్ 5, లక్నోతో) ఆడనుంది. ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. లక్నో, పంజాబ్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతాయి.
ఐపీఎల్ 2026 కోసం సన్‌రైజర్స్ జట్టు..
సలీల్ అరోరా, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరన్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ మావి, పాట్ కమిన్స్ (కెప్టెన్), అమిత్ కుమార్, క్రియాన్స్ ఫులెట్రా, ప్రఫుల్ హింజ్, ఎషాన్ మలింగ, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, శివంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ


