ప్రారంభానికి ముందే వాయిదా పడిన క్రికెట్‌ లీగ్‌ | Inaugural Bangladesh Premier League Pushed Forward | Sakshi
Sakshi News home page

ప్రారంభానికి ముందే వాయిదా పడిన క్రికెట్‌ లీగ్‌

Mar 11 2026 10:31 PM | Updated on Mar 11 2026 10:31 PM

Inaugural Bangladesh Premier League Pushed Forward

మహిళల బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WBPL) ప్రారంభానికి ముందే వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం, ఈ లీగ్‌ ఏప్రిల్‌ 3 నుంచి 15 తేదీల మధ్యలో జరగాల్సి ఉండింది. అయితే స్పాన్సర్లు దొరక్క జులై నెలకు పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

వాస్తవానికి ఈ లీగ్‌ టీ20 ప్రపంచకప్‌కు ముందు తమ ప్లేయర్లకు ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు భావించింది. అయితే వాయిదా పడటంతో ప్రపంచకప్‌ వరకు బంగ్లాదేశ్‌ ప్లేయర్లకు ఎలాంటి అధికారిక మ్యాచ్‌లు ఉండవు. బంగ్లా ప్లేయర్లు నేరుగా జూన్‌ 14న నెదర్లాండ్స్‌తో జరిగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. ఆ దేశ పురుషుల క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2026 నుంచి వైదొలిగి, చాలా పెద్ద సాహసం చేసింది. ఈ పరిణామం తర్వాత ఆ దేశంలో క్రికెట్‌కు స్పాన్సర్లు కరువయ్యారు. 

ఈ ప్రభావం పలువురు అంతర్జాతీయ స్టార్లు పాల్గొనే పురుషుల బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌పై కూడా పడనుంది. ఇప్పటికే ఆ లీగ్‌లోని పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు రెమ్యూనరేషన్‌ ఎగ్గొట్టాయనే టాక్‌ ఉంది. పురుషుల బీపీఎల్‌కు కూడా స్పాన్సర్లు ఎవరూ ముందుకు రాకపోతే, ఈ లీగ్‌ మనుగడనే ప్రశ్నార్థకమవుతుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement