మళ్లీ భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌.. ఎప్పుడంటే? | ICC Women's T20 World Cup 2026 full schedule out | Sakshi
Sakshi News home page

Women's T20 WC 2026: మళ్లీ భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌.. ఎప్పుడంటే?

Feb 24 2026 3:28 PM | Updated on Feb 24 2026 3:31 PM

ICC Women's T20 World Cup 2026 full schedule out

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ ఆతిథ్య‌మిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ వేదిక‌గా ఇంగ్లండ్‌-శ్రీలంక జ‌ట్టు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి.

ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక జ‌ట్లు నేరుగా అర్హ‌త సాధించ‌గా.. క్వాలిఫైయర్ మ్యాచ్‌ల ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ త‌మ స్ధానాల‌ను ఖాయం చేసుకున్నాయి.

భార‌త్‌-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో ఉన్న భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు జూన్ 14న ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా అమీతుమీ తెల్చుకోనున్నాయి.  భార‌త్‌కు ఇదే తొలి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. గ్రూపు-ఎలో భార‌త్‌, పాక్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, నెద‌ర్లాండ్స్ ఉన్నాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూలై 5న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ 
జూన్ 14 - పాకిస్తాన్‌తో.. ఎడ్జ్‌బాస్ట‌న్
జూన్ 17- నెద‌ర్లాండ్స్‌తో.. లీడ్స్‌
జూన్ 21-సౌతాఫ్రికాతో.. మాంచెస్ట‌ర్‌
జూన్ 25- బంగ్లాదేశ్‌తో.. మాంచెస్ట‌ర్‌
జూన్ 28- ఆస్ట్రేలియాతో.. లార్డ్స్‌

Advertisement
 
Advertisement
Advertisement