ఈ ఏడాది (2026-27) హోం సమ్మర్ షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) ఇవాళ ప్రకటించింది. ఈ సీజన్‌లో మూడు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నాయి. ఈ సీజన్ ఆస్ట్రేలియా సిరీస్‌తో మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ 3 వన్డేలు, 3 టెస్ట్‌లు ఆడనుంది.
అనంతరం బంగ్లాదేశ్ సఫారీ గడ్డపై అడుగుపెడుతుంది. ఈ పర్యటనలో బంగ్లా జట్టు 3 వన్డేలు, 2 టెస్ట్‌లు, 3 టీ20లు ఆడనుంది. ఆతర్వాత ఇంగ్లండ్ టీమ్ సౌతాఫ్రికాలో ల్యాండవుతుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ 3 వన్డేలు, 3 టెస్ట్‌లు ఆడుతుంది. దీనికి సంబంధించిన తేదీలు, వేదికల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆస్ట్రేలియా టూర్
సెప్టెంబర్ 24-తొలి వన్డే, డర్బన్
సెప్టెంబర్ 27-రెండో వన్డే, జోహనెస్‌బర్గ్
సెప్టెంబర్ 30-మూడో వన్డే, పోచెఫ్‌స్ట్రూమ్
అక్టోబర్ 9-13: తొలి టెస్ట్, డర్బన్
అక్టోబర్ 18-22: రెండో టెస్ట్, గ్కెబెర్హా
అక్టోబర్ 27-31: మూడో టెస్ట్, కేప్‌టౌన్
బంగ్లాదేశ్ టూర్
నవంబర్ 15-19: తొలి టెస్ట్, జోహనెస్‌బర్గ్
నవంబర్ 23-27: రెండో టెస్ట్, సెంచూరియన్
డిసెంబర్ 1- తొలి వన్డే, ఈస్ట్ లండన్
డిసెంబర్ 4- రెండో వన్డే, గ్కెబెర్హా
డిసెంబర్ 7- మూడో వన్డే, కేప్‌టౌన్
డిసెంబర్ 10- తొలి టీ20, కింబర్లీ
డిసెంబర్ 12- రెండో టీ20, బెనోనీ
డిసెంబర్ 13- మూడో టీ20, సెంచూరియన్
ఇంగ్లండ్ టూర్
డిసెంబర్ 17-21: తొలి టెస్ట్, జోహనెస్‌బర్గ్
డిసెంబర్ 26-30: రెండో టెస్ట్, సెంచూరియన్
2027 జనవరి 3-7: మూడో టెస్ట్, కేప్‌టౌన్
జనవరి 10- తొలి వన్డే, పార్ల్
జనవరి 13- రెండో వన్డే, బ్లోంఫాంటైన్
జనవరి 15- మూడో వన్డే, బ్లోంఫాంటైన్
ఈ పర్యటనలో జరగాల్సిన టీ20 సిరీస్‌ను షెడ్యూల్ సమస్యల కారణంగా వాయిదా వేసి, తర్వాతి తేదీల్లో నిర్వహించనున్నారు.


