'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం' | Shahid Afridi Shares Unheard 2011 World Cup Story, Says Pakistan Players Were Shivering And Indian Crowd Put Our Players Under Pressure | Sakshi
Sakshi News home page

'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం'

Mar 12 2026 8:26 AM | Updated on Mar 12 2026 10:51 AM

Pakistan Players Were Shivering: Shahid Afridi Shares Unheard 2011 World Cup Story

ఐసీసీ టోర్న‌మెంట్ల‌లో పాకిస్తాన్‌పై భార‌త జ‌ట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. 1992 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026 వ‌ర‌కు దాయాదిపై భార‌త్‌దే పై చేయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో 2011 వన్డే ప్రపంచకప్‌లో భార‌త్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను అప్ప‌టి పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది గుర్తు చేసుకున్నాడు. మొహాలీ స్టేడియంలోని ప్రేక్షకుల ధాటికి తమ ఆటగాళ్లు ఎలా భ‌య‌ప‌డ్డారో అఫ్రిది వివ‌రించాడు.

"వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2011లో మొహాలీలో భార‌త్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను నేను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఆ మ్యాచ్‌లో మేము చాలా అద్భుతంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాం. మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ తొలి వికెట్‌కు 90 పరుగుల భాగ‌స్వామ్యాన్ని అందించారు. దీంతో టీమిండియాను ఓడించడం ఖాయమని చాలా రిలాక్స్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చునున్నాను.

కానీ తొలి వికెట్ పడగానే సీన్ మారిపోయింది. స్టేడియంలోని అభిమానులు భార‌త జ‌ట్టును ఉత్సాహపరిచిన తీరు అమోఘం. ఆ కేరింత‌లు, అరుపుల మ‌ధ్య భార‌త్ తిరిగి అద్భుతంగా పుంజుకుంది. దెబ్బ‌కు మైదానంలో మా బ్యాటర్లు వణికిపోవ‌డం నేను చూశాను. హఫీజ్ అవుట్ అయిన తర్వాత, మా ప్లేయర్లు వ‌రుస క్ర‌మంలో పెవిలియ‌న్‌కు చేరారు

ప్ర‌తీ బంతికి ఇబ్బంది పడ్డారు. స్టేడియంలో విపరీతమైన గోల మ‌ధ్య‌ మా ప్లేయ‌ర్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు.  కనీసం నిలదొక్కుకోలేకపోయారు" అని అఫ్రిది పేర్కొన్నాడు. కాగా ఆ మ్యాచ్‌లో పాక్‌పై 29 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. 260 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో పాక్ 231 ప‌రుగులకు ఆలౌటైంది. 85 ప‌రుగులు చేసిన స‌చిన్ టెండూల్క‌ర్ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: రిచాకు రూ. 61 లక్షలుదీప్తికి రూ. 34 లక్షలు

Advertisement
 
Advertisement
Advertisement